మరో చరిత్రను సృష్టించిన మరో చరిత్ర సినిమా . వందల వందల సినిమాలలో నటించిన సీనియర్ స్టార్లకు మాత్రమే సినిమాలు వందల రోజులు ఆడే రోజుల్లో ఒక తమిళ జూనియర్ నటుడు , ఒక ‘సాదాసీదా సరికొత్త నటి నటించిన ఈ మరో చరిత్ర మద్రాసు , బెంగుళూర్లలో డబ్బింగ్ లేకుండా వందల రోజులు ఆడటమంటే మరో చరిత్ర కాక మరేమిటి ! చరిత్రలో అప్పటివరకు లైలా మజ్ను , సలీం అనార్కలి , రోమియో జూలియట్ […]
ఆమెకు అది చాలా పెద్ద సర్టిఫికెట్..! అనుకోకుండా ఓ అరుదైన విశేష ప్రశంస..!
మణిరత్నం… తన పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చేది తక్కువే… మాట్లాడేదీ తక్కువే… వార్తల తెరపైనా తక్కువగా కనిపిస్తుంటాడు… తన పనేదో తనది… సినిమా ఇండస్ట్రీలో ఒకరికొకరు పొగుడుకోవడమూ ఎక్కువే… కానీ ఆయన ఎవరినీ పెద్దగా అభినందించడు, ప్రశంసించడు… తన కెరీర్లో చాలామంది మంచి ప్రతిభ ఉన్న నటీనటులను చూశాడు, పనిచేయించుకున్నాడు… ఎవరి నటనను ఏ పాత్రకు ఎలా పిండుకోవాలో తనకు బాగా తెలుసు… అందుకే తను ఏకంగా నటి సాయిపల్లవికి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకోవడం ద్వారా అందరినీ […]
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ..! అసందర్భ ప్రశ్నలతో అద్భుత పాత్రికేయం..!!
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ… సినిమావాళ్లు ఎలాగూ దొరికారు కదాని కొందరు ఫిలిమ్ జర్నలిస్టులు ఏవేవో ప్రశ్నలు వేస్తూ, చివరకు సినిమావాళ్లు ప్రెస్మీట్లు అంటేనే చికాకుపడే సిట్యుయేషన్ తీసుకొస్తున్నారు ఈమధ్యకాలంగా..! సినిమాకు సంబంధం లేని ప్రశ్నలు, ఏవో గెలికి, ఏదో రాబట్టే విఫల ప్రయత్నం చేసి, హబ్బ, భలే అడిగాం ప్రశ్నల్ని అనుకుని వాళ్లే భుజాలు చరుచుకునే విచిత్ర ధోరణి… సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు కూడా మినహాయింపేమీ కాదు… తెలుగమ్మాయి, హీరోయిన్ అనన్య నాగళ్ల ఓ లేడీ రిపోర్టర్ […]
పేరున్న మొహాల కోసం బలగం వేణు తన్లాట… అక్కడే అసలు తప్పు…
ఎమోషన్స్ను తెరపై బలంగా ప్రజెంట్ చేయగల ఓ దర్శకుడు వేణులో ఉన్నాడని చాలామందికి బలగం సినిమా వచ్చేవరకూ తెలియదు… అప్పటిదాకా తను జస్ట్, ఓ జబర్దస్త్ బాపతు కమెడియన్ మాత్రమే… కానీ బలగం వచ్చాక తనలో రియల్ టాలెంట్ లోకానికి అర్థమైంది… తనను ఐదారు మెట్లు ఎక్కించింది ఆ సినిమా ఒకేసారిగా… వోకే, గుడ్, ట్రెమండస్… ఫస్ట్ సినిమా తనను ఇండస్ట్రీలో నిలబెట్టింది… కానీ వాట్ నెక్స్ట్..? అసలు పెద్ద పెద్ద దర్శకులకు ద్వితీయ గండం ఉంటుంది… […]
పురాణాల్ని సోషలైజ్ చేయడం బాపుకు అలవాటే… ఈ కథ కూడా అంతే…
బాపు సృష్టించిన మరో గొప్ప మాస్ & క్లాసిక్ సినిమా మన వూరి పాండవులు… . పాండవులు అనో , లవకుశులు అనో టైటిల్ పెట్టకపోయినా పురాణాలను సోషలైజ్ చేయకుండా ఉండలేరు బాపు . అది ముత్యాలముగ్గు కావచ్చు , బుధ్ధిమంతుడు కావచ్చు . టైటిల్లోనే పాండవులు అన్నాక ఇంక చెప్పేదేముంది . భారతంలో పంచ పాండవుల్లాగా ఈ సినిమాలో కూడా అయిదుగురు పాండవులు , ఓ దుర్యోధన+ దుశ్శాసనుడు ఉంటాడు , ఓ శకుని ఉంటాడు […]
ఆమే… అవును, ఆమే… ఇండియన్ సినిమా తెరపై ఓ ప్రజ్వలిత వెలుతురు…
. , ‘భూమిక’ The Role ఎ ఫిల్మ్ బై శ్యాం బెనెగల్ …………………………………………………….. S M I T A P A T I L A Barometer for Accomplishment 1955 అక్టోబర్ 17 మహానటి స్మితాపాటిల్ పుట్టిన రోజు ……………………………………… మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం. ఒక అందమైన దేవదాసీ, వయసులో పెద్దవాడైన ఓ బ్రాహ్మడు (బి.వి.కారంత్) భార్యాభర్తలు . వాళ్ళకో పదేళ్ళ కూతురు ఉష. శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన ఉష […]
ఒళ్లమ్ముకుంటేనేం..? గుండెలో తడి ఉండదా..? దానికీ భావోద్వేగాలుండవా..?
. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు , ఆ సినిమాల కధాంశాలు , పాత్రలు , ఆ పాత్రల్లోని నటులు , సంగీతసాహిత్యాలు , దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి . మధురానుభూతిని కలిగిస్తాయి . నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ మల్లెపూవు సినిమా . It’s a musical , literary , emotional classic . ముఖ్యంగా […]
ప్చ్… గంతులు వేసే డ్యూయెట్లు లేని సీరియస్ లాయర్ విశ్వనాథుడు…
S D లాల్- NTR కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన రీమేక్సులో ఒకటి 1978 లో వచ్చిన ఈ లాయర్ విశ్వనాథ్ . నిజాయితీకి మారుపేరుగా న్యాయసేవ చేస్తున్న లాయర్ gangster గా మారి , దోషుల్ని పోలీసులకు పట్టించే కధానాయకుడి పాత్ర లాయర్ విశ్వనాథ్ . లాయరుగా NTR చాలా హుందాగా , బేలన్సుడిగా నటించారు . నాకు బాగా నచ్చిన పాత్ర , నటన . Gangster అయిన తర్వాత కూడా ఆయనకు గంతులు వేసే […]
ఆ కృష్ణ జింక ఆ ధూర్త సల్మాన్ను వేటాడుతూనే ఉంది… మద్దతుదార్లనూ…!!
తల్లిలేని జింక పిల్లలకు చనుబాలిచ్చే స్త్రీలున్న బిష్ణోయీ సమాజంలో పుట్టిన లారెన్స్ బిష్ణోయీ! రాంగోపాల్ వర్మ సిన్మా తీస్తాడట! ………………………………………………………………………… జింక పిల్ల తల్లి మరణిస్తే.. ఆ పిల్లను బిష్ణోయీ మహిళ తన చాతి దగ్గరకు తీసుకుని పాలు ఇస్తుంది. పిల్లలకు ఆవుపాలు తాగించి పెంచే మన సమాజంలో ఇది వింత. ఇలాంటి దృశ్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ––కిందటేడాది భారత నటుడు వివేక్ ఓబెరాయ్ దుబాయిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బిష్ణోయీ సమాజం గురించి […]
ఆఫ్టరాల్ సినిమా ప్రేక్షకులు… మీకు మాట్లాడే హక్కెక్కడిదిరా..!
