మమ్ముట్టి… వయస్సు 70 ఏళ్లు… యాభై ఏళ్లుగా తను మలయాళంలో తిరుగులేని హీరో… మోహన్‌లాల్ తనకన్నా పదేళ్లు చిన్న… అప్పుడప్పుడూ మన్నెంపుల్లి, జనతా గ్యారేజీ, మనమంతా ఎట్సెట్రా పాత్రలతో తనను గమనించే అవకాశం లభించింది… కానీ మమ్ముట్టి అప్పుడెప్పుడో ముప్ఫయ్ ఏళ్ల క్రితం తను హీరోగా నటించిన స్వాతికిరణం ఓ క్లాసిక్… తరువాత యాత్ర అని వైఎస్ బయోపిక్‌లో ఓ పార్ట్… మళ్లీ ఇప్పుడు సోనీ యాప్‌లో పెట్టిన పుజు… నటవిశ్వరూపం… ఈ వయస్సులో కూడా ఓ […]
ఔనా, థమన్ భయ్..? నువ్వు చెప్పేది నిజమా..? ఓహో, అలాగా..? అబ్బ ఛా..!
సర్కారువారి పాట మూవీ విక్టరీ పార్టీకి థమన్ ఎందుకు పోలేదు..? బీజీఎం సరిగ్గా లేదనీ, రెండు పాటలు కాపీ ట్యూన్లేననీ మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి కూడా విమర్శలొచ్చాయి… ఏపాట దేనికి కాపీయో కూడా సోషల్ మీడియా బట్టలిప్పేసింది… ప్రత్యేకించి సూపర్ హిట్ సాంగ్ కళావతి పల్లవి కొత్తగానే ఉన్నా, చరణాలన్నీ తన పాత పాటలకు కాపీయేననీ నెటిజనం విశ్లేషించింది… తనపై జరుగుతున్న కాపీక్యాట్ ప్రచారంతో డిస్టర్బ్ అయినందువల్లే థమన్ సర్కారువారిపాట పార్టీకి పోలేదని ఓ టాక్… […]
నుదుట తిలకమై వాలుతా… ఆకట్టుకునే ప్లజెంట్ మెలొడీ సాంగ్…
సాధారణంగా సినిమా ప్రమోషన్ అంటే… ముందుగా ఒక పాటకు సంబంధించిన ప్రోమో… మళ్లీ మరో ప్రోమో… తరువాత లిరికల్ వీడియో… ఆ తరువాత మరో పాట… పాటలు హిట్టయితే సినిమాకు హైప్… సో, పాటలు బాగుంటే సినిమాకు బాగా ప్లస్… పుష్ప ఘనవిజయంలో పాటలదే ప్రధాన పాత్ర ఈమధ్య కాలంలో… అయితే ఒక సినిమాకు సంబంధించి భలే ఆశ్చర్యమేసే ఒకటీరెండు విశేషాలున్నయ్… మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ సినిమాలో నటిస్తున్నాడు… పేరు సీతారామం… యుద్ధంతో […]
భేష్ మమ్ముట్టి… భేష్ పార్వతి… పరిణతి ప్రదర్శించారు, భళిరా అనిపించుకున్నారు…
వెరీ థిన్ లైన్… పెద్ద లోతైన సమీక్ష కాదు, విశ్లేషణ కాదు… కానీ ఏమాటకామాట… కేరళ తారలు నటనలో పర్ఫెక్ట్… మంచి కమిట్మెంట్… (సినిమా పరిభాషలో కమిట్మెంట్ గురించి కాదు…) మంచి నటన తెలిసిన తారలు… నిజానికి అది కూడా కాదు అసలు విషయం… వివక్ష మీద గొంతెత్తుతారు… స్త్రీద్వేషం మీద, మగ వివక్ష మీద, ఆ పోకడల మీద, వేతనాల్లో తేడా మీద సంయుక్తంగా పోరాడతారు… ఒకరికొకరు సంఘీభావంగా నిలుస్తారు… అదెందుకో కాస్త నచ్చుతుంది… అదే […]
ఆలీ నాలుకకు తీట ఎక్కువే… ఆ కంపుకు అడివి శేషూ మూసుకున్నాడు…
