అల్లూరి విగ్రహావిష్కరణ హడావుడి ముగిసింది కదా… ఇంకా దుమ్మూదుమారం సద్దుమణగలేదు… ఆంధ్రజ్యోతి అసలే అక్కసుగా ఉందిగా, అలా దుమ్ము చల్లబడనివ్వదు… మా చంద్రబాబుకు ప్రయారిటీ ఏది..? మా తెలుగుదేశానికి సముచిత గౌరవం ఏది..? ఇదే ధ్యాస..? దాంతో జగన్ మీదకు ఏడుపు… జగన్ చెప్పినట్టుగానే ఆహ్వానితుల జాబితా రూపొందిందనీ, గిట్టనివాళ్లను దగ్గరకు రానివ్వలేదనీ ఓ ఆరోపణ… అందుకే పవన్, బాబులు ఈ కార్యక్రమానికి దూరమయ్యారనీ, కిషన్ రెడ్డి జగన్ చెప్పినట్టు నడుచుకున్నాడనీ ఆంధ్రజ్యోతి విమర్శ… ఇంకోకోణంలో చూద్దాం… […]
‘‘ముందస్తు ముఖ్యమంత్రులు’’ చదవాల్సిన పాత ఎన్టీయార్ కథనం..!!
అటు జగన్… ఇటు కేసీయార్… ఇద్దరూ ముందస్తుకు సై అంటున్నారు… పోనీ, అంటున్నారని అందరూ అంటున్నారు… అడ్డగోలు పాలన వైఫల్యాలతో రోజురోజుకూ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జగన్ ముందుగానే ఎన్నికలకు వెళ్లి, రెన్యువల్ అయిపోదామని అనుకుంటున్నాడు… కేసీయార్ స్థితీ అంతకు భిన్నంగా ఏమీ లేదు… కాస్త బెటర్… జనరల్ ఎలక్షన్స్‌తోపాటే స్టేట్ ఎలక్షన్స్ వస్తే… బీజేపీ మోడీ ప్రభావం పడుతుందని కేసీయార్ సరిగ్గా అంచనా వేశాడు… గత ఎన్నికల ముందు బీజేపీతో, మోడీతో బాగానే ఉండేవాడు కదా… […]
సంచలన రికార్డు… 95 % మార్కులతో నంబర్ వన్ ర్యాంకర్ జగన్…
సాక్షి మొదటి పేజీలో శ్రీచైతన్య గ్రూపు విద్యాసంస్థలు ఇచ్చిన వాణిజ్య ప్రకటన ఇంట్రస్టింగు… వేల కోట్ల విద్యావ్యాపారంలో భాగంగా ఈ గ్రూపు ఏటా కోట్లకుకోట్ల మీడియా యాడ్స్ జారీ చేస్తుంటుంది… ఆ బిస్కెట్ల కోసమే ఏ మీడియా కూడా వాళ్ల జోలికి పోదు… ఉభయతారకం… అదొక టెక్నిక్… ఆ టెక్నిక్కులు నారాయణ గ్రూపుకూ తెలుసు, శ్రీచైతన్యకూ తెలుసు… కానీ నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు… తనతోపాటు తన వియ్యంకుడు కూడా జగన్ ప్రబల ప్రత్యర్థి తెలుగుదేశంలో ఉన్నారు… […]
RRRR… మూడార్లు కాదు… తెలుగుదేశంలో బాబు వెనుక నాలుగార్లు…
మొన్న రాజమౌళి తీసిన సినిమా పేరు ఆర్ఆర్ఆర్… దానికి టెక్నికల్‌గా పూర్తి పేరు రౌద్రం, రణం, రుధిరం… నిజానికి రాజమౌళి, రాంచరణ్, రామారావు జూనియర్… ట్రిపుల్ఆర్ అది… ప్రస్తుతం తెలుగుదేశంలో ఆర్ఆర్ఆర్ఆర్, అంటే మూడార్లు కాదు, నాలుగార్లు… ఇంగ్లిషులో క్రాడ్రుపుల్ ఆర్ శకం… ఒకటి ఈనాడు రామోజీ, రెండు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మూడు టీవీ5 రాజగోపాలనాయుడు, నాలుగు పార్టీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ… గతంలో టీవీ9 రవిప్రకాష్ పేరు ఉండేది… అది ఇప్పుడు కనిపించడం లేదు… […]
జగన్ కూడా పాన్ ఇండియా టైప్… రాజ్యసభ ఎంపికలో విశాల దృక్పథం…
