. ఒక నగరాన్ని అర్థం చేసుకోవాలంటే, అది పాడే పాటను వినాలి కదూ? టిబిలిసి మొత్తం వర్షంలో తడిసిపోయింది. రోడ్ల మీద దీపాల కాంతి, వాహనాల లైట్లు, అప్పుడప్పుడూ మెరిసే సౌవెనీర్ షాప్ల నీయాన్ వెలుగులు ప్రతిబింబించాయి. తడి నేల వాసన, తాజా కాఫీ సువాసన గాలిలో కలిసిపోయాయి. అన్నీ నిశ్శబ్దంగా అనిపించినా, ఓ మూలన కాస్త గోధుమ రంగు కప్పుకొని వర్షపు చినుకుల్లో తడుస్తూ ఓ సంగీతకారుడు తన అకోర్డియన్తో ఏదో పాడుతున్నాడు. దాని స్వరం […]
హమ్మయ్య… అలా నా కుడి భుజం బతికిపోయింది… ఇంకా రాస్తోంది…
. ఆరోజు ఎప్పటిలాగే తెల్లవారింది. కానీ ఆ రోజు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్షణమొక యుగంగా గడిచింది. ముప్పయ్యేళ్ళు గడిచినా ఇంకా ఆ రోజు నన్ను వెంటాడుతూనే ఉంది. అప్పుడు నేను హిందూపురంలో విలేఖరిని. ఉదయం తొమ్మిదిన్నరకు ఆఫీసులో కూర్చోగానే కార్లు, జీపులు ఒకటే హడావుడి. ఒక రాజకీయనాయకుడు, అతడి అనుచరులు రెండొందల మంది వచ్చారు. ఆ రాజకీయనాయకుడు సిగరెట్ వెలిగించి పొగ నా మొహమ్మీదికి వదులుతూ… “ఏంది! నా మీద ఏందేందో రాసినావు? ఇట్లే ఒకాయప్ప […]
ఏ తిండి ఎలా ఉన్నా… తొక్కులు, పచ్చళ్లలో మనల్ని కొట్టేవాడు లేడు…
. రోటీలు, బ్రెడ్డులు, నాన్స్, పూరీలు ఎట్సెట్రా బ్రెడ్ కేటగిరీలో టేస్ట్ అట్లాస్ వాడు మన బటర్ గార్లిక్ నాన్కు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాడు, టాప్ 100లో పదిపన్నెండు వెరయిటీలను కూడా చేర్చాడు, గుడ్ అనుకున్నాం కదా… టోటల్గానే టాప్ 100 వరల్డ్ డిషెస్ జాబితాలో మన వంటలు ఏమైనా ఉన్నాయా..? అదే చూస్తుంటే, ర్యాంకుల్లో ఒక్కొక్కటీ చెక్ చేస్తూ, దిగువకు వెళ్తూ ఉంటే… 29వ ప్లేసులో ముర్గ్ మఖానీ కనిపించింది… నిజానికి అది స్ట్యూ… ఆధరువు… […]
బెట్టింగ్ తెరపైకి కొత్త కొత్త మొహాలు… తీగ లాగితే పెద్ద డొంకే…
. ఇప్పుడు తెలుగు సోషల్ మీడియాలో సబ్జెక్టు గ్రోక్, సునీతా విలియమ్స్… ప్లస్ బెట్టింగ్ యాప్స్… గ్రోక్ అత్యంతాధునిక ఎఐ టెక్నాలజీ, సునీత స్పూర్తి… బెట్టింగ్ యాప్స్ దోపిడీ… ఓ సాదాసీదా ఐపీఎస్ అధికారిలా గాకుండా… సొసైటీ కన్సర్న్ కనిపించే సజ్జనార్ కారణంగా ఈ యాప్స్ దుర్మార్గాలు, వీటిని ప్రమోట్ చేసే సెలబ్రిటీల బాగోతాలు బయటికొచ్చాయి… తన పని ఏదో తాను చేసుకున్నామా, పోయామా అని గాకుండా సొసైటీ పట్ల తన బాధ్యతను ఫీలయ్యే సజ్జనార్కు అభినందనలు… […]
ఆ సునీతకు తోడుగా గీత, గణపతి… ఈ తులసి వెంట గీత, తులసీమాల…
