. రామాయణం అనగానే… రామాయణంలోని పాత్రలు గుర్తొస్తయ్ కదా… అందులో నరులు, వానరులు, రాక్షసులే కాదు… జటాయువు వంటి పక్షులు, జాంబవంతుడు వంటి ఎలుగుబంట్లు, చివరకు వంతెన కోసం రాళ్లెత్తిన కుందేలు… ఇలా చాలా జీవ జంతు పాత్రలు కూడా ఉన్నయ్… మళ్లీ ఆ నరుల్లోనూ కైకలు, మంథరలు… వానరుల్లో వాలి… రాక్షసుల్లో రావణాసురుడు, కుంభకర్ణుడు… హీరోలు, సైడ్ హీరోలు, హీరోయిన్లు, సైడ్ హీరోయిన్లు, విలన్లు, ఇతరత్రా పాత్రలు, అనేక తత్వాలు కూడా… చాలా కీలకపాత్రే అయినా […]
ఆ కౌరవ యువరాణి..! అందరికీ గారాలపట్టి..! ఐతేనేం… ఓ విధివంచిత..!!
. మహాభారతంలోనే చాలామందికి తెలియని కథ… చదవాల్సిన కథ… చెబితే భారతమంత… అందుకే సంక్షిప్తంగా చెప్పుకుందాం… ఆమె పేరు లక్ష్మణ… కురు సార్వభౌముడు దుర్యోధునుడి భార్య భానుమతి… వారణాసి రాజు బిడ్డ… ప్రతి రాజుకూ బోలెడుమంది భార్యలు… కానీ దుర్యోధనుడికి కేవలం భానుమతి ఒక్కతే… ఏకసతీవ్రతుడు… వాళ్లకు ఇద్దరు కవల పిల్లలు… మగ, ఆడ… లక్ష్మణకుమారుడు, లక్ష్మణ… లక్ష్మణకుమారుడి కథను మనం మాయాబజార్ సినిమాలో చూస్తాం… బలరాముడి కూతురు శశిరేఖతో లక్ష్మణకుమారుడికి పెళ్లి చేయాలని అనుకోవడం, కృష్ణుడు […]
మౌనం ఓ రహస్య సమ్మతి… అది ద్రోహం, నేరం… అనగా మౌనమూ శిక్షార్హమే…
. ‘‘ప్రశ్నించాల్సిన చోట, ప్రశ్నించే స్థోమత ఉన్నచోట… ఒక తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించకుండా నిశ్శబ్దంగా ఉండిపోవడం… ఒక తప్పుకు రహస్య సమ్మతి తెలిపినట్టే… అంటే ధర్మానికి ద్రోహం చేసినట్టే… ద్రోహం అంటే తప్పు… తప్పు అంటే నేరం… మరి నేరానికి శిక్ష తప్పదు కదా… ’’ Silence is connivance.. Connivance is betrayal.. Betrayal is sin.. Sin is a punishable offence…… మనం బతుకుతున్న వాతావరణంలో మనకు నచ్చని అనేకానేక మౌనాల్ని గమనిస్తున్నప్పుడు, ఇలా […]
ప్రస్తుత సోషల్ మీడియా క్షుద్ర నీతికి ఆదిగురువు… కణికుడు..!!