ఆఫ్టరాల్ ప్రేక్షకులు… మీకు మాట్లాడే హక్కెక్కడిదిరా! ఒక్కొక్కడికి ఎముకలు విరగ్గొడతా! నిజమే కదా! ఆ వినిర్మాత అన్నదాంట్లో తప్పేముంది? ఈ భూప్రపంచంలో సామాన్యులకు సినిమా తప్ప ఇంకేదీ వినోదం కానప్పుడు, లేనప్పుడు ఒక సినిమాకు ఒక కుటుంబానికి ముష్టి పదిహేను వందల రూపాయలు పెట్టలేరా? ప్రభుత్వాలే బెనిఫిట్ ఆఫ్ వినోదం కింద బెనిఫిట్ షోలకు సూర్యుడు లేవకముందే తెరలేపడానికి ప్రత్యేక జి ఓ లు జారీ చేసి అనుమతులిస్తున్నప్పుడు- మొదటి వారం, మొదటి పదిరోజుల్లో రెండింతలు, మూడింతలు […]
కథ రొటీనే… ఐనా కశ్మీర్ లొకేషన్లు, కృష్ణ ట్రిపుల్ యాక్షన్తో హిట్టయింది…
కృష్ణ త్రిపాత్రాభినయం చేసిన మొదటి సినిమా 1978 లో వచ్చిన ఈ కుమారరాజా సినిమా . కుమార రాజా అంటే ఇద్దరు కృష్ణలు . ఒక కృష్ణ పేరు కుమార్ , మరో కృష్ణ పేరు రాజా . కన్నడంలో సూపర్ డూపర్ హిట్టయిన శంకర గురు అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . కన్నడ హీరో రాజకుమార్ స్వీయ నిర్మాణంలో వచ్చింది . అందులో మూడు పాత్రలూ ఆయనే వేసారు . జయమాల […]
వాణిశ్రీ నటవిరాట రూపం… స్మితాపాటిల్తో కలిసి శ్యాం బెనగల్ ‘అనుగ్రహం’…
శ్యాం బెనగల్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ఈ సూపర్ ఫ్లాప్ సినిమా . అయిననూ చూడవలె . వాణిశ్రీ నట విరాటరూపాన్ని ఆవిష్కరించిన సినిమా . నట విరాట రూపమంటే పేజీల పేజీల డైలాగులు చెప్పి , గంటలు గంటలు ఏడుస్తూనో ఎగురుతూనో నటించటం మాత్రమే కాదు . డైలాగులు ఎక్కువ లేకపోయినా , అటూఇటూ ఎగురకుండా కళ్ళతో , పెదాలతో , మొహంతో నటించటాన్ని నట విరాటరూపం అంటారు , అనాలి . […]
నాగవంశీ మాత్రమే కాదు… ఇండస్ట్రీ ఘొప్పోళ్లందరిదీ అదే బుర్ర… నాని సహా…
పైకి చెప్పేది ప్రేక్షకదేవుళ్లు అని..! ధోరణి మాత్రం నిండా గొరగడం..! పర్సులకు కత్తెర పెట్టడం… ప్రేక్షకుడంటే ఏమాత్రం గౌరవం లేదు, సొసైటీ మీద అవగాహన లేదు… మరి ఇలాంటోళ్లు తీసే సినిమాలు చెత్త గాక మరేమిటి..? దిక్కుమాలిన ఫార్ములా సినిమాలు తప్ప ఇంకేమిటి..? యథా నిర్మాత, తథా చిత్రము… నాగవంశీ అనే ఘనమైన దర్శకరత్నం ప్రతి కుటుంబం ఒక సినిమాకు రూ. 1500 పెట్టలేరా అని ఏదో కూశాడు తెలుసు కదా… నెటిజనం కూడా ఆడుకుంటోంది బాగానే… […]
కథనంలో తడ‘పాట్ల’తో… కథ కాస్తా నాసిరకం కండోమ్ అయిపోయింది…
కొత్త దర్శకులు, కొత్త హీరోలు కొందరు మెల్లిమెల్లిగానైనా సరే… తెలుగు సినిమాను కొత్తదనం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు… సోకాల్డ్ స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు ఇంకా మూస ప్రపంచంలోనే బతుకుతుంటే… చిన్న హీరోలు, చిన్న దర్శకులు మాత్రమే ప్రయోగాలు, భిన్నమైన కథల వైపు వెళ్తున్నారు… సుహాస్ వారిల్లో ఒకడు… తను భిన్నమైన కథల్ని ఎంచుకుంటున్నాడు.., అభినందనీయం… పాత్రకు తగినట్టుగా… అతి చేయడు, తక్కువ చేయడు… ఈమధ్య వచ్చిన ‘జనక అయితే గనక’ మూవీలో కథ ట్రీట్మెంట్ […]
కుంతీకర్ణులు… భిన్నమైన స్టోరీ లైన్… కృష్ణంరాజు రెబల్ స్టార్గా సెటిల్డ్..!!