. తులసి గబ్బార్డ్… అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్… మోడీని కలిసింది… తరువాత ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘కష్ట సమయాల్లో భగవద్గీతలోని శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన బోధనలు తనకు బలాన్ని, శాంతిని, స్ఫూర్తిని ఇస్తాయి… క్లిష్ట సమయంలో సవాళ్లు ఎదుర్కొంటున్నా, ఎప్పుడు కష్టాలు చుట్టుముట్టినా, అర్జునుడికి కృష్ణుడు బోధించిన పాఠాలను వింటాను… ఇవే నాలో బలాన్ని, శాంతిని పెంచుతాయి” అని పేర్కొంది… భారతీయ సంస్కృతి పట్ల తనకున్న గౌరవాన్ని కూడా ఆమె వ్యక్తం చేసింది, భారత్లో […]
గ్రహాంతర జీవులపై అమెరికాకు ఏదో తెలుసు… కానీ ‘భయ’టపెట్టదు…
. భూమ్మీదికి వచ్చి… వెళుతున్న గ్రహాంతరవాసులు మనకు దయ్యాలతో బాగా పరిచయమే. దయ్యాలతో మాట్లాడేవారు; దయ్యాలతో పనులు చేయించుకునేవారు; దయ్యమై పట్టి పీడించేవారు; పట్టిన దయ్యాలను విడిపించేవారు; అంతటి దయ్యాలు కూడా నిలువెల్లా వణికి చావాల్సినవారు… ఇలా వీళ్ళందరూ మనకు బాగా తెలుసు. ఎటొచ్చీ గ్రహాంతరవాసులతోనే మనకు బొత్తిగా పరిచయం లేని వెలితి ఉండేది. ఆ వెలితిని కూడా అమెరికాలో కొందరు ఉన్నతాధికారులు ఇన్నాళ్ళకు భర్తీ చేశారు. అధునాతన మానవ మేధస్సుతో అంతరిక్షంలో ఏళ్ళకు ఏళ్ళు కాపురాలు […]
అరవై దాటాం కదా… ఇదుగో ఏదీ తిననివ్వరు, తింటే పడదు…
. Rajani Mucherla వాల్ మీద ఓ సరదా పోస్టు కనిపించింది… బాగుంది… ఓ వయస్సు దాటాక జిహ్వకు పరీక్ష… ఏదీ సరిగ్గా తిననివ్వరు, ఎలాగోలా తింటే పడదు… జిహ్వ ఆగదు… ఆ బాధ మీద పోస్టు… తిండి గురించి కదా ఆసక్తికరమే… ఇదీ ఆ పోస్టు… (చదివినదే కానీ మరల చదువుకోవచ్చు, నవ్వుకోవచ్చు… మరోసారి…) · *60 సంవత్సరాల వయస్సు దాటిన వాడి గోడు. ఏఁ రోగాలో, మాయ రోగాలు …. కమ్మగా కడుపు నిండా తినడానికి […]
వెల్లుల్లి వెన్న రొట్టె… అనగా బటర్ గార్లిక్ నాన్… ప్రపంచ నెంబర్ వన్…
. సాధారణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వంటకాల్లో వేస్తుంటాం కదా… కానీ అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలుగా లేదా తరుగుగా అలాగే వేసి ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేసేవాళ్లూ ఉంటారు… పెసరట్టు మీద పచ్చి అల్లం తరుగు అలాగే పైన జల్లి దాన్ని ఇష్టపడే వాళ్లు కూడా తెలుసు కదా… ఐతే చాలామందికి వెల్లుల్లి పచ్చిగా ఉంటే ఆ ఘాటు వాసన పడదు… కొందరికేమో అదే ఇష్టం… సరే, ఈమధ్య హైదరాబాద్, ఇతర తెలుగు నగరాల్లోని […]
సునీతా విలియమ్స్… గీత, గణపతి, సమోసాల్ని మించిన విశేషాలివి…
. సునీతా విలియమ్స్… సాహసులకు, ప్రత్యేకించి మహిళలకు ఓ స్పూర్తి… నారీ శక్తి… మళ్లీ అంతరిక్షంలోకి వెళ్తోంది… 9 రోజులు అనుకున్న జర్నీ కాస్తా 9 నెలలైంది… అంతరిక్ష కేంద్రంలో చిక్కుబడిపోయింది… నాసా ఫెయిల్యూర్… ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ పుణ్యమాని ఆమె తిరిగి వస్తోంది… బయల్దేరింది… రేపు తెల్లవారుజామున 3 -4 మధ్యలో భూమిని చేరుతుంది… గుడ్… అందరూ కోరుకుంటున్నది అదే… ఇది ఆమెకు మూడో అంతరిక్ష యాత్ర… మహిళా వ్యోమగాముల్లో ఆమెది ఓ చరిత్ర… […]
తమిళం ఓ అనాగరిక భాష… అడవి మనుషుల భాష… ఎవరన్నారంటే..?
. #తమిళం #పెరియార్ …. తమిళం అనేది అడవి మనుషుల (Barbaric) భాష. నేను ఈ మాట అనగానే చాలామందికి నా మీద కోపం వచ్చింది. కానీ నేనెందుకు అలా అంటున్నానో ఎవరూ ఆలోచించడం లేదు. అలా ఆలోచించే తెలివి ఎవరికీ ఉన్నట్టు లేదు. తమిళం మూడు నుంచి నాలుగు వేల ఏళ్ల క్రితం ఏర్పడ్డ భాష అని తమిళులంతా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా! తమిళం అన్ని వేల ఏళ్ల నాటి భాష కాబట్టే, అదే కారణంతో […]
ఓహో, పౌర సమాజమా..? అంటే ఏమిటి మాస్టారూ నిజంగానే..?!
. Murali Buddha …… పౌర సమాజం అంటే ? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నా హజారే నాయకత్వంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది గుర్తుందా ? ఎందుకు గుర్తు లేదు … హజారేకు భారత రత్న ఇవ్వాలని అసలైన మహాత్ముడు అతనే అని …. హజారేకన్నా రెండింతల ఎత్తున్న జాతీయ జెండాలతో శ్రీమాన్ బాబు గారు కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి పంజాగుట్ట వరకు పాదయాత్ర చేశారు … అవినీతికి వ్యతిరేకంగా అదేదో పార్లమెంట్ […]
రోత, బూతు, జుగుప్స, వెగటు… కంపుకొడుతున్న తెలంగాణ పాలిటిక్స్..!!
. బూతు, రోత, జుగుప్స, నీచ రాజకీయాలు… వ్యక్తిత్వ హననానికి పాల్పడే రాజకీయాలు… ఈ అంశాల్లో ప్రపంచంలో ఏ దేశమూ ఏ ప్రాంతమూ ఏపీ పాలిటిక్స్ రేంజుకు దిగజారలేదు అనే నమ్మకం ఉండేది… కానీ ఎహె, మాకేం తక్కువ,.? మేమేం తక్కువ..? అన్నట్టుగా తెలంగాణ పాలిటిక్స్ వేగంగా ఏపీ పాలిటిక్స్ స్థాయిని దాటేశాయి… అవును, నిజం నిష్ఠురంగానే ఉంటుంది… కేటీయార్ వర్సెస్ రేవంత్ … (నిజానికి ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కూడా కాదు) ఇద్దరు నాయకుల […]
‘ఏయ్ సిపాయీ… నువ్వు డాన్స్ చేయాలి, లేకపోతే కొలువు ఊడుతుంది…’
· డ్యాన్స్ చేయకపోతే.. పోలీసు ఉద్యోగం ఊడుతుంది … ‘ఏయ్ సిపాయీ! దీపక్! ఇప్పుడొక పాట పెడ్తారు. దానికి నువ్వు డ్యాన్స్ చేయాలి. లేకపోతే నీ ఉద్యోగం ఊడుతుంది. తప్పుగా అనుకోకు, ఇవాళ హోలీ. అర్థమైంది కదా?’ అని అంటున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, ప్రస్తుతం ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యే తేజ్ప్రతాప్ యాదవ్. హోలీ సందర్భంగా ఆయన ప్రవర్తించిన తీరు ఇది. మొన్న ఈ వీడియో వైరల్గా […]
ఓహ్… పెళ్లితో మగవాడికీ ఈ సమస్య అదనమా..? భలే చెప్పారయ్యా..!!
. అదీ సంగతి. మగవాళ్ళు ఇంతింత లావు కావడానికి పెళ్ళే కారణం తప్ప మరొకటి కానే కాదు. పెళ్ళికి ముందు నాజూగ్గా, రివటలా, ఎండు పుల్లల్లా ఉన్నవారు…పెళ్ళయ్యాక కదల్లేని పర్వతాల్లా తయారుకావడానికి శాస్త్రీయమైన కారణాలు దొరికిపోయాయి. కదిలి వచ్చే మేరునగంలా ఉంటే తీగలాంటి అమ్మాయిలెవరూ ఇష్టపడరన్న ఎరుకకొద్దీ ఎంతోకొంత శరీరంపై శ్రద్ధ పెట్టి ఊబకాయం రాకుండా జాగ్రత్త పడతారట. కొంచెం లావు కాగానే వ్యాయామం చేసో, ఆహారం తగ్గించో సన్నబడడానికి ప్రయత్నిస్తారట. పెళ్ళయ్యాక ఆ శ్రద్ధ ఉండదట. […]
డియర్ ఆర్కే గారూ… 350 కిలోల బంగారు నాణేల్ని ఏం చేశారంటారూ..?!
. నిన్నటిదే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న కొత్త పలుకులో ఒకటీరెండు పేరాలు బలంగా ఆకర్షించాయి… ‘‘హైదరాబాద్లోని ఒక డిస్టిలరీ యాజమాన్యం 200 కోట్ల రూపాయలతో దాదాపు మూడున్నర క్వింటాళ్లు, అంటే 350 కిలోల బంగారు నాణేలను కొనుగోలు చేసింది. పద్మావతి జ్యువెలర్స్ అనే సంస్థకు సదరు డిస్టిలరీ నుంచి 200 కోట్ల రూపాయలు చెక్కు రూపంలోనే అందాయి. ఆ డబ్బు తీసుకున్న పద్మావతి జ్యువెలర్స్ సంస్థ 350 కిలోల బంగారాన్ని నాణేలుగా మార్చి అందజేసింది. సదరు బంగారాన్ని […]
వందేళ్లుగా లెనిన్ ‘అలాగే ఉన్నాడు’… ఆయన సిద్ధాంతాలే గల్లంతు…
. Bhandaru Srinivas Rao ………. మేము మాస్కోలో వున్న అయిదేళ్ళ కాలంలో గమనించింది ఏమిటంటే, వానయినా, ఎండయినా (ఎండలకు చాన్స్ లేదనుకోండి) వానయినా వంగడి అయినా, మంచు అయినా, మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో గడ్డకట్టే చలి అయినా, అయినా కొనుగోళ్ల కోసం, జనాలు క్యూల్లో వుండడం చూశాను కానీ, కావాలని వెళ్లి, ఆరుబయలు మంచు మైదానంలో గంటల తరబడి క్యూలో నిలబడి తమవంతు కోసం వేచి చూసే సీను ఒక్క చోటే కనబడింది. అది […]
అనసూయను ఆంటీ అని పిలవాలంటే అది పడిపోవాల్సిందేనట…
. అనసమ్మతో ఇదే తంటా… నా ఇష్టమొచ్చినట్టు బట్టలేసుకుంటా, బికినీలో ఫోటో షూట్ చేసుకుని పబ్లిక్ డొమెయిన్లో పెడతా, నా మొగనికే ఏ బాధ లేదు, మీకేం నొప్పి, నన్నేమన్నా అంటే ఒక్కొక్కడినీ కేసుల్లో బుక్ చేస్తా… ఇలా విరుచుకుపడుతుంది కదా… చాలా ఉదాహరణలు చూశాం కదా… అసలు ఆమెను ఎప్పుడూ లైవ్లో ఉంచేవే ఈ వివాదాలు, ఈ బెదిరింపులు, ఈ ఝలక్కులు… సరే, ప్రచారం కోసం ఆమె బాధ ఆమెది… అదొక పంథా అనుకుందాం… కొన్నాళ్లుగా […]
ఈ చరిత్ర ఏ సిరాతో…. ఈరోజుకూ అంతే… ఈ చరిత్ర ఏ రంగు సిరాతో…
. Subramanyam Dogiparthi ……… ఈ చరిత్ర ఏ సిరాతో ! ఇప్పుడయితే ఏ రంగు సిరాతో అని పెట్టవలసి ఉంటుందేమో ! ఎర్ర రంగా లేక బులుగు రంగా లేక కాషాయ రంగా లేక మరి ఇంకేదయినా రంగా ? ఈ సినిమాలో కూడా ఒక సీనులో ఇలాంటి ప్రస్తావన ఉంటుంది . విలనేశ్వరుడి భజింత్రీ కవి అంటాడు . విలన్ కొడుకు పుట్టాకనే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వ్రాస్తాను అంటాడు . చరిత్రదేముంది ; […]
ముంబై..! వేగంగా తన పర్యాటక ప్రాభవాన్ని కోల్పోతున్నదా..?!
. ( హరగోపాల రాజు వునికిలి) …. ముంబై తన ప్రాభవాన్ని కోల్పోతోందా..? ముంబై ….దేశ ఆర్ధిక రాజధాని.. మరాఠా సంస్కృతికి మచ్చుతునక.. పార్సీ సంప్రదాయానికి ప్రతీక .. కానీ గత కొన్నేళ్లుగా తన ప్రాభవాన్ని కోల్పోతుందా అని అన్పిస్తోంది.. నాటి బొంబాయికి నేటి ముంబైకి కొన్నిస్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. ముంబైకి లైఫ్ లైన్ అనదగ్గది లోకల్ రైళ్ళు.. కచ్చితమైన సమయానికి పేరు. కోట్లాదిమంది ప్రయాణికులకు అత్యంత చవకైన ప్రయాణ సాధనం. ఇప్పుడిప్పుడే మెట్రో రైళ్ళు వాటిపై ఒత్తిడి […]
“అరే… తాగినప్పుడు గిట్లనే మజాక్ చేస్తార్రా బై… దానికే కొట్టాల్నా?”
. హైదరాబాద్ బంజారాహిల్స్. ఉద్యోగ పక్షులు రెక్కలు కట్టుకుని, లంచ్ బాక్సులు కట్టుకుని బైకుల్లో, కార్లలో, ఆటోల్లో, రాపిడో బైకుల్లో వెళ్ళే వేళ. ఆఫీస్ లో నా సీటు పక్కన పెద్ద కిటికీలో నుండి కనపడే పచ్చటి చెట్టును, వీధిని చూడడంలో నాకు ఏదో ఆనందం ఉంటుంది. పక్కింటివారి చెట్టు కొమ్మ నా కిటికీ ముందు వాలి… ఎర్రటి, తెల్లటి పూలగుత్తులతో ఏదో పూలబాస మాట్లాడుతున్నట్లు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. పచ్చటి కొమ్మలు, ఊగే పూలకొమ్మలతో కిటికీ […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 131
- Next Page »