మామూలుగానైతే బీజేపీ నాయకుడు రఘునందన్ మంచి వక్త… మంచి వకీలు… లాజిక్కులు, లాపాయింట్లు సరిగ్గా పట్టుకుని ఎదుటోడికి చాన్స్ ఇవ్వకుండా దడదడలాడిస్తాడు… కానీ ఈ విషయంలో మాత్రం భిన్నంగా ఉంది… తను సోనియా గాంధీ నివాసానికి వెళ్లాడు.,. బ్లిట్జ్ అనే ఓ మ్యాగజైన్ పత్రికలో రాహుల్ గాంధీ రహస్య వివాహం, పెళ్లిళ్లకు సంబంధించిన కథనాలు వచ్చాయి, ఇద్దామని వచ్చాయి అని అక్కడి సెక్యూరిటీ వాళ్లకు చెప్పాడట… వాళ్లు నథింగ్ డూయింగ్ అనేసరికి ఆ కాపీలు వాళ్లకే ఇచ్చేసి, […]
మాయమైపోతున్న గోదావరి..! ప్రవాహం నడుమే అనూహ్యంగా అదృశ్యం… మిస్టరీ..!!
ప్రజాశక్తిలో ఓ వార్త… నదిలో రోజుకు సగటున 28 టీఎంసీల నీరు మాయమైపోతున్నదనీ, సీడబ్ల్యూసీ నివేదికలో కూడా ప్రస్తావించారనీ, దీంతో పోలవరం పటిష్ఠతపై కూడా అనుమానాలు ప్రబలుతున్నాయనేది వార్త… అదృశ్య గోదావరి అని శీర్షిక… సాధారణంగా ప్రవాహజలాల్ని క్యూసెక్కుల్లో, నిల్వనీటిని టీెఎంసీల్లో కొలుస్తాం కదా… మరిదేమిటి..? రోజుకు 28 టీఎంసీలు అంటారేమిటి..? అంతటి సీడబ్ల్యూసీ కూడా (కేంద్ర జల మండలి) అలా నివేదికలో రాసిందా..? సరే, ఈ టెక్నికల్ సందేహాలు పక్కన పెడితే… వాళ్ల లెక్కల్లోనే 28 […]
ఐదు రూపాయలు… ఓ ఆదర్శ స్మరణీయుడి కథను చెబుతోంది ఇలా…
“నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?” తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు ! అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని ! సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటి నుంచి కన్నీటితో వచ్చిన […]
మరి ఆ సందర్భాల్లో మీ గొంతులు ఏమయ్యాయ్ తెలంగాణ బుద్దిజీవులూ..!!
మేధావులు (?), కళాకారులు, రచయితలు, పాత్రికేయులు ఎట్సెట్రా చాలా మంది కేసీయార్ క్యాంపు మనుషులు (ఒక్క హరగోపాల్ మినహా అనుకుంటున్నాను) చాలా ఆవేదనతో, వేదనతో, బాధతో, నొప్పితో రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు… అయ్యా, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీ రేవంత్ రెడ్డి మా సచివాలయం ఎదుట పెడతా అంటున్నాడు… కానీ సరికాదు… సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెడితేనే మొత్తం తెలంగాణ సమాజం ఆకాంక్షలను గౌరవించినట్టు… ఇంకెక్కడ పెట్టినా సరే అవమానించినట్టు… కేసీయార్ […]
నిజంగానే ప్రారంభ వాక్యాలు అలా ఉంటాయేమోనని హడలగొట్టారు కదా సార్..?!
