మూవీ క్రిటిక్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి డౌటనుమానం ఏమిటంటే…? ‘‘అసలు బిగ్‌బాస్ నుంచి అరియానాను ఎలిమినేట్ చేసినట్టు సమాచారం ఉంది… మరి అందరూ మోనాల్‌ను బయటికి పంపించేసినట్టు రాస్తున్నారేం..? నాకొచ్చిన సమాచారం తప్పా..? అందరూ రాసేది తప్పా..?’’ నిజంగా కాస్త థింకాల్సిన విషయమే… ఎందుకంటే..? నిన్నటి ఎపిసోడ్ చూస్తున్నంతసేపూ… నాగార్జున సొహెల్‌ను సపోర్ట్ చేస్తూ, అరియానాకు అడ్డగోలుగా క్లాస్ పీకుతున్నప్పుడే చాలామందికి డౌటొచ్చింది అలా… నిజమే, కుక్కపిల్ల బొమ్మ విషయంలో మరీ ఓవర్ చేసింది… […]
ఇక మోనాల్ అక్కడ అక్కర్లేదు… బయటికి పంపించేయండి బాస్…
చివరికి బిగ్‌బాస్ క్రెడిబులిటీ ఎంత పాతాళానికి చేరిందీ అంటే… మోనాల్‌ను ఎలిమినేట్ చేసేశారు అని రాసినా ఎవరూ నమ్మలేని పరిస్థితి… ఎహెఫో, ప్రతిసారీ అలాగే అంటారు… ప్రతిసారీ ఆమెను బయటికి పంపించేయండ్రోయ్ అని ప్రేక్షకులు కోరుతూనే ఉంటారు… ప్రతిసారీ అందరికన్నా తక్కువ వోట్లు వస్తాయి… ఐనా ప్రతిసారీ ఆమెను బిగ్‌బాస్ సేవ్ చేస్తూనే ఉంటాడు… మేమెందుకు నమ్మాలి అంటారు జనం… నిజమే… ప్రజలు వేసే వోట్లతో సంబంధం లేదు… బిగ్‌బాస్ ఏది అనుకుంటే అదే… ఆమెతో కుదిరిన […]
ఫాఫం, వర్షిణి ఔట్… దీపిక పిల్లి ఇన్… అప్పుడే హైపర్ ఆది పులిహోర…
మీరు సంగీతం… నృత్యం… కామెడీ… ఏ టీవీ షో అయినా తీసుకొండి… గ్లామర్ మసాలా మస్ట్… లవ్ ట్రాకులూ మస్ట్… అవి లేకపోతే టీవీ షోలు రక్తికట్టవు అని మన టీవీ షోల నిర్మాతల అభిప్రాయం… యాంకర్లు, మెంటార్లు, టీం లీడర్లు… పేరు ఏదయితేనేం… బోలెడుమంది రూపగత్తెల్ని తీసుకురావడం… ఏవేవో ట్రాకుల్లో ముంచి కథ నడిపించడం ప్రజెంట్ ట్రెండ్… చివరకు షో ఫ్లాపయితే ఫస్ట్ బకరాలయ్యేది కూడా వాళ్లే పాపం… నాగబాబు ఫ్లాప్ షో అదిరింది తెలుసు […]
ఆరియానా తిక్క వాదన… ప్రొమో మైనస్… హుందాగా అభిజిత్…
ఆట… పోటీ… యాక్షన్ పరిమితి మేరకు మాత్రమే ఉండాలి… గెలుస్తున్నాం కదాని ఓవరాక్షన్ చేస్తే… అది కూరలో ఉప్పు ఎక్కువైనట్టుగా ఇసం అయిపోతుంది… ప్రత్యేకించి బిగ్‌బాస్ ఆటలో చాలామంది బోల్తాకొట్టింది ఈ ఓవరాక్షన్‌తోనే… 14 వారాలు బిగ్ హౌస్‌లో గడిపినా సరే, ఆరియానాకు ఈ తత్వం బోధపడినట్టు లేదు… ఈరోజు ఆటలో ఆమె వాదన చూసి ప్రేక్షకులు బిత్తరపోయారు… ఏమిటీ ఫూలిష్ వాదన, తలాతోకా లేకుండా మాట్లాడుతున్నదేమిటి అనుకున్నారు… ఇటీవల తన ఆటతో గెలుచుకున్న ప్లస్ అంతా […]
SUN TVతో Jr NTR సూపర్ అగ్రిమెంట్… ముచ్చట Exclusive Story…
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్ షూటింగు తరువాత జూనియర్ ఎన్టీయార్ ప్లాన్ ఏమిటి..? బాహుబలి తరువాత ఆ స్థాయిలో రాజమౌళి తీసే ఆ సినిమా సంగతి కాసేపు ఇక పక్కన పెట్టేయండి… జూనియర్ దక్షిణ భారతంలో ఇంటింటికీ చేరగల ఓ భిన్నమైన ప్రాజెక్టు మీద సంతకం చేశాడు… నిజంగా తనకు పెద్ద ప్లస్… జస్ట్, ఇలా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు గుమ్మడికాయ కొట్టేయడం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు స్టార్ట్ కావడం… వావ్… అందరూ అనుకుంటున్నట్టు అది ఏ పాన్ […]
ఓ బక్కపిల్ల… ఓ కుక్కపిల్ల..! బిగ్‌బాస్‌నే ఆడిస్తున్నది ఈ చిన్నబొమ్మ..!!
