వేట్టయన్… అంటే వేటగాడు… ఆ తమిళ పేరే తెలుగులో, ఇతర భాషల్లోనూ… తెలుగు పేరే దొరకలేదా..? అనే ప్రశ్నకు పంపిణీదారుల నుంచి ఓ శుష్క సమర్థన వచ్చింది… ఎవరికీ నచ్చలేదు… ఆ సినిమాలాగే..! అరె, అదేమిటి..? జైభీమ్ వంటి మంచి ఆలోచనాత్మక సినిమాను ప్రజెంట్ చేశాడు దర్శకుడు జ్ఞానవేల్… ఈ వేట్టయన్ను అదే రేంజులో ఎందుకు ప్రజెంట్ చేయలేకపోయాడు..? ఇదీ ప్రశ్న… పైగా ఒకరా ఇద్దరా..? అసలే రజినీకాంతుడు… దానికితోడు అంతటి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్… […]
మేకప్ లేకపోతేనే వాణిశ్రీ అందంగా సహజంగా ఆకట్టుకునే గోరంతదీపం..!!
వాణిశ్రీ మేకప్పు లోనే కాదు , మేకప్పు లేకపోయినా కూడా అందంగానే ఉంటుందని రుజువు చేసిన సినిమా 1978 లో వచ్చిన ఈ గోరంతదీపం సినిమా . ఈ సినిమా కూడా వాణిశ్రీ సినిమాయే . ఆమే షీరో . అమాయకపు మెగుడు , జులాయి మామ , ఆరళ్ళు పెట్టే అత్త , అమాయకపు మొగుడి బెస్ట్ ఫ్రెండ్ అవతారంలో ఓ స్త్రీలోలుడు , వాడి వెంట ఓ గాలి బేచ్ , అత్తారింటికి పోయాక […]
ఆ పాత దేవదాసును దాసరి మళ్లీ అంతే క్లాసిక్గా పుట్టించలేకపోయాడు..!!
ఓ సూపర్ హిట్ సినిమాకు ఇరవై అయిదేళ్ళ తర్వాత సీక్వెల్ తీయాలనే ఆలోచన రావటమే సంచలనం . హేట్సాఫ్ టు దాసరి . దానికి తగ్గట్టుగా ప్రధాన పాత్రధారులు జీవించి ఉండటం. ఇదీ గొప్ప విషయమే . దేవదాసు సినిమాలో ఎక్కువ మందికి దేవదాసు , పార్వతిల పాత్రలు నచ్చుతాయి . నాకు ఆ రెండు పాత్రల కన్నా ఎక్కువ నచ్చే పాత్ర , నేను గౌరవించే పాత్ర చంద్రముఖిదే . ఒక వేశ్య ఒక అభాగ్యునికి […]
శివ ఇంపాక్ట్..! యువతలో హింసా ప్రవృత్తిని ఖచ్చితంగా పెంచిన మూవీ..!
. లల్కార్, ది ఓపెన్ ఛాలెంజ్! సిచుయేషన్ ఆఫ్టర్_ శివ శివ సినిమా ప్రభావం మా ఊరు కరీంనగర్ పై బలంగా పడిందనే చెప్పాలి! తస్సాదియ్యా, ఆ మూవీ రిలీజ్ ఐన తరవాత మంకమ్మతోటలో యూత్ ఏకంగా శివ గ్యాంగ్, భవానీ గ్యాంగ్ అంటూ రెండుగా చీలిపోయి కొట్టుకున్నారంటే, దానమ్మా ఎఫెక్టా మజాకా! తరవాత పోలీసోళ్లు ఆ పోరగాళ్లను టూ టౌన్ కు తీసుకుపోయి రోకలిబండలు ఎక్కిచ్చిన్రు, అది వేరే విషయం! అంతకుముందు టౌన్లో గ్యాంగ్ వార్స్ […]
అదేమిటో గానీ ఆయన సినిమాల్లో వాణిశ్రీ ఎక్కువ అందంగా కనిపిస్తుంది..!!