. పొలిటికల్ స్ట్రాటజిస్టుుల, సలహాదారులు ఇప్పుడే కాదు… మహాభారత కాలం నుంచీ ఉన్నారు..! ఈ ప్రశాంత్ కిశోర్‌లు, రాబిన్ శర్మలు, సునీల్ కనుగోలులు, అనేకానేక మంది సలహాదారులు ఏ కేటగిరీలోకి వస్తారో తెలియదు, ఖజానాల నుంచి, పార్టీల బొక్కసాల నుంచి ప్రజల సొమ్మును ఎందుకు తినేస్తారో తెలియదు కానీ… ఓసారి మనం అలా భారతకాలానికి వెళ్లొద్దాం… మనకు చాణక్యనీతి తెలుసు… తను సాధించిన పగ, పన్నిన వ్యూహాలు, ఆ బుర్ర చురుకుదనం, ఆయన రాసిన ఆర్థికశాస్త్రాలు, పాలన […]
హిడింబి… మహాభారతంలో ఓ మార్మిక పాత్ర… ఆ గుడిలో దేవత…
. చాలామంది ఈ తరం యువతకు ఓ డౌటొచ్చింది… రాక్షస జాతికి చెందిన వేరే పురాణ పాత్రలకూ గుళ్లున్నాయా..? ఇలా అనగానే గుర్తొచ్చేది హిడింబి గుడి… అదే ఎందుకు గుర్తురావాలి..? హిడింబి గుడి ఉన్నది మనాలిలో… చాలామంది టూరిస్టులు మనాలి వెళ్తుంటారు కదా, హిడింబి గుడి కూడా వెళ్లొస్తుంటారు… కానీ హిడింబి మన మనిషి, పూజించాల్సిన దేవత ఎలా అయ్యింది..? మహాభారతంలో ఓ అంతుచిక్కని మార్మిక పాత్ర హిడింబి… తన కళ్ల ముందే తను బాగా అభిమానించే […]
Destiny..! ఆ ఘడియ తరుముకొస్తే ఆ శ్రీకృష్ణుడికే తప్పలేదు… మనమెంత..?!
. కరోనాకాలంలో చెప్పుకున్నట్టు… ఒక సమయం వస్తుంది… ఆ టైం తరుముకొచ్చినప్పుడు… నీ హోదాలు, నీ డబ్బులు, నీ ఆస్తులు, నీ అంతస్థులు, నీ సర్కిళ్లు… ఒక్కటి, కనీసం ఒక్క హాస్పిటల్ బెడ్ ఇప్పించలేవు… కాసింత ఆక్సిజన్ ఇప్పించలేవు… ఒక్క రెమ్‌డెసివర్ ఇప్పించలేవు… అంతెందుకు స్మశానంలో ప్రశాంతంగా కాలనివ్వవు… మరీ రోజులు బాగాలేకపోతే… బంధుగణం ఎవరూ ఉండరు… ఎవరో నలుగురు హాస్పిటల్ సిబ్బంది ‘డ్యూటీ’లాగా కాల్చేసి నిష్క్రమిస్తారు… ఎగ శ్వాస తన్నుకుంటూ ఐసీయూలో విలవిల్లాడుతూ… ‘‘ధైర్యము విలోలంబయ్యె, […]
కర్ణ-కృష్ణ సంభాషణ… కౌగిలించుకున్న రెండు సమాంతర రేఖలు…
. ఆమధ్య కల్కి సినిమా రిలీజు తరువాత కర్ణుడు గొప్పవాడా కాదా అని పెద్ద చర్చే జరిగింది సోషల్ మీడియాలో… ఎవరి అభిప్రాయాలు వాళ్లవి… నిన్న ఏకలవ్య సినిమా రివ్యూ పబ్లిష్ చేస్తున్నప్పుడు కూడా ఓ చర్చ… నిజానికి ఏకలవ్యుడిది కూడా కుంతి కుటుంబ రక్తమేననీ, పాండవుల సోదరుడేనని…! తను కూడా కృష్ణుడికి రక్తబంధువునని..! అంటే కర్ణుడు, ఏకలవ్యుడు కథలు దాదాపు సమానమే, దారులు వేరు, గమ్యాలు వేరు… ఇదే రాస్తుంటే, ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ముచ్చట […]
‘‘రాత్రయితే, గోవాలో అందరూ సీఎంలే… తియ్, లైసెన్సులు చూపించు’’
. అట్టహాసం, ఆడంబరం అనేవి అధికార ప్రదర్శనలో కనిపించే పైత్యపు లక్షణాలు… ఈరోజుల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కాన్వాయ్ మెయింటెయిన్ చేస్తున్నారు… ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వీవీఐపీల ఎస్కార్ట్ కోసమే సగం మంది పోలీసులు పనిచేస్తున్నతీవ్ర దురవస్థ మనది… ఎక్కడో ఏదో చదువుతుంటే మళ్లీ మన మాజీ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ వార్త ఒకటి కనిపించింది… దానికితోకలాగా మరో రెండు చిన్న వార్తలు… (నిన్న ఆయన వర్ధంతి…) అన్నీ పరీకర్ నిరాడంబరత్వం గురించే… తన నిరాడంబరత […]
మేం తోపులం అని విర్రవీగే ప్రతి ఒక్కడూ చదవాల్సిన డిజాస్టర్ స్టోరీ..!