ఓ చిన్న కుక్కపిల్ల బొమ్మ… దాన్ని ఏదో సందర్భంలో అరియానా అనే కంటెస్టెంటుకు బహూకరించింది కూడా బిగ్‌బాసే… దానికి ఓ పేరు కూడా పెట్టారు… చింటూ…! ఆ బక్క పిల్ల ఈ కుక్కపిల్ల ప్రేమలో పడింది… అనగా బంధాన్ని పెంచుకుంది… పెట్స్ మాత్రమే కాదు, చాలామంది పెట్స్ పోలిన బొమ్మల్ని కూడా ఇష్టపడతారు… ముచ్చట్లు చెప్పుకుంటారు… తమలోని ఒత్తిడిని ఎగ్జాస్ట్ చేసుకునే మెథడ్ అది… అసంకల్పితంగానే అలా చేస్తుంటారు… ఆ అరియానా బొమ్మ ఇప్పుడు బిగ్‌బాస్‌లో చిచ్చు […]
అక్కినేని నాగార్జునకు ఈ సీరియల్ ఓసారి నిర్బంధంగా చూపించాల్సిందే…
ఎవరినైనా చంపాలనేంత కోపంగా ఉందా..? చంపేయాల్సిందేనా..? ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్‌కు గానీ, జీతెలుగు హెడ్డాఫీసుకు గానీ ఫోన్ చేయండి… సతీ త్రినయని సీరియల్ స్క్రిప్టు రైటర్ నెంబరు గానీ, దర్శకుడి నంబరు గానీ అడగండి… వాళ్లు మీకు ఓ కెమికల్ పేరు చెబుతారు… దాన్ని ఏదైనా పూల బొకే మీద స్ప్రే చేసి, మీ టార్గెట్ నివసించే రూంలోకి చేర్చండి… ఫినిష్… అది పీల్చీ పీల్చీ వాడే చస్తాడు మూడునాలుగు రోజుల్లో…! మీ చేతికి ఏ మట్టీ […]
మాటీవీ, జీటీవీ అట్టర్ ఫ్లాప్… ఈ జానర్లలో ఈటీవీని కొట్టే టీవీయే లేదు…
వ్యాపారమే… దందాయే… ఇదీ వినోద వ్యాపారమే… ఏ వినోద చానెల్ చేసేదైనా కళామతల్లి సేవ ఏమీ కాదు… నిఖార్సయిన కాసుల వేట మాత్రమే… మంచి రేటింగ్స్ పడాలి… మంచి యాడ్స్ పడాలి… డబ్బుల కట్టలు పడాలి… అంతే… అదే టార్గెట్… సీరియల్స్ అయినా అంతే… రియాలిటీ షోలు అయినా అంతే… కానీ ఈటీవీని ఒకందుకు మెచ్చుకోవాలి… మాటీవీ, జీటీవీ పెద్ద ఎచ్చులకు పోతాయి గానీ… ఈరోజుకూ కామెడీ, డాన్స్, సాంగ్స్ అనే జానర్లలో ఈటీవీ దరిదాపుల్లోకి కూడా […]
ఆటలో కోపం అదుపు తప్పితే… ఇదుగో, ఇలా ఏడుపురాగమే సోహెల్…
తనలోని కోపాన్ని క్రమేపీ కంట్రోల్ చేసుకుంటూ… మంచి స్నేహశీలిగా తనను తానే ఆవిష్కరించుకుంటూ కొద్దిరోజులుగా బిగ్‌బాస్‌లో దూసుకుపోయి, ఒక దశలో రన్నర్ అప్ అవుతాడు అనిపించుకున్న సొహెల్ ఒక్కసారిగా తన అవకాశాల్ని తనే చెడగొట్టుకుంటున్నాడు… కీలకమైన తరుణంలో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు… అఖిల్, అవినాష్, అభిజిత్‌లతో వ్యవహరించే తీరుకూ అరియానా, హారిక, మోనాల్‌తో వ్యవహరించే తీరుకూ నడుమ తేడా చూపకపోతే ఎలా..? లేడీ కంటెస్టెంట్లతో మన ధోరణిని ప్రేక్షకులు జాగ్రత్తగా అంచనా వేస్తారు… అది మరిచిపోయాడు సొహెల్… […]
3 రోజుల గ్రాండ్ ఫినాలే… అదిసరే, నాగార్జున పేరిట అన్ని అబద్ధాలా..?!