A pucca commercial entertainer . బంగారు తల్లి సినిమాతో రెబల్ హీరోగా చేసిన ప్రయత్నం ఈ సినిమాతో పక్కా అయిపోయింది కృష్ణంరాజుకి . 1978 లో వచ్చిన ఈ కటకటాల రుద్రయ్య సినిమాలో కూడా బంగారు తల్లిలోలాగా జమున , కృష్ణంరాజులు తల్లీకొడుకులే . అయితే కృష్ణంరాజు ఈ సినిమాలో కుప్ప తొట్టి కుంతీపుత్రుడు . క్లైమాక్సులో NTR , హేమలతల కుంతీ కర్ణుల సంవాదాన్ని కూడా చూపుతారు దర్శకులు దాసరి నారాయణ రావు . […]
చినుకులా రాలి… నదులుగా సాగి… వరదలై పోయి… కడలిగా పొంగిన సంగీతం…
. రాజన్ నాగేంద్ర… యాభై దశకంలో తెలుగు సినిమా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన సంగీత దర్శక ధ్వయం. కర్ణాటక మైసూరు శివరాంపేట నుంచి వచ్చిన అన్నదమ్ములతో ఎక్కువ సినిమాలకు పనిచేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, జంధ్యాల. అంతకుముందే వారు విఠలాచార్య గారి సినిమాలతో సహా కొన్ని తెలుగు చిత్రాలకు పన్జేశారు. కానీ ఈ ఇద్దరి సినిమాల్లోనూ ముఖ్యంగా వేటూరి కాంబినేషన్ లో వచ్చిన పాటలూ గొప్పగా ఉంటాయి. నవగ్రహ పూజా మహిమలో ఎవ్వరో ఎందదుకీరీతి సాధింతురో లాంటి […]
వాడు మనపై హిందీ రుద్దును… వీడు అదేపనిగా అరవం రుద్దును… మనకే దద్దులు…
ఏయ్! ఎవర్రా అక్కడ! వేట్టయన్ తెలుగు కాదన్నది? దుడ్డు కర్ర అందుకోండి! భీమయ్య:- ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రామయ్య:- ఏమీ లేదు భీమయ్యా! మన తెలుగు కొంపకు ఏ పైకప్పు వేద్దామా అని ఆలోచిస్తున్నా. భీమయ్య:- ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! మన్నికకు, నాణ్యతకు పేరెన్నికగన్న వేట్టయన్ తమిళ పైకప్పులు వేస్తే సరి! రామయ్య:- …అంటే అవి అరవ పైకప్పులు కదా! తెలుగు ఇనుప రేకులు, సిమెంట్ రేకులు, పెంకులు, రెల్లు గడ్డి, బోద, మట్టి, ఆర్ […]
కదిలిందీ కరుణరథం… సాగిందీ క్షమాయుగం… అప్పట్లో పాన్- వరల్డ్ మూవీ…
రాముడు , కృష్ణుడు అనగానే NTR ఎలా గుర్తుకొస్తారో అలాగే యేసుక్రీస్తు అనగానే విజయచందర్ గుర్తుకొస్తారు . 1978 క్రిస్టమస్ సందర్భంలో రిలీజయిన ఈ కరుణామయుడు సినిమా ద్వారా అంతటి పేరు ప్రఖ్యాతులను విజయచందర్ సంపాదించుకున్నారు . యేసుక్రీస్తు మీద వచ్చిన అన్ని సినిమాలలో కమనీయంగా తీయబడింది ఈ సినిమా . 14 భాషల్లోకి డబ్ చేయబడింది . విదేశాలలో ఇంగ్లీషు సబ్ టైటిల్సుతో ప్రదర్శించబడింది . యేసుక్రీస్తు పాత్రను వేయాలని మొదలుపెట్టిన వారు చివరిదాకా బతకరు […]
మధ్యలో కథ దారితప్పింది కాసేపు… అది తప్ప సినిమా అభినందనీయమే…
హీరో సుధీర్ బాబు… కాదు, నటుడు సుధీర్ బాబు… ఎందుకంటే, తను టిపికల్ తెలుగు హీరో కాదు, ఒక నటుడిగా భిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ, అంగీకరిస్తూ… ఆయా పాత్రలకు అతి గాకుండా, తగ్గకుండా సరైన నటనను అందిస్తూ… భిన్నమైన కెరీర్ నిర్మించుకునే సుధీర్ బాబుకు ఆ కోణంలో అభినందనలు… అర్జెంటుగా తెలుగు స్టార్ హీరో తరహాలో తరమడాలు, తురమడాలు… తెగ నరకడాలు, నెత్తుటేర్లు… సోకాల్డ్ కమర్షియల్ వాసనలు, పాన్ ఇండియా ప్రయాసలు, ఎలివేషన్లు గట్రా గాకుండా వైవిధ్యమైన […]
నను వలచావని తెలిసేలోగా నివురై పోతానూ… నేటికీ జ్వలించే పాటే అది…
ఏడు రంగుల ఇంద్రధనసు ఈడు వచ్చిన నా సొగసు , నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి . ఇంద్రధనస్సు సినిమా అనగానే ఈ రెండు పాటలే ముందుగా గుర్తుకొచ్చేవి . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో ఆత్రేయ వ్రాసిన పాటలు అద్భుతంగా పండాయి . మిగిలిన పాటలు ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా , తడిసిన కోక కట్టుకుని కడవ సంకన పెట్టుకుని వస్తుంటే , మూసుకో మూసుకో తలుపులన్నీ […]
- « Previous Page
- 1
- …
- 6
- 7
- 8
- 9
- 10
- …
- 120
- Next Page »