. యండమూరి వీరేంద్రనాథ్ కలం ప్రతిభావంతంగా పరుగులు తీసిన ఆ రోజుల్లో ఒక నవల రాశాడు… పేరు పర్ణశాల… డెస్టినీ అంటే ఏమిటో బలంగా చిత్రీకరిస్తుంది అది… అక్వా ఎగుమతులతో కోట్లు సంపాదించిన ఓ కుటుంబం… ఇన్స్యూరెన్స్ కట్టడం మరిచిపోతారు, ఒక్క క్షణం డీప్ ఫ్రీజర్ రూం డోర్ వేయలేని దురవస్థ… తెల్లారేసరికి తల్లకిందులు… కుటుంబం బజారున పడుతుంది… సదరు ఓనర్ కారు డ్రైవర్‌గా చేరతాడు మరోచోట, సాక్షాత్తూ తన భార్యే ఆ కారు ఓనర్‌కు లొంగిపోతుంది… […]
ఒకే తల్లి కడుపున పుట్టారు… ఆ ఇద్దరి జీవితాలూ ఫుల్ కంట్రాస్టు…
. నీతా అంబానీ గురించి పరిచయం అక్కర్లేదు కదా… ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ భార్య, రిచ్చెస్ట్ వైఫ్ ఇన్ ఇండియా, రిలయెన్స్ ఫౌండేషన్ చెయిర్ పర్సన్, Nita Mukesh Ambani Cultural Centre (NMACC) ఫౌండర్ చెయిర్ పర్సన్, Dhirubhai Ambani International School (DAIS) ఫౌండర్ చెయిర్ పర్సన్… ఇలా ఎన్నెన్నో… అడుగు తీసి అడుగేస్తే రాజభోగం… మొన్ననే తన కొడుకు అనంత్ అంబానీ ప్రివెడ్ ఫంక్షన్‌కు 1000 కోట్లు ఖర్చు పెడితే, […]
పిచ్చి మొక్క కాదు… కళ్లెదుట ఓ సూపర్ మూలిక… విలువ తెలిస్తే కదా…!!
. ఈ పోస్టు బాగా నచ్చింది… అల్లోపతీ వైద్యం డ్రగ్ మాఫియా, మెడికల్ మాఫియా చేతుల్లో చిక్కి, దోపిడీ శక్తుల పరమయ్యాక…. ప్రతి పల్లె, ప్రతి ఇల్లు ఈ దోపిడీతో నిలువునా చచ్చిపోతున్న దశలో…. మన దేశీయ వైద్యం, మన వారసత్వ వైద్యం, అందులోని ‘మంచి’, మన నిర్లక్ష్యం ఇంకా ఇంకా వెలుగులోకి రావాలి… రావాలీ అంటే ఇలాంటి కొన్ని ఉదాహరణలు కావాలి… పరిశోధనలు సాగాలి… ఢిల్లీలోని బ్యూరోక్రాట్ల మెదళ్లను ఆవరించిన అవినీతి, అక్రమాల వైరస్ చచ్చిపోవాలి… […]
తప్పుపట్టకండి… అసలు కథ తెలిస్తే… గుండె తడి పొంగి, కళ్లను దాటేస్తుంది…
. కంటికి కనిపించేది అంతా నిజం కాదు… మనకు కనిపించిన సన్నివేశాన్ని, దృశ్యాన్ని బట్టి మనం ఏదేదో ఊహించేసుకుంటాం… కానీ సత్యం వేరే అయి ఉండవచ్చు… ఈ మాట మనకు పెద్దలు పదే పదే చెప్పినా సరే… మన రక్తంలో జీర్ణించుకుపోయిన తత్వాన్ని బట్టి ఇప్పటికీ మనం మారం… ఉదాహరణ చెప్పడానికి… చాలామంది ఇదుగో ఈ బొమ్మ చూపిస్తారు… ఫస్ట్, బొమ్మ చూడగానే మనకు కొన్ని నెగెటివ్ ఆలోచనలు కలుగుతాయి… ఛిఛీ అనిపించొచ్చుగాక… కానీ అసలు కథ […]
మహాభారతంనాటి దివ్యాస్త్ర పరిజ్ఞానం ఏమైంది..? ఎలా అంతరించింది..?