చీరెలెత్తుకెళ్ళాడా చిన్నికృష్ణుడు చిత్తమే దోచాడీ చిలిపికృష్ణుడు . ఈ సినిమా అనగానే ఎవరికయినా గుర్తుకొచ్చే పాట ఇదే . నాకు ఈ పాట కూడా చాలా చాలా ఇష్టం . ఆత్రేయ గారు వ్రాసారు . 1978 లో వచ్చిన ఈ చిలిపి కృష్ణుడు సినిమా జనానికి బాగా నచ్చింది . ఇరవై అయిదు వారాలు ఆడింది . ఈ సినిమాలో ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది ANR రంగురంగుల , పువ్వుల పువ్వుల చొక్కాలు . రాజబాబువి కూడా […]
భారీ సినిమాలపై ఓటీటీల పునరాలోచనలు… పాత ఒప్పందాలూ జాన్తా నై…
. ముందుగా కోరా జాన్ పోస్టు చదవండి ఓసారి… ఇది తంగలాన్ – నెట్ఫ్లిక్స్ వివాదం పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ లీడ్ రోల్లో వచ్చిన తంగలాన్ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 20న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదల […]
పద్దెనిమిది చలిచీమలు కలిసి… తలా పది వేలు వేసుకున్న శ్రామిక చిత్రం…
బక్కోళ్ళ సినిమా . అంటే కేవలం బక్క జీవుల మీద సినిమా అనే కాదు . నిర్మాతలు , నటులు అందరూ ఈ సినిమా తీసేనాటికి బక్కోళ్ళే . 18 మంది నిర్మాతలు తలా పది వేలు వేసుకుని ఈ సినిమాను నిర్మించారట . సినిమా ప్రొడక్షన్ పేరు కూడా శ్రామిక చిత్ర . కమర్షియల్ గా కూడా నిరుత్సాహపరచలేదట . ఈ 18 మంది నిర్మాతల్లో వేజెళ్ళ సత్యనారాయణ కూడా ఉన్నారు . తర్వాత కాలంలో […]
కృష్ణకు ఏసీ కాటేజ్..! రజినీకాంత్ రూమ్ బాగాలేక వరండాలో పడుకున్నాడు…!!
. ఇద్దరు సూపర్ స్టార్లు కృష్ణ , రజనీకాంతులు నటించిన ఈ అన్నదమ్ముల సవాల్ సినిమా 1978 లో వచ్చింది . కన్నడంలో హిట్టయిన సహోదర సవాల్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . రెండు సినిమాలకూ కె యస్ ఆర్ దాసే దర్శకులు . రజనీకాంత్ రెండు భాషల్లోనూ నటించారు . తెలుగులో కూడా వంద రోజులు ఆడింది . రొటీన్ కధే అయినా స్క్రీన్ ప్లే బాగుంటుంది . దర్శకుడు స్పీడుగానే నడిపిస్తాడు […]
కోమాలో ఉన్న భార్యకు నమస్కారం పెట్టి… అనుపమ్ ఖేర్ కదిలించేస్తాడు…
. #the signature మనిషి జీవితంలో డబ్బులు ఎంత ప్రాముఖ్యమో, ఒక్కొక్క రూపాయి కోసం తపించిపోతూ, భార్య కొస ప్రాణాలను కాపాడుకోవడం కోసం తాపత్రయ పడుతున్న భర్త పాత్రలో అనుపమ్ ఖేర్ అద్భుతంగా నటించారు “మధూ! నువ్వు ముందే ఎందుకు చనిపోలేదు? పన్నెండు రోజుల తర్వాత ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత చనిపోతానంటే ఎలా?” “నా దగ్గర ఉన్న డబ్బులతో నేను నీకు ఇంకా ఎన్ని శ్వాసలు కొనగలను మధూ?” అంటూ కోమాలో ఉన్న భార్యకు […]
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో… తాజ్మహల్ ధవళ కాంతుల్లో… నిదురించూ జహాపనా…
. గురుసమానులు మల్లావఝల సూర్యనారాయణ శర్మ కాలం చేశాడనే సమాచారం చదివిన వెంటనే చిన్నప్పుడు తను పరిచయం చేసిన తెలుగు హనుమాన్ చాలీసా గుర్తొచ్చింది… ఓ చిన్న హనుమాన్ గుడిలో ప్రతివారం తన ఆధ్వర్యంలోనే భజన సాగేది… అందులో చాలీసా, సుందరకాండ తప్పనిసరి… అవి రాసింది, పాడింది ఎంఎస్ రామారావు… సుందరదాసుగా సుప్రసిద్ధుడు… తన గురించి గొప్పగా చెప్పేవాడు తరచూ… అలా తనూ గుర్తొచ్చాడు… తను నీరాజనం సినిమా కోసం ఆలపించిన ఈ విశాల ప్రశాంత ఏకాంత […]
పుట్టు గుడ్డి… పాడిందే పట్టుమని పదిహేను పాటలు… కానీ ‘మెచ్చిన పాట’…
పాతాళభైరవి సినిమా టైటిల్స్ లో ప్లేబ్యాక్ అంటూ ఘంటసాల లీల జిక్కిల పేర్లు మాత్రమే పడతాయి. మరి అందులో ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు పాట పాడిన వి.జె.వర్మ పేరుగానీ … ఇతిహాసం విన్నారా అన్న టిజి కమల పేరుగానీ వినవే బాలా అన్న రేలంగి పేరు గానీ కనిపించదు. ఎపి కోమల పేరు కూడా లేదు. ఆరో తరగతిలో ఉండగా బెజవాడ రామ్ గోపాల్ లో రెండోసారి పాతాళభైరవి చూసినప్పుడు ఈ ప్రేమ […]
ఆ కృష్ణ దేవదాసులాగే… ఈ ఎన్టీయార్ అనార్కలి కూడా ఓ బ్లండర్…
1978 లోకి వచ్చేసాం … అనార్కలి మీద చాలా భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి … 1978 లో వచ్చిన ఈ అక్బర్ సలీం అనార్కలి కధా రచన , స్క్రీన్ ప్లే , దర్శకత్వం యన్టీఆరే వహించారు.. . బాగా ఆడలేదు … ప్రేక్షకులకు నచ్చలేదు … కర్ణుడి చావుకు ఆరు కారణాలు అన్నట్లు , ఈ సినిమా వైఫల్యానికి కూడా చాలా కారణాలే ఉన్నాయి . 1960 లో మొఘల్ ఎ ఆజం టైటిల్ […]
బక్కపలచ ఉడుకు నీలో బలిసిపోయిందా… ఫాఫం జయప్రద, ఎన్టీయార్ ఇనుపలవ్వు…
ఏమని వర్ణించను ఈ సినిమా గురించి ! నా మిత్రులు ఒక్కొక్కరు ఒక్కో థీసిస్ వ్రాస్తారు . అయినను ప్రయత్నించెదను . అడవిరాముడు వీర మాస్ అయితే ఈ యమగోల ఊర మాస్ . 1977 యన్టీఆర్ ఇయర్ . 28 సెంటర్లలో వంద రోజులు అడింది . మన తెలుగోళ్ళకు యముడంటే చాలా ఇష్టం . ఆయన సినిమాలన్నీ హిట్టయ్యాయి . 1960 లో దేవాంతకుడు , 1994 లో యమలీల , 1977 లో […]
సూపర్స్టార్ కృష్ణకు సరైన జత’ప్రద… తెలుగు తెరపై సోకాల్డ్ స్ట్రాంగ్ కెమిస్ట్రీ…
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మరెమ్మకు . ఇంత భావుకత కలిగిన పాట దేవులపల్లి కాక మరెవరు వ్రాస్తారు ?! యస్ రాజేశ్వరరావు , దేవులపల్లి , సుశీలమ్మ అలా దిగిపోతారు ఈ పాటలో . తగ్గట్టుగానే జయప్రదా నటించింది . 1977 లో వచ్చిన ఈ ఈనాటి బంధం ఏనాటిదో సినిమా ఈ పాట వలన కూడా పాపులర్ అయింది . ఈ సినిమా కధ , స్క్రీన్ ప్లే అంతా నిర్మాత బాలయ్యదే […]
సావాసగాళ్లు గుమ్మడి, సత్యనారాయణలు కూడా డాన్సులు చేశారు..!!
నాకు బాగా నచ్చిన సంసారపక్షమైన సినిమా . సందేశాత్మక కధ . మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి . చెంబులో ఉన్న నీళ్ళతోనే కాళ్ళు కడుక్కోవాలి . One should not bite more than what he can chew . మనిషి ప్రశాంతంగా జీవించటానికి కావలసిన సందేశం ఉన్నది ఈ సినిమాలో . 1977 లో వచ్చింది . ఇద్దరు సావాసగాళ్ళు . ఒకరేమో ఉంగరాల సాంబయ్య అనబడే బడాయి బసవయ్య . మరొకరు […]
సత్యమే సుందరం..! చాలాసార్లు సంతోషంతో ఏడ్చాను. కారణం తెలీకుండా ఏడ్చాను…
. గుర్తుకొచ్చారా? – మహమ్మద్ ఖదీర్బాబు ‘ఒరే గాడ్ది’ అనే అక్క ఒకత్తి ఉంటుంది. మద్రాసులో ఉంటుంది. అంత మంచి పొడవైన కురులు మళ్లీ జన్మలో చూడం. సెలవుల్లోనో, పెళ్లిళ్లప్పుడో నశ్యం వల్ల నల్లగా ఉండే ముక్కుపుటలతో ఉండే వాళ్లమ్మతో వస్తుంది. ఆవిడ వరుసకు మేనత్త అవుతుంది. తమిళ దేశానికి వెళ్లి సంసారం చేసి కూతుర్ని కన్నది. వచ్చిదంటే పూర్వికుల పురాణం విప్పుతుంది. ఆ బంధువులు అక్కడ ఈ బంధువులు ఇక్కడ… మాటల్లో బంధాలు తెలుస్తూ ఉండగా […]
అన్య భాషల ఎదుట ఏమిటీ సాగిలబాటు..! తెలుగు దివాలా తీసిందా..?!
