డిజిటల్ ఎడిషన్స్, వాట్సప్ ఎడిషన్స్, ఈ-పేపర్స్ అంటూ మెయిన్ స్ట్రీమ్ పత్రికలన్నీ…. ప్రింటింగ్ మానేసి, డిజిటల్ బాట పట్టాయి… అఫ్ కోర్స్, అవి చేస్తూనే తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ప్రకటనల్ని అడ్డగోలు రేట్లకు యాడ్స్ పబ్లిష్ చేయడం…. మెదళ్లు మోకాళ్లలో ఉండే సమాచార శాఖ అధికారుల పుణ్యమాని కోట్లకుకోట్లు కొల్లగొట్టడం, ఆ కమీషన్ల బాగోతం అనేది వేరే సంగతి… (అత్యంత భారీ గొప్ప నిజాయితీ, శీలం ఉన్న ఎర్ర పత్రికలు సహా… వాటికి అంతకుమించిన శరణ్యం లేదు […]
పగలైతే దొరవేరా..! ఔను మరి… తెలుగుపాటపై దేవులపల్లి దొరతనం..!!
అసలు సినిమా సాహిత్యం అంటే పల్లీబఠానీ, చాట్ మసాలా… ఏవో నాలుగు పిచ్చి పదాలను ఏదో దిక్కుమాలిన ట్యూన్లో ఇరికించి… ఢమఢమ సంగీత పరికరాలను మోగిస్తే చాలు… దానికి తెర మీద హీరోహీరోయిన్లు నాలుగు గెంతులు గెంతి, పిల్లి మొగ్గలు వేసిపోతారు… అంతా అని కాదు… 90 శాతం ఇంతే… అందులో ప్రమాణాలు, విలువలు, ప్రయోగాలు, తొక్కాతోలు చూస్తే… కనిపించేది డొల్ల… అయితే కొందరిలో ఓ దురభిప్రాయం ఉంది… వీలైనంత సంక్లిష్ట, గంభీర, అర్థం కాని పదాలతో […]
దమ్ మారో దమ్… లెటజ్ గం‘జాయ్’… మోడీ సర్కారు కొత్త ఆలోచన…
నిజం… నమస్తే తెలంగాణ ఎప్పుడోసారి చుక్క తెగి రాలిపడ్డట్టుగా… ఓ మంచి కథనాన్ని ప్రజెంట్ చేస్తుంది… మోడీ ప్రభుత్వం గంజాయిని నిషిద్ధ, నార్కొటిక్స్ జాబితా నుంచి తొలగించే ఆలోచనలో ఉందనే ఓ స్టోరీ ఇంట్రస్టింగుగా ఉంది… నిజానికి గంజాయి, వీడ్, మారిజువానా పేరు ఏదైతేనేం..? తరతరాలుగా మన జాతి మత్తుపదార్థం అది… ఈరోజుకూ ఉత్తరాదిలోని అనేక ప్రాంతాల్లో శుభ కార్యాల్లో భంగ్ వాడకం సహజం… హోళీ వంటి సందర్భాల్లోనైతే స్వీట్లు, తాంబూలాలు, లస్సీలు… ఏదోరకంగా భంగ్ కలుపుకుని […]
ఏ పతంజలి కన్నో పడలేదింకా… ఎర్రచీమలు బతికిపోయినయ్ ప్రస్తుతానికి..!!
ప్రస్తుతానికి ఎర్రచీమలు బతికిపోయాయి… మూడు నెలల వరకు ఢోకా లేదు… ఈలోపు ఏ పతంజలి రాందేవ్‌బాబా కన్నో పడితే మాత్రం… పాపం, ఒడిశాలో ఒక్క ఎర్ర చీమ కూడా మిగులుతుందో లేదో తెలియదు… ఎందుకంటారా..? ఒడిశాలో గిరిజనులు దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బంది, ఫ్లూ జ్వరం వస్తే… ఆ చుట్టుపక్కల ఉండే ఎర్రచీమల్ని పట్టుకొచ్చి, పచ్చిమిరపకాయలు వేసి తమదై శైలిలో పచ్చడి చేస్తారు… మెల్లిమెల్లిగా అనారోగ్యం లక్షణాలు తగ్గిపోతయ్… అదీ అసలు విషయం… ఎహె, ఊరుకొండి మాస్టారూ… […]
రైతు ‘ధర’హాసం..! ఎంత మంచి వార్త…! చదువుతుంటేనే ఎంత స్పైసీ…!!
