నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది ఈ సినిమా… పేరు దస్వీ… అంటే పదో తరగతి… టెన్త్ క్లాస్… ఇప్పుడు తాజాగా చర్చల్లో నలుగుతోంది… ఎందుకు..? సినిమా గురించి కాదు… సినిమాపై రివ్యూల గురించి కూడా కాదు… పర్టిక్యులర్‌గా ఆ సినిమాలో హీరోయిన్ యామీ గౌతమ్ నటన గురించిన రివ్యూలపై… నిజానికి ఆ సినిమాలో ఆమె హీరోయినే కాదు… కాకపోతే ఓ ముఖ్యమైన పాత్ర… దీనికన్నా ముందు మరో నటి గురించి చెప్పాలి… నిమ్రత్ కౌర్… వయస్సు నలభై ఏళ్లు… రాజస్థాన్‌లో […]
కౌన్ ప్రవీణ్ తాంబే… ఓ డిఫరెంట్ క్రికెట్ హీరో… ఓ డిఫరెంట్ బయోపిక్…
ఒక సచిన్… ఒక గంగూలీ… ఒక సెహ్వాగ్… ఒక ధోనీ… ఒక కోహ్లీ వీళ్ల గురించి ఎవరైనా రాస్తారు… బయోపిక్కులూ తీస్తారు… అయితే వాళ్ల కథలు వేరు… కానీ మరికొందరు ఉంటారు… వాళ్లు అన్సంగ్ హీరోస్… ప్రస్తుతం ఓ క్రికెటర్ గురించిన బయోపిక్ అందరి చర్చల్లోనూ నానుతోంది… ప్రముఖ క్రికెటర్లు కూడా ట్వీట్లు చేస్తున్నారు… అభినందిస్తున్నారు… నిజంగా ఓ డిఫరెంట్ బయోపిక్… రాహుల్ ద్రవిడ్‌కే స్పూర్తినిచ్చిన క్రికెటర్‌పై బయోపిక్… ఆ క్రికెటర్ ఎవరో తెలుసా..? ప్రవీణ్ తాంబే… […]
నాటి అర్జున్ జెంటిల్మన్ సినిమా గుర్తుందా..? ఇదుగో ఆనాటి శుభశ్రీ…!!
అప్పట్లో… అంటే దాదాపు 30 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది… అర్జున్, మధుబాల హీరోహీరోయిన్లు… పేరు జెంటిల్మన్… అప్పట్లో బాగా హిట్టయ్యింది సినిమా… ఈ సినిమా పేరు వినగానే గుర్తొచ్చేది ప్రభుదేవా, గౌతమి సాంగ్ ‘‘చికుబుకు చికుబుకు రైలే’’… ఎవరి నోట విన్నా ఆ పాటే అప్పట్లో… అంత హిట్… ఇదోరకం ఐటం సాంగ్… అంటే సినిమా కథకు సంబంధం ఉండదు… సినిమా పేరు వింటే గుర్తొచ్చే మరో పేరు శుభశ్రీ… ఆమె అల్లరిచిల్లర ఆటలు […]
అబ్బాయ్ వరుణుడా… ఏ ఖనిజ సంపదా లేని ఈ గని దేనికి స్వామీ…
సినిమా సంగతి తరువాత… నిర్మాత, దర్శకుల ఓ కొత్త ఆలోచన మాత్రం డిఫరెంటుగా అనిపించింది…. ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే కదా… అంటే మరేమీ లేదు, తెలుగు, కన్నడ,మలయాళ, తమిళ, హిందీ భాషలు మాత్రమే… మార్కెట్ ఈ భాషల్లో మాత్రమే ఉంటుంది… నాలుగు డబ్బులు రాలతయ్… జస్ట్, ఆయా భాషల్లోకి డబ్ చేసి మార్కెట్ మీదకు వదిలేయడమే… అయితే ఒకే భాష సినిమాలకు చెందిన నటులైతే వేరే భాషల వాళ్లకు పరాయి సినిమా చూస్తున్నట్టు ఉంటుంది… […]
బుల్లితెర మీద కూడా ‘గల్లా’ చిరిగిపోయింది… సూపర్ డూపర్ డైనమిక్ ఫ్లాప్…
మస్తు డబ్బుంది… సో వాట్..? పొలిటిషియన్ కమ్ ఇండస్ట్రియలిస్ట్ గల్లా జయదేవ్ కొడుకు… సో వాట్..? మహేశ్ బాబు మేనల్లుడు… సో వాట్..? ప్రేక్షకులు అడ్డంగా తిరస్కరించారు గల్లా అశోక్ అనే ఓ వారస హీరోను…! పెద్ద తెర మీదే కాదు, బుల్లి తెర మీద కూడా బోల్తాపడ్డాడు… ఏదేదో నేపథ్యం ఉంది కదాని, తెరను చించేస్తామని వచ్చేస్తే సరిపోదు,… అలా చాలామంది వచ్చారు, పోయారు… నిలబడింది కొందరే… అందుకే ఇదే అశోక్ తాత, అనగా సూపర్ […]
మరో వివాదంలో ఇళయరాజా..! పాటకు తొలిహక్కుదారుడు ఎవరు..?!