కమెడియన్ ఆలీ నోటికి కాస్త తీట ఎక్కువే… ఏదో ఒక పిచ్చి కూత కూయనిదే నాలుక చల్లారదేమో… గతంలో కూడా ఆలీ బహిరంగ వేదికల మీద చేసిన చిల్లర వ్యాఖ్యలపై బోలెడు కథనాలు వచ్చాయి… ఐనా ఆలీ మారడు… మారలేదు… ప్రైవేటు సంభాషణల్లో వోకే, కానీ పది మందీ గమనించే ప్రోగ్రాముల్లోనూ అదే ధోరణి ఆశ్చర్యకరం… ఏపీ పొలిటిషియన్ కదా, తోటి నాయకుల బూతులతో తన నాలుకకు కూడా మరింత పదును పెట్టుకున్నట్టు కనిపిస్తోంది… ఆలీతో సరదాగా […]
మహేష్ బాబు అర్థరహితమైన వ్యాఖ్య… డ్యామేజీ కంట్రోల్ ప్రయత్నాలు…
మామూలుగా మహేష్ బాబు బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు… ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లలో ఎక్కడైనా సరే మాట తూలడు… వివాదాల జోలికి పోడు… కూల్‌గా, హుందాగా ఉంటాడు… కానీ మొన్న ఓచోట హఠాత్తుగా హిందీ సినిమాలకు సంబంధించి చేసిన వ్యాఖ్య ఇప్పుడు వివాదాన్ని కొనితెచ్చింది… నిజంగానే తన వ్యాఖ్యలు అర్థరహితం… హిందీ సినిమా తనను భరించలేదు అనే వ్యాఖ్య సందర్భరహితం కూడా..! తను ఏ మూడ్‌లో ఉండి, ఏం అనబోయి, ఆ మాటలన్నాడో తెలియదు గానీ, ఆ […]
ఫాఫం దిల్ రాజు… అంతటి సినిమా టైకూన్కూ రేటింగ్స్ చుక్కలు…
దిల్ రాజుకు పరాభవమా..? హెంత మాఠ..? హెంత మాఠ..? అయ్యారే, నమ్మశక్యంగా లేదే..! ఇంతకీ ఏం జరిగినది..? ఇవే కదా మీ ప్రశ్నలు… సరే, వివరముగా చెప్పుకుందాము… దిల్ రాజు అనగానెవ్వరు..? తెలుగు రాష్ట్రాల్లో చలనచిత్ర నిర్మాణం, ఆర్థికసహకారం, పంపిణీ, ప్రదర్శన అనగా ఆంగ్లమున ప్రొడక్షన్, ఫైనాన్స్, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాలను తన కంటిచూపుతో, కనుసైగలతో శాసించు ఓ ప్రబలశక్తి… అకస్మాత్తుగా ఆయనకు ఓ ఆలోచన తట్టినట్టుంది… ”తనలాంటి వ్యక్తే కదా అల్లు అరవింద్, మన సిండికేటే […]
అవి సరిపోలేదు..! సర్కారువారి పాట తేడా కొట్టేయడానికి ఏమేం కారణాలు..?!
సరిపోలేదు… మహేష్ బాబు సూపర్ లుక్, గతంకన్నా భిన్నంగా సరదా స్టెప్పులు, భిన్నమైన ఫైట్లు, సరదా డైలాగ్స్ సరిపోలేదు… 46 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోలాగా కొత్తకొత్తగా కనిపించడం బాగుంది, కానీ సరిపోలేదు… కీర్తి సురేష్ స్లిమ్‌గా ఉంది, అందంగా ఉంది, మాస్ అప్పీల్ ఉంది, మహేష్‌తో కెమిస్ట్రీ బాగుంది… స్టెప్పుల్ని ఇద్దరూ ఇరగదీశారు… కానీ సరిపోలేదు… కళావతీ, మ మ మహేష్ పాటలు అదరగొట్టాయి, కానీ సరిపోలేదు… కేవలం ఫార్ములా, ఇమేజ్ వదలని ట్రీట్మెంట్ […]
కాజల్ కొడుకు పేరేంటి..? మియా మల్కోవా దేశమేంటి..? అలియా ఏం చదివింది..?
కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏమిటి..? శ్రియ మొగుడి ఇంటి పేరు రాయండి..? కరీనాకపూర్ కొడుకుల పేర్ల వివాదం వివరించండి..? ప్రముఖ దర్శకుడు రాంగోపాలవర్మ మియా మల్కోవాతో తీసిన సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు..? థమన్ ఎంతవరకూ చదువుకున్నాడు..? నయనతార మొత్తం అఫైర్లు, బ్రేకప్పులను సంక్షిప్తంగా రాయండి… వనిత విజయకుమార్ నాలుగు పెళ్లిళ్లూ ఎందుకు చెడిపోయాయి..? సమంత, నాగచైతన్య విడాకులకు కారణాలు ఏమై ఉంటాయో ఊహించండి… రేప్పొద్దున మీ పిల్లల ఇంటర్ లేదా డిగ్రీ పరీక్ష పత్రాల్లో […]
ఆమె కీర్తి సురేషేనా..? ఆ మహానటేనా..? మీరు మారిపోయారు మేడమ్…!!
కీర్తి సురేష్ తల్లి మేనక (చిరంజీవి పున్నమినాగులో ఉంది, అసలు పేరు పద్మావతి)… నిర్మాత, ఒకప్పటి హీరోయిన్… తండ్రి సురేష్ కుమార్ నిర్మాత… సోదరి రేవతి వీఎఫ్ఎక్స్ స్పెషలిస్టు, షారూక్ రెడ్ చిల్లీస్‌లో పనిచేసింది… పుట్టుక నుంచీ తనది సినిమా వాతావరణమే… సినిమా ఫీల్డ్‌లో సెంటిమెంట్లు, డబ్బు, గ్లామర్, కుట్రలు, ప్రమాదాలు అన్నీ వింటూ, చూస్తూ పెరిగిందే… మహానటి అనే పాత్ర ఆమెకు బోలెడంత అదృష్టాన్ని, కీర్తిని, డబ్బును, కెరీర్‌ను మోసుకొచ్చింది… ప్రతిభావంతురాలే, జాతీయ అవార్డుకు అర్హురాలే… […]
తెలుగు ఇండియన్ ఐడల్… నిత్య మేనన్ బైబై… శ్రావణభార్గవి ఇన్…
ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ షో నుంచి మొన్నటి ఆదివారం అర్థంతరంగా జడ్జిల్లో ఒకరైన నిత్యా మేనన్ బయటికి వెళ్లిపోయింది… వీడ్కోలు చెప్పింది… అమ్మల దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్స్ అవి… కంటెస్టెంట్ల తల్లులు కూడా పార్టిసిపేట్ చేశారు… అకస్మాత్తుగా వాళ్ల అమ్మను తలుచుకుని ఎమోషన్‌కు గురైన నిత్యా మేనన్ అమ్మను కలవడానికి వెళ్తున్నాను అంటూ మధ్యలోనే లేచి వెళ్లిపోయింది… మణిశర్మ పాల్గొన్న ఆ ఎపిసోడ్లో మధ్యలో వెళ్లిపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించింది… నిజానికి బెంగుళూరులో […]
అల్లరి అనే గొప్ప సినిమాను… అంతే గొప్పగా స్మరించుకున్న తెలుగు మీడియా…
ఆంధ్రజ్యోతి నిన్న ఓ సినిమాకు ఆహో ఓహో అని ఫుల్లు డప్పు కొట్టింది ఓ ముప్పావు పేజీలో… అబ్బో, జూనియర్ నరేష్ అలియాస్ అల్లరి నరేష్‌కు అంత సీన్ ఉందా..? అసలు సందర్భమేమిటబ్బా అని లోపలకు వెళ్తే… భజనను ఇరగదీశాడు ఆ రచయిత ఎవరో గానీ… సాధారణంగా సినిమా పేజీల్లో ఏం వేస్తున్నారో చూసేంత ఓపిక, తీరిక సంపాదకులకు ఉండదు, అందులోనూ ఆంధ్రజ్యోతిలో అస్సలు ఉండదు… ఈమాట ఎందుకు అనుకోవాలీ అంటే… ఓ మంచి సినిమాను స్మరించుకునే […]
అరె, ఏం ప్రశ్నలు అడుగుతుర్ర భయ్… అన్నీ చచ్చు ఇంటర్వ్యూలు…
ప్రపంచంలో చాలారకాల మనుషులుంటారు… కొందరు ఎక్స్ట్రీమ్… మందకు ఎడంగా నడిచే బాపతు… అయితే పిచ్చోళ్లు లేకపోతే మేధావులు… అరుదుగా వర్మ వంటి కొత్త కేటగిరీ ఉంటుంది… అందరూ రాసీ రాసీ, చూపీ చూపీ, అడిగీ అడిగీ వర్మ మీద ఏదేదో టన్నుల కొద్దీ చెప్పారు కాబట్టి తన తత్వం లోతుల్లోకి వెళ్లే సాహసం మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు… తను కూడా ఎప్పటికప్పుడు తిక్క (?) చేష్టలతో వార్తల్లో ఉంటాడు కాబట్టి తన వ్యవహార ధోరణి […]
నువ్వు సూపర్ మహేష్… ఎక్కడా తొణక్కుండా, కూల్‌గా భలే జవాబు చెప్పావ్…
‘‘ఫిల్మ్ బ్యూరో రాధా అడిగిన ప్రశ్నకు షాక్ అయిన సూపర్ స్టార్’’ అని ఓ వీడియో కనిపించింది… ఇలాంటి వీడియో వార్తల సంగతి తెలుసుకదా… అందుకని మనసులోనే ఆంజనేయస్వామిని ఓసారి పాహిమాం అని ధ్యానించి, చూడ సాహసించి, వీడియో ఓపెన్ చేస్తే… సదరు సూపర్ స్టార్ షాక్ సంగతేమిటో గానీ… నాకు కొన్ని షాక్స్ తగిలాయి… కానీ ఏమాటకామాట… ఆ తిక్క స్క్వేర్ ప్రశ్నకు మహేష్ జవాబు ఇచ్చిన తీరు, తను చూసిన చూపు మాత్రం భలే […]
ఇన్నేళ్లుగా మహేష్ బాబుకు ఈత రాదు… 46 ఏళ్ల వయస్సులో నేర్చుకున్నాడు…
సాధారణంగా సినిమాల్లో హీరోలు అంటేనే… సముద్రాలు ఈదేస్తారు, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కేస్తారు… ఒంటి చేత్తో మడత నలగకుండా వందలాది మంది రౌడీలను ఉతికేస్తారు… ఏదంటే అది చేసేస్తారు… అంత సుప్రీం స్టామినా అన్నమాట… తెర మీద వాళ్లకు తెలియని విద్య ఉండదు… కానీ ఒరిజినల్‌గా వాళ్లూ మనుషులే కదా… నానా బలహీనతలు ఉంటయ్… కాకపోతే ఎప్పుడూ తమలోని మైనస్ పాయింట్లు, భయాలు గట్రా బయట ఫోకస్ గాకుండా జాగ్రత్త పడతారు… అది తమ ఇమేజీకి నష్టం […]
ఓహ్… ఆ సాయిపల్లవి వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదా..?
మొన్నామధ్య సాయిపల్లవి ఓ ఫోటో షేర్ చేసుకుంది… చీరెలో ఆమె, భుజాన ఓ హ్యాండ్ బ్యాగ్, వీథుల్లో పరుగు తీస్తున్న అడుగులు… అంతే, అందులో ఆమె మొహం ఏమీ లేదు… మే9న ఇదేమిటో వెల్లడవుతుందని చెప్పింది… అది ఆమె జన్మదినం… సో, ఆ ఫోటో ఎందుకు వైరల్ అయ్యిందీ అంటే… ఈమధ్య అందరూ తెగరాసేస్తున్నారు, ఆమె చేతిలో సినిమాల్లేవు, పెళ్లి చేసుకుంటోంది, సినిమాలకు దూరమవుతోంది అని…! ఒరేయ్ బాబూ, ఈ పెళ్లి ముచ్చట్లు ఫేక్, రాయకండ్రా బాబూ […]
ఆ తప్పు చేయకుండా ఉంటే… ‘‘భళా తందనాన’’ అని ఆడాల్సిన సినిమా…!!