చిన్నప్పుడు ఏదో పాఠ్యపుస్తకంలో చదివినట్టు గుర్తు… ఓ పాపులర్ పెద్దమనిషి తాను రోజూ పత్రికల్ని తిరగేస్తాను తప్ప చదవననీ, కానీ ఒకరోజు ఒక రైతుకు ఉత్తమరైతు పురస్కారం ఇచ్చి, తలపాగా బహూకరించిన వార్త మాత్రం తనను బాగా ఆకట్టుకున్నదనీ రాస్తాడు… తోటి రైతుల్లో ఆ తలపాగా తనకు ఎంత గర్వం..? ఆ ఫీలింగే ఆనందాన్ని కలిగించింది అంటాడు… నిజమే… రైతు బతుకులు మరీ ఘోరంగా ఉన్న ఈరోజుల్లో రైతులకు ఆనందాన్ని కలిగించే ఒక చిన్న వార్త అయినా […]
టాటా, ఈనాడు… సేమ్ సేమ్… అగ్నిని అవరోధిస్తాయి అలవోకగా…. ఇలా..!!
టాటా తలుపులు పెట్టుకోండి! అగ్ని అవరోధిస్తుంది!……… by…. -పమిడికాల్వ మధుసూదన్ ———————- తెలుగు భాష ఎప్పటికీ చచ్చిపోదు అని నమ్మకం కలిగించడానికి అప్పుడప్పుడూ కొన్ని దృష్టాంతాలు ఎదురవుతుంటాయి. అలాంటి దృష్టాంతాల్లో కార్పొరేట్ ప్రకటనల తెలుగు అనువాదం ఒకటి. తెలుగు భాషను ఎంతగానో ప్రేమించే ఈనాడు పలక అక్షరాల మాస్ట్ హెడ్ కింద The largest circulated Telugu daily అని ఇంగ్లీషులో ఉండడంలో ఏదో జర్నలిస్టిక్ లింగ్విస్టిక్ అంతరార్థం దాగి ఉండవచ్చు! అవుటర్ రింగ్ రోడ్డకు- బాహ్యవలయ […]
తడి ఎండిన తెలుగు కలాలు..! కన్నీటి సిరాకు దూరదూరంగా…!!
నిజమే, ఓ మిత్రుడు బాధపడినట్టు…. కరోనా ఎన్ని పాఠాలు నేర్పింది మనిషికి..? నేర్పిస్తూనే ఉంది..? మళ్లీ మనం చూస్తామో చూడమో ఇలాంటి విపత్తును… ప్రపంచం మొత్తం వణికిపోయింది… పోతున్నది… ఈ భూగోళానికి కుదిపేసే ఇలాంటి విపత్తు వస్తే… మతం ఏమిటి..? కులం ఏమిటి..? ప్రాంతం ఏమిటి..? అసలు దేశం ఏమిటి..? మనిషన్నవాడే మిగుల్తాడా మిగలడా అన్నంత కలవరం… కానీ ఒక్క కలమూ కదల్లేదేం..? ఒక దర్శకుడికీ, ఒక్క నిర్మాతకూ మనసు కదల్లేదేం..? ఇన్ని సీరియళ్లు, ఇన్ని పత్రికలు, […]
హేమిటీ దీపికా.. అంత పనిచేసేశావ్..? కారణమైనా చెప్పలేదు…
ఈమె తత్వం కాస్త వింతగా కనిపిస్తున్నది… సెలబ్రిటీలు అందరూ తమ సోషల్ మీడియా ఖాతాల్ని వీలైనంత లైవ్‌గా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు జనాన్ని తమవైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు… పెద్ద పెద్దోళ్ల ఖాతాల్ని మెయింటెయిన్ చేయడానికి సోషల్ మీడియా టీమ్స్ ఉంటయ్… ఇండియన్ టాప్ సినిమా హీరోయిన్ దీపిక పడుకోన్ మాత్రం అందరికీ కొత్త సంవత్సరం వేళ షాక్ ఇచ్చింది… ఏమిటో తెలుసా..? తన సోషల్ మీడియా ఖాతాల్ని ఖాళీ చేసింది… అర్థం కాలేదు కదూ… ప్రధానంగా […]
…. పూర్వకాలంలో వాహనాలకు డ్రైవర్లు కూడా ఉండేవాళ్లట వొదినా…!