ఒక నిర్మాత… డబ్బు ఖర్చు పెడతాడు… లాభానికి, నష్టానికి రిస్క్ తీసుకుంటాడు… అందరికీ రెమ్యునరేషన్లు ఇస్తాడు, పనిచేయించుకుంటాడు… అనేక విభాగాలు, అనేకమంది, బోలెడంత ఖర్చు, రిలీజయ్యే వరకూ డౌటే… సక్సెసయితే డబ్బు, లేకపోతే నెత్తి మీద తుండుగుడ్డ… అయితే సినిమా టైటిల్ దగ్గర నుంచి రీమేక్, డబ్బింగ్, టీవీ హక్కుల దాకా మొత్తం నిర్మాత సొంతమే కదా… ఒక్క సినిమా సంగీతం విషయంలోనే తేడాలు ఎందుకు వస్తున్నట్టు..? సంగీత దర్శకుడికీ హక్కులుంటాయట… గాయకులకూ రాయల్టీలు ఉంటాయట… రికార్డింగ్ […]
ఫాఫం… అంతటి సంగీత సరస్వతి సైతం… గతి తప్పి… శృతి తప్పి…
ఆమె ఎవరో తెలుసా..? కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉపాధ్యక్షురాలు… పద్మశ్రీ గ్రహీత… వయస్సు డెబ్బయ్ ఏళ్లు… పెప్సికో సీఈవో ఇంద్రా నూయికి మేనత్త… మంచి సంగీత కుటుంబం… పెద్ద పెద్ద వాళ్ల దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంది… నేర్చింది కర్నాటక సంగీతమే అయినా అన్నిరకాలూ పాడగలదు… ఎనిమిదో ఏటనే ఓ బంగారు పతకం పొందిన ఆమె అప్పట్నుంచీ పాడుతూనే ఉంది… ఆమె చరిత్ర చదువుతూ పోతే ఇలా చాలా చాలా విశేషాలు కనిపిస్తయ్… ఆమె పేరు […]
క్షుద్ర మంత్రోపాసనలాగా… కాష్మోరాను పిలుస్తున్నట్టుగా… ఏం పాట గురూ…!!
