Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరీ గౌరీ రాజ్..? సీనియర్ టీవీ యాక్టర్లనూ డామినేట్ చేసేస్తోంది..!!

September 10, 2022 by M S R

gowri raj

నిజానికి సినిమా నటులతో పోలిస్తే టీవీ నటులకే నటన కష్టం… సినిమా నటులదేముంది..? ఎక్కువగా లాంగ్ షాట్స్ ఉంటయ్… ఎవరి మొహంలో ఏం ఉద్వేగాలు పలుకుతున్నాయో ఎవడు చూడొచ్చాడు..? మరీ క్లోజప్ షాట్స్ ఉంటనే సదరు నటుల అసలు సత్తా బయటపడేది… అలాంటి షాట్లు ఇప్పుడు సినిమాల్లో తక్కువగా ఉంటున్నయ్… ఎందుకంటే… మన హీరోలకు, స్టార్ నటులకు పెద్దగా నటన రాదు… రకరకాల కారణాలతో ఇండస్ట్రీలో చెలామణీ అయిపోతుంటారు… వాళ్లకు క్లోజప్పులు పెట్టే సాహసం దర్శకులకు ఉండదు… […]

బాడీ షేమింగ్‌లా, ఏజ్ షేమింగ్‌లా… లేడీ కంటెస్టెంట్ల వార్తల్లో కలర్ షేమింగ్…

September 9, 2022 by M S R

bb6

పేరున్న పెద్ద సైట్లతోపాటు చాలా చానెళ్లలో, సైట్లలో ఓ వార్త కనిపించింది… నటులు, లేడీ సెలబ్రిటీల కలర్ విషయంలో మన మీడియా కురచ బుద్ధులు ఇప్పటికీ మారలేదు అని రూఢీ అయిపోయింది… ఫెయిర్ కలర్, డార్క్ షేడ్ మీద పరువు తీసేలా, ఆయా నటుల ఆత్మస్థయిర్యం, నైతికసామర్థ్యం దెబ్బతినేలా ఎవరైనా నెత్తిమాశిన వార్తలు రాస్తే, ఆ జర్నలిస్టులను టీవీ, సినిమా ప్రపంచం వెలివేసినట్టు చూస్తోంది కొన్నిచోెట్ల… ప్రత్యేకించి తమిళనాడు, కేరళ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు కనిపిస్తే […]

కార్తీకదీపం దర్శకుడికి కర్రు కాల్చి వాతలు పెట్టిన టీవీ ప్రేక్షకులు..!!

September 8, 2022 by M S R

kartikadeepam

ప్రేక్షకులు హౌలాగాళ్లు… పిచ్చోళ్లలాగా మేం ఏం చూపించినా సరే, కళ్లప్పగించి చూస్తారు అనుకునేవాళ్లకు ప్రేక్షకులు కర్రు కాల్చి వాతలు పెట్టడం కొత్తేమీ కాదు… ప్రేక్షకులు అంత ఎడ్డోళ్లు కూడా కాదు… కాకపోతే ఆ టైం రావాలి… కార్తీకదీపం నిర్మాతలకు, దర్శకుడికి ఇప్పుడు ఆ అనుభవం ఏమిటో అర్థమవుతోంది… ప్రేక్షకులు ఛీకొడుతున్నారు… ఫోఫోరా ఎడ్డీస్ అని వెక్కిరిస్తున్నారు… నిజం… తాజాగా బార్క్ రేటింగ్స్ చెబుతున్న చేదు నిజం అదే… సరే, సీరియల్ మార్పుల గురించి ఓసారి సంక్షిప్తంగా చెప్పుకుందాం… […]