ఆగస్టు 22. 1955. నర్సాపురం ఆసుపత్రి. ఉదయం 10. 10 నిమిషాలు. చిత్త నక్షత్రం. భూమికి నలుదిక్కులా మంగళ వాద్యాలు మోగుతున్నాయి. సప్త ఋషులు ఏడు దిక్కులా నిలబడి మంత్రోచ్ఛాటన చేస్తూ భూమి మీదకి పూలు విసురుతున్నారు. ఎనిమిదో దిక్కున నారద తుంబురులు స్వాగతగానం చేస్తున్నారు. ఒక మహోన్నత వ్యక్తి రాకని సూచిస్తూ ఒక నక్షత్రం ఆకాశంలో ప్రజ్వరిల్లుతూ ప్రకాశిస్తో౦ది. ‘పద్మావతీ నామధేయ నర్సు పురుడు పోయగా, పద్మాసానుడే ఉసురు పోయగా, నటరాజ తేజమై, నవరస నాందీ […]
డౌట్ లేదు… రాజీవ్ విగ్రహం బదులు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే కరెక్టు..!
మొన్న ఎక్కడో మాట్లాడుతూ కేటీయార్ ‘బస్సుల్లో రికార్డింగ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు చేసుకొమ్మనండి, మాకేం అభ్యంతరాల్లేవు’ అని ఏదో అన్నాడు… అంతకుముందు అక్కలు అని రేవంత్ సంబోధించినా సరే, అదేదో మొత్తం తెలంగాణ ఆడపడుచులందరినీ అవమానించారు అంటూ ట్విస్ట్ చేసి, ఏదో గాయిగత్తర లేపాలని చూశారు… కానీ తను చేసిన సంస్కారరహితమైన డాన్సుల మాటేమిటి..? అదేమంటే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని రచ్చ… దానికీ కేసీయార్ కాలంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయో లెక్క చెప్పి సీతక్క కౌంటర్ […]
కరిగిపోయాను కర్పూర వీణలా..! ఓ పాత ప్రేమకథకు కొత్త రూపు ఇలా…!!
ఓ ప్రేమ జంటకు కొత్తగా పెళ్ళైంది… ఆ జంట తమ హానీమూన్‌కు ప్లాన్ చేసుకుంది… కాస్త భిన్నంగా, ఎప్పుడూ గుర్తుండేలా… అది మంచు పర్వతాల్లో ట్రెక్కింగ్ కు వెళ్లడం… థ్రిల్లింగ్ కమ్ రొమాంటిక్… అనుకున్నట్టే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ట్రెక్కింగుకు వెళ్తుంది ఆ జంట… పూర్తిగా పైకి వెళ్ళాక అనుకోని ప్రమాదం… హఠాత్తుగా ఓ మంచు లోయలో పడిపోతాడు ఆ భర్త… షాక్ తింటుంది భార్య… కన్నీరుమున్నీరు అవుతుంది… హానీమూన్ కాస్తా తనకు అంతిమ యాత్రగా […]
నమ్మలేనంత ప్రేమ… భార్య కోసం సముద్రగర్భంలో 13 ఏళ్లుగా అన్వేషణ …
2004లో సునామీ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తే, 2011లో ఆ ప్రతాపం జపాన్ మీద పడింది. పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కారణంగా అలలు ఉవ్వెత్తున ఎగిశాయి. భారీ అలలు తీరాన్ని తాకి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. జపాన్‌లో నమోదైన ప్రకృతి విపత్తుల్లో ఇది అత్యంత పెద్దది. ప్రపంచంలోని భయంకరమైన భూకంపాల్లో ఇది నాలుగోది. అలలు 133 అడుగుల ఎత్తున ఎగిసిపడి జనాన్ని నామరూపాలు లేకుండా చేశాయి. ఈ కారణంగా సుమారు 20 వేల మంది మరణించగా, 6,242 మంది […]
అన్నే షిమోటీ..! నిఖార్సు ఇండియన్ ఆర్ట్… 1976 లోనే ఓ ‘పడమటి సంధ్యారాగం’…
‘పాడనా తెనుగు పాట, పరవశనై మీ ఎదుట మీ పాట, పాడనా తెనుగు పాట’ … అమెరికా అమ్మాయి సినిమా అంటే ఎవరికయినా మొదట గుర్తుకొచ్చేది ఈ పాటే … ఈ పాట వింటే గుర్తుకొచ్చేది అమెరికా అమ్మాయి సినిమాయే … ఇంత చక్కటి , గొప్ప పాటను వ్రాసిన భావ కవి , ఆంధ్రా షెల్లీ , రవీంద్రనాథ్ టాగోర్ మిత్రుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి హేట్సాఫ్ . ఈ పాట విన్నప్పుడు నాకు మరో […]
యండమూరి మాస్టారూ… ఇక ఏ నవల రాసినా ఆ వ్యక్తిత్వ వికాస పాఠాలేనా..?