చాలాసేపు మాట్లాడాను… తనేం అంటాడంటే..? మన తెలుగు కంపోజర్లు లేరా…? ఇండస్ట్రీలో బతక్కూడదా..? ఒకప్పుడు హిట్లు ఇచ్చినవాళ్లు కూడా ఊళ్లు, దేశాలు పట్టిపోయారు… జాడాపత్తా లేరు… ఎంతసేపూ తమిళ, కన్నడ కంపోజర్లే కావల్సి వచ్చారా..? మనవాళ్ల ప్రతిభకు విలువ లేదా..? అవకాశాల్లేవా..? బతకనివ్వరా..? నిజమే కదా అనిపించింది… ఓ యంగ్ మ్యూజిషియన్ను నీ అభిప్రాయం ఏమిట్రా అబ్బాయ్ అనడిగాను… నవ్వాడు… అంకుల్ (హబ్బా… ఇదొక నొప్పి…) సక్సెస్ డిక్టేట్స్… success dictates… భాషకన్నా సంగీతమే ప్రధానం, సంగీతంకన్నా […]
కొన్ని కథలు మలయాళ, బెంగాలీ ప్రేక్షకులకు మాత్రమే… మనకు ఎక్కవు..!!
ఇరవయ్యో శతాబ్దం మొదటి రోజుల్లో దేశంలో సంచలనం కలిగించిన భవాల్ రాజా కేసు ఆధారంగా వచ్చిన సన్యాసి రాజా అనే బెంగాలీ సినిమాకు రీమేక్ 1977 లో వచ్చిన మన రాజా రమేష్ సినిమా . బెంగాలీలో ఉత్తమ కుమార్ , సుప్రియాదేవి నటించారు . బెంగాలీలో సూపర్ హిట్ మూవీ . 126 రోజులు ఆడింది . మన తెలుగు సినిమాలో అక్కినేని , వాణిశ్రీ , జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించారు . అయితే […]
అందమైన ఆ సీత పక్కన… ఆ రాముడు నప్పలేదు… వెరసి అప్పట్లోనే ‘ఆదిపురుష్’…
మరో సీతా కల్యాణం . సీతా కల్యాణానికి కొనసాగింపే ఈ సీతారామ వనవాసం . బాపు గారి సినిమాకు పేరు , అవార్డులన్నా వచ్చాయి . కమలాకర కామేశ్వరరావు గారి ఈ సినిమాకు పేరు ఏమయినా వచ్చిందేమో కాని , డబ్బులు, అవార్డులు మాత్రం రాలేదు . సినిమా అంత నాసిదేమీ కాదు . అయినా నిర్మాత పింజల సుబ్బారావుకు ధన ప్రాప్తి ఉన్నట్లుగా లేదు . రెండు సినిమాలలోనూ శ్రీరాముడిగా రవి నటించారు . సీతా […]
నిజమే… ఎవరో హిందీ సినీరచయిత చెప్పినట్టు… రేఖ అంటేనే ఓ విభ్రమ..!!
మామూలుగా మన చుట్టూ మహిళలకు 70 ఏళ్లు వచ్చాయంటే… బామ్మలు, మామ్మలు… కాళ్ల నొప్పులు… ఆయాసం, అనారోగ్యం, మొహంపై ముడతలు… వయస్సయిపోయి ఇహలోకం నుంచి ఇక ఎప్పుడు విముక్తి అన్నట్టుగా మాటలు, చూపులు, అడుగులు… నిస్తేజం అలుముకుని, నిర్వేదంగా సాగే నిర్లిప్త జీవనాలు కనిపిస్తుంటాయి కదా… కానీ ఆమె… 69 ఏళ్ల వయస్సు… అమృతం తాగిందో ఏమో… వయస్సు ఎక్కడో ఆగిపోయింది… ఈ వయస్సులోనూ అనార్కలి డ్రెస్ వేసుకుని, అబూదాబిలో జరిగిన సినిమా అవార్డుల ఐఫా వేదిక […]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9
- 10
- 11
- …
- 120
- Next Page »