గీతూ రాయల్… ఇలాంటి కేరక్టర్లే అవసరమబ్బా… లేకపోతే షో శుద్ధ దండుగ…

September 6, 2022 by M S R

Geethu royal

గలాటా గీతు… గీతు రాయల్… చిత్తూరు చిరుత… ఏ పేరుతోనైనా పిలవండి… నోరిప్పితే చాలు, దడదడ మాటల ప్రవాహమే… చిత్తూరు యాస పర్‌ఫెక్ట్‌గా పలుకుతుంది తన గొంతులో… ఇంకా ఏ కృతిమత్వమూ ఆమె యాసను పెద్దగా పొల్యూట్ చేయనట్టుంది… ఎందుకు చెప్పుకోవడం అంటే..? కాస్త భోళాగా, తనేం మాట్లాడుతుందో కొన్నిసార్లు తనకే తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తుంటుంది కదా… కానీ ఇలాంటి కేరక్టర్ బిగ్‌బాస్‌లో అవసరమే… మొత్తానికి సోమవారం షోను డామినేట్ చేసిపడేసింది… మిగతా ఆడ, మగ కేరక్టర్లు […]

ఫాఫం సింగర్ రేవంత్… మొదటిరోజే మొహం వాచిపోయింది…

September 6, 2022 by M S R

revanth

బిగ్‌బాస్ టీంను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు… ఆ షో ద్వారా కావల్సింది ఎక్కువ టీఆర్పీలు… కమర్షియల్ యాడ్స్, మూవీ ప్రమోషన్స్, డబ్బు… యాక్టివిటీ యాడ్స్ పేరిట ఇదే కంటెస్టెంట్లతో బోలెడు కమర్షియల్ యాడ్స్ అదే హౌజులో చేయిస్తారు… సో, కంటెస్టెంట్ల పర్‌ఫామెన్స్, వాళ్లకు వచ్చే వోట్లు, దానికి అనుకూలించే కంట్రవర్సీలు షోలో కంటెస్టెంట్ల గమనాన్ని నిర్దేశిస్తాయి… రెమ్యునరేషన్ల వరకూ కాస్త ఎక్కువ, తక్కువ అనేది వాళ్ల పాపులారిటీని బట్టి ఉంటుంది… కానీ కంటెస్టెంట్ అంతిమంగా ఎన్ని […]

సామాన్యులకి ఆహ్వానం, ఆడిషన్స్ అన్నారు… ఏమయ్యారురా బిగ్‌బాస్…?!

September 4, 2022 by M S R

bb6

గత మే నెల… బిగ్‌బాస్ టీం అధికారికంగానే ప్రకటించింది… సామాన్యులకు ఆహ్వానం అని చెప్పింది… ఆడిషన్స్ అని పేర్కొంది… ఓహో, యూట్యూబర్స్, టీవీ యాక్టర్స్, మోడల్స్, కమెడియన్స్, సింగర్స్, ఇతరత్రా చిన్నాచితకా సెలబ్రిటీలే గాకుండా సామాన్యులతో కూడా బిగ్‌బాస్ ఆట ఆడిస్తారా అనుకున్నారు ప్రేక్షకులు… గతంలో కూడా ఒకరిద్దరిని ఇలా తీసుకొచ్చారు కూడా… కానీ తీరా చూస్తే… 20 మందిని ప్రవేశపెడితే వారిలో ఒక్క సామాన్యుడూ లేడు… మరి సామాన్యుల ఎంపిక ఏమయిపోయిందిరా బిగ్‌బాసోడా అనడగాలి… ఆదిరెడ్డి […]

జబర్దస్త్ ఫైమా, సింగర్ రేవంత్, చలాకీ చంటి… వీళ్లపైనే అందరికన్ను..!