. కురుక్షేత్రంలో అనేకమంది అతిరథులు, మహారథులు మరణించారు కదా… తరువాత కొన్నేళ్లకు యాదవులు, పాండవులు కూడా గతిస్తారు కదా… కురుక్షేత్రంలో మరణించకుండా మిగిలినవాళ్లలో కురుగురువు కృపాచార్యుడు, ధర్మరాజు సవతిసోదరుడు యుయుత్సు, యాదవ వీరులు సాత్యకి, కృతవర్మ కూడా కాలం చేస్తారు… అశ్వత్థామ కృష్ణుడి శాపానికి గురై, కుష్టు వ్యాధిగ్రస్తుడై, పిచ్చోడై దేశాలు పట్టిపోతాడు… ఈలోపు కలియుగం వచ్చేస్తుంది… మరి అనేకానేక దివ్యాస్త్రాల పరిజ్ఞానం అంతటితో అంతరించిపోయిందా..? అవి తెలిసిన వీరుడెవ్వడూ కలియుగంలోకి ప్రవేశించలేదా..? ఓ చిన్న చర్చ… […]
ఓ ఐపీఎస్ అధికారి పరివర్తన..! కైలాస పర్వతయాత్రతో ఆత్మమథనం…!!
. అన్నామలై… ఔను, అదే నా పేరు, 37 ఏళ్ల వయస్సుకే ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడినయ్యానని రాసిన మీడియాయే ఈరోజు చెడామడా తిట్టేస్తోంది… అసలు నేను ఏమన్నానని..? జస్ట్, 6 నెలలు ఆగండ్రా భయ్, రాజకీయ పక్షపాతంతో నానా కూతలూ, సారీ, రాతల రాసే ఈ మీడియా అంతా కంట్రోల్లోకి వస్తుందన్నాను… అంతే కదా… నాకన్నా ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా చేసిన మురుగన్ కేంద్ర ప్రసార, సమాచార శాఖకు మంత్రి అయ్యాడు, ఈ దిక్కుమాలిన […]
ఓహో… ప్రపంచపు మొట్టమొదటి కథను శివుడు పార్వతికి అలా చెప్పాడా..?
. ఓరోజు పార్వతి ఎందుకో చిరాగ్గా ఉంది… శివుడి రాకను కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తోంది… శివుడు ఆమెను సమీపించి, ఆమె చుబుకం పట్టుకుని, తన కళ్లల్లోకి చూస్తూ, గౌరీ ఏమిటీ పరాకు అనడిగాడు… నాకు అకారణంగా విసుగు వస్తోంది స్వామీ, నాకేదైనా వినోదాన్ని అందించే నాలుగు మాటలు చెప్పు స్వామీ అనడిగింది ఆమె… శివుడు ఓసారి సావధానంగా చూసి, సరే నేనొక ముచ్చట చెబుతాను విను… శివుడు అప్పటికప్పుడు ఓ కథను క్రియేట్ చేసి చెప్పసాగాడు… […]
ఒక ఎకరం పొలముంది… ఒక ఆవు ఉంది… అండగా ఆ శివుడున్నాడు…
. ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు… అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు.., తమను చూడగానే ఆ పూజారి గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ… కానీ ఆయన వీళ్ళని కాజువల్‌గా ఓ చూపు చూసి, తన పూజలో తాను నిమగ్నమయ్యాడు… పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి […]
ఆ భీమశిల ఓ అద్భుతం..! కేదారనాథ్‌లో ఆ విలయం వేళ ఏం జరిగిందంటే..?!
