A New Raagam: అవార్డు వచ్చిన నాటు నాటు పాట కీరవాణి గురించి చర్చోపచర్చలు జరుగుతుంటే… అవార్డు రాకముందు కీరవాణి గురించి చాలా చర్చ జరగాలి కదా అని అనిపించింది. కె వి మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా, రాజ్- కోటీల దారుల్లో వెళ్లకుండా కీరవాణి సంగీత క్షణ క్షణాలను తన వైపు ఎలా తిప్పుకున్నారో కొంత చర్చ జరగాలి. చిటికెలోన చిక్కబడ్డ కటిక చీకటి…కరిగిపోక తప్పదమ్మ అరుణ కాంతికి అంటూ సిరివెన్నెల కలం వెలుగు పూలు చల్లితే […]
డీఎస్సీ Vs థమన్… గోపీచంద్ Vs బాబీ… ఎవరు గెలిచారు..? కిరీటం ఎవరికి..?!
ఇంతకీ దేవిశ్రీప్రసాద్ గెలిచాడా..? థమన్ గెలిచాడా..? ఒక విశ్లేషణ….. దర్శకుడు బాబీ గెలిచాడా..? మలినేని గోపీచంద్ గెలిచాడా..? మరొక విశ్లేషణ…. బాలయ్య గెలిచాడా..? చిరంజీవి గెలిచాడా..? ఏ సినిమా వసూళ్ల పరిస్థితేమిటి..? అనే విశ్లేషణలు కొంతమేరకు వోకే… ఎందుకంటే, మనం ఉన్న రియాలిటీలో గెలుపోటములకు హీరోల్నే బాధ్యుల్ని చేస్తున్నాం… గెలుపోటములను బట్టే సదరు హీరో తదుపరి మార్కెట్ నిర్దేశించబడుతుంది కాబట్టి…! కానీ సంగీత దర్శకుల్లో ఎవరు గెలిచారు..? ఏ దర్శకుడు గెలిచాడు..? అనే చర్చలు శుద్ధ దండుగమారి […]
కలిసి తిరుగుతున్న ఆ అమెరికన్‌పై జయసుధ వివరణ… ప్చ్, క్లారిటీ లేదు…
జయసుధ ఏదో క్లారిటీ ఇచ్చింది… ఐననూ ఏదో అస్పష్టత… ఏదో సందేహం… విషయంలోకి వెళ్తే… జయసుధ వయస్సు 64 ఏళ్లు… ఆమె మొదటి వివాహం నిర్మాత వడ్డే రమేష్ బావమరిది కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌తో జరిగింది… కానీ అది ఎన్నాళ్లో సాగలేదు… తరువాత ఆమె రెండో వివాహం జితేంద్ర కజిన్ నితిన్ కపూర్‌తో 1985లో జరిగింది… ఇద్దరు పిల్లలు… ఆయన 2017లో మరణించాడు… ఆమె నట, రాజకీయ జీవితాలను పక్కన పెడితే… అప్పటి నుంచీ ఒంటరిగానే ఉంటున్న జయసుధ […]
శేఖర్ మాస్టర్ భలే పంచ్… అంతటి సుమ ఉడుక్కుని సైలెంట్… నో కౌంటర్…
పర్లేదు… క్యాష్ ప్రోగ్రామ్ రద్దు చేసి పారేశాక సుమ కొత్తగా సుమ అడ్డా అని ఓ షో స్టార్ట్ చేసింది కదా… ఎలాగూ అది సరదాగా, కిట్టీ పార్టీ తరహాలోనే ఉంటుందని తెలుసు… కానీ సుమ కాబట్టి ఆ షోకు కొంత విలువ ఉంటుంది… స్పాంటేనియస్‌గా జోకులు పేలుస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ప్లజెంటుగా షో నడిపించేస్తుంది ఆమె… క్యాష్, స్టార్ మహిళ, వావ్, ఆలీతో సరదాగా, అన్‌స్టాపబుల్, కపిల్‌శర్మ షో వంటి అన్ని షోలను మిక్సీ చేసి, […]
అప్పటికే పేకేటికి ఐదుగురో ఆరుగురో పిల్లలు… ఐనా పెళ్లాడింది జయంతి…
Bharadwaja Rangavajhala……….. ఆలోచనల ఓవర్ ఫ్లో .. పేకేటి శివరామ్ ను జయంతి పెళ్లి చేసుకున్నప్పటి రిసెప్షన్ చిత్రం. ఆ క్రతువుకు ఎన్టీఆర్ తన సోదరుడితో సహా హాజరయ్యారు. పేకేటికి అది రెండో పెళ్లి. అప్పటికి పేకేటికి ఐదుగురో ఆరుగురో పిల్లలూ ఉన్నారు. అయినా పెళ్లాడారు … జయంతి. పెళ్లైన కొంత కాలం తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత జయంతి వేరే పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పుడు జయంతికి అది రెండోపెళ్లి. ఆ రెండో పెళ్లి చేసుకున్న […]