ప్రిన్స్ మహేశ్ బాబు బిగ్‌బాస్ ఫినాలేకు ముఖ్య అతిథి అంటున్నారు… అంతేకాదు… మునుపెన్నడూ లేనట్టుగా ఈసారి ఫినాలే ఏకంగా మూడు రోజులు ప్రసారం చేస్తారట..! చేయవచ్చు… అసలు ట్రెండ్ కూడా అదే… ఆఫ్టరాల్ ఢీ చాంపియన్స్ వంటి ఫైనల్సే… ఏ ముఖ్య అతిథీ లేకుండా రెండు భాగాలు చేసి మరీ, వారం గ్యాప్‌తో ప్రసారం చేసినప్పుడు… ఇదే బిగ్‌బాస్ వీకెండ్ షోలు రెండేసి రోజులు ప్రసారం చేస్తున్నప్పుడు… గ్రాండ్‌గా ఫినాలే నిర్వహిస్తే, దాన్ని మూడు రోజులు వరుసగా […]
వావ్… పిసుకుడు బాంబులు… మన టీవీ సీరియళ్ల టెర్రిఫిక్ క్రియేషన్…
రాస్తే రాశావులే గానీ, మరీ నువ్వు రాసినంత దరిద్రంగా ఏమీలేవు మన తెలుగు టీవీ సీరియళ్లు… అందులో సరుకు, దమ్ము లేనిదే కోట్ల మంది ఆడ లేడీస్, ఒక్కొక్క సీరియల్‌ను ఏళ్లుగా చూస్తారా..? మరీ ఈ వెటకారపు విమర్శలు దేనికి అని ఒకాయన బాగా ప్రేమగా మందలించాడు… ఒక సీరియల్ సజెస్ట్ చేశాడు… సరే, ఏదయితే అదయిందీ… కలకాలం బతకడానికి ఏమీ రాలేదు కదా.., ఇదేమైనా కరోనా వైరసా ఏం..? ఇన్నికోట్ల మంది లేడీస్‌కు ఏమీ కానిది […]
ఎవరూ తక్కువ అంచనా వేయకండి… ఆమె పేరు అరియానా…..
ఈమధ్య ఎవరో రాంగోపాలవర్మను అడిగారుట… బిగ్‌బాస్‌లో అరియానా పర్ఫామెన్స్ చూస్తారా అని… ఆ షో చూడను, నాకు ఐడియా లేదు, కానీ అరియానాను మాత్రం వదలను, వచ్చే ఏదో ఓ సినిమాలో హీరోయిన్ తనే అన్నాడట… నిజానికి ఓసారి ఇంటర్వ్యూ కోసం వెళ్తే, నిన్ను బికినీలో చూడాలని ఉంది అని హఠాత్తుగా ఓ అశ్లీలపు, అసభ్యపు కామెంట్ విసిరాడు వర్మ… సరే, వర్మ అంటేనే మెంటల్ కదా… దానికి ఆమె ఓసారి షాకై, తరువాత కూల్‌గా థాంక్స్ […]
ఆరిపోతున్న కార్తీకదీపం…! మా దాటేసి దుమ్మురేపుతున్న జీ సీరియల్స్…
మీరు గమనించారో లేదో…. ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్ అంటే తెలుగునాట ఫుల్ పాపులర్…. అదిప్పుడు గాలితీసిన బెలూన్… రోజురోజుకూ ఇంకా పెంటపెంట చేసేస్తున్నాడు ఆ సూపర్ దర్శకుడు ఎవరో గానీ…!! పాపం, ఆయనకు స్టార్ మాటీవీ ఎల్లప్పుడూ రుణపడి ఉండు గాక…. అసలు తెలుగు టీవీ సీరియళ్లు అంటేనే పరమ దరిద్రమైన క్రియేటివ్ వర్కుకు కేరాఫ్ అడ్రసులు… ఆ గొంగట్లో వెంట్రుకలు ఏరడం కష్టమే గానీ… కార్తీకదీపం లెవల్ చెత్తా సీరియల్ సమీప భవిష్యత్తులో మళ్లీ రాకపోవచ్చు… […]
నేడు మీదే – రేపు మాదే..! అదరగొట్టేసిన ఆరియానా… హారిక అట్టర్ ఫ్లాప్…
అవునూ… బిగ్‌బాస్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా మహేశ్ బాబు వస్తున్నాట్ట నిజమేనా..? ఏమోలే, వచ్చినప్పుడు చూద్దాం, రాసుకుందాం, చెప్పుకుందాం… కానీ ఈరోజు నామినేషన్ల సంగతి ఏమైందీ అంటారా..? ఏముందీ..? ఈ నామినేషన్ల ప్రక్రియ నావల్ల కాదు… మళ్లీ గంటల కొద్దీ మైండ్ లేకుండా ఒర్లుతారు, నాకే వశపడతలేదు, ఇక ఫాఫం, ప్రేక్షకులు ఇంకా ఏం భరిస్తారు అని బిగ్‌బాస్ భావిస్తున్నట్టుగా…. ఈసారి అందరినీ నామినేట్ చేసిపడేశాడు తనే… ఇక మీ చావు మీరు చావండి, ప్రేక్షకుల దయ, మీ […]
బక్క పిల్ల, పొట్టి పిల్ల, నార్త్ పిల్ల… ఇక ఫైనల్ వేటు ఎవరి మీదో..?!
ఎప్పుడైనా వీలయితే ఎన్టీయార్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ వీకెండ్ షోలు చూడండి… రచ్చ రచ్చ… బ్రహ్మాండమైన వినోదం పంచింది ఆ సీజన్… ఎన్టీయార్ టీవీ హోస్టింగు ఫస్ట్ టైమే అయినా చింపేశాడు… మరి ఇప్పుడు..? పదిన్నర కోట్ల ఓట్లు అని గప్పాల్ కొట్టినా సరే…. మరీ ఈ నాలుగో సీజన్ పేలవంగా, మరీ రాంగోపాల్‌వర్మ తీసిన ఆఫీసర్ సినిమాలాగా ఉసూరుమనిపిస్తోంది… నాగార్జున తప్పేమీ కాదు… వర్క్ చేస్తున్న టీం అసమర్థత… ఎంచుకున్న కంటెస్టెంట్లు మరో […]
గుజరాతీ రాజకుమారి కోసం మరొకరు బలి… ఈసారి అవినాష్…!