మన పట్ల మనకు నమ్మకం ఎక్కువైతే దాన్ని ‘ఓవర్-కాన్ఫిడెన్స్’ అంటారు. నా మనసులో ఎక్కడో నాకు, మంచి మార్కులతో పాసయ్యాననే అహం ఉంది. అదీగాక కాలేజీ రోజుల్లో నేనొక గ్యాంగ్ లీడర్ని. ఆ అహంభావం నా బాడీ లాంగ్వేజ్ లో, మాటతీరులో ఎదుటి వాళ్లకి కనపడిపోతోందని అర్థమైంది. ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగిన వాళ్లకి సిద్ధాంతపరంగా సమాధానం చెప్పేవాణ్ని తప్ప నా జవాబులో ప్రాక్టికల్ అప్రోచ్ ఉండేది కాదు. అంతే కాకుండా ఫ్యాక్టరీలో నాపై ఉద్యోగి కన్నా, నాకు […]
విలీనం బీఆర్ఎస్ అవసరం… బీజేపీది కాదు… తక్షణ ఫాయిదా కూడా లేదు…
కేసీయార్ గవర్నర్, కేటీయార్ కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ పగ్గాలు హరీశ్‌రావుకు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చర్చలు… ఇదీ రేవంత్ రెడ్డి చెబుతున్నది… నో, నో, రేవంత్ రెడ్డే బీజేపీలో చేరతాడు… తన చివరి గమ్యం అదే, చూస్తూ ఉండండి… ఇదేమో కేటీయార్ ప్రతివిమర్శ… బీజేపీలో కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది, మాకున్న సమాచారం అదే… బండి సంజయ్ విసుర్లు… ఫాఫం, రాష్ట్ర రాజకీయాలు… విలీనం చేయాలని బీజేపీ అడుగుతోందట, కానీ విలీనానికి కేసీయార్ సిద్ధంగా లేడట, […]
రేవంత్ ఓ ఉన్నత స్థాయి సమీక్ష అవసరం… టెంపుల్ సిటీ పేద్ద పెండింగ్ టాస్క్…
నర్సింహస్వామి దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే… ఓ ముసలాయన, తన ముందు కొడుకు, వెనుక ఓ మహిళ… ఆ ముసలాయనకు ఆక్సిజెన్ పైపు, పోర్టబుల్ మినీ ఆక్సిజన్ సిలిండర్‌ను తోసుకుంటూ కొడుకు… వాళ్లను తీసుకెళ్తూ ఓ ఆలయ ఉద్యోగి… ఆశ్చర్యం అనిపించింది… ఆ అవస్థలోనూ, క్షణక్షణం కృత్రిమ ఆమ్లజని లేకపోతే గడవని అనారోగ్యం, వృద్ధాప్యంలోనూ నర్సన్న దర్శనం కోసం… అలా దివ్యాంగులు, రోగపీడితులు… దేవుడంటేనే నమ్మకం… నమ్మకమే బలం… ఆ బలమే బతుకు మీద ఆశను, కష్టాలపై […]
యాదగిరిగుట్ట మీద ఇప్పుడెలా ఉంది..? ఏమేం మార్పులు జరుగుతున్నయ్..?