ప్రియ భవానీశంకర్… ఈ ‘కమనీయ తార’కు చేతిలో బొచ్చెడు రోల్స్…
గతం వేరు… పెద్దగా చదువూసంధ్య ఉండేది కాదు తారలకు..! ఇప్పుడు సినిమాల్లోకి, టీవీల్లోకి… రంగుల ప్రపంచంలోకి బాగా చదువుకున్న మహిళలు కూడా ప్రవేశిస్తున్నారు… సాయిపల్లవి వంటి ఒరిజినల్ డాక్టర్లు కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు అంటే పెద్దగా ఆశ్చర్యపోయే రోజులేమీ కావు ఇది… కళ్యాణం కమనీయం సినిమాలో లీడ్ రోల్ చేసిన ప్రియ భవానీశంకర్ బీటెక్ చేసింది, తరువాత మీడియా ఫీల్డులో పనిచేస్తూనే (న్యూస్ రీడర్) ఎంబీఏ పూర్తి చేసింది… ఈ చెన్నై తార న్యూస్ రీడింగ్ నుంచి తమిళ […]
వీరసింహుడి ప్రియురాలు మీనాక్షి… అసలు ఎవరీ తేనె గులాబీ… అనగా హానీ రోజ్…
అన్‌స్టాపబుల్ షోలో ఒక ఎపిసోడ్‌ను బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రమోషన్‌కు అంకితం చేశాడు కదా… అసలు ఆ షో కేరక్టర్ ఏమిటో, బాలయ్య ఏం చేస్తున్నాడో అంతా అల్లు అరవింద్‌కే ఎరుక… అసలే ఈసారి రకరకాల ప్రయోగాలతో అన్‌స్టాపబుల్ అనాసక్తికరంగా తయారైంది… దానికితోడు ఏకంగా తన సినిమా ప్రమోషన్‌కు ఒక ఎపిసోడ్ మొత్తాన్ని అంకితం చేయడంతో దానిపై ఇంట్రస్ట్ పోయింది చాలామందికి… ఇక రాబోయే ఎపిసోడ్ పవన్ కల్యాణ్‌తో ఉంటుంది… ఏముంది..? జజ్జనకరి జనారే… వీరసింహారెడ్డి ప్రమోషనల్ ఎపిసోడ్‌లోకి […]
విలన్లు కాదురా… రాయలసీమకూ మనసుంది – కలతపడితే కన్నీళ్లున్నాయి…
Seema in Cinema: రాయలసీమది కన్నీటి కథ. అంతు లేని వ్యథ . ఒక్కో భౌగోళిక ప్రాంతానికి ఒక్కో చరిత్ర, సంస్కృతి, మాండలికం , ఆచార వ్యవహారాలు విధిగా ఉంటాయి. నెలకు ముమ్మారు వర్షాలు కురిసిన రాయల కాలంలో రాయలసీమ ఎలా ఉండేదో? అంతటి మహోజ్వల వైభవ దీప్తులు నేడు కనీసం ఇంగువ కట్టిన గుడ్డగా అయినా ఎందుకు మిగలలేదో విడిగా చెప్పాల్సిన పనిలేదు. వరుస కరువులు, జలవనరుల కొరత సీమ దుస్థితికి కారణం. నెలకు అయిదారువేల జీతానికి సీమ కన్నడ […]
కమనీయంగా లేని కల్యాణం… థియేటర్ కోసం సాగదీసిన షార్ట్ ఫిలిమ్…
ఈ సినిమా గురించి నిజానికి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు… ఏదైనా ఓటీటీలోకి తోసిపారేస్తే అయిపోయేది… షార్ట్ ఫిలిమ్‌కు ఎక్కువ, ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్‌కు తక్కువ… అయితే ఒక చాన్స్ మిస్ చేశాడు దర్శకుడు ఆళ్ల అనిల్ కుమార్… సంక్రాంతి సందర్భంలో సహజంగానే జనం వినోదం కోసం ఖర్చు పెడతారు, సినిమాలు చూస్తారు… ఫ్యామిలీ ప్రేక్షకులు కలిసి సినిమాలకు వెళ్లే సందర్భాల్లో ఇదీ ఒకటి… దీన్ని సొమ్ము చేసుకోవడానికి పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉండటానికే […]
సంక్రాంతి బరిలో నాలుగు జీరోలు… విజేతలెవ్వరూ లేరు… ఎందుకంటే..?