September 4, 2022 by M S R

bb6

సహజంగానే బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఎవరు అనే ఆసక్తి ఉంటుంది కదా… దిక్కుమాలిన సీరియళ్లు, ఆ చెత్తా కథాకథనాలు, ఈటీవీలో వచ్చే తలతిక్క రియాలిటీ షోలతో పోలిస్తే మాటీవీలో వచ్చే బిగ్‌బాస్ మీద ప్రేక్షకులకు ఆసక్తి సహజమే కదా… ఆల్రెడీ షో లాంచింగుకు టైం వచ్చేసింది… ఎంట్రీ తాలూకు షూటింగులు అయిపోయాయి… ఎప్పటిలాగే నాగార్జున కోసం డాన్సులు, అనగా పిచ్చి గెంతుల ఎంట్రీ షూట్స్ కూడా అయిపోయాయి… కానీ ఎవరు కంటెస్టెంట్లు..? ఇదుగో, కింద ఓ ఫోటో ఇస్తున్నా… […]

టీవీ సీరియల్‌లో హఠాత్తుగా మాయం… బిగ్‌బాస్ హౌజులోకి పయనం…

September 4, 2022 by M S R

sri satya

ఈ బిగ్‌బాస్ షో ద్వారా స్టార్ మాటీవీ వాడికి వచ్చే రేటింగ్స్, యాడ్స్, పాపులారిటీ మాటేమిటో గానీ… అందులో పాల్గొనే వాళ్లకు వచ్చే పబ్లిసిటీ మైలేజీ, ఇతరత్రా డబ్బు ఫాయిదాల మాటేమిటో గానీ… ఒక్కసారిగా కొన్ని వేరే ప్రోగ్రామ్స్ డిస్టర్బ్ అవుతాయి… సపోజ్, యాంకర్‌గా చేసే దీపిక పిల్లి హఠాత్తుగా బిగ్‌బాస్ హౌజులోకి వెళ్లిపోతే పెద్ద ఫరక్ పడదు… ప్రస్తుతం ఆమె రెగ్యులర్‌గా చేస్తున్న షోలు ఏమీ లేవు… కానీ మంగళంపల్లి శ్రీసత్యను తీసుకొండి… జీతెలుగులో త్రినయని […]

తీసేవాడికి చూసేవాడు లోకువ… కక్కుర్తి కార్తీకదీపం కథ ప్రేక్షకులకు అర్థమైంది…

September 3, 2022 by M S R

vantalakka

మనం చాలాసార్లు చెప్పుకున్నాం… కార్తీకదీపం తెలుగు నిర్మాతల కక్కుర్తి యవ్వారం గురించి… ఆ మలయాళ ఒరిజినల్‌కూ దీనికీ అసలు సంబంధమే లేకుండా పోయింది… ఇష్టారాజ్యంగా కథను, కథనాన్ని మార్చేస్తూ, కొత్త పాత్రల్ని తెస్తూ, కొన్ని తొలగిస్తూ… ఏది తోస్తే అది తెలుగు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు… ఆ నల్ల పిల్ల ఏకంగా రంగుమారి తెల్ల స్త్రీ అయిపోయింది అంటేనే అర్థం చేసుకొండి… ఏ ప్రాంతీయ భాషలోనూ ఏ టీవీ సీరియల్‌కు లేనంతగా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు… […]

థియేటర్లలో థండర్ స్ట్రయిక్… టీవీల్లో మాత్రం మరీ బిచ్చపు రేటింగ్స్…

September 2, 2022 by M S R

kgf2

ఒకటికి పదిసార్లు కళ్లు నులుముకుని చూడాల్సి వచ్చింది… నిజమా..? కేజీఎఫ్-2 సినిమా రేటింగ్స్ మరీ అంత దయనీయమా..? హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ పరిశీలిస్తుంటే… కేజీఎఫ్- చాప్టర్2 సినిమా రేటింగ్స్ జస్ట్, ఆరున్నర మాత్రమే… ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే 6.53 మాత్రమే… ఏ దిక్కుమాలిన టీవీ సీరియల్ రేటింగ్స్ చూసినా దీనికన్నా బెటర్ అనిపిస్తాయి… హాశ్చర్యం ఎందుకంటే… ఇటీవల కాలంలో దేశంలోకెల్లా సూపర్ హిట్ సినిమా కేజీఎఫ్-2… థియేటర్లు దద్దరిల్లిపోయాయి… ప్రత్యేకించి సౌండ్ బాక్సులు… ఎగ్జిబిట్లర్లు, బయ్యర్లు, ప్రొడ్యూసర్ల […]