జగన్ ఏమీ తెలియనివాడు కాదు కదా… ఉండే ఉంటుంది, ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది… తెలంగాణ బీసీ కృష్ణయ్యను వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు పంపించాలనే నిర్ణయం వెనుక తనకు, కృష్ణయ్యకు మాత్రమే తెలిసిన ఏదో సమీకరణం ఉండే ఉంటుంది… ఏమో, కృష్ణయ్యకు కూడా తెలిసినా తెలియకపోయినా జగన్ ఏదో గుప్త ప్రణాళికతోనే, అనగా సీక్రెట్ ప్లాన్‌తోనే ఈ ఎంపిక చేసి ఉంటాడు కదా… ఎటొచ్చీ ఆ సమీకరణం ఏమిటనేదే ఫాఫం, ఇప్పుడెవరికీ అంతుపట్టడం లేదు… అంతుపట్టకపోతే […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారూ… ఈయన్ని ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా..?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమంటున్నాడంటే… ఈ దేశానికి వ్యూహకర్తల దరిద్రం పట్టుకుందట… కరెక్టు… రాజకీయ గండరగండడు అనిపించుకున్న కేసీయార్ సైతం ఎన్నికల వ్యూహకర్త పీకే సాయం తీసుకోవడం ఓ విషాదం… కరెక్టు… తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు అందరినీ ముఖ్యమంత్రుల్ని చేస్తున్న తనే ముఖ్యమంత్రి అయితే తప్పేమిటి అనుకుని సొంత పార్టీ పెట్టేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్… కరెక్టు… పార్టీల సిద్ధాంతాలు గాలికి ఎగిరిపోయి వక్ర పద్ధతుల్లో ప్రజాభిప్రాయాన్ని మార్ఫింగ్ చేసే వ్యూహకర్తల ప్రాధాన్యం పెరిగింది… కరెక్టు… ఇలా పీకే […]
భర్త సెల్వమణి షూటింగు వ్యాఖ్యలకు భార్య రోజా స్పందించాలా..?!
నిన్నటి నుంచీ ఓ వార్తను బాగా సర్క్యులేషన్‌లోకి తీసుకొస్తున్నారు… అదేమిటయ్యా అంటే..? రోజా భర్త సెల్వమణి నిన్న చెన్నైలో ఏదో వ్యాఖ్య చేశాడు… ‘‘తమిళ హీరోలు చెన్నై గాకుండా వైజాగ్, హైదరాబాద్ కేంద్రాల్లో సినిమాలు తీస్తున్నారు, షూటింగులు చేస్తున్నారు, ఇది సరికాదు, అలా చేస్తే చెన్నైలో సినిమా పనుల మీద ఆధారపడి బతికే వేల కుటుంబాలు ఏమైపోవాలి..? అజిత్‌కు కూడా చెప్పాం, సరే, ఇకపై చెన్నైలోనే చేస్తానని అంగీకరించాడు…’’ అంటూ ఏదేదో చెబుతూ పోయాడు… ఆయన కోణంలో […]
రాజాధిరాజ… రాజమార్తాండ… రాజగంభీర… పీకే మహాశయా… జీ హుజూర్…
ప్రశాంత్ కిషోర్… ఓ పొలిటికల్ బ్రోకర్ అనే పదాన్ని వాడాల్సిన పనిలేదు… కానీ తను ఓ పొలిటికల్ మానిప్యులేటర్… తన ఆలోచనలు అత్యంత చంచలం… తనది వేల కోట్ల పొలిటికల్ స్ట్రాటజీ దందా… ఈ దేశ రాజకీయాల తాజా దురదృష్టం ఏమిటంటే… తను చుట్టూ తిరుగుతున్నారు సోకాల్డ్ రాజకీయ దురంధరులు… 24 గంటలూ రాజకీయ చాణక్యంలో మునిగి, తమను తాము ప్రూవ్ చేసుకున్న మోస్ట్ సక్సెస్ ఫుల్ రాజకీయ వేత్తలు సైతం సిద్దాంతాలు, మన్నులేవు అంటూ ఓ […]
హమ్మయ్య… కేఏపాల్ తెలంగాణకు వచ్చేశాడు… ఇక చింత లేదు…
ఏపీలో నవ్వు పుట్టించగల నాయకులు బోలెడు మంది… అందుకే ఏపీ ప్రజల్లో బీపీ, స్ట్రెస్ తక్కువ… తెలంగాణలోనే మరీ లోటు కనిపిస్తూ ఉండేది… ఏదో అప్పుడప్పుడూ బండ్ల గణేష్ ఆ లోటు కొంత పూరిస్తున్నా సరే, తను సరిపోవడం లేదు… ఏదో అప్పుడప్పుడూ తలసాని కూడా కాస్త చేయి వేస్తున్నాడు… హమ్మయ్య, ఇప్పుడు ఆ చింత తీరినట్టే… కేఏ పాల్ తన క్రీడావేదిక ఏపీ కాదని, తెలంగాణ మాత్రమే తన కార్యస్థలమని గుర్తించాడు… వచ్చేశాడు… ఇక గాయిగత్తరే… […]
ఈటల ప్లేసు ఏపీలో భర్తీ..! అదీ తెలంగాణ బిడ్డతోనే…! కమ్మలకూ బాధక్కర్లేదు..!!