ఊంచాయి సినిమా చూడండి… ఆ వయస్సులో… వయస్సు దాచుకోకుండా… ఆ వయస్సు వాళ్లకు కొత్త ఉత్సాహాన్నిస్తూ, బతుకు మీద ఆశల్ని పెంచుతూ… పాజిటివ్ వైబ్స్ పంచుతూ… ఒక అమితాబ్, ఒక అనుపమ్ ఖేర్, ఒక బొమన్ ఇరానీ, ఒక డేనీ… తోడుగా వెటరన్ తారలు… ఎంత ఉదాత్తమైన పాత్రలు… సినిమా రిలీజ్ సమయంలో జీరో బజ్… అయితేనేం, యాభై రోజులు నడిచి దాదాపు 50 కోట్లు వసూలు చేసింది… కలెక్షన్ పక్కనపెడితే ఆ పాత్ర ఔచిత్యానికి విలువ […]
ఆ వెగటు పఠాన్ దేనికి గానీ..? గాంధీ వర్సెస్ గాడ్సే వైపు చూడండి ఓసారి…
తొక్కలో ఫైట్లు, స్టెప్పుల ఇమేజీ బిల్డప్పుల ఫార్ములా సినిమాలు ఎవడైనా తీస్తాడు… ఒక కొత్త కథకు ప్రాణం పోస్తే, ఆల్రెడీ తెలిసిన కథకు కొత్తదనం అద్దితే, ప్రేక్షకుల బుర్రల్లో మథనం సాగిస్తే అదీ గొప్పదనం… 66 ఏళ్ల వయస్సులోనూ రాజకుమార్ సంతోషికి అలసట రాలేదు… జనంలోకి చర్చను వదిలే కథల్ని భలే రాస్తాడు… చక్కగా తీస్తాడు… నటీనటులను తనకు కావల్సిన రిజల్ట్ వచ్చేదాకా పిండుతాడు… అలాగని ఒక సైడ్ తీసుకోడు… రెండు బలమైన పరస్పర విరుద్ధ వాదనల్ని […]
అదే దుస్తులు… అవే స్టెప్పులు… అవే తుపాకీ మోతలు… అవే పాత్రలు… చిరు మారలేడు…
అదే బాలయ్య, నరుకుడు, తురుముడు, నెత్తురు, కత్తులు, సీమ ఫ్యాక్షన్… అదే చిరంజీవి స్టెప్పులు, పాటలు, ఇమేజీ బిల్డప్పులు, మాఫియాతో పోరాటాలు, తుపాకులు…. ఎవరి ఇమేజీ బందిఖానా వాళ్లది… వాళ్లు బయటికి రాలేరు… ఫ్యాన్స్ రానివ్వరు… బిజినెస్ లెక్కలు అస్సలు కదలనివ్వవు… వాళ్లు ఏర్పాటు చేసుకున్న మార్కెట్లో వాళ్లే బందీలు… బాలయ్య కాస్త నయం, అఖండ, శాతకర్ణి వంటివి కనిపిస్తాయి… అవసరమైతే చెంగిజ్‌ఖాన్ కలగంటాడు… తీసినా తీస్తాడు… మొండి… చిరంజీవి దగ్గర ఆ ధైర్యమూ లేదు… ఎవడో […]
నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ ఎందుకో అర్థం కావాలంటే… ఇది చదవాలి…
నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం మిక్కిలి ముదావహం… ఇంకేదో పాటకు రావడం వేరు, కానీ నాటునాటు పాటకే రావడం మరీ మీదిమిక్కిలి ముదావహం… కొంతమందికి నచ్చకపోవచ్చుగాక, కానీ ఎందుకు ఆ పాటకు అంత విశిష్టత తెలియకపోవడం వల్ల వచ్చిన దురవగాహన తప్ప మరేమీ కాదు… ఆ పాట విలువ తెలియాలి… తెలిస్తే కళ్లు చెమరుస్తాయి… గోల్డెన్ గ్లోబ్ ఆ పాటకు తప్ప మరే పాటకూ రావడానికి వీల్లేదని అప్పుడు అర్థం చేసుకోగలరు… ట్విట్టర్లో పవన్ సంతోష్ […]