అదే ఆంటీకి రష్మికి నడుమ తేడా… ఓ ట్రోలర్‌కు జబర్దస్త్ జవాబు…

September 1, 2022 by M S R

rashmi

ఇద్దరూ బూతు షో జబర్దస్త్ యాంకర్లే మొన్నటివరకూ… అవకాశాల్ని బట్టి సినిమాల్లో బోల్డ్ కేరక్టర్లలో నటించినవాళ్లే… కానీ ఎంత తేడా..? అనసూయ అనసూయే… రష్మి రష్మియే… కొన్ని వేల మంది అనసూయ మీద డిజిటల్ దాడికి దిగితే ఒక్కరంటే ఒక్కరూ టీవీ ఇండస్ట్రీ నుంచి గానీ, సినిమా ఇండస్ట్రీ నుంచి గానీ తన సపోర్టుకు రాలేదు… అదీ తను సంపాదించుకున్న క్రెడిబులిటీ… పైగా ఎవరి జోలికీ వెళ్లని బ్రహ్మాజీ కూడా ఓ సూపర్ సెటైర్ వేసి పరువు […]

సుధీర్, రష్మి విడిపోయారు సరే… ఇమ్ము- వర్ష ఆ జంటకు ఆల్టర్నేటివా..?!

August 31, 2022 by M S R

varsha

థియేటర్లకు వెళ్లే రోజులు కావివి… అవి దోపిడీ కేంద్రాలు… బయట వినోదపార్కులు, రిసార్టుల ఖర్చు జేబుకు చిల్లు పెట్టేదే… అందుబాటులో ఉన్న ఏకైక వినోదం టీవీ… అందులోనూ న్యూస్ చానెళ్లు చూడలేం, ప్రత్యేకించి వాటిల్లో చెత్త డిబేట్లు చూస్తే ఎర్రగడ్డే దిక్కు… అసలు ఆ ప్రజెంటర్లే పెద్ద వైరసులు… సీరియళ్లకన్నా జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నయం… కాస్తోకూస్తో నచ్చినా నచ్చకపోయినా రియాలిటీ షోలే కాస్త చూడబుల్… వాటిని సైతం సినిమా ప్రమోషన్ల వేదికలుగా మార్చాక అవీ చూడబుద్దేయడం […]

హమ్మ మహేషా… ఇవీ వదలవా..? ప్రతి కదలికకూ కాసుల లెక్కేనా..?!

August 30, 2022 by M S R

mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు, బిడ్డ సితారతో పాటు ఓ టీవీ షోకు రావడం… అదీ ఓ తెలుగు చానెల్‌లో వచ్చే డాన్స్ షోకు…! సితార స్టెప్పులేయడం, మహేష్ బాబు మురిసిపోవడం.., ఓ ఇద్దరు డాన్సర్ల డాన్స్ చేసి, మీకు నా సినిమాల్లో చాన్స్ ఇస్తానని మహేష్ ఔదార్యం చూపించడం, వాళ్లు పరుగెత్తుకెళ్లి కాళ్ల మీద పడిపోవడం, ఈయన కౌగిలించుకోవడం… ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది… మామూలుగా మహేష్ బాబు మాటల్లో గానీ, ప్రెస్ మీట్లలో గానీ […]