. కొన్ని యాదృచ్ఛికాలు అని తేలికగా కొట్టిపారేయలేం… అవి అద్భుతాలు… అంతే… చూడాలి, వినాలి, చదవాలి… అబ్బురపడాలి… అంతకుమించి వివరణలు, విశ్లేషణలు, కారణాలు దండుగ… ఏదీ, ఎవరూ తేల్చలేరు… ఇదీ అంతే… కేదారనాథ్… సగటు హిందువు ఒక్కసారైనా వెళ్లాలని కోరుకునే చార్ ధామ్ యాత్రలో ఈ ఆలయం కూడా ఒకటి… పాండవులు కట్టారా..? ఆదిశంకరాచార్యుడు కట్టించాడా..? అంత పాతదా..? జియాలజిస్టులు చెప్పినట్టు ఏడెనిమిది వందల ఏళ్ల క్రితం మందిరమా..? 400 ఏళ్లు మంచులోనే కప్పబడి ఉందా..? ఆ […]
అనితరసాధ్యుడే… అనామకంగా మిగిలిపోయిన మహాభారత పాత్ర…!!
. ఓ మిత్రుడు హఠాత్తుగా ఓ ప్రశ్న వేశాడు… మహాభారతంలో పాత్రలన్నీ తెలుసా అని…! పెద్ద పెద్ద ప్రవచనకారులు, పురాణాలకు బాష్యాలు చెప్పే భాగవతులకు కూడా మొత్తం పాత్రలు తెలుసో లేదో సందేహమే అని జవాబిచ్చాను… నిజంగానే అదొక సముద్రం… మనకు తెలిసింది ఓ దోసిలంత…! పైగా ఒరిజినల్ కావ్యం ఇన్ని వేల ఏళ్లలో, అనేక కళారూపాల్లోకి ఒదిగి, వ్యాప్తి చెంది, పలు దేశాలకు పయనించి, రకరకాల ప్రక్షిప్తాలు, క్రియేటివ్ యాడిషన్స్తో రకరకాలుగా మారిపోయింది… ప్రత్యేకించి తూర్పుదేశాల్లో […]
ఏదో మిస్టరీ దాగి ఉంది… లేకపోతే అలా పుడుతున్నారు ఎందుకు..?!
. . ( రమణ కొంటికర్ల ) .. …. ఏదైనా ఆకర్షణ ఉండాలంటే… కాస్త భిన్నంగా ఉండి ఉండాలి. అలా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే గ్రామమే కొడిన్హి. కేరళకు చెందిన ఆ గ్రామమెందుకు వార్తల్లోకెక్కింది..? ట్విన్ టౌన్ ఆఫ్ ఇండియా ఇదీ కొడిన్హి పేరు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న ఈ చిన్న గ్రామం ప్రపంచం దృష్టినే ఆకర్షించింది. శాస్త్రవేత్తలనూ అబ్బురపరుస్తోంది. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యధిక కవలలున్న గ్రామంగా ఖ్యాతికెక్కడంతో ఇదో పరిశోధనల […]
సింగీతం, కమల్ సావాసం… ప్రతి సినిమా ఓ సాహసం… ఆ స్మృతులు…
. అటు తిరిగి ఇటు తిరిగి అల్లు అర్జున్ ని ఆడిపోసుకోవడం నాకూ ఇష్టం లేదు. కాకపోతే, ఈ మధ్య “అపూర్వ సింగీతం” చూసాను. అది చూస్తున్నంత సేపూ అల్లువారబ్బాయి వద్దనుకున్నా.. గుర్తొచ్చాడు. పాపం ఆయన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలే గుర్తొచ్చాయి. నిన్న కాక మొన్నొచ్చిన ఈ యువతారే అంతగా ఫీలైతే, ఎప్పటి సింగీతం.. ఎలాంటి సినిమాలు.. మరి ఆయనెంత ఫీలవ్వాలో కదా అనిపించింది. సరే, ఇక్కడితో అర్జున్ గొడవ వదిలేద్దాం. .. […]
- 1
- 2
- 3
- …
- 33
- Next Page »