సీమ అంటే అదే తరుముడు, అదే తురుముడు… బాలయ్య ఇక మారడు…
అదే ఫ్యాక్షన్… అదే రాయలసీమ… అవే పంచ్ డైలాగులు… అదే నరుకుడు… అదే ఉతుకుడు… బాలకృష్ణకు హిట్ సినిమా కావాలంటే మళ్లీ అదే సీమ సింహం పాత్ర కావల్సిందేనా..? ఇక వేరే పాత్రల వైపు వెళ్లడా..? వెళ్లలేడా..? బయటికి రాలేడా..? పైగా రాయలసీమను ఇంకా ఇంకా ఎందుకలా చూపించడం..? సీమ అంటే తరుముడు, తురుముడేనా..? సీమలో అడుగుపెట్టగానే వేటకొడవళ్లు, పారే నెత్తురేనా కనిపించేది..? అసలు ఫ్యాక్షన్‌కు సీమ దూరమై ఎన్నేళ్లయింది..? ఇంకా ఆ కత్తుల నీడలే చూపించాలా..? […]
మితిమీరిన కన్నడ ట్రోలర్ల ద్వేషం… ప్రశాంత్ నీల్ సోషల్ ఖాతాల రద్దు…
కన్నడిగుల భాషాభిమానం శృతిమించుతోంది… అది ఇతరుల పట్ల ద్వేషంగా మారుతోంది… మన తెలుగువాళ్లు నిజంగా అభినందనీయులు… కన్నడ స్టార్ పునీత్ రాజకుమార్ మరణిస్తే అందరిలాగే కన్నీరు పెట్టుకుంది… ఒక కేజీఎఫ్ సినిమాను సూపర్ హిట్ చేసింది… ఒక కాంతార సినిమాను నెత్తిన పెట్టుకుంది… కన్నడాన్ని మన సౌతే అని అలుముకున్నదే తప్ప విడిగా చూడలేదు… అది తెలుగువాడి సహృదయం… కానీ సినిమాలకు సంబంధించి కన్నడిగుల నుంచి ఈ వైఖరి కరువైంది దేనికి..? తాజాగా ప్రశాంత్ నీల్‌పై పడ్డారు […]
సంక్రాంతి తెలుగు పోటీ నుంచి ఈ ఇద్దరు తమిళ హీరోలూ సైలెంటుగా ఔట్..!!
తెలుగులో ఇమేజ్ దాదాపుగా ఇద్దరికీ ఈక్వల్… ఫస్ట్ కేటగిరీ కాదు, అలాగని తీసిపారేయలేం… కాబట్టి ఫుల్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణలతో సంక్రాంతి పోటీలో వాళ్లు నిలవలేరు అని అందరికీ తెలుసు… అనుకున్నట్టుగానే ఇద్దరి సినిమాలూ తేలిపోయాయి… వారసుడు తెలుగులో ఇంకా రిలీజ్ కాలేదు కానీ తమిళంలో టాక్ మిక్స్డ్… కాబట్టి తెలుగులో పెద్దగా వర్కవుట్ కాదు… కానీ డబ్బింగ్ ఖర్చే కదా, వచ్చినకాడికి వస్తాయి, లేకపోతే లేదు… కాకపోతే మరీ ఇలాంటి సినిమాలను తమిళంలో […]
గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు విలువేం ఏడ్చింది..? ఎందుకీ ఆహారావాలు, ఓహోరాగాలు..!?