సైలెంటుగా భలే పేల్చావు బ్రహ్మాజీ అంకుల్ … ఆంటీకి సెటైరిక్ కౌంటర్…

August 30, 2022 by M S R

brahmaji

కొద్దిరోజులుగా సదరు పొట్టి దుస్తులు, ఐటమ్ సాంగుల యాంకరిణి రచ్చ రచ్చ చేస్తోందిగా… నన్ను ఆంటీ అని పిలుస్తారురా, ఆఫ్టరాల్ నేను 37, అయితే ఆంటీని అయిపోయానా, ఇది ఏజ్ షేమింగ్ అని వీరంగం వేస్తోందిగా… ఇది నన్ను తిట్టినట్టే అంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుంది… తనను ట్రోల్ చేస్తున్న వాళ్ల మీద కనీసం దేశద్రోహం సెక్షన్లు పెట్టాలన్నంత కోపంతో ఊగిపోతోంది ఫాఫం… అంతేలే, ఆమె బాధ ఆమెకు జాతీయ సమస్య… అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ […]

ఈటీవీ ఢీ షోకు అదిరిపోయే పోటీ… విజయ్ దేవరకొండ, మహేశ్‌బాబు హంగామా…

August 29, 2022 by M S R

sitara

తెలుగే కాదు… ఏ భాషలో వచ్చే టీవీ డాన్స్ షోలైనా అంతే… సినిమా పాటలకు సర్కస్ ఫీట్ల వంటి పిచ్చి గెంతులు… ఈ విషయంలో వేరే అభిప్రాయం లేదు… ఇక విషయంలోకి వెళ్దాం… టీవీల్లో రియాలిటీ షోలకు సంబంధించి పోటీ విపరీతంగా పెరిగిపోయింది… అంటే డాన్స్, మ్యూజిక్, కామెడీ ఎట్సెట్రా షోలు… (నాన్-ఫిక్షన్, అంటే సీరియళ్లు గట్రా కాదు)… వీటిల్లో ఈటీవీ ఇప్పటిదాకా బలంగా ఉండేది… వావ్, క్యాష్, స్వరాభిషేకం, పాడుతా తీయగా, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా […]

సుధీర్‌ను మళ్లీ పట్టుకొచ్చారు… జస్ట్, ఈటీవీకి చుట్టపుచూపుగా మాత్రమే…

August 28, 2022 by M S R

sudigali

అవమానించారు… ఒక్కొక్క ప్రోగ్రామ్ నుంచీ కత్తెరపెట్టారు… ఉంటే ఉండు, పోతేపోవోయ్ అన్నారు… తీరా సుధీర్ బయటికి వెళ్లిపోయాక లెంపలేసుకుని, రా బాబూ రా ప్లీజ్ అని ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌లోకి తీసుకొచ్చారు… ఈటీవీ 27 సంవత్సరాల కార్యక్రమం ‘భలేమంచిరోజు’లో మాత్రమేనట… అంతేతప్ప, సుధీర్ ఏదో అర్జెంటుగా మళ్లీ జబర్దస్త్‌లో, ఢీలో, శ్రీదేవి డ్రామా కంపెనీలో దూరిపోతున్నాడని కాదు..! అంతెందుకు… వినాయకచవితిన ప్రసారం చేయబోయే ‘మనవూరి దేవుడు’ స్పెషల్‌లో అసలు సుధీర్ కనిపించడమే లేదు… (ప్రోమోల్లో)… ఈటీవీతో తనకు […]

ఆంటీ అంటే జైలే… చెల్లీ, బిడ్డా పదాలు బెటర్… లేదా ఈ లెజెండ్ వదలదు…

August 27, 2022 by M S R

anasuya

మరీ అనసూయ వంటి ఐటమ్ సాంగ్స్ చేసుకునే నటి వ్యాఖ్యలకు అంత ఇంపార్టెన్స్ ఏంటి సార్ అని విసుక్కున్నాడు ఓ మిత్రుడు… నిజమే, కానీ నిన్నంతా ఆమె వివాదమే ట్విట్టర్‌లో ట్రెండింగ్… బొచ్చెడు మీమ్స్ వెల్లువెత్తాయి… పైగా నవ్వు పుట్టించే తిక్క వాదన… దాదాపు ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియా సైట్లలోనూ ఆమె బెదిరింపులకు ప్రయారిటీ స్పేస్… ఓసారి చెప్పుకోవాలి… మరి తెల్లారిలేస్తే టీవీల్లో కనిపించి పలకరించే మొహం కదా… ఐనా మనం ప్రముఖ మేధావులు, సైంటిస్టులు, […]