ధా… రా… ణా… హా… ఛే… నో… రా… హా… ధా… రా… య… జ… చౌ… రౌ… రా… ఏ… …. ఈ అక్షరాల్ని ఓసారి పాడటానికి ప్రయత్నించండి… పోనీ, మీకిష్టమున్న ట్యూన్లో… బీభత్సం, క్రౌర్యం, భీకరం గట్రా వినిపించాలి… అబ్బే, రావడం లేదా..? ఎక్కడో, ఏ ఒడిశా మారుమూల గ్రామంలోనో, అమావాస్య, చీకటిపూట, భీతిగొలిపే స్మశానంలో, ఏ మంత్రగాడు దార్కాయో కాష్మోరాను పిలుస్తున్నట్టుగా… ఏదో క్షుద్రశక్తిని ఆవాహన చేస్తున్నట్టుగా ఉన్నాయా..? ఛ, తప్పు… ఇది […]
అయ్యా… త్రివిక్రముడా… ఏడో తరగతి సాంఘిక శాస్త్రం చదువు ఒక్కసారి…
మన ప్రేక్షకులంటే మన దర్శకులకు మరీ చిన్నచూపు… మేమే సర్వజ్ఞులం, మేమేం చెబితే అదే వేదం, ఎడ్డి ప్రేక్షకులకేం తెలుసు అనుకుంటారు… దీనికి తగ్గట్టు మాటల మాంత్రికుడు గట్రా బిరుదులతో మీడియా, తోటి ఇండస్ట్రీ పర్సనాలిటీలు భుజకీర్తులు తొడిగేసరికి… ఏమో, నిజమేనేమో, మేం మహాతోపులమే కావచ్చు సుమా, లేకపోతే ఇంతమంది ఎలా భజిస్తారు అని మరింతగా కిక్కెత్తిపోతుంది… త్రివిక్రమ్ శ్రీనివాస్ బీమ్లానాయక్ సినిమాలో ‘‘గజినీ మహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు, వాడి మీద నెగ్గినవాడి […]
కచ్చా బదంలాగే… ఇది హలామిత్తీ హబీబో… అర్థాలు అక్కర్లేని అరబిక్ కుత్తు…
దళపతి విజయ్… అనగా కమాండర్ విజయ్ కొత్త సినిమా పేరు బీస్ట్… అనగా మృగం… ఐనా ఈమధ్య తమిళ సినిమాలకు గమ్మతి పేర్లు పెడుతున్నారుగా… వలిమై, బిగిలు, ఈటీ, బీస్ట్… ఎన్నన్ని కొత్త ఆప్ట్ పేర్లు దొరుకుతయ్, కానివ్వండి… విషయం ఏమిటంటే… అలాంటి పేరే ఉన్న మరో సినిమా… కేజీఎఫ్-2 తో పోటీ… ఢీ… ఒకటి తమిళం, మరొకటి కన్నడం… ఇప్పుడు ప్రతిదీ పాన్ ఇండియాయే కదా… తెలుగులో కూడా డబ్ చేసి వదులుతున్నారు… కేజీఎఫ్ ఫస్ట్ […]
కశ్మీరీ ఫైల్స్ నిర్మాతల టైగర్ ఫైల్స్..! తెలుగు రాబిన్‌హుడ్ బయోపిక్..!!
Nancharaiah Merugumala…………….. కశ్మీర్ ఫైల్స్ ‘పాపం’ టైగర్ నాగేశ్వరరావుతో కడిగేసుకోవచ్చని గుర్తించిన అగర్వాల్స్..? మూడు దశాబ్దాల నాటి కశ్మీరీ పండితుల బలవంతపు వలసలు, ఇంకా తీరని వారి కష్టాలపై సినిమా తీసిన వివేక్ అగ్నిహోత్రి, పల్లవీ జోషీ దంపతులకు పెట్టుబడులు అందించిన అభిషేక్ అగర్వాల్, ఆయన అన్న తేజ్ నారాయణ్ అగర్వాల్ ఇప్పుడు స్టువర్ట్పురం పెద్ద దొంగగా మా తరం వారికి సుపరిచితుడైన ‘టైగర్’ నాగేశ్వరరావుపై తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో సినిమా నిర్మిస్తున్నారనే […]
R – Rusted… R – Ruined… R – Ruptured… మూడార్లు అనగా సూక్ష్మంగా అంతే…
……. Opinion of Katta Srinivas…….. సెల్యులాయిడ్ చరిత్రకి చెదలు పట్టించగలడా? R-Rusted R- Ruined R- Ruptured… మూడార్లు ఇప్పటికి చూడటం కుదిరింది. రెండు తెలుగు రాష్ట్రాలను, సినిమా ఇండస్ట్రీ రెండు పెద్ద కుటుంబాలను బాలన్స్ చేయడం గురించో, కళ్ళ ముందటి కనికట్టు కలెక్షన్స్ గురించో బ్లా బ్లా బ్లా చెప్పలేను, కానీ కరోనా తర్వాత గుంపులో కలిసే, కరువు తీర్చే మార్గమనో.., సమాజాన్ని బ్రతికిస్తోందో, సమాజం మీద బ్రతుకుతుందో, సినిమా ఇండస్ట్రీకి ఇది కొత్త […]
ఆర్ఆర్ఆర్ Vs రాధేశ్యాం..! డెస్టినీకి ఓ పర్ఫెక్ట్ ఉదాహరణ… ఎలాగంటే..?!