అదేదో సినిమాలో… బ్రహ్మానందం తనే భాస్కర్ అవార్డులు ప్రవేశపెట్టి, వాటిని స్వీకరించి, మురిసిపోతాడు గుర్తుందా..? పోనీ, మన ఫిలిమ్ క్రిటిక్స్ అసిసోయేషన్ లేదా ఫిలిమ్ జర్నలిస్టుల అసోసియేషన్ గ్లోబల్ ఎలిఫెంట్ అవార్డులు లేదా ఇంటర్నేషనల్ క్యాట్ అవార్డులు అని ప్రకటిస్తే ఎలా ఉంటుంది..? పోనీ, మన ప్రభుత్వ శాఖలు డబ్బులు పెట్టి కొనుక్కునే స్కోచ్ అవార్డుల సంగతి తెలుసా మీకు.? కనీసం పైరవీలతో, లాబీయింగ్‌తో దక్కించుకునే జాతీయ అవార్డుల గురించైనా తెలుసా లేదా..? ఎస్… గోల్డెన్ గ్లోబ్ […]
చోద్యం కాకపోతే… ఈ పాత చింతపచ్చడి కోసమా దిల్ రాజు వీర ఫైటింగు..!
మన నిర్మాతలు… ఏ భాష హీరోనైనా పట్టుకొచ్చి తెలుగులో సినిమా తీస్తారు… మలయాళం, తమిళం నుంచి మరీ ఎక్కువ… వాళ్ల సొంత భాషల్లో ఆదరణకన్నా తెలుగులో ఎక్కువ ఆదరణ పొందిన హీరోలు కూడా ఉన్నారు… కానీ దిల్ రాజు వెరయిటీ… అదే జయసుధ, అదే ప్రకాష్‌రాజ్, అదే సంగీత… అంతా తెలుగు నటులే కనిపిస్తుంటారు… హీరో విజయ్‌తో తమిళంలో ఆ సినిమా తీశాడు… రష్మిక హీరోయిన్… దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తెలుగే… అన్నట్టు ఫాఫం శ్రీకాంత్ […]
కాపీ ట్యూన్ రచ్చలోకి పరోక్షంగా డీఎస్పీని కూడా లాగిన థమన్…
మొత్తానికి థమన్ భలే చెప్పాడు… కాదు, అంగీకరించాడు… పాత సినిమాల్లోని ట్యూన్లను కాపీ కొట్టేస్తామని చెప్పేశాడు… జైబాలయ్య అనే పాటకు తను వాయించిన ట్యూన్ గతంలో వందేమాతరం శ్రీనివాస్ పాడిన ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్‌తో పోలి ఉందని సోషల్ మీడియా ఆల్రెడీ థమన్ బట్టలిప్పింది… థమన్ ఏ పాట చేసినా సరే, క్షణాల్లో అది గతంలో ఏ సినిమాలో వచ్చిందో, ఎక్కడి నుంచి కాపీ కొట్టారో సోషల్ మీడియా బయట పెట్టేస్తోంది… గతంలోనైతే ‘నో, నో, […]
కొరత… అర్జెంటుగా తెలుగు సినిమాకు కొత్త హీరోయిన్లు కావాలిప్పుడు…
ఇప్పుడు డిస్కషన్ ఏమిటంటే… శ్రీదేవి బిడ్డ జాన్వీ ఉంది కదా… ఆమెను హీరోయిన్గా తీసుకోవాలని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆలోచన… అందులో జూనియర్ ఎన్టీయార్ హీరోయిన్… ఇప్పుడప్పుడే కాదులెండి… ప్రశాంత్ చేతిలో ఒకటీరెండు పెద్ద ప్రాజెక్టులున్నయ్… అందులో ఒకటి ప్రభాస్‌తో తీస్తున్న సాలార్… అవి అయిపోయాక కదా జూనియర్‌తో సినిమా… జాన్వీని అడిగితే కళ్లు తిరిగే రేటు చెప్పిందట… ఆమె అనుభవం మూడునాలుగు సినిమాలు… అందులో ఒకటీ క్లిక్ కాలేదు… పెద్దగా నటన తెలుసా అంటే […]
- « Previous Page
- 1
- …
- 78
- 79
- 80
- 81
- 82
- …
- 130
- Next Page »