. కన్నీటితో తడిసిన కరెన్సీ కాగితాలు… ఓ తండ్రి ఆవేదన… ఆ రోజు, శివకుమార్ జీవితంలో చీకటి రోజు… ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో చదివి, కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతురాలిగా ఎదిగిన తన ముద్దుల కూతురు అక్షయ శివకుమార్ (34), మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్) కారణంగా హఠాన్మరణం చెందింది… ఒక మాజీ BPCL CFO (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా, అత్యున్నత స్థానంలో పనిచేసి […]
మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్… మరో మాట లేకుండా చప్పట్లు కొట్టేయడమే…
. మూకీ సినిమా శకం ముగిశాక… టాకీలు అడుగెట్టాక… డైలాగులు మాత్రమే లేని సినిమా ప్రయోగం పుష్పక విమానం… కమలహాసన్, అమల, సింగీతం శ్రీనివాసరావు కాంబో… సింగితం భిన్న ప్రయోగాలకు పేరు… తను సంగీత దర్శకుడు కూడా… ఈ ప్రయోగం ఇదే మొదలు, ఇదే చివరి అనుకుంటున్నాం కదా… కానీ కాదట… . ఐతే… సేమ్, అలాంటిదే మరో సినిమా వచ్చింది… 2002 లో… మిస్టర్ లోన్లీ, మిస్ లవ్లీ అనేది సినిమా పేరు… అందులో నోబెల్ […]
చైనా సైబర్ మాఫియా..! ఆ చెరలో వందలాది భారతీయులు గిలగిల..!
. నిన్నటి ఓ వార్త… చైనా సైబర్ గ్యాంగ్ బందీలుగా 500 మంది భారతీయులు… చైనా మాఫియాకు చెందిన కెకె పార్క్ సైబర్ క్రైమ్ సంస్థలో పనిచేసే 500 మంది భారతీయులు ఇప్పుడు థాయ్‌లాండ్‌లో బందీలయ్యారు… వీరిని సురక్షితంగా భారత్‌కు రప్పించేందుకు విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది… కేకే పార్క్ కంపౌండ్ పేరిట మయన్మార్‌లో వెలిసిన ఓ సైబర్ క్రైమ్ మాఫియాలో చిక్కుకున్న బాధితులు వాళ్లు… ఆర్మీ దాడులు చేసేసరికి వందలాది మంది బ్యాంకాక్‌కు పారిపోయారు… ఇంకేం చేయాలో […]
జెమీమా రోడ్రిగ్స్..! ఓ తిలక్ వర్మ… ఓ రోహిత్ శర్మ… ఓ విరాట్ కోహ్లీ…!!
. What a match …. మగ జెంట్స్ క్రికెట్ అంటేనే ఇండియాలో క్రేజ్… ఆడ లేడీస్ క్రికెట్ అంటే ఓ తేలికభావం… కానీ ఈరోజు ఆస్ట్రేలియా మీద వుమెన్ క్రికెట్ జట్టు గెలిచిన తీరు, ప్రపంచ్ కప్ ఫైనల్‌కు చేరిన తీరు అపూర్వం… అపురూపం… మామూలుగా కాదు, గతంలో ఎప్పుడూ లేనంతగా… ఏకంగా 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే మాటలా..? చేశారు… వావ్ అవర్ వుమెన్ క్రికెట్ జట్టు… సాలిడ్ గేమ్… ఎక్సట్రా ఆర్డినరీ […]
ఫాఫం కన్నప్ప… ఇంకా ఫాఫం రజినీకాంత్… పూర్ టీవీ రేటింగ్స్…
. కన్నప్ప మీద రిలీజ్ మొదట్లో బాగా హైప్ వచ్చింది, హమ్మయ్య, ఇక ఇది సక్సెసయినట్టే అనుకున్నారు అందరూ… ప్రభాస్ పుణ్యమాని సినిమాకు కాస్త మంచి పేరు, ఐమీన్, మంచి మౌత్ టాక్ వచ్చినట్టే అనుకున్నారు… తీరా చూస్తే ఏమైంది..? మనం ముందు నుంచీ చెప్పుకుంటున్నట్టే…. కథను మరీ ఓవర్ క్రియేటివిటీతో మరీ కేజీఎఫ్, బాహుబలి తరహాలో పొల్యూట్ చేశారు… కన్నప్ప కథ వేరు, దానికి ఆధ్యాత్మిక ఫ్లేవర్ కావాలి… నానా భాషల స్టార్లతో సంకరంతో కథ […]
ట్రంపులమారి మళ్లీ ఏసేశాడు… అసలు ట్రేడ్ డీల్ చిక్కులేమిటంటే..?!
. ఏసేశాడు, మళ్లీ ఏసేశాడు…. ఈ ఫేమస్ డైలాగ్ అందరికీ పరిచయమే కాదు… దీన్ని వాడే సందర్భాలు వేర్వేరు, మీమ్స్‌లో మాత్రం ప్రధానంగా కామెడీ, సెటైర్, వెక్కిరింపుకే వాడుతుంటారు కదా… ఎస్, ట్రంపు ఏం మాట్లాడినా అది కామెడీయే అయిపోతోంది… వాచాలత్వపు కూతలు రోజురోజుకూ తను అసలు ఓ అగ్రదేశం అధ్యక్షుడేనా..? తెలుగు సినిమా లేక జబర్దస్త్ కమెడియనా అనేలా ఉంటున్నాయి… తాజాగా ఏమంటున్నాడంటే..? ‘‘నిజాయితీగా చెప్పాలంటే, ప్రధాని మోడీ అందంగా కనిపిస్తాడు, (nicest-looking guy)… మా […]
ఆ గ్రామీణ ఆర్టీసీ బస్సులు పుష్పక విమానమంత అద్భుతాలు..!!
. ఏసి స్లీపర్ బస్సు ప్రమాదాల నుండి ఏమి నేర్చుకుంటున్నాం..? ఇది 1975- 80ల నాటి సంగతి. అప్పుడు మా లేపాక్షిలో బస్ స్టాండ్ ఉండేది కాదు. రోడ్డు పక్కన చెట్టు కింద బస్సు కోసం జనం నిరీక్షిస్తూ ఉండేవారు. దాంతో బస్సు అక్కడ మాత్రమే ఆగేది. అందువల్ల దాన్ని బస్ స్టాండ్ అని భ్రమపడి అందరూ అనడంతో అదే బస్ స్టాండ్ గా చలామణి అయ్యింది. అక్కడ కూర్చోవడానికి బెంచీలు ఉండవు. ఎండలో ఎండాల్సిందే. వానలో […]
గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!
. గ్రేట్ నికోబార్… పేరు ఎప్పుడైనా విన్నారా..? కేంద్రం చేపట్టిన ఓ బృహత్ ప్రాజెక్టు ఇది… పర్యావరణానికి తీవ్ర హాని చేస్తుందనీ, ఆపేయాలని 70 మంది మేధావులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు లేఖ రాశారు… అవునవును, వాళ్లు నిజమే చెబుతున్నారని కాంగ్రెస్ మేధావి జైరాం రమేష్ వత్తాసు… వాళ్ల అభ్యంతరాల్లో ముఖ్యమైనవి… 1) ఇది వనరుల దోపిడీ… 2) పర్యావరణ నష్టం… 3) సామాజిక విపరిణామాలు… 4) నిబోబారిస్, షోంపేన్ వంటి సున్నితమైన ఆదివాసీల మనుగడకు […]
ఎవరు ఈ ధూల్‌పేట లేడీ గంజాయ్ డాన్ అంగూర్ బాయ్..?
. ఈరోజు పత్రికల్లో చిన్నగా ఎక్కడో కనీకనిపించనట్లుగా ఉంది ఓ వార్త… ఒక లేడీ డాన్ మీద ప్రభుత్వం పీడీ యాక్ట్ పెడితే, ఆమె కోర్టుకెక్కితే… పీడీ యాక్ట్ సమర్థనీయమే, తప్పులేదు అని హైకోర్టు కొట్టేసింది ఆమె పిటిషన్‌ను… ఇదీ ఆ వార్త సారాంశం… హైదరాబాదులో పెద్ద లేడీ డాన్ అట, ఇంతకీ ఎవరబ్బా ఆమె..? ఆరా తీస్తే పెద్ద చరిత్రే ఆమెది… పెద్ద గంజాయి నెట్వర్క్… ధూల్‌పేట అడ్డా… పేరు అంగూర్ బాయ్ (అలియాస్ అరుణ […]
మామా ఏక్ పెగ్‌లా… లాటరీలలో చిక్కిన చక్కని కిక్కు చుక్కలు!
. ముందుగా ఒక డిస్ క్లైమర్. ఇది లిక్కర్ కు సంబంధించిన విషయం కాబట్టి పరిభాషలో, భావంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే విశాల ద్రవహృదయంతో అనుభవరాహిత్యంగా, అభినివేశరాహిత్యంగా అర్థం చేసుకోగలరు. తెలంగాణాలో మద్యం దుకాణాలకు బాధ్యతగల ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా తీసిన లాటరీల్లో దుకాణాలు వచ్చినవారి కళ్ళల్లో ఆనందాన్ని ఇన్నేళ్ళల్లో ఎప్పుడూ లేనంతగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాకూడా అత్యంత ఉత్సాహంగా పోటీలుపడి రిపోర్ట్ చేసింది. ఒకే ఇంట్లో ఒకే […]
రుబాయీకి ఓ పద్ధతి, ఓ సొగసు ఉంటయ్… అవహేళన చేయకండి దాన్ని..!!
. Rochish Mon …. రుబాయీ (పుంసత్వంతో) ———- కనీసం ‘రుబాయీ’ అని అనడం కూడా ‘చాతకాని’ (రుబాయి అనడం చదువులేమి) తెలుగు నపుంసకత్వం వల్లా, రుబాయీ అంటూనూ, రుబాయి అంటూనూ ఏదో, దేన్నో రాస్తున్న తెలుగు నపుంసకత్వం వల్లా తెలుగులో రుబాయీ అన్న ప్రక్రియ పూర్తిగా వికారమైపోయింది; విదూషకత్వం అయిపోయింది. “నేను ఏదో రాసి దాన్ని రుబాయీ అంటాను” అని సిగ్గులేకుండా బహిరంగంగా చెప్పుకున్న పెన్నా శివరామకృష్ణ (ఇతడి ఆ ఉవాచ స్క్రీన్ షాట్ నా దగ్గర […]
పగ రాజకీయాలు..! రేవంత్ రెడ్డిని చూసి కవిత నేర్చుకోవాలి కొన్ని..!!
. ఒక వ్యక్తిని విమర్శించాలనో, పొగడాలనో ఇది రాయలేదు… నా వృత్తిలో భాగంగా రాజకీయ నిత్య విద్యార్థిగా గమనించి రాస్తున్నాను. రాజకీయంలో వ్యూహ ప్రతివ్యూహాలు, విద్వేష విద్రోహాలు ఉంటాయి… ఉండాల్సిందే. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ వ్యూహం వాడాలి… ఎలా వాడాలి… ఎందుకు వాడాలి… అన్నది తెలిసిన వారే అసలైన రాజకీయ విజ్ఞాని. ఈ మధ్య బాగా డబ్బులుండో, తాతలు తండ్రులు సంపాదించిన పేరు ప్రతిష్టల వల్లో, నాలుగు మాటలు నాలుగు భాషల్లో ప్రాసగా మాట్లాడితే చాలన్న మిడిమిడి జ్ఞానమో తెలియదు […]
విషసర్పాలు, బుడ్డెరఖాన్లు… హైదరాబాద్ ప్రెస్ దుర్వాసనలు..!!
. నిజం… ఈసారి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో డబ్బు, కులం, మతం, ప్రాంతం, ఇతరత్రా ప్రభావాలూ, ప్రలోభాలు కూడా నిజం, అక్రమాలు నిజం… తమ సొంత వ్యవస్థల దుర్వినియోగమూ నిజం… స్థూలంగా ప్రెస్ క్లబ్ ఎన్నికల తంతు దారితప్పిందనేదీ నిజం… నేనిక్కడ విజేతలు, పరాజితుల గుణాల్ని అంచనా వేయడం లేదు, విమర్శించడం లేదు… కానీ ఓ ప్రెస్ క్లబ్ ఎన్నికలు మరీ ఇంత దిగజారాలా..? హఠాత్తుగా ఆంధ్రాలో సెటిలైన జర్నలిస్టులకు ఓటు హక్కు ఏమిటి..? గత ఏడాదికీ […]
ఆకుపూజ చేయించారా..? పారేయకండి… ఔషధాహారం చేయొచ్చు…
. నిజమే… ఏదో గ్రూపులో చూశాను ఈ పోస్టు… చాన్నాళ్లయింది, సరిగ్గా గుర్తులేదు… అకస్మాత్తుగా కనిపించింది… Sundari Vedula పోస్టు… ఎందుకు ఇంట్రస్టింగు అనిపించిందంటే…. చాలామంది హనుమంతుడికి ఆకుపూజ చేయిస్తుంటారు… ఆ తమలపాకులు మనం ప్రసాదంగా తెచ్చుకుంటాం… వాటిని ఏం చేసుకోవాలి… ఎవరికి పంచిపెట్టినా ఎవరూ తీసుకోరు, తీసుకున్నా వాడరు… ఇప్పుడు తాంబూలం ఎవరు వేసుకుంటున్నారు గనుక… అందుకే ఆరోగ్యం కూడా ప్రసాదించే ఓ రెసిపీ చెబుతున్నదామె… అవే తాంబూలపు ఉండలు… కావల్సినవి ఏమిటంటే… శుభ్రంగా ఉప్పునీటిలో […]
చెప్పిన మాట వినని ఎఐ… ఇప్పుడిక పోబే అని తిరగబడుతోంది..!
. ఏ ఐ తిరుగుబాటు… ఏ ఐ మెదడులో కూడా చెత్తేనట “విత్తొకటి నాటగా వేరొకటి మొలచునా…?” అని ప్రశ్నిస్తాడు అన్నమయ్య. వేప విత్తు నాటి మామిడి పండాలనుకుంటే ఎలా వస్తుంది? రానే రాదు. ఏది నాటితే అదే వస్తుంది. చివరికి కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏ ఐ)లో అయినా అంతే. కుక్క తోకను ఆడించే రోజులు పోయాయి. ఇప్పుడు తోకే కుక్కను ఆడించే రోజులొచ్చాయి! నానా చెత్తతో మన మెదళ్ళు ఎలా పాడైపోయాయో! ఎలా మొద్దుబారి జ్ఞాపకశక్తిని […]
వామ్మో, ఇదేం జర్నలిజం… అసలు ఎవుర్రా మీరంతా…
. వామ్మో ఇదేం జర్నలిజం… ఎవుర్రా మీరంతా… కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు… మనిషి కుక్కని కరిస్తేనే వార్త. జర్నలిజం బేసిక్ సూత్రంపై అప్పట్లో ఓ మేధావి అన్న మాటలివి. ఇప్పుడు ట్రెండ్ మారింది.టెక్నాలజీ పెరిగింది. జర్నలిజం మరింత డిఫరెంట్ స్టైల్ కు వెళ్ళింది. ఉధృతంగా జనం మీదకు విరుచుకుపడుతోంది. వ్యూస్ కోసం పోటీలు పడి ఎవడ్ని పడితే వాన్ని సెలబ్రిటీలను చేస్తుంది తెలుగు మీడియా. యూట్యూబర్స్ అంటే పోనీలే అనుకుందాం. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు […]
మదనగోపాలుడు… సకల కళావల్లభుడిని దారికి తెచ్చుకున్న ఓ పడవ పిల్ల..!
. Subramanyam Dogiparthi ……. 1987వ సంవత్సరం రాజేంద్రప్రసాద్ కెరీరుకు అచ్చొచ్చిన సంవత్సరం . సెకండ్ హీరో స్థాయి నుండి ఫస్ట్ హీరో స్థాయికి , ఆ తర్వాత సోలో హీరో స్థాయికి ఎదిగిన సంవత్సరం . లేడీస్ టైలర్ వంటి హిట్ సినిమాలు అతన్ని మెయిన్ ట్రాక్కులో పడేసాయి . 1987 సెప్టెంబరులో వచ్చిన ఈ మదనగోపాలుడు ఎబౌ ఏవరేజ్ పిక్చరుగా నమోదయి అతనికి మంచి పేరే తెచ్చింది . బుధ్ధిమంతుడు సినిమాలో గోపాలాచార్యులు పాత్రలో నాగేశ్వరరావు […]
సంసారం యథాతథం… కానీ ఆ భార్యాభర్తల నడుమ 20 ఏళ్ల నిశ్శబ్దం…
. ఆయన గోడ వైపు చూస్తూ… ‘నీకే చెబుతున్నా, ఈరోజు ఆలస్యమవుతుంది, నువ్వు తినేసి పడుకో’ అంటున్నాడు… ఆమె స్టవ్వు మీద మూకుడు వైపు చూస్తూ ‘ఈరోజేమైనా కొత్తా..? సర్లే’ అంటోంది… ఏదో పట్టింపు.., భార్యాభర్తలన్నాక గొడవలే జరగవా..? కోపం… దాంటో మాటలు బంద్… చాలా ఇళ్లలో జరిగేదే… ఇప్పుడంటే డిష్యూం డిష్యూంలు… మరీ అహాలు దెబ్బతింటే నేరుగా ఫ్యామిలీ కోర్టుకే… ఇప్పుడు మాటలు బంద్ పెట్టడాల్లేవ్… బూతులే… అటూ ఇటూ… ఇంతకుముందు దాదాపు ప్రతి ఇంట్లో […]
ఎహెఫో… ట్రంపుకి ఇండియా తాజా సందేశం… రష్యాలో భారీ యూరియా ప్లాంట్…
. ట్రంపు వంటి వాచాలుడు పిచ్చి కూతలకు దిగుతాడు… మోడీ వంటి కార్యసాధకుడు చేతల్లో చూపిస్తాడు… ఇదీ ఓ మిత్రుడి వ్యాఖ్య… భారత్- రష్యాల భారీ యూరియా ప్లాంటు ఏర్పాటును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్య ఇది… ఇండియాను తన కాళ్ల మీద పడేసుకోవడానికి ట్రంపు అనే — చేయని ప్రయత్నం లేదు… తనకు మద్దతు ఇచ్చినందుకు మోడీ ఎన్నిసార్లు తనలోతనే లెంపలేసుకున్నాడో కూడా తెలియదు… కాకపోతే సైలెంటుగా ఇండియా పావులు కదుపుతోంది… ఎహె ఫోరా ట్రంపుగా అన్నట్టుగా […]
దమ్మున్న జర్నలిస్టు అంటే..? సీఐఏకే చుక్కలు చూపించిన ఈ కేరక్టర్..!!
. ( రమణ కొంటికర్ల )…. CIA చీకటి ఒప్పందాల్ని బట్టబయల్జేసిన రిపోర్టర్ గ్యారీ వెబ్ విషాద గాధ ఇది. పులిట్జర్ వంటి అత్యున్నత పురస్కార గ్రహీత తన పరిశోధనలతో అమెరికన్ ప్రభుత్వాన్నే గడగడలాడించిన చరిత్ర ఇది. 1990ల మధ్య కాలమది. పులిట్జర్ బహుమతి గ్రహీత, రిపోర్టర్ గ్యారీ వెబ్.. ది మెర్క్యూరీ న్యూస్ అనే పత్రికలో ఒక మూడు భాగాల సీరీస్ తో అమెరికా ప్రభుత్వం వెన్ను విరిచే సంచలన కథనాలతో విరుచుకుపడ్డాడు. తను సృష్టించిన వార్తా కథనాల […]



