ఇదేరోజు థియేటర్లలో విడుదలైన జయమ్మ పంచాయితీ, అశోకవనంలో అర్జునకల్యాణం, ఓటీటీలో విడుదలైన చిట్టి సినిమాల విశ్లేషణలు, కథనాల నడుమ ఫాఫం భళా తందనాన అనే సినిమా గురించిన చర్చ కనిపించకుండా పోయింది… నిజానికి తీసిపారేయదగిన సినిమా ఏమీ కాదు ఇది… మరీ నాసిరకం అని ఛీకొట్టాల్సిన పనిలేదు… కాకపోతే దర్శకుడి వైపు నుంచి ఓ సందిగ్ధత సినిమాను దెబ్బతీసినట్టు అనిపిస్తుంది… దర్శకుడు దంతులూరి చైతన్య… మొదట్లో బాణం… ఎవరబ్బా ఈ కొత్త దర్శకుడు అనిపించేలా కాస్త పర్లేదు… […]
ఊకో సుమక్కా ఊకో… ఏం తక్కువ చేస్తివి, నువ్వయితే మస్తు కష్టపడితివి…
ఏ జెర ఊకో సుమక్కా… జెర సైసు… నువ్వేం తక్కువ జేసినవ్ శెప్పు… అసలు ఏ హీరో అయినా నీ అంత భుజాన వేసుకుని సినిమాను ఇంత ఘనం ప్రమోట్ చేసిన్రా ఎప్పుడైనా..? గిర్రగిర్ర నెలరోజుల నుంచి తిరుగుతనే ఉన్నవ్… దొరికిన పెద్ద పెద్ద హీరోలను పట్టుకుని ట్రెయిలరో, టీజరో, పోస్టరో రిలీజ్ చేయిస్తనే ఉన్నవ్… ప్రతి టీవీ ప్రోగ్రాముకు ప్రమోషన్ కి పోతివి… నీ ఎనర్జీ చూసి అందరూ ఆశ్చర్యపోయిన్రు కూడా… కానీ ఏం లాభమొచ్చె […]
నో డౌట్… కీర్తి సురేష్ మహానటే… మరోసారి అదరగొట్టేసింది… భేష్…!!
రౌద్రం, కాఠిన్యం, కసి, కోపం, ప్రతీకారం రగిలే కొన్ని పాత్రలకు చాలామంది హీరోయిన్లు సూట్ కారు… ఆ మొహాల్లో ఆ ఉద్వేగాలు బలంగా ఎక్స్పోజ్ కావు… మరీ ఎక్స్పోజింగ్ పాత్రలు తప్ప ఇంకేమీ చేయని టైంపాస్ పల్లీబఠానీ హీరోయిన్లకు అస్సలు చేతకాదు… కానీ కీర్తి సురేష్ అలా కాదు… ఆమెలో తల్లి వారసత్వం ఉంది… ఏ ఎమోషనైనా సరే ఆ మొహంలో బలంగా ఆవిష్కరించగలదు… ప్రేమ, రొమాన్స్ గానీ… రౌద్రం గానీ… మహానటిలో ఆమెను చూశాం కదా… […]
సినిమా బాగానే ఉందిగా… ఆ పిచ్చి ప్రాంక్ ప్రమోషన్లకు ఎందుకు పాల్పడినట్టు..?!
అర్థం కాని విషయం ఒక్కటే… సినిమాను నీట్‌గా తీశారు, ఔట్పుట్ బాగానే వచ్చింది… ఒక్కసారి గనుక ప్రేక్షకుల మౌత్‌టాక్ బాగుంటే సినిమా నడుస్తుంది… సినిమాలో దమ్ములేకపోతే ఎన్ని ప్రమోషన్ వేషాలు వేసినా సినిమా నిలబడదు… అంత పెద్ద ఆచార్యే కొట్టుకుపోయింది… చిన్న సినిమాలు ఎంత..? సో, సరదాగా, ఓ ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా సినిమా తీశారు కదా… మరెందుకు ఆ ప్రాంక్ వీడియోలు వంటి పిచ్చి ప్రమోషన్ చేష్టలకు వెళ్లినట్టు..?! నిజానికి విష్వక్సేన్ వ్యవహార ధోరణిలో యారొగెన్సీ కనిపిస్తుంది… […]
- « Previous Page
- 1
- …
- 89
- 90
- 91
- 92
- 93
- …
- 117
- Next Page »