రాధేశ్యామ్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో పెట్టేశారుగా… ఆ కథలో ప్రధానమైన చర్చ డెస్టినీ… అంటే, విధిరాత… దాన్నెవడూ తప్పించలేడు అనే జనాభిప్రాయానికి భిన్నంగా… మనిషి బతుకు చేతుల్లో కాదు, చేతల్లో ఉంటుందనే విషయం చెప్పడానికి దర్శకుడు విఫలప్రయత్నం చేశాడు… శుద్ధ తప్పు… చేతల్లో ఏముంది..? చేతుల్లోనే ఉంది… అందుకే సినిమా మునిగిపోయింది… ఆ సినిమాలో టైటానిక్‌లాగే… జ్యోతిష్యం 99 శాతం సైన్స్ కావచ్చుగాక, కానీ ఆ ఒక్క శాతం విధిరాత నుంచి తప్పించుకుంటారు, వాళ్లే చరిత్ర సృష్టిస్తారు […]
ఈటీవీ బుర్రలు వెలిగాయి… మూడో స్థానదరిద్రం దేనికో బోధపడింది…
ఈటీవీ ఎందుకు మూడో స్థానంలో కొట్టుకుంటోంది… అసలు రెండో స్థానంలో ఉన్న జీతెలుగు ప్రోగ్రామ్సే పెద్ద నాసిరకం… ఐనాసరే, ఈటీవీ రోజురోజుకూ చివరకు జీతెలుగుతో కూడా ఎందుకు పోటీపడలేకపోతోంది… ఏవేవో రియాలిటీ షోలు చేస్తుంటారు… ఆ బూతు జబర్దస్త్ ఉండనే ఉంది, చివరకు ఈటీవీ న్యూస్‌ను కూడా వినోదాల జాబితాలో కలిపేశారు… ఐనా ఆ వెలితి ఎందుకు..? ఆలోచించగా, చించగా వాళ్లకు బోధపడింది ఏమిటంటే..? మన సీరియళ్లను ప్రేక్షకులు ఇష్టపడరు, దేకరు… అందుకే ఈ దురవస్థ అనేది […]
కొత్త ట్రెండ్ గురూ… నెత్తి మీద పిచ్చుకగూడు… అడ్డదిడ్డంగా పెంచేయాలంతే…
డీజే టిల్లు… ఓటీటీలో పడేశారుగా… కాస్త నెమరేస్తుంటే కొన్ని విశేషంగా కన్పించినయ్… అబ్బే, థమన్ బీజీఎం గురించి కాదు, టిల్లూ టిల్లూ అని సూపర్ హిట్ అయిన ఎంట్రీ సాంగ్ ట్యూన్, టోన్, మ్యూజికే సినిమా చివరిదాకా కొట్టి ఇడిశిపెట్టిండు… అఖండకు ఏం కష్టపడ్డడో తెలియదు గానీ టిల్లుకు మాత్రం అలవోకగా, అనాయాసంగా సరదాగా కొట్టిపడేశాడు… ఆ దర్శకుడెవరో గానీ ఎక్కడా ‘అతి వేషాలు’ ప్రదర్శించలేదు… సాఫీగా నడిపించాడు కథను… అసలు కథ, మాటలు, హీరో, ఎట్సెట్రా […]
‘‘లక్కీగా సెంట్రల్ లాక్ పడలేదు… డోర్స్ ఓపెనయ్యాయి… బతికిపోయాను…’’
‘‘నేను అప్పుడు రాధిక వాళ్లదే ఓ తమిళ సీరియల్లో చేస్తున్నాను… అమ్మవారి గెటప్… కుట్రాలంలో షూటింగ్, అది ఫినిష్ చేసుకుని, టాటా సఫారీలో బెంగుళూరు వెళ్తున్నాం… మధ్యలో మీనాక్షి హోటలో, మరొకటో ఆపుకుని లంచ్ చేశాం… ఆ టైమ్‌లో నేను ఏదో ఫోన్ మాట్లాడుతూ డోర్ తీయడానికి ప్రయత్నించాను… కానీ డ్రైవర్ లాక్ చేసుకుని ఎక్కడికో వెళ్లాడు… ఎవరైనా కారు లాక్ తీయడానికి ప్రయత్నిస్తే అరుస్తుంది కదా… అప్పట్లో అదొక అలర్ట్ సిస్టం ఉండేది… అది కుయ్ […]
RRR…! చరిత్రకు ఎంత నష్టదాయకం..? అసలు ఇది ద్రోహమేనా..? ఏది అసలు చరిత్ర..?!