ఈ ఏడు దినాల క్వారంటైన్ కథలేందిర భయ్..? బిగ్‌బాస్ స్పెషలా..?!

August 27, 2022 by M S R

biggboss6

వచ్చె, వచ్చె… పాయె పాయె… దీపిక పిల్లి ఈసారి బిగ్‌బాస్‌లో ఖాయం, మస్తు పైసలు ఇస్తామన్నారట… అరెరె, కాదు, కాదు, ఆమె ప్లేసులో వర్షిణిని తీసుకుంటారట… అసలు ఉదయభానును తీసుకోవడం దాదాపు ఫైనల్ అయిపోయి, చివరకు ఆగిపోయింది… ఇలా ఇప్పటికి అన్ని సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కలిసి ఓ వంద మందిని సెలెక్ట్ చేశాయి, తీసేశాయి, ఇంకా రాసేస్తూనే ఉన్నాయి… ఏదో వీళ్ల ఆత్రం గానీ నిజానికి ఇప్పటికి ఆ లిస్టు ఫైనల్ కానేలేదు… ఫైనల్ అయ్యి […]

TV9 నుంచి వెళ్లిపోయినవాళ్లూ మళ్లీ వచ్చేయండి… ఎందుకట..?!

August 25, 2022 by M S R

media

టీవీ9 నుంచి వెళ్లిపోయిన మురళి మళ్లీ వచ్చాడట… అవున్నిజమే… వెళ్లిపోయిన మరికొందర్ని కూడా రమ్మంటున్నారట… అవున్నిజమే… కానీ ఎందుకు..? అనవసరంగా వర్కర్లను పంపించేశామనే ఆత్మమథనం ఏమైనా ఉందా యాజమాన్యంలో..? ఇప్పటిదాకా అనవసరంగా కొందర్ని నమ్మి, టీవీ9ను రెండో ప్లేసుకు పడేశామా అనే బాధ ఉందా..? చక్కదిద్దుకుంటోందా..? నిజానికి ఇదేనా చక్కదిద్దుకునే మార్గం..? ఇంతకుమించి యాజమాన్యానికి సమర్థ నిర్వహణ దిశలో ఇంకేమీ చేతకాదా..? రకరకాల కారణాలతో టీవీని వీడివెళ్లిపోయినవాళ్లు అదే వ్యవస్థ నడుస్తుంటే మళ్లీ ఎందుకు వస్తారు..? ఏం […]

అనసూయ మళ్లీ గోక్కుంది… ఈసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో…

August 25, 2022 by M S R

anasuya

అనసూయకి గోకుడు ఎక్కువ… ఏదో ఒకటి గోక్కోవడం అలవాటే తనకు… ఈసారి సమయానికి ఏదీ దొరకలేదేమో… అయిదేళ్ల నాటి, అంటే అర్జున్ రెడ్డి సినిమా నాటి ఓ ఇష్యూను యాదికి తెచ్చుకుంది… ఇప్పుడు లైగర్ ఎదురుతన్నింది కదా మార్కెట్‌లో… ఇక కసితీరా ఓ ట్వీట్ పెట్టింది… ‘‘అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు, కర్మ… కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కాని రావడం మాత్రం పక్కా!!’’ అనేది ట్వీట్… నేరుగా ఇది లైగర్ రిజల్ట్ మీదే అని పెట్టలేదు… […]

  • « Previous Page
  • 1
  • …
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions