హైదరాబాద్- బెంగుళూరు నడుమ ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేవాళ్లకు తెలుసు… ఎప్పుడూ ఎవరో ఒక సీరియల్ టీవీ నటి బిజినెస్ క్లాసు కుర్చీలో కనిపిస్తుంది… మరీ శని, సోమవారాల్లో ఎక్కువగా… ఎందుకు..? టీవీ సీరియళ్లలో నటించడానికి బెంగుళూరు- హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు చాలామంది… నిజం… ఈరోజు ఏ చానెల్లో ఏ సీరియల్ చూసినా సరే, ప్రధాన పాత్రలన్నీ కన్నడ తారలే… ప్రధాన పాత్రలే కాదు, ఓ మోస్తరు పాత్రల్లోనూ వాళ్లే… మన తెలుగువాళ్లు లేరా..? […]
వోటింగు తంతుతో ఏమొస్తుంది థమన్..? దీన్ని కూడా బిగ్‌బాస్ షో చేస్తున్నారా..?
నో డౌట్… ఆహా ఓటీటీలో వచ్చే రియాలిటీ షోలలో సూపర్ క్లిక్కయింది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… తరువాత ఆ రేంజ్ ప్రజాదరణ పొందింది ఇండియన్ ఐడల్ తెలుగు మ్యూజిక్ కంపిటీషన్ షో… నిజానికి శ్రీరాంచంద్ర హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ బాగా హిట్టయింది… ఆ సీజన్లో కనిపించిన నిత్యా మేనన్, శ్రీరామచంద్రలను డిలిట్ కొట్టేసి, కొత్తగా గీతమాధురి, హేమచంద్రలను యాడ్ చేశారు… మేల్ శ్రీముఖిలా హేమచంద్ర హైపిచ్ లేదా హెడ్ వాయిస్ అరుపులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి […]
స్వీట్ వయోలినిస్ట్ కామాక్షి… ఆహా ఇండియన్ ఐడల్ ఆర్కెస్ట్రాలో అదుర్స్…
అంబటిపూడి కామాక్షి… మరోసారి చెప్పుకుంటున్నాం… సాధారణంగా టీవీల్లో కనిపించే మ్యూజిక్ కంపిటీషన్, సారీ, సింగింగ్ కంపిటీషన్స్లో ఆర్కెస్ట్రాను పెద్దగా పట్టించుకోరు, గుర్తించరు… అరుదు… ఈటీవీ పాడతా తీయగా వంటి షోలలో ఇన్స్ట్రుమెంట్స్, ప్లేయర్లను చూపిస్తూ ఉంటారు చాలాసార్లు… అభినందనీయం… కొన్ని టీవీ షోలలో మరీ ట్రాకులతో కథ నడిపించేస్తుంటారు… జీతెలుగు వంటి చానెళ్లలో సరిగమప వంటి పరమ నాసిరకం షోలలో చెప్పనక్కర్లేదు… జడ్జిల వేషాలు కూడా చిరాకెత్తిస్తున్నాయి… కానీ ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్ […]
గీత దాటిన గీతామాధురి… హఠాత్తుగా ఏ వైరస్ తాకిందో, వెకిలి డ్రెస్సుతో ప్రత్యక్షం…
హఠాత్తుగా ఏ వైరస్ మెదడును అటాక్ చేసి, విచక్షణను దెబ్బతీస్తుందో తెలియదు… మేం హోస్ట్ చేస్తున్నది లేదా జడ్జిగా ఉన్నది మ్యూజిక్ షో అనే సోయి కూడా అకస్మాత్తుగా మాయమైపోతుంది కొందరికి… ఆమధ్య శ్రీముఖి డ్రెస్సింగు గురించి, అనసూయ దుస్తుల గురించి మనం చెప్పుకున్నాం… ఆ సిరివెన్నెల ఏ క్షణాన రాశాడో గానీ… నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు… అని… ఇక కాళ్లు, ఆపైన తొడల దాకా చూపించుకునే ఆత్రం, తాపత్రయం బాగా […]
వెబ్ సీరీస్… సౌత్ భాషల్లో పూర్ క్రియేషన్స్… టాప్-10 మొత్తం హిందీయే..!!
3.71 కోట్ల వ్యూస్… ఒక వెబ్ కంటెంటు వ్యూయర్స్ విషయంలో ఇది అసాధారణ సంఖ్య కదా… అవును, విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ నటించిన వెబ్ కామెడీ సీరీస్ ఫర్జి ప్రస్తుతం మోస్ట్ వాచ్డ్ ఇండియన్ వెబ్ షో… ఇప్పటివరకూ వచ్చిన అన్ని వెబ్ సీరీస్‌ను ఇది కొట్టిపారేసింది… ఇది చిన్న విషయమేమీ కాదు… ఓటీటీలో సూపర్ సక్సెస్ అన్నమాట… అసలు ఇదే కాదు, ఒక్కసారి టాప్ 10 ఇండియన్ వెబ్ కంటెంట్ విషయానికి వస్తే అన్నీ […]
తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?
సుడిగాలి సుధీర్ ఇక బుల్లితెరకు బైబై చెప్పినట్టే…. ఇదీ కొన్ని తాజా వార్తల సారాంశం… నిజమేనా..? బైబై చెబితే నష్టమేంటి..? ఈ ప్రశ్నలకు జవాబు కష్టం… సుధీర్ స్వతహాగా కమెడియన్… మంచి పర్ఫార్మర్… కామెడీతోపాటు డాన్స్ తనకు బాగా అచ్చొచ్చే అదనపు క్వాలిటీ… అన్నింటికన్నా హైపర్ ఆది వంటి కేరక్టర్లు సైతం తన మీద సెటైర్లు వ్యాఖ్యలు విసురుతున్నా సరే, లైట్ తీసుకుంటాడు తను… పంచులు వేసేవాడి పంచెలే ఊడిపోతాయి, నాదేం పోయింది అని మనస్సులో నవ్వుకుంటాడేమో… […]
Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…
ఒక్క తెలుగులోనే ఈ పైత్యం ఉన్నట్టుంది… దానికి ఆద్యురాలు శ్రీముఖియే కావచ్చు… ప్రోగ్రామ్ హోస్టింగ్ కావచ్చు, యాంకర్ కావచ్చు భీకరంగా అరిస్తేనే అది ఎఫీసియెంట్ యాంకరింగ్ అనే ఓ భ్రమ పెరుగుతోంది… అది అంతిమంగా ప్రోగ్రామ్ మీదే నెగెటివిటీ పెరగడానికి కారణం అవుతుంది… అనసూయ పిచ్చి, వెకిలి డ్రెస్సింగును శ్రీముఖి ఆదర్శంగా తీసుకుంటే, శ్రీముఖి పిచ్చి కేకల్ని ఇండియన్ ఐడల్ యాంకర్ సింగర్ హేమచంద్ర ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు… బాలయ్య మూడు భాగాల పెద్ద ఎపిసోడ్ తరువాత ఈసారి […]
FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
Psy Vishesh …….. సెలెబ్రిటీలు బ్రతికుండగానే చంపేస్తున్న సోషల్ మీడియా వాడకందారులు ఇవ్వాళ కోట శ్రీనివాసరావు గారిని చంపేశారు. పాపం ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చేతులు ఖాళీగా ఉన్నాయి, వేళ్లు దురదపెడుతున్నాయంటూ, డబ్బులేం ఖర్చు కావంటూ… వేలి కొసలతో మనం చేసే పనులు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో, ఎన్ని జీవితాలను నాశనం చేస్తాయో వివరిస్తూ తీసిన వెబ్ సిరీస్… #Fingertip . ZEE5 లో ఉంది. ఒక్కో భాగం 30 నిమిషాల చొప్పున 5 భాగాలే. […]
ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
పండుగ అంటే..? ఏముంది..? జొమాటో లేదా స్విగ్గీ నుంచి ఏవైనా స్పెషల్స్ ఆర్డర్ పెట్టుకోవడం… నోట్లో కుక్కుకుంటూ టీవీలకు కళ్లు అతికించడం… ఆది వెగటు పంచులో, రాంప్రసాద్ వెకిలి డైలాగులో, స్త్రీముఖి భీకరమైన యాంకరింగో… తప్పేదేముంది..? ఇంట్లోనే దొరికే ఏకైక వినోదం కదా..! లేదంటే ఓటీటీలో ఏదైనా సినిమా ఓపెన్ చేసి చూడటం… ఇదీ ఈతరం నగర ఉగాది… ఇప్పటికీ ఊరి ఉగాది లేదా సంప్రదాయ ఉగాది వేరు… తలస్నానాలు… మామిడాకులు కట్టాలి, ఉగాది పచ్చడి చేయాలి, […]
థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
మనం కొన్ని కథనాలు రాసినప్పుడు బూతులు, ఇతర అభ్యంతరకర పదాలు రాయాల్సి వస్తే… మధ్యలో డ్యాష్ పెట్టి వదిలేస్తుంటాం… పాఠకులే అర్థం చేసుకోవాలి… కానీ కొన్నిసార్లు ఇష్యూను సరిగ్గా వివరించాలంటే ఆ పదాల్ని యథాతథంగా రాయకతప్పదేమో… రానాలు, వెంకటేశులే పచ్చి బూతుల అడల్ట్ సినిమాలు తీస్తుంటే… అంతటి రామోజీరావే తన టీవీ రేటింగ్స్‌కు జబర్దస్త్ వంటి బూతుషోను ఆశ్రయిస్తుంటే… విష్వక్సేన్ వంటి హీరోలు ఓ రీతిలేని బతుకును ఆవిష్కరించుకుంటుంటే… ఆఫ్టరాల్ మనమెంత..? ఆ అవసరం కోసం ఒకటీరెండు […]
ఓ చిన్న పిల్ల కాళ్లకు పట్టీలు తొడిగి… ఓ బామ్మకు భక్ష్యాలు చేసి తినిపించి…
అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్‌కు వచ్చేసరికి బాలయ్య దాన్ని బాగా చెడగొట్టాడు… ఆ కారణాల విశ్లేషణ ఇక్కడొద్దు గానీ, ఆ షోకన్నా తను గెస్టుగా పాల్గొన్న ఇండియన్ ఐడల్ స్పెషల్ ఎపిసోడ్ మాత్రం అదరగొట్టాడు… బాలయ్య ప్రజెంట్స్ టాప్ 12 పేరిట, గాలా విత్ బాలా పేరిట ఈ ఎపిసోడ్స్‌లో రెండు రోజులపాటు బాలయ్య సమక్షంలో కంటెస్టెంట్లు 12 మంది 12 పాటలు పాడతారు… బాలయ్యను గెస్టుగా పిలిచాం కదాని ఇండియన్ ఐడల్ టీం మరీ బాలయ్య […]
అసలు కంటెస్టెంట్ల పోటీయే స్టార్ట్ కాలేదు… పరుగున బాలయ్య వచ్చేశాడు…
రెండుమూడు పాపులర్ సైట్లలో కూడా కనిపించింది… బాలయ్యను అల్లు అరవింద్ తెగవాడేసుకుంటున్నాడు, ఇండియన్ ఐడల్ ఫినాలే కూడా షూట్ చేసిపారేశారు, బాలయ్య బాగానే టైమ్ ఇచ్చాడు అని..! ఇక్కడ బాలయ్య పిచ్చోడు కాదు, అరవింద్ పిచ్చోడు కాదు… బాలయ్య ఇప్పుడు ఆహాకు అస్థాన ఆర్టిస్టు… అన్‌స్టాపబుల్ షో ద్వారా ఒక భిన్నమైన పాపులారిటీని సంపాదించాడు… తనలోని భిన్నమైన బాలయ్యను ఆవిష్కరించుకున్నాడు… మరోవైపు అరవింద్ ఓటీటీ బాగా పాపులరైపోయింది… ఐననూ… అసలు కంటెస్టెంట్ల నడుమ పోటీయే స్టార్ట్ కాలేదు, […]
ఆ సీరియల్ సీతారాములం… నిజంగానే సీతారాములం అయ్యాం…
నా పేరు గుర్మీత్ చౌదరి… ఆరేళ్ల వయస్సున్నప్పుడు మా టీచర్ అడిగాడు… ‘‘నువ్వు జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నావురా..?’’ నేను సింపుల్‌గా ‘యాక్టర్ అవుతాను సార్’’ అన్నాను… అందరూ నవ్వారు… టీచర్ కూడా జోక్‌గానే తీసుకున్నాడు… సరదాగా పిర్రల మీద ఒక్కటేశాడు… కానీ నేను సీరియస్‌గానే చెప్పాను… కాకపోతే మా కుటుంబానిది ఆర్మీ నేపథ్యం… అసలు ఫిలిమ్, టీవీ ఇండస్ట్రీలతో ఏమాత్రం లింక్ లేదు… కానీ నేను వెళ్లే తోవ అదేనని వాళ్లకూ తెలియదు అప్పుడు… మాది […]
అంతగా నవ్వించే కపిల్ శర్మ ఓ దశలో ఆత్మహత్యకు ఆలోచించాడు..!!
నవ్వు వెంటే ఏడుపు… ఏడుపు వెంటే నవ్వు… దేశంలో ఇప్పుడు టాప్ కామెడీ పర్ఫార్మర్ అంటే కపిల్ శర్మ… కోట్ల మంది వీక్షకులున్నారు తన కామెడీ షోలకు… సోనీ టీవీ ప్రధాన షోలలో ఇదీ ఒకటి… దేశంలోని ప్రతి సెలబ్రిటీ ఒక్కసారైనా కపిల్ శర్మ షోలో పాల్గొంటే బాగుండునని తహతహలాడుతారంటే అతిశయోక్తి కాదు… తరచూ తన ఆస్తుల గురించి, కార్లు-ఇళ్ల గురించి వార్తలు వస్తుంటాయి… కానీ ఇదే కపిల్ శర్మ ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు… […]
ఫటాఫట్ ఆడిషన్స్… చకచకా ఫిల్టర్… ఐదారుగురు మెరికలు దొరికారు…
1) శృతి నండూరి… అమెరికా నుంచి వచ్చింది… వైద్యాన్ని, సంగీతాన్ని కలిపి ప్రయోగాలు చేయాలనే అభిలాష ఉంది… ఫస్టే గోల్డెన్ మైక్ ఇచ్చేశారు… ఆమె టోన్ ఆమెకు బలం… ఈమె నండూరి ఎంకి మునిమనవరాలు… 2) విశాఖపట్నం నుంచి వచ్చిన సౌజన్య గతంలో అర్జున్‌రెడ్డి సినిమాలో పాడింది… పెళ్లి, సంతానంతో బ్రేక్… ఇప్పుడు మళ్లీ వచ్చింది… ఆమె సీనియారిటీ ఆమెకు ధైర్యం, టోన్ బాగుంది… 3) యుతి హర్షవర్ధన… ఈ బెంగుళూరు అమ్మాయి గతంలో జీసరిగమపలో కూడా […]
Barc News… సుమ ‘అడ్డా’ ఢమాల్… జెమినిటీవీ మటాష్… జబర్దస్త్ ఫ్లాప్…
మనం చాన్నాళ్లుగా చెప్పుకుంటున్నదే… సుమ ప్రోగ్రామ్స్ టీవీల్లో మొనాటనీ వచ్చేశాయనీ, బోర్ కొడుతున్నాయనీ, తన రూట్ మార్చుకోకపోతే యాంకర్‌గా, హోస్ట్‌గా తన పాపులారిటీని కోల్పోక తప్పదనీ…! కానీ సుమ తన బలహీనత ఏమిటో తను గుర్తించడం లేదు… నో డౌట్, ఆమె స్పాంటేనిటీ, వాగ్ధాటిలో తనను కొట్టేవారు లేరు… కానీ ఒకే తరహా ఫార్మాట్లో, ఒకే తరహా విసుర్లతో సాటే తన ప్రోగ్రామ్స్‌ను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదిప్పుడు… మరోసారి నిరూపితమైంది… దీనికి నిదర్శనం ఏమిటో తెలుసా..? […]
నాడు సరిగమపలో ప్రదీప్ ర్యాగింగ్… నేడు ఇండియన్ ఐడల్‌లో రాకింగ్…
ఇండియన్ ఐడల్ తెలుగు సెకండ్ సీజన్ స్టార్టయింది కదా ఆహా ఓటీటీలో… దానికి చాలా వ్యూయర్ షిప్ ఉంది… థమన్, కార్తీక్ ప్లస్ పాయింట్స్,.. శుక్రవారం రాత్రి థర్డ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు… అమెరికా నుంచి వచ్చిన ఓ గాయని కమ్ డాక్టర్ గోల్డెన్ మైక్ పొంది టాప్ 12 జాబితాలోకి వెళ్లిపోయింది… సిద్దిపేట నుంచి వచ్చిన లాస్య కూడా బాగా పాడింది… అకస్మాత్తుగా ఓ గాయని సింగర్ కార్తీక్‌ను ఆటపట్టిస్తూ… (ఆహా టీం స్క్రిప్టు)… […]
ఫాఫం వెంకీ… ఈ ఒక్క పాత్రతో విశిష్ట కెరీర్ కాస్తా మటాష్… జాలిపడదాం…
రచయిత, దర్శకుడు, నిర్మాత, మిత్రుడు Prabhakar Jaini ఫేస్ బుక్ వాల్ మీద ఓ పోస్టు కనిపించింది… అది… ‘‘పొరపాటున కూడా, మన వెంకటేశ్, మన రానా ఉన్నాడని ఈ వెబ్ సీరీస్ చూడకండి. అలగా జనం కూడా మాట్లాడలేని, అతి హేయమైన బూతులు, ఎంత దరిద్రంగా ఉందంటే, వీళ్ళ ముఖాలు జన్మలో చూడకూడదన్నంత ఛండాలంగా ఉంది. అందుకే, రానా, వెంకటేశ్ లు కూడా, ఇంటర్వ్యూలలో, మా అభిమానులు ఈ వెబ్ సీరీస్ చూడకండి అని చెబుతున్నారు… ఇక […]
కేటీయార్ టీవీ చానెల్ పైపైకి… జగన్, బీజేపీ టీవీ చానెళ్లు నానాటికీ లోపలికి…
ఆల్రెడీ హైదరాబాద్ బార్క్ మార్కెట్లో ఎన్టీటీవీ ఫాఫం నాలుగో ప్లేసుకు పడిపోయింది… పేరుకు అది తెలుగు న్యూస్ చానెళ్లలో నంబర్ వన్… కానీ కీలకమైన ఫైనాన్షియల్ మార్కెట్ హైదరాబాద్‌లో మాత్రం దాని ప్రగతి ఇదీ…! ఇంకో విశేషం తెలుసా..? మేం టీవీ9 చానెల్‌నే కొట్టేశాం అంటున్నారు కదా… ఇప్పుడు ఆ ఎన్టీవీని ఫస్ట్ ప్లేసు నుంచి పడగొట్టేయడానికి టీవీ9 జస్ట్, ఒకే అడుగు దూరంలో ఉంది… అంటే రెండు చానెళ్ల నడుమ తేడా కేవలం ఒక జీఆర్పీ […]
పొట్టోడిని పొడుగోడు కొడితే… కౌశల్‌ను పోశమ్మ కొట్టింది… బీబీజోడీ నుంచి ఔట్…
పొట్టోడిని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోశమ్మ కొట్టింది అని సామెత… పోశమ్మ అంటే దేవుడు అని…!! బీబీ జోడి షోలో కౌశల్‌కు ఈ సామెత సరిగ్గా వర్తిస్తుంది… అప్పట్లో బిగ్‌బాస్ షోలోనే కౌశల్ పోకడ చాలామంది నచ్చేది కాదు… కాకపోతే అందరూ తనను ఒంటరిని చేశారనే సానుభూతి కొంత, బయటి నుంచి వోటింగులో లభించిన సపోర్ట్ కొంత, వోట్ల కోసం తన టీం అవలంబించిన వ్యూహం కొంత ఫలించి గెలిచాడు… కాకపోతే అందరినీ గెలుకుతూ ఉంటాడు… తనదే […]
- « Previous Page
- 1
- …
- 14
- 15
- 16
- 17
- 18
- …
- 41
- Next Page »