మాయమైపోతున్నడమ్మా! డ్రైవరన్న వాడు! ———————– తక్కువ సమయంలో యంత్రాలతో ఎక్కువ పని చేయించుకోవడం ఒకప్పుడు గొప్ప… పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచమంతా ఫ్యాక్టరీల పొగ గొట్టాలే. సైరన్ మోతలే. యంత్రాల రోదలే. కాలం ఎప్పుడూ నిలిచి ఉండేది కాదు. ప్రవహించేది. ఇప్పుడు మనుషులు యంత్రాలను నడపడం ఓల్డ్ ఫ్యాషన్. యంత్రాలను యంత్రాలే నడపడం లేటెస్ట్ ట్రెండ్. ఆమధ్య గుజరాత్ లో గుండె డాక్టర్ ఒక చోట, రోగి మరోచోట ఉండగా రోబోటిక్ పద్ధతిలో డాక్టరు ఉన్నచోటునుండే ఎక్కడో […]
బెజవాడ అంటే పగలు సెగలు కావు… మరేమిటో తెలుసా మీకు..?
బెజవాడ అంటే..? సంక్షిప్తంగా చెప్పాలంటే… ఆంధ్రా సంస్కృతికి అడ్డా…! ఇక మీరు ఎన్ని పేర్లయినా పెట్టుకొండి… దాని గురించి ఎలాగైనా చెప్పుకొండి… ఈమధ్య వాట్సప్ గ్రూపుల్లో బెజవాడ మీద ఓ వ్యాసం తెగతిరుగుతోంది… రచయిత ఎవరో చాలామందికి తెలియదు, తెగ షేర్లు చేసేస్తున్నారు… కానీ అది రాసింది సీనియర్ జర్నలిస్టు Bhandaru Srinivas Rao…. ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో తొమ్మిదేళ్ల క్రితం రాసుకున్నాడు… దానికిప్పుడు మళ్లీ కొత్త ప్రాణం వచ్చింది… సరే, వస్తే వచ్చింది, మనం కూడా […]
తెలంగాణేన్సిస్..! ఓ పీతసాలీడు, ఓ పులిచేప… ఏం కనిపెట్టినా అదే పేరు…
ఉస్మానియా యూనివర్శిటీ జువాలజికల్ పరిశోధకులు ఓ అత్యంత అరుదైన చేపను కనుగొన్నారు అని నమస్తే తెలంగాణలో ఓ పెద్ద వార్త వచ్చింది… పులి చారలున్న చేప అంటే… సూపర్, వీర తెలంగాణ పోరాటపటిమ రేంజ్లో ఉందిలే చేపరూపం అనుకుంటూనే ఉన్నాను… ఆ చేప ఫోటో చూస్తుంటే, దానికి పెట్టిన తెలంగాణేన్సిస్ పేరు చదువుతుంటే… అరెరె, కేసీయార్ పేరు కలిసొచ్చేలా పెడితే వీళ్ల సొమ్మేం పోయింది అనిపించిన మాట నిజం… కానీ ఉస్మానియా యూనివర్శిటీ కదా… పెట్టరులే అని […]
చంద్రుడి మీద రియల్ ఎస్టేట్..! ఔనూ, రియలేనా..? అప్రూవ్డ్ లేఅవుట్లేనా..?