Nancharaiah Merugumala………….. తెలంగాణ ‘ముది’ రాజకుమారి ఏపీలో మంత్రి…. తెలంగాణ కాబినెట్లో 2014 నుంచీ ‘కమ్మ ప్రాతినిధ్యం’ ——————— తెలంగాణలో ఏకైక ముదిరాజ్ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి సాగనంపి ఏడాది నిడుతోంది. నల్లగొండ జిల్లా వీరోచిత రెడ్లకు సంపన్న అల్లుడైన రాజేందర్ గారు తనపై టీఆరెస్ సర్కారు నుంచి ‘వేధింపులు’ ఎదురైనప్పుడు తాను ‘రెడ్స్’ దామాద్ అని బెదిరించకుండా ముదిరాజ బిడ్డనని వినమ్రంగా విలేఖరులకు చెప్పారు. ముదిమి, బలిమి గల మరో ముదిరాజ్ […]
జగనన్నా… ఏంటీ ముద్దులు..? కాళ్లమొక్కులు..? ఏంటీ అన్-సైంటిఫిక్ కూర్పు…!!
నిజమే… ఈ రేంజులో అసమ్మతి సెగలు బహిరంగంగా ప్రదర్శితం అవుతాయని జగన్ కూడా అనుకుని ఉండడు… ప్రతి ఒక్కరూ చెప్పినట్టు వింటారనీ, నా మాటే శాసనం అన్నట్టుగా ఇలా చెప్పగానే అందరూ నిశ్శబ్దంగా తన మాట పాటిస్తారనీ అనుకుంటే… దానికి భిన్నంగా బజారుకెక్కారు మంత్రి పదవులు రాని నేతలు… వ్యక్తి కేంద్రంగా ఉన్న ఓ ప్రాంతీయ పార్టీ అది, తను పార్టీ పెట్టాక ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లే అందరూ… ఎవరి లెక్కలు వాళ్లవి… ఎవరి స్వార్థం […]
అమాత్యుల్ని అమాంతం పీకేశారు సరే… అసలు జగన్ ఆశించే ఫాయిదా ఏంటి..?
ఏపీ మంత్రుల మొహాలు మాడిపోయాయి, వాడిపోయాయి, కళాకాంతుల్లేవు, మూడీగా ఉండిపోయారు… అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దాదాపు సేమ్ కథనాల్ని ప్రచురించాయి… రెండూ ఒకే జన్యుసంతతి పత్రికలు కాబట్టి, ఒకే వేవ్‌లెంగ్త్, ఒకే తరహా ప్రయోజనాల కోసం పనిచేస్తాయి కాబట్టి సేమ్ కథనాలు రావడం పెద్ద విశేషం కాదు గానీ… మంత్రిపదవులు ఊడబీకబడిన నాయకుల మొహాలు వాడిపోయి గాకుండా… హుర్రే నా మంత్రి పదవి ఊడిపోయిందోచ్ అని గంతులేస్తారా..? కొత్త వెలుగులతో మొహాలు తళుక్కుమంటాయా..? రెండున్నరేళ్ల తరువాత అందరినీ […]
ఇది కాంగ్రెస్-టీడీపీ పునఃకలయిక సంకేతమా..? ఉత్త కర్టెసీ భేటీయేనా..?
మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ నిర్మాణాత్మక చర్చ జరుగుతుంది అనుకున్నాను గానీ… పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు… లైట్ తీసుకున్నారు… ఈ ఫోటో ఏమిటంటే… స్టాలిన్ డీఎంకే పార్లమెంటరీ పార్టీ ఆఫీసు ఓపెన్ చేశాడు, సోనియా ముఖ్య అతిథిగా వచ్చింది… చాలామంది ఎంపీలను పిలిచినట్టున్నారు… కానీ కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్న ఎంపీలే పలువురు వచ్చారు… వచ్చినవారిలో గల్లా జయదేవ్ సహా ఇద్దరు టీడీపీ ఎంపీలున్నారు… అదీ ఆసక్తికరంగా ఉన్నది… ఎందుకంటే..? మళ్లీ చంద్రబాబు కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నాడా..? […]
ముద్రగడకు కోపమొచ్చింది… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు అంటించాడు…
ముద్రగడ పద్మనాభం రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ సోషల్ మీడియాలో కనిపిస్తోంది… ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణను ఉద్దేశించిన రాసిన లేఖ… అక్కడక్కడా చురకలు పెడుతూ, పరోక్షంగా వెక్కిరిస్తూ సాగింది ఆ లేఖ… ఆయనకు ఎందుకంత కోపం వచ్చిందీ అంటే… రాధాకృష్ణ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడిని ఇంటర్వ్యూ చేస్తూ ముద్రగడ ప్రస్తావనను తీసుకొచ్చాడు… పద్మనాభం వగైరా వాళ్లు కాపుల గురించి మాట్లాడతారు కదా, ఒక్కరినైనా ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకువచ్చారా అని రాధాకృష్ణ ప్రశ్నిస్తే, రామానాయుడు నో అని […]
జగన్, పవన్, బాబు జాన్తా నై… మోడీ, షా తలుచుకుంటే ఏపీలో పవర్ వీజీ..!!
అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది… నానాటికీ కొడిగట్టిపోతున్నది కదా హాస్యకళ…, ఏదో రాజకీయ నాయకులు, చండప్రచండ జ్ఞానులైన సినిమా పర్సనాలిటీలు, బూతుతో హాస్యకళను బతికించాలని అరచేతులు అడ్డుపెడుతున్న ఈటీవీ మల్లెమాల జబర్దస్త్‌లు, సొసైటీని అబ్రకదబ్ర అని గాలిలో పోస్టులు ఊపి అర్జెంటుగా ఉద్దరించే సోషల్ యాక్టివిస్టులు… వీళ్లే లేకపోతే హాస్యకళ ఎప్పుడో అంతరించిపోయేది కదా… ప్రత్యేకించి నాయకుల గురించి చెప్పుకోవాలి… ఫాఫం, గతంలో గిరిగీసుకుని, తెలిసీతెలియనితనంతో, మూర్ఖపు హుందాతనంతో రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడేవాళ్లు… అఫ్‌కోర్స్, సినిమావాళ్ల మాటల్ని […]
బాబును ఛీత్కరించి తరిమేస్తే… ఇప్పుడేం భిన్నంగా ఉంది జగనన్నా…
ఏం భిన్నంగా ఉంది జగనన్నా… మరీ 23 సీట్లకు చంద్రబాబును ఛీత్కరించేసి, నిన్ను గద్దెనెక్కిస్తే ఏం భిన్నంగా ఉంది..? నిష్ఠురం కాదు… నువ్వే చెప్పు… ఎలాగూ మీడియా ముందుకు రావుగా… నువ్వు గొప్పోడివి, మొన్నటి ఎన్నికల ముందు దాకా చంద్రబాబు కూడా అంతే… మీరు గొప్ప వ్యక్తులు… తెలుగు జాతి ఆశాకిరణాలు… ఆయన అమరావతిని మధ్యలో పడుకోబెట్టాడు… గ్రాఫిక్స్‌తో జనాన్ని పిచ్చోళ్లను చేశాడు… మూడేళ్లు కావస్తోందిగా, మరి జగనన్న ఏం చేశాడు..? మండలి రద్దు నుంచి సినిమా […]
అర్థమయ్యేట్టుగానే చెప్పాడు… కానీ అర్థం కాని చిక్కులూ బోలెడున్నయ్…
జనసేనాని మార్మికంగా ఏమీ చెప్పలేదు… పరోక్షంగా చెప్పినట్టు అనిపించినా సరే, అందరికీ అర్థమయ్యేట్టుగానే చెప్పాడు… ‘‘రాబోయే ఎన్నికల్లో వైసీపీ వోట్లు చీలనివ్వను’’ అని పార్టీ తొమ్మిదో వార్షికోత్సవ సభలో గట్టిగానే చెప్పాడు… అంటే ఏమిటి..? వైసీపీకి ప్రధాన వ్యతిరేక వోటు తెలుగుదేశం వోటు… ప్లస్ బీజేపీ, జనసేన కూటమి… వీళ్లు చీల్చుకోవద్దు అంటే… ఈ రెండూ ఆ టీడీపీతో కలవాలి… ఆ సంకేతాలు ఇస్తున్నాడు పవన్ కల్యాణ్… బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కావాలంటాడు, టీడీపీ వైపు […]
మీటర్లకు ఆద్యుడే తను… బాబోయ్, ఉరితాళ్లు అని శోకాలు పెడుతున్నాడు…
మిగతా వార్తల్ని వదిలేయండి కాసేపు… వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడితే అవి ఉరితాళ్లు అవుతాయట… చంద్రబాబు చెబుతున్నాడు… దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ విషయం చెప్పినా సరే, అది వేరు… చంద్రబాబు చెబితే అంతకుమించిన దరిద్రం మరొకటి లేదు… నిజం… కేంద్రంలో చక్రాలు తిప్పానని, సంస్కరణలకు ఆద్యుడిననీ, ఆధునిక భారత్‌కు ఆదిపురుషుడిననీ ఏవేవో చెప్పుకుంటాడు కదా… ఇప్పుడేం చెబుతున్నాడు..? రైతులకు ఉరితాళ్లు, గతంలో వ్యవసాయ విద్యుత్తుపై రైతుల్ని ఆదుకున్నది తనేననీ చెబుతున్నాడు… ఒక రాజకీయ నాయకుడికి […]
ప్రీతికి వోకే..! గౌతమ్ స్థానంలోకి విజయసాయి..? రాజ్యసభకు వైవీ..?
నిజమో, అబద్ధమో… కల్పనో, గాలివంటకమో… ఏదయితేనేం… మాంచి మసాలా వంటకంగా మార్చి, బాగా గార్నిష్ చేసి వడ్డించగలదు ఆంధ్రజ్యోతి… ప్రత్యేకించి రాజకీయవార్తలు..! ఈరోజు ఫస్ట్ పేజీలో వచ్చిన వార్త ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో ఒకింత చర్చ జరిగేదే… ఏమిటంటే..? ‘‘ఆదానీ భార్య ప్రీతికి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నాడని… విజయసాయికి మరోసారి చాన్స్ ఇస్తాడని… రేసులో ఆలీ ఉన్నాడని… రేసులో బొత్స, సజ్జల, వైవీ కూడా ఉన్నారని… కానీ..? జగన్ ఆలోచనల్ని అందుకోవడం ఆ పార్టీ పెద్దలకే […]
పోనీ, ఒక్కమాట మీ అన్నయ్య చిరంజీవిని అడగలేకపోయావా నాగబాబూ..?!
‘‘బీమ్లానాయక్ గురించి సినిమా పెద్దలు ఒక్కరూ మాట్లాడటం లేదు, ఇండస్ట్రీ మాట్లాడటం లేదు… వాటీజ్ దిస్ దారుణం’’ అని నాగబాబు అలియాస్ పవన్ కల్యాణ్ బ్రదర్ అలియాస్ చిరంజీవి బ్రదర్ మాట్లాడుతుంటే నవ్వొచ్చింది… సోషల్ మీడియాకొచ్చి శోకాలు పెట్టడం దేనికి..? ఒక్కసారి చిరంజీవి దగ్గరకు వెళ్లి ‘‘హన్నయ్యా, హేమిటి ధారుణం..?’’ అని ఒక్క మాట అడగొచ్చు కదా… ఎలాగూ తమ్ముడు ఎత్తిచూపాడు కదా, వంగి వంగి దండాలు పెట్టడం దేనికీ అంటూ..! పవన్ కల్యాణ్ టెంపర్‌మెంట్‌కు ఆఫ్టరాల్ […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- …
- 9
- Next Page »