….. గతంలో చాలాసార్లు జరిగిందే… జనమేమో మోనాల్ గుజ్జర్‌కు తక్కువ వోట్లు వేస్తారు… అంటే ఇక ఫోవమ్మా తల్లీ అన్నమాట… కానీ బిగ్‌బాస్ ఆమెను సేవ్ చేస్తాడు… ఎలాగంటే..? ఎవరికెన్ని వోట్లు వచ్చాయో తనెవరికీ చెప్పాల్సిన పనిలేదు కదా… తను ఇష్టమున్నవాళ్లను పంపించేస్తాడు, లేదా ఉంచేస్తాడు… ఆ వోట్ల లెక్కింపుకి ఏ థర్డ్ పార్టీ ఉండదు కదా… మోనాల్ తను ఇచ్చిన స్క్రిప్టు మేరకు నటించగలదు… లవ్ ట్రాకులు నడిపించగలదు… తన పాత్రలో తను జీవిస్తుంది… అభిజిత్ […]
అయ్యబాబోయ్… నాగబాబోయ్… ఇదేం కామెడీ దేవుడోయ్…
ఎప్పుడైనా కపిల్ కామెడీ షోలు చూశారా…? భారతీయ వినోదరంగాన్ని శాసించే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో షోలు చేయడం మాత్రమే కాదు… పెద్ద పెద్ద తలకాయలు కూడా తన షోలకు అతిథులుగా వచ్చేస్తుంటారు… ఓ పేద్ద సమూహాన్ని, సమావేశాన్ని ఫేస్ చేస్తూ… అందరినీ నవ్వించే కామెడీ చేయగలడు… ఎక్కడా వీసమెత్తు అసభ్యత, అశ్లీలం ఉండదు… మనసారా నవ్వుకునేలా ఉంటుంది… తను వేసే సెటైర్లు కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు… అలా స్టాండప్ కామెడీ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు… చాలా […]
మైండ్‌లెస్ బిగ్‌బాస్… వైరాగ్యంతో వదిలేసిన అభిజిత్… చివరకు జైలుపాలు…
ఈసారి బిగ్‌బాస్ సీజన్ అంతా అభిజిత్ వర్సెస్ బిగ్‌బాస్ అన్నట్టుగానే సాగుతోంది… హౌస్ లోపల అఖిల్‌తో ఎప్పుడూ ఏదో కాన్ఫ్రంటేషన్… ఇక లోలోపల బిగ్‌బాస్‌తోనే ఘర్షణ… కానీ ఎప్పుడూ తను రాజీపడలేదు… తన ఆలోచనల మేరకు తను అడుగులు వేస్తున్నాడు… ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్లిపోవడానికి సిద్ధం అన్నట్టుగా ఉంటాడు ఎప్పుడూ… దాదాపు 12 సార్లు నామినేషన్లలో ఉన్నాడు… ప్రతిసారీ భారీగా ప్రేక్షకుల మద్దతు లభిస్తూనే ఉంది… ఇప్పుడు మళ్లీ మరోకోణంలో బిగ్‌బాస్ చెప్పిన టాస్కును తనంతట […]
తొలిసారి బిగ్‌బాస్ ధగధగ… ఆగిపోయేముందు రేటింగ్స్ వెలుగు..!
దీపం ఆరిపోయే ముందు వెలుతురు ఎక్కువ అంటారు కదా… నెగటివ్‌గా మాత్రమే తీసుకోనక్కర్లేదు… అప్పుడప్పుడూ దాన్ని పాజిటివ్ అంశానికీ వర్తింపజేసుకోవచ్చు… ఉదాహరణకు బిగ్‌బాస్… ఈ బాస్ షో అయిపోయే ముందు trp ధగధగ అంటోంది… తొలిసారిగా కాస్త చెప్పుకోదగిన నంబర్ కనిపిస్తోంది రేటింగ్స్ లో… ఈమేరకు నాగార్జున ఖుషీ అయిపోవాలి… ఇన్నిరోజులు 8 కోట్లు, 9 కోట్లు, 9.5 కోట్ల ఓట్లు అని వీకెండ్ షో వేదికల మీద ఎన్ని గప్పాలు కొట్టుకున్నా సరే, నిజానికి లెక్కకు […]
ఒకవేళ అఖిల్‌ను జనం ఎలిమినేట్ చేస్తే… ఫినాలే మెడల్ గతేమిటి..?!
ఒక ప్రశ్న… ‘అఖిల్‌ను గనుక ప్రేక్షకులు ఈవారం ఎలిమినేట్ చేస్తే… తను గెలుచుకున్న ఫినాలె మెడల్ పనికొస్తుందా..? లేదా..? అప్పుడు ఫినాలె మెడల్‌కు ఉన్న విలువ ఎంత..? ఉపయోగం ఎంత..? అసలు ఒకవైపు అయిదుగురు నామినేషన్ జాబితాలో ఉన్నప్పుడు, ఈ ఫినాలె మెడల్ టాస్కు పెట్టడంలో తెలివి ఎంత..? ఇక ఈసారి బిగ్‌బాస్ బుర్రలేని ధోరణి ఇక ఆగదా..?’ ఈ ప్రశ్నకు సరైన సమాధానాలు ఇవ్వగలిగిన వారిని నేరుగా ‘వైల్డ్ కార్డ్ ఫైనలిస్టు’గా ప్రకటిస్తామహో…. పైన పేరా […]