ధర్మేంద్ర అనే పెద్ద తోపు… రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉంటాడు… పెళ్లాం పేరు స్వప్న… పెళ్లిరోజు కానుకగా ఆమెకు మూడెకరాల పొలం కొని… సారీ, జాగా కొనేసి, రిజిస్ట్రేషన్ పత్రాలు ఆమె చేతిలో పెట్టి… ఐ లవ్యూ డియర్ అన్నాడు… ఆ కానుక చూసి మురిసిపోయి నా మొగుడు బంగారం, కాదు, కాదు… మంచి వాల్యూ ఉన్న సైట్ అనుకున్న ఆమె కూడా ఐ టూ డియార్ అనేసింది… మరి కాదా..? అక్కడా ఇక్కడా… ఏకంగా చంద్రుడి మీద […]
అమితాబ్..! నెటిజనం ముక్క చీవాట్లతో తప్పనిసరై లెంపలేసుకున్నాడు…
కోట్ల మంది అమితాబ్ బచ్చన్‌ను ఆరాధిస్తారు… తనకు చిన్న సమస్య వచ్చినా అందరూ తల్లడిల్లిపోతారు… తన క్రేజ్ అలాంటిది… అయినా సరే… తను తప్పు చేస్తే ఏకిపారయడానికి కూడా తన ఫ్యాన్స్ రెడీ… ముక్కచీవాట్లు పెడతారు… తాము ఆరాధించే మనిషి తప్పు చేయకూడదు… అంతే… అవును, అదే జరిగింది… తన ట్విట్టర్ ఫాలోయర్లు, ఫేస్బుక్ ఫాలోయర్ల సంఖ్య తెలుసు కదా… ఆ రేంజ్‌కు చేరుకోవడం ఏ సినిమా నటుడికీ ఇండియాలో ఇక చేతకాదు… అయితే తను ఈమధ్య […]
ఫాస్ట్ ఫుడ్… బహుశా గప్‌చుప్ బండ్లు కూడా తప్పక ఉండేవేమో…
వేల ఏళ్లుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లున్నాయి! ఇంట్లో అప్పటికప్పుడు వండుకుని తిన్నది వేడి వేడి అన్నం- పచ్చడి మెతుకులయినా ఆరోగ్యం, క్షేమం, ఆనందం. రోడ్డు మీద తిన్నది అధ్వాన్నం అన్నది లోకంలో ఒక సాధారణ అభిప్రాయం. నిజానికి అధ్వ అంటే దారి. అన్నం అంటే ఆహారం. రెండు పదాలు కలిస్తే తినకూడని, పనికిమాలిన అధ్వాన్నం అయ్యింది. ఎప్పుడో పాతరాతి యుగంలో రాచ్చిప్పల్లో అప్పుడే చెకుముకి రాళ్లతో మంట కనుక్కుని వండుకున్న రోజుల్లో అధ్వాన్నం అంటే తినకూడనిది. ఇప్పుడు […]
పైత్యపు వేడుకలు..! ప్రి-వెడ్ షూట్లలో పీక్స్… నయం, ఇక్కడే ఆపేశారు…
ఏవగింపు… వెగటు… జలదరింపు… ఈ పదాలకు మించి ఇంకా ఏమైనా ఉంటే గుర్తుకుతెచ్చుకొండి… మన పెళ్లి వేడుకల్ని ఎటు తీసుకుపోతున్నామో తలుచుకుని సిగ్గుపడదాం అందరమూ… ప్రివెడ్ షూట్లు మరీ నీచమైన ధోరణుల వైపు వెళ్తున్నాయి… ఉదాహరణగా బోలెడు ఫోటోలు… అసలు ఈ తలతిక్క పైత్యాలకన్నా రిజిష్టర్ మ్యారేజీలు, స్టేజ్ మ్యారేజులు, సింపుల్‌గా గుళ్లల్లో పెళ్లిళ్లు చాలా చాలాా బెటర్ కదా… ఈ ఫోటో చూడండి ఓసారి… ఇది ప్రి వెడ్ షూటట… ఆదిమమానవుల కాన్సెప్టు అనుకుంటా… ఇంకాస్త […]
అసలే చలి… మందు వద్దంటావురా చీప్ లిక్కర్ మొహమోడా..?
కుక్క పని కుక్క చేయాలి… గాడిద పని గాడిద చేయాలి… ఇక్కడ కుక్క ఎవరు, గాడిద ఎవరు అనేది కాదు సమస్య… తమది కాని పని చేయడమే అసలు ఇష్యూ…….. ఈ మాట గట్టిగా అన్నామనుకొండి, సోషల్ మీడియాలో వెంటనే ఉల్టా దాడి మొదలవుతుంది… కుక్కకు పనిచేతకానప్పుడు గాడిద ఆ పనిచేస్తే తప్పేమిటట అంటారు… కోకిల రాగం శృతి తప్పుతోందని గమనించినా సరే, కాకి ఆ పాట అందుకోకూడదు కదా… సేమ్, ఈ వార్త చదివితే అదే […]
మనసుకింపు వార్త.. ఆడబిడ్డ పుడితే ఆ ఇంట అపురూప సంబరం..!
అమ్మలగన్న అమ్మ! ముగురమ్మల మూలపుటమ్మ! By పమిడికాల్వ మధుసూదన్ ———————- “వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” దాదాపు రెండున్నర వేల సంవత్సరాల క్రితం కవికులగురువు లాంటి కాళిదాసు కుమారసంభవం కావ్యంలో మొదట అన్న మాట ఇది. సాగరసంగమం సినిమాలో ఈ శ్లోకాన్ని పాటకు వాడుకున్న వేటూరి మొదట “పార్వతీపరమేశ్వరౌ” అని, రెండో సారి “పార్వతీప రమేశ్వరౌ” అని విడదీశాడు. మొదటిది శివపార్వతులు; రెండోది లక్ష్మీనారాయణులు అన్నది వేటూరి విరుపులో ఉద్దేశం. కానీ- […]
ఇద్దరూ మన విశాఖ తరంగాలే… ఉత్తరాది వేదికను హోరెత్తిస్తున్నారు…
హిందీ మన మాతృభాష కాదు… పైగా మన తెలుగువారికి లేదా దక్షిణ భారతీయులు హిందీ మాట్లాడినా, పాడినా మన యాస వద్దన్నా వినిపిస్తూ ఉంటుంది… అన్నింటికీ మించి హిందీ సంగీతంలో మనవాళ్ల ఉనికిని, ప్రగతిని నార్త్ ఇండియన్స్ అస్సలు సహించరు… ఈ యాసను సాకుగా చెబుతారు… కానీ ఆ రోజులు పోయినయ్… హిందీ మాతృభాషగా కలిగిన సింగర్స్‌ను మనవాళ్లు కొట్టేస్తున్నారు, పక్కకు నెట్టేస్తున్నారు… వాళ్లను మించి మనవాళ్లు పాడుతున్న తీరు చూస్తుంటే… పాటల పోటీల్లోని న్యాయమూర్తులే నోళ్లు […]
ప్లాటు చూపి, సరిపోయే చెక్కిస్తే చాలు… రెండు రోజుల్లో గృహప్రవేశం…
48 గంటల్లో ఇల్లు కట్టి చూపిస్తా! ———————— యంత్రం మాయలో పడిన తరువాత మనిషి కూడా యంత్రంలా మారిపోతాడని వందేళ్ల క్రితమే- మోడరన్ టైమ్స్ సినిమాలో చార్లీ చాప్లిన్ నిరూపించాడు. మనిషి నోట్లో అన్నం పెట్టి, మూతి తుడిచే మిషన్‌ను చాప్లిన్ ఎగతాళిగా ఆనాడే ఆవిష్కరించాడు. యంత్రభూతాల పళ్ల చక్రాల మధ్య చిక్కుకుని మనిషి కూడా జీవంలేని నట్టులో నట్టుగా, బోల్టులో బోల్టుగా మీట నొక్కితే కదిలి, మళ్లీ మీట నొక్కగానే ఆగిపోయే మరబొమ్మగా ఎలా మారిపోయాడో […]
సోలో బ్రతుకు..! ఇది ఓ ఉద్యమం..! జపాన్ తాజా ధోరణులు తెలుసా మీకు..?
గొప్పవాళ్లు కాబట్టే అలా పెళ్లీపెటాకులు లేకుండా ఉండగలిగారా..? లేక వైవాహిక బంధంలో ఇరుక్కోలేదు కాబట్టే గొప్పవాళ్లు అయ్యారా..? మరి మిగతా గొప్పవాళ్ల సంగతేమిటి..? ఒకటికాదు, ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లు కూడా గొప్పవాళ్లు అయ్యారు కదా… పోనీ, ఏ పెళ్లిబంధంలో ఇరుక్కోకపోయినా గొప్పవాళ్లు కాలేకపోయిన వారి సంగతేమిటి..? అన్నీ పిచ్చి లేపే ప్రశ్నలు కదా…… నిన్న రిలీజ్ అయిన తెలుగు కొత్త సినిమా ‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ నిర్మాత గానీ, హీరో గానీ, దర్శకుడు గానీ ఈ […]
- « Previous Page
- 1
- …
- 29
- 30
- 31
- 32
- 33
- …
- 35
- Next Page »