యాదాద్రి యాదగిరిగుట్ట అయిపోయింది మళ్లీ… గుడ్… కొండపైన కొన్ని కార్ల పార్కింగుకే చాన్స్ ఉంది… దాంతో కొండపైకి సొంత వెహికిల్‌లో రావడాన్ని నిరుత్సాహపరచడానికి 500 టికెట్ ధర పెట్టారు… కింద పార్కింగుకు 50 రూపాయలు… అక్కడి నుంచి పైకి ఫ్రీ బస్సులు… మరీ వృద్ధులు, వికలాంగులైతే బ్యాటరీ కార్లు… భక్తుల టాయిలెట్ అవసరాల్ని గుర్తించారు… పలుచోట్ల నిర్మించేశారు… డ్రింకింగ్ వాటర్ దివీస్ వాళ్లు ప్రొవైడ్ చేశారు… బాగా నచ్చింది ఏమిటంటే..? వయోవృద్ధులు, దివ్యాంగులు లిఫ్ట్ వాడుకునే ఛాన్స్, […]
జైలుకైనా వెళతా… ఇంటికి మాత్రం వెళ్లను… ఇది భారతీయ భార్య శిక్షా స్మృతి…
జైలుకైనా వెళతా… ఇంటికి మాత్రం వెళ్లను… భారతీయ భార్య శిక్షా స్మృతి మగవాడి కష్టం పగవాడికి కూడా రాకూడదని తెలియజెప్పే కథనమిది. “గృహహింస” అంటే వ్యుత్పత్తి ప్రకారం ఇంట్లో హింస అని. కాకపోతే గృహహింస కేసుల్లో సాధారణంగా భార్యను అత్తమామలు, భర్త వేధిస్తుండేవారు కాబట్టి ఆ మాట అనగానే మహిళలు బాధితులు అన్నంతగా అర్థవ్యాప్తి పొందింది. నిజానికి వ్యుత్పత్తిలో ఆ అర్థం లేదు. కాలం మారింది. ఇప్పుడు గృహహింసకు మగవారు కూడా గురవుతున్నారు కాబట్టి…హింసలో సమానత్వం సాధించినట్లే అనుకుని…ఒకానొక […]
స్టాక్ మార్కెట్‌ను మళ్లీ కూల్చబోయి… ఈసారి తనే కుప్పకూలిన హిండెన్‌బర్గ్…
జార్జ్ సోరోస్ కి మళ్ళీ దెబ్బ పడింది! రాహుల్ పేరును కూడా చేర్చాలి! 94 ఏళ్ళ జార్జ్ సోరోస్ కి ఆగస్టు 12 న 94 ఏళ్లు వచ్చాయి! కానీ ఎప్పటిలాగా పుట్టిన రోజు వేడుక జరుపుకోలేదు! ఆగస్టు 11న అంటే, ఆదివారం రోజున హిండెన్‌బర్గ్ రిసెర్చ్ చేత SEBI ( Securities and Exchange Board of India) ఛైర్ పర్శన్ మీద ఆరోపణలు గుప్పిస్తూ ఒక నివేదిక విడుదల చేయించాడు సోరోస్! ఆ నివేదికలో2023 లో […]
అయోధ్యలో బీజేపీ ఓటమి… ఆలేరులో బీఆర్ఎస్ ఓటమి… దేవుళ్లెందుకు కోపగించారు..?
యాదగిరిగుట్టకు వెళ్తుంటే అనిపించింది… అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది… దేశం మొత్తం దృష్టినీ తనవైపు తిప్పుకున్న ఆ బాలరాముడు బీజేపీని అక్కడ ఎందుకు శపించాడు..? అంతగా వారణాసి కారిడర్ డెవలప్ చేసినా సరే, మోడీ మెజారిటీ ఎందుకు పడిపోయింది కాశిలో… అలాగే యాదగిరిగుట్ట ఉండే ఆలేరులో 1800 కోట్ల ఖర్చుతో గుడికట్టిన కేసీయార్‌ను కాదని కాంగ్రెస్‌ను గెలిపించారు ఎందుకు..? చాలా విశ్లేషణలు ఉండొచ్చుగాక… కానీ కేసీయార్ ఆలోచనలు, ప్రణాళికలు, అడుగులకు స్థానిక జనం తిరస్కరణే కదా అది… అలాగే […]
తెలుగు భాషకు ఇంకా ఈ రాక్షసాల నుంచి ‘స్వాతంత్రం’ రాలేదు..!
