Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేపకాయంత ఉందా… రండి, కార్టూనిస్టు కండి..! (కార్టూన్ కబుర్లు-2)

February 3, 2021 by M S R

cartoon kaburlu2

Early warning to young cartoonists……… కార్టూన్ కబుర్లు – మోహన్ “ఈ బుల్లి పుస్తకం చదవండి. ఒక్క వారంలో మంచి కార్టూనిస్టు కాగలరు. మరో వారం తిరిగేసరికి కార్టూన్ గోల్డెన్ స్టార్ గా వెలుగుతారు. అందరి కళ్లూ మీమీదే. ఆటోగ్రాఫ్ హంటర్స్ అందరూ మీవెంటే. ఎడిటర్లూ, పబ్లిషర్లూ బ్లాంకు చెక్కులు పట్టుకుని మిమ్మల్ని వేటాడతారు. కనకవర్షం, కీర్తివాన, నవ్వుల హరివిలల్లు” ఇలా ముందుచెప్తే కింద రాసిందంతా చచ్చినట్టు చదువుతారు కదా అని ఆశ. అయినా అబద్ధాలెందుకు? […]

ఒసే., ఓవర్ మేకప్‌తో ఇంత మోసం చేస్తావా..? తియ్, డబ్బు తియ్..!

February 2, 2021 by M S R

algeria

నిన్నలేని వికారమేదో నిదుర లేచెనే! అపురూపమయిన రూపం అన్న మాట నిజానికి పాక్షికమే కానీ- పరమ ప్రమాణం కాదు. అసలు విషయంలోకి వెళ్లే ముందు తెలుగులో వాడుకలో ఉన్న కొన్ని మాటలను ఒకసారి తలచుకుందాం. అసలు రంగు బయట పడింది. నిజరూపం తెలిసింది. స్వస్వరూప జ్ఞానం. ఎలుక తోలు తెచ్చి ఎంతగా ఉతికినా నలుపు నలుపేగానీ- తెలుపు కాదు. పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చి భయపెడుతుంది. మసిపూసి మారేడు కాయ చేసి. కంటికి మించిన కాటుక. […]

మెర్సీ కిల్లింగ్..! మనసును పిండేసే ఓ హృదయ విదారకమైన కథ..!

February 2, 2021 by M S R

aruna

ఒక వార్త… మెర్సీకిల్లింగ్, అంటే కారుణ్య మరణాన్ని అనుమతిస్తూ పోర్చుగల్ దేశం ఓ నిర్ణయం తీసుకుంది… అంటే చనిపోయేందుకు అనుమతి… నెదర్లాండ్స్, బెల్జియం, కొలంబియా, లక్సెంబర్గ్, వెస్టరన్ ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో ఆల్‌రెడీ మెర్సీకిల్లింగ్‌కు అనుమతి ఉంది… సో, పోర్చుగల్ ఏడో దేశం… దీనికి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకులున్నారు, సమర్థకులున్నారు… తప్పనిసరి పరిస్థితిలో ఒక మనిషి గౌరవంగా మరణించడానికి సమాజం అంగీకరించాలనేది ఈ మెర్సీ కిల్లింగ్ కాన్సెప్టు… మరి మన ఇండియాలో..? ఇక తప్పదు, సాగనంపడమే మేలు అనుకున్నప్పుడు, […]

నేతాజీ..! గెలుపో ఓటమో జానేదేవ్… నాయకుడంటేనే తను..!

January 31, 2021 by M S R

netaji

కాలాతీత స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్ ———————– నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే మనకు అంతులేని అభిమానం. ప్రేమ. ఆరాధన. తాదాత్మ్యం. పులకింత. ఆయన గురించి తెలిసింది ఎంతో- తెలియనిది కూడా అంతే ఉంటుంది. తెలిసినదానితో తెలియనిది ఊహించినా, తెలియనిదాన్ని తెలిసినదానితో ముడిపెట్టుకున్నా ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కు వచ్చిన లాభమూ లేదు- నష్టమూ లేదు. మార్గాలు వేరు కావచ్చు. ఎంచుకున్న విధానాలు వేరు కావచ్చు. కానీ- నూట ఇరవై ఐదేళ్లయినా మనమింకా సుభాష్ చంద్రబోస్ కు విలువ కట్టడంలో […]

మిస్ అజ్ఞానేశ్వరి..! అవును మిస్టర్, మిస్ చేయదగిన మూవీయే…

January 30, 2021 by M S R

mr and miss1

రష్మి, అనసూయ, భానుశ్రీ, తేజస్వి… తాజాగా జ్ఞానేశ్వరి… టీవీ వల్ల ఫేమ్ వచ్చి… సినిమాల కోసం ట్రై చేస్తే బోల్డ్ టైప్ పాత్రలే దిక్కా..? వాటితో వాళ్లు నిచ్చెనమెట్లు ఎక్కడం సాధ్యమేనా..? హేమిటో… సుధీర్, రాంప్రసాద్, గెటప్ సీను వంటి నటులే త్రీమంకీస్ వంటి బోల్డ్ అండ్ అగ్లీ కథలతో కుస్తీ పడుతుంటే పాపం ఆడతారల్ని ఆడిపోసుకోవడం దేనికి లెండి… ఈ జ్ఞానేశ్వరి ఎవరో టీవీలు, సినిమాలు ఎక్కువగా చూసే ప్రేక్షకులకు తెలుసు… మాటీవీలో వచ్చిన పెళ్లిచూపులు […]

ఒక్కసారి ఆమె తీర్పుల తీరేమిటో మీరే చెప్పండి యువరానర్..!

January 30, 2021 by M S R

eenadu

ఒక వార్త… నిజానికి పత్రికల్లో, టీవీల్లో దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఎందుకు లభించలేదో తెలియదు గానీ… ప్రామినెంటుగా రావల్సిన వార్తే…. న్యాయవ్యవస్థను విమర్శిస్తూ రచిత్ తనేజా చేసిన ట్వీట్లపై కేసు… కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది ