Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫ్లెక్సీ లీడర్స్..! వింటారా కలాం చెప్పిన ధావన్ కథ..?

January 19, 2021 by M S R

flexy leaders

అబ్దుల్ కలాం ఎక్కడికి వెళ్లినా విద్యార్థులతో మాట్లాడేవాడు. కారణజన్ముడు కాబట్టి అలా విద్యార్థులతో మాట్లాడుతూ అదే వేదికమీద నిత్య విద్యార్థిగా సాగిన దేహయాత్రకు గొప్ప ముగింపు పలికాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆయన తరచుగా తన అనుభవంలోనుండి ఒక గొప్ప సందర్భాన్ని ఉదహరించేవాడు. సతీష్ ధావన్ జగమెరిగిన అంతరిక్ష శాస్త్రవేత్త. ఆయన పేరే శ్రీహరికోటలో అంతరిక్ష కేంద్రానికి పెట్టారు. ధావన్ నేతృత్వంలో ఒక రాకెట్ తయారీకి శాస్త్రవేత్తలు వందలమంది అహోరాత్రాలు కష్టపడ్డారు. తీరా ఆ రాకెట్ […]

ప్రధాని దాకా కీలక పదవులు… దేశరక్షణకు మాత్రం ముందుకు రారు…

January 19, 2021 by M S R

army

2009లో గుజరాత్ నుంచి మన సైన్యంలోకి చేరినవాళ్ల సంఖ్య 719… ఆ రాష్ట్రానికి అదే రికార్డు… 2008లో, 2007లో జస్ట్ 230 మాత్రమే… పది లక్షల మందికిపైగా ఉన్న భారతీయ సైన్యంలోకి గుజరాతీలు ఎందుకు చేరరు..? ఇదెప్పుడూ ఓ ప్రశ్నే… దేశరక్షణకు ఆ ప్రజలు ఎందుకు ముందుకు రారు..? ఇదెప్పుడూ ఓ విమర్శే… ప్రధాని పదవి దాకా ఎదుగుతారు, కానీ తుపాకీ ఎందుకు పట్టుకోరు..? ఇదెప్పుడూ ఓ పజిలే… గుజరాత్ జనాభాలో, విస్తీర్ణంలో సగం కూడా లేని […]

#కాశీలో ఓరోజు… ఆటగదరా శివా…! ‘‘నేనేం తెలుసుకున్నాను’’…

January 19, 2021 by M S R

varanasi

Gottimukkala Kamalakar……………….  కారణం తెలియదు. ఒంటరిగా కాశీవిశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలనిపించింది. మా ఊరు నెల్లపల్లి మల్లయ్య దేవుడే చెప్పాడో..? వైరాగ్యమే వచ్చిందో..? “సంప్రాప్తే సన్నిహితే కాలే నహినహిరక్షతి..” అని భయమే వేసిందో..? హైదరాబాదు నడిమి తరగతి నడిమి వయసు భవసాగరాలే భయపెట్టాయో..? రెండు వారాల ముందు టిక్కెట్టు బుక్ చేసుకుని, రెండు గంటలు ఎయిర్ పోర్ట్ లో నిరీక్షించి, మరో రెండు గంటల్లో “వారాణసీ పురంపతిం భజ విశ్వనాథం..!” అనుకుంటూ హోటల్లోకి వచ్చేసా..! నిక్కరూ, టీ షర్టూ […]

గంజితో అధ్వా‘న్నం’- తీసేస్తే పరమాన్నం… ఈ కుక్కర్ బోధ ఇదే…

January 18, 2021 by M S R

rice cooker

పిండితార్థం! పిండి పదార్థం!! ——————— ముందుగా ఒక విన్నపం. కడుపుకు అన్నం తినేవారెవరయినా ఈ ప్రకటన చదివి భయపడకండి. అనవసరంగా ఆందోళన పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ప్రకటన భాషలో, భావంలో ఉన్న వైరుధ్యాలు, తమాషా, చమత్కారాల మీద సరదాగా కాసేపు మాట్లాడుకోవడానికే ఈ చర్చ. ఈ ప్రకటన చూసి ఇన్నేళ్లుగా మీరు తింటున్నది అన్నం కానే కాదని- కాలకూట విషమయిన సున్నమని దయచేసి కంక్లూజన్ కు రాకండి. ఇప్పుడు విషయంలోకి వెళదాం. బాగా పేరున్న ఓ […]

కాలం ఎదురుతన్నినా… ఎవరెంత తిట్టినా సరే… ట్రంపుదీ ఓ చరిత్రే…

January 18, 2021 by M S R

donald trump

ప్రతీ నాయకుడిలోనూ మైనసులుంటయ్, ప్లస్సులుంటయ్… గెలిస్తే ఆహా ఓహో అని పల్లకీలు మోసే లోకమే, ఓడినప్పుడు చేతకానివాడనీ, చెడ్డవాడనీ ఆడిపోసుకుంటుంది… అంతకుముందు మంచిగా కనిపించిన కొన్ని లక్షణాలను విస్మరిస్తుంది… సేమ్, ట్రంపు విషయంలోనూ..! ఏ మెరిట్ లేకుండానే అమెరికా అధ్యక్షుడయ్యాడా..? కాదు కదా..! ఈసారి ఎన్నికల్లో తను పోరాడిన పద్ధతులు మనకు తప్పుగా తోచవచ్చుగాక.., తన పాలన పద్ధతుల్లో మనకు బోలెడు తప్పులు కనిపించవచ్చుగాక… తను అంతిమంగా ఫెయిల్ అయిపోవచ్చుగాక… రేప్పొద్దున సెనెట్ తనను అభిశంసించవచ్చుగాక… కానీ […]

ఈ పుస్తకం నిండా ఓ ‘నిశ్శబ్ద విస్ఫోటనం’ తాలూకు శిథిలాలు..!!

January 17, 2021 by M S R

nissabda visphotanam

కాలం మారుతోంది… ఇప్పుడంతా డిజిటల్… పుస్తకం కావచ్చు, థియేటర్ కావచ్చు…. సినిమా అంటే, సీరియల్ అంటే ఓటీటీలో వీక్షణమే… అలాగే పుస్తకమూ ఈ ‘దారి’కొచ్చింది… ఇంగ్లిషులో అయితే డిజిటల్ పుస్తకం ఓపెన్ చేసి, రీడ్ ఇట్ అనే అప్షన్‌లోకి వెళ్లిపోతే… అరమోడ్పుగా కళ్లుమూసుకుని వెనక్కి వాలితే… అది కథ చదివి పెడుతుంది… ఇంకా మన తెలుగులో అది విస్తృతంగా రాలేదు… తెలుగు నవలారచనలో శైలికి, కంటెంటుకు సంబంధించి బోలెడు విజయవంతమైన ప్రయోగాలు చేసిన యండమూరి వీరేంద్రనాథ్ తొలిసారిగా […]

సగౌరవ అంత్యక్రియలూ రాసిపెట్టి ఉండాలి… కాలం మారుతోంది కదా…

January 17, 2021 by M S R

anandobrahma

విఖ్యాత తెలుగు నవలారచయిత Yandamoori Veerendranath  తన ఫేస్‌బుక్ వాల్ మీద షేర్ చేసుకున్న ఓ పోస్టు చదవండి ముందుగా……….. ‘‘మరి కొద్ది గంటల్లో నగరం మీద పడబోయే బాoబు గురించి తెలిసిన అతి కొద్దిమందిలో అతనొకడు. కుటుంబంతో కలిసి రహస్యంగా రాష్ట్రం విడిచి వెళ్ళటానికి తయారు అవుతూ ఉండగా ‘హోమ్‌ ఫర్‌ ది ఏజ్డ్‌ నుంచి మాట్లాడుతున్నాం. మీ తండ్రి రామానంద, నెం 64392 అరగంట క్రితం మరణించారు” అని ఫోన్ వచ్చింది. ఈ సమయంలో తండ్రి […]

సీపీఎం తక్కువేమీ కాదు… ఓ గొప్ప ఫర్టిలిటీ డాక్టర్‌ను పొట్టనపెట్టుకుంది…

January 17, 2021 by M S R

test tube baby

By…… Chada Sastry………….  డాక్టర్ టి.సి. ఆనంద్ కుమార్, పునరుత్పత్తి జీవశాస్త్రవేత్త, భారతదేశపు మొట్టమొదటి టెస్ట్-ట్యూబ్ బిడ్డను సృష్టించినందుకు ప్రసిద్ది చెందారు. ఆయన పని చేసిన ప్రాజెక్ట్ ద్వారా భారత్ లోని మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ 6వ తేదీ ఆగస్టు 1986 న ముంబైలో హర్ష చౌడా అనే బిడ్డ పుట్టుకకు దారితీసింది. అయితే డాక్టర్ ఆనంద్ కుమార్ పెద్ద మనసున్న మహా మనిషి. నాకన్నా ముందే ఎవరో కలకత్తా డాక్టర్ ముఖర్జీ ఇలా భారత్ […]