ఇంగ్లిష్ లో freedom ను fridom అని కానీ, freedum, fridum, fridam అని కానీ రాస్తే తప్పు. టీచర్లు వెంటనే బెత్తంతో కొడతారు. స్కేల్ తో రాసిన వేళ్లను విరగ్గొడతారు. శిక్షగా Freedom అన్న మాటను వంద సార్లో, వెయ్యి సార్లో రాయించి మనకు ఆ మాట సరిగ్గా వచ్చిందని అనుకునేవరకు మన గుండెల్లో నిద్రపోతారు. తెలుగులో అయితే ఆ సమస్యే లేదు. “స్వాతంత్ర్యం” అన్న మాటను ఎలా అయినా రాసుకునే స్వాతంత్ర్యం మనకు 1947 […]
ఓహ్… ఈ షో కోసం అనవసరంగా ఆహా ఓటీటీని సబ్స్క్రయిబ్ చేసుకున్నానే…!!
ఎందుకో అలా అనిపించింది… హీరో నాని అతిథిగా పాల్గొన్న ఈవారం తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ చూశాక… ఈసారి ఆహా ఓటీటీని దీని కోసం అనవసరంగా సబ్స్క్రయిబ్ చేసుకున్నానా అని..! ఎపిసోడ్ మొదట్లోనే ఈ షో వ్యూస్ లెక్కలు ఏవో చెప్పారు గానీ, బార్క్ రేటింగ్స్లాగా ఫేక్ అనిపించింది… అనిపించడానికి కారణాలూ ఉన్నయ్… ఇతర టీవీలలో సినిమా పాటల కంపిటీషన్ షోలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ అనిపించింది… కంటెస్టెంట్ల ఎంపిక గానీ, ఆర్కెస్ట్రా గానీ, పాటల […]
టాలీవుడ్ పెద్ద తలలూ… సిగ్గుతో పాతాళానికి వంగిపోయాయా..? థూమీబచె..!!
థూమీబచె… ఈ మాట అనడానికి సంకోచం లేదు, సంశయమూ లేదు… మొత్తం ఇండియన్ సినిమాను శాసించేంత సాధన సంపత్తి ఉంది తెలుగు ఇండస్ట్రీలో… కళాకారుల ప్రతిభను కొదువ లేదు… మస్తు క్రియేటివిటీ, మస్తు కష్టపడే తత్వం ఉన్నాయి… కానీ ఎటొచ్చీ మన టాలీవుడ్ ఓరకమైన కమర్షియల్, సోకాల్డ్ మాస్ మసాలా, దిక్కుమాలిన ఇమేజీ బిల్డప్, ఫార్ములా నదిలో పడి కొట్టుకుపోతోంది… ఎందుకొచ్చిన స్టార్డమ్..? సినిమా అంటే ఇంకా నెత్తిమాసిన మూర్ఖ స్టెప్పులు, మడతపెట్టే బూతు పాటలు, వెగటు […]
జోలపాడి.., నిద్రపుచ్చి.., సేదతీర్చి.., రెప్పపడని సమస్యకు రెప్పపాటు సొల్యూషన్…
చైనాలో నిద్రపుచ్చే వ్యాపారం….. నిద్ర పట్టని ప్రపంచం నిద్ర కోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తూ ఉంటుంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను రెప్ప వేసే కాలమే నిమిషం. దేవతలకు మనలాగా కనురెప్పలు పడవు కాబట్టి వారు అనిమేషులు. కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత […]
- « Previous Page
- 1
- …
- 28
- 29
- 30
- 31
- 32
- …
- 124
- Next Page »