……. By… Sridhar Bollepalli……….. ఏది చరిత్ర? ఆర్.ఆర్.ఆర్. సినిమా విడుదలయ్యాక ఆ సినిమా బాగోగుల గురించి జరుగుతున్న చర్చలో భాగంగా కొందరు మిత్రులు అందులో వున్న historical inaccuracies గురించి మాట్లాడారు. చాలా మంచి కోణం అది. సినిమాటిక్ లిబర్టీ పేరుతో చరిత్రని వక్రీకరించడం కరెక్ట్ కాదు అన్న వాదనతో నేను 100% ఏకీభవిస్తున్నాను. కానీ, యిదే సందర్భంలో నాకు వున్న కొన్ని సందేహాలని వ్యక్తం చేయకుండా వుండలేకపోతున్నాను… ఆర్ ఆర్ ఆర్ అనేది ఒక […]
‘ఆన్లైన్’ మీదా అల్లు అరవింద్ గ్రిప్… ఏదీ వదలడు, Real Mega Player…
అల్లు అరవింద్… తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద తన పట్టు మరింత పెరగబోతోంది… ఇప్పటికే బడా నిర్మాత, పెద్ద ఎగ్జిబిటర్, ఏకైక తెలుగు ఓటీటీ, ఎట్సెట్రా… అన్నింటికీ మించి కొడుకు బన్నీ హీరోగా ఎక్కడికో వెళ్లిపోయాడు… ఇవన్నీ గాకుండా మెగాక్యాంప్తో చుట్టరికం… కాదు, కాదు, ఇప్పుడు అల్లుయే పెద్ద క్యాంప్… పవన్, నాగబాబులతో పెద్ద సత్సంబంధాలు లేకపోయినా… చిరంజీవి సొంత బావే… గతంలోలాగా బలమైన ఆర్థికబంధాలు లేకపోయినా హార్ధికబంధాలు పదిలం… తను నిర్మాత కదా… వ్యాపారి… సైలెంట్ […]
ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు… ఆదిపురుషుడూ అంతే… ఆలస్యం అనివార్యం…
అందరూ రాజమౌళి తన సినిమాను లేటుగా నిర్మిస్తాడు, సంవత్సరాలు తీసుకుంటాడు అంటారు గానీ… పెద్ద సినిమాలు తీసే దర్శకులు దాదాపుగా అందరూ అంతే… ఇలా కొబ్బరికాయ కొట్టేసి, ఏ అయిదారు నెలలకో గుమ్మడి కాయ కొట్టేయడం కుదరదు… అసలు ప్రిప్రొడక్షన్ వర్కే బోలెడు ఉంటుంది… ఒకసారి బ్యానర్ కుదిరాక, ఇక దర్శకుడు, హీరో, హీరోయిన్, సంగీత దర్శకుడు, ఇతర నటీనటులు, కెమెరా, ఎడిటర్ గట్రా సెలక్షన్స్ అయ్యేవరకు రోజులు గడుస్తూనే ఉంటయ్… సాంగ్స్ రికార్డింగ్, షూటింగ్ సరేసరి.., […]
తెలుగు హీరోలు ఎలుగ్గొడ్లు అట… వీడెవడో చాలా దూరం వెళ్లిపోయాడు…
Prasen Bellamkonda…… టూమచ్….. సినీ సమీక్షకు కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు మీరడానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. వాటిని కూడా దాటేసాడితడు. నిజం చెప్పాలంటే సినిమాను సమీక్షించినట్టుగా కాక రాజమౌళి మీద వ్యక్తిగత పగ పెట్టుకుని మూడార్లను వీధి కుళాయి దగ్గర తిట్టుకున్న పద్దతిలో వ్యాఖ్యానం చేసాడు. సినిమా బాగుండకపోతే దాన్ని విమర్శించడానికి చాలా పద్ధతులున్నాయి. ఆ పరిధి లోపల తిట్టొచ్చు. ఆ పద్ధతులను కాదని కూడా మర్యాదగా తిట్టొచ్చు. కానీ ఇతను మరీ మితిమీరాడు. భావ స్వేచ్చ […]
- « Previous Page
- 1
- …
- 92
- 93
- 94
- 95
- 96
- …
- 117
- Next Page »