కరోనా రావచ్చు పోవచ్చు… కానీ కరోనా ట్యూన్ మాత్రం చస్తే వదలదు…

January 16, 2021 by M S R

caller tune

మీరు వినే కోవిడ్ వాణి రోజుకు 3 కోట్ల గంటలే! ———————– గడచిన సంవత్సరం మార్చి నెల దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ మొదలయినప్పటి నుండి సెల్ ఫోన్లలో ఏ నంబరుకు డయల్ చేసినా ముప్పయ్ సెకన్ల పాటు కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలే వినపడతాయి. హిందీ, ఇంగ్లీషుతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా డయల్ టోన్ నిర్బంధంగా వినిపించేలా ఏర్పాటు చేశారు. మొదట్లో చైతన్యపరచడానికి ఇది బాగానే ఉన్నా- ఇప్పుడు కరోనాతో సహజీవనం చేయకతప్పదని జ్ఞానం కలిగిన […]

ఓహ్ బేబీ రజినీ చాంది..! నెట్ ట్రోలర్స్‌కు దొరికింది తాజా ‘ఏజ్ బార్ బకరీ’..!

January 16, 2021 by M S R

ranini chandi

ఒకావిడ తల్లి పాత్రలు వేస్తుంటుంది… ఒళ్లూ, కాళ్లూ డ్యాష్ డ్యాష్ బాగా కనిపించేలా డాన్సులు చేస్తూ ఓ వీడియో ఇన్‌స్టాలో పెడుతుంది… హేమిటీ అంటే, నేను ఇంకా ఫిట్టేనోయ్, చూడు కాస్త అని నిర్మాతలకు గట్రా ఓ మెసేజ్… మరొకావిడ పెళ్లీడుకొచ్చిన తన బిడ్డతో కలిసి షార్ట్స్‌లో డాన్సులు చేస్తూ, ఇన్‌స్టాలో పెట్టేస్తూ, నేను కూడా మస్తు ఫిట్టుగా ఉన్నానోయ్ అని సంకేతాలు పంపిస్తుంటుంది… ఎవరి వృత్తిగతం వాళ్లది… ఓ సింగర్ ఎదిగిన పిల్లల సాక్షిగా రెండో […]

చదివితే సింగిల్ కాలమ్ వార్త… వార్తాంశంలోని స్పూర్తి అంతులేనంత…!

January 16, 2021 by M S R

upsc

రాస్తే నిండా పది వాక్యాలు రావు… అంత చిన్నగా ఉంటుంది వార్త… కానీ పెద్ద సంకల్పం… చదువుతుంటేనే ఆనందం కలిగే వార్త… మన రాష్ట్రాలు, కాదు, కాదు, మన సమాజాలు కులం, మతం, క్షుద్ర రాజకీయాలతో తన్నుకుచస్తున్నాయి కదా… విద్యావేత్తలు, జర్నలిస్టులు, అధికారులు గట్రా అందరినీ ఆ కంపు కమ్మేస్తోంది కదా… కేరళకు సంబంధించిన ఈ వార్త చదువుతుంటే మన చైతన్య స్థాయిని చూసి మనమే ఏడవాలి అనిపిస్తుంది… సరే, రాజకీయాలు ఎక్కడైనా ఉన్నవే… కేరళలోనూ సహజమే… […]

మనుషుల్లో పశుత్వం! పశువుల్లో మానవత్వం!

January 15, 2021 by M S R

jallikattu

“ఇన్ద్రో విశ్వస్య రాజతి; శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే” అని వేదంలో శాంతి మంత్రం. రెండు కాళ్లున్న మనుషులకు, నాలుగు కాళ్లున్న పశువులకు సుఖశాంతులు కలుగుగాక అని ఈ మంత్రం అర్థం. మనుషులకు రెండు కాళ్లేనని ఈ మంత్రంలో ఎక్కడా లేదు. ద్విపదే అంటే రెండు కాళ్లున్న మనుషులమయిన మన గురించే అని మనం గ్రహించాలి. చతుష్పదే అంటే నాలుగు కాళ్లతో నడిచే పశువులు అని ఆ విషయం తెలుసుకోలేని పశువులకు మనం తెలియజెప్పాలి. పశువుకంటే […]

… అదుగో… వాళ్లే మన ఫేస్‌బుక్ పోస్టులు ప్రేమగా చదివేది…!

January 15, 2021 by M S R

police

నగరానికి ఊళ్లో పండుగ! అప్పుడే దొంగలకు నగరంలో పండుగ!! ———————— హైదరాబాద్ విశ్వనగర పోలీస్ కమీషనర్ బాధ్యతాయుతంగా ఒక జాగ్రత్త చెప్పారు. పండగలకు పొలోమని ఊరెళ్లేవారు- ఈగ ఇల్లలుకుతూ ఇంటిపేరు మరచిపోయినట్లు ఇళ్లను మరచి ఊళ్లకు పోవద్దన్నది ఆయన చెప్పిన జాగ్రత్త సారాంశం. లేకపోతే పండగకు నగరం వదిలి వెళ్లిన ఇళ్లల్లో దొంగలు పండగ చేసుకుంటారన్నది ఆయన హెచ్చరిక. హైదరాబాద్ జనాభా కోటి. ఈ కోటిలో అరవై లక్షల మంది ఇతర ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడ్డవారే […]

తిలక్… నువ్వు లేవు… నీ పాట/ మాట/ ఆట వుంది..!

January 14, 2021 by M S R

tilak

Taadi Prakash………………  తిలక్… నువ్వు లేవు… నీ పాట/ మాట/ ఆట వుంది!………… Artist Mohan on film director Tilak ——————————————————— ఇవాళ పాత సినిమా దర్శకుడు కె. బీ. జీ. తిలక్ పుట్టిన రోజు. ఆయన గురించి పది సంవత్సరాల క్రితం the Sunday Indian తెలుగు రాజకీయ వార పత్రికలో ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసం ఇది : నిజానికిది సినిమా దర్శకుడు కొల్లిపర బాలగంగాధర తిలక్ గారి గురించి కాదు ఆయన్ని […]

హే వాట్సాప్..! హౌ ఈజ్ మై టెలిగ్రామ్ సిగ్నల్..?

January 14, 2021 by M S R

signal app

వాట్సాప్ వాడే అమాయకులకు మాయకులయిన వాట్సాప్ ఫేస్ బుక్ యాజమాన్యం ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా- 1 . మేము మీకు సేవచేసి తరించడానికి ధర్మసంస్థ కాదు. అహోబిల మఠం కాదు. ఊరిచివర తలుపు చెక్క కూడా మిగలని శివాలయం కాదు. మాది ఫక్తు అంతర్జాతీయ డిజిటల్ దిగ్గజ వ్యాపార సంస్థ. 2. భూగోళమంతా కోట్ల మందికి వాట్సాప్ అలవాటు చేసిన తరువాత- ఇక ఆ గుత్తాధిపత్యాన్ని అనుభవిస్తూ ఫలితాలు పిండుకోకుండా ఉండడానికి మేమేమీ సేవా ప్రతిఫలాపేక్ష లేని […]

కొత్త పేర్ల ట్రెండ్..! నవ్వించేవి, బుర్రచించేవి… కోహ్లీకి కూడా ఇదే తల్నొప్పి..!!

January 13, 2021 by M S R

virushka

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ… అలియాస్ విరుష్క… ఫ్యాన్స్ ఇద్దరినీ కలిపి పిలుచుకునే పేరు… పాప పుట్టింది… ఈ వార్త రాయని మీడియా, సైట్లు, టీవీలు, ట్యూబ్ చానెళ్లు లేవు… హహహ… రకరకాల ఫేక్ ఫోటోలు కూడా అప్పుడే దర్శనమిచ్చాయి… సరే, ఆ ఫోటోల రియాలిటీ ఏమిటనేది పక్కన పెడితే… చర్చ ఇప్పుడు ఆ పాపకు పెట్టబోయే పేరు మీదకు మళ్లింది… బోలెడన్ని డిబేట్లు, సూచనలు… అదో ఆనందం… కొందరు విరుష్క అనే పేరే ఖాయం చేయమని […]

అయ్య బాబోయ్, ఆంధ్రప్రభోయ్… ఇదేం వింత వార్త దేవుడోయ్…

January 13, 2021 by M S R

zee telugu1

తెలుగునాట హాస్యప్రియులు ఏది మిస్సయినా సరే… కేఏపాల్, సబ్బం హరి, చంద్రబాబు, ఆంధ్రప్రభ పత్రికను అస్సలు ఇగ్నోర్ చేయలేరు… బీపీని తగ్గించి, ఒత్తిడి ద్వారా వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడే పాజిటివ్ పేర్లు ఇవన్నీ…! అబ్బే, ఆంధ్రప్రభ చాలారోజులుగా మనల్ని నిరాశపరుస్తోంది అనుకుంటామో లేదో ఓ అరివీర భజన వార్తో, ఓ అనూహ్యమైన నమ్మలేని కథనమో అచ్చేసి వదులుతుంది… ఈరోజు ఓ వార్త చదవండి… అది ప్రకటనో, వార్తో, స్పెషల్ కథనమో, చరిత్రో, భజనో ఎంతటి ఘనుడైన […]

రైతు నవ్వే రోజే నిజమైన సంక్రాంతి..! ఆ శుభసంక్రమణం ఎప్పుడో…!

January 13, 2021 by M S R

sankranti

రైతులకు వస్తుందా సంక్రాంతి? ———————- సంక్రాంతి అర్థం, పరమార్థం ప్రవచనాకారులకు వదిలేద్దాం. ఏ భక్తి టీ వీ పెట్టినా టీ వీ తెర మొత్తం సంక్రాంతి ముగ్గులే. గొబ్బెమ్మలే. మకర సంక్రమణ భాష్యాలే. నిజానికి ఒక సంవత్సర కాలంగా అన్ని పండగలకు ముందు విశేషణ పూర్వపద ఖర్మ ధారయ కరోనా తోడయ్యింది. కరోనా దసరా, కరోనా దీపావళి… తాజాగా కరోనా సంక్రాంతి. అయితే ఈ సమాసాన్ని పాజిటివ్ గా తీసుకుందామంటే- కరోనా వేళ నెగటివ్ మంచిది కానీ- పాజిటివ్ […]

చెప్పింది విను..! బ్రిటిషువాడు రాసిందే చరిత్ర..!!

January 12, 2021 by M S R

history

బ్రిటీషు వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగు వేసుకుని వ్యాపారం పేరిట భారతదేశాన్ని కబళించడానికి కలకత్తాలో కాలు పెట్టిన 1757 ప్రాంతానికి గ్రేట్ బ్రిటన్ జనాభా అక్షరాలా అరవై లక్షలు కూడా దాటి ఉండదు అని ఒక అంచనా. కాదు కాదు- ఒకటిన్నర కోటి అని వారు చెప్పుకున్న రికార్డుల మీద కొందరికి అనుమానాలున్నాయి. అప్పటికి భారత్ జనాభా దాదాపు ఇరవై కోట్లు. ఇరవై కోట్ల జనాన్ని అరకోటి జనసమూహం ప్రతినిధులు రెండు పడవల్లో వచ్చి, రెండు […]

హిజ్రా మాఫియా..! తెలంగాణవ్యాప్తంగా విస్తరించిన ఓ వింత సమస్య..!!

January 10, 2021 by M S R

third gender

మిత్రుడు Venkateshwar Reddy… ఫేస్ బుక్ వాల్ మీద కనిపించిన ఈ పోస్టు ఓసారి చదవండి ముందుగా… ‘‘హిజ్రాలు సానుభూతి కోల్పోతున్నారు. ఈ మధ్య ఒక గృహప్రవేశ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా పెద్ద పెద్దగా అరుపులు వినవచ్చాయి. ఏమిటా ??? అని చూస్తే… ఒక హిజ్రా … గృహస్థులకు శుభం జరగాలంటే 42 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. 42 వేలే ఎందుకు? అని ప్రశ్నిస్తే.. ఆ ఏరియాలో ఉండే స్క్వేర్ ఫీట్ ఆధారంగా, ఫ్లాట్ […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • Next Page »

Search On Site

Advertisement

Latest Articles

  • హిమ స్వర్ణం..! ఇండియన్ సోషల్ మీడియా సంబరం… చాలా అరుదు..!
  • సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
  • చెక్ నితిన్..! ఎంత ఏలేటి అయితేనేం… కమర్షియల్ లెక్కల్లో బోల్తా…!!
  • వజ్రాన్ని నేను…! నీరవ్ మోడీ అంతరాత్మ బహిరంగ లేఖ..!
  • ఇంట్రస్టింగు తీర్పు…! మహిళ పుట్టింటివారికీ ఆస్తిలో వారసత్వహక్కు..!!!
  • డంకీ బిర్యానీ… డంకీ కబాబ్స్… డంకీ బర్గర్స్… లొట్టలేస్తున్నారట ఏపీజనం..!!
  • లెఫ్ట్, రైట్ కలిసి… రైట్ రైట్..! బెంగాల్‌లో బద్ధవైరుల నయా దోస్తానా..!!
  • బాబోయ్… ఇదేం వార్తారచన తండ్రీ… ఈనాడును ఏదో పాము కాటేసింది…
  • రైల్వే ప్రయాణాలు తగ్గించండి… లేకపోతే చార్జీలు ఇంకా పెంచేస్తాం…
  • దక్షిణ కుంభకోణం..! పూజారుల భారీ మోసాల్ని పట్టేసిన కేరళ సర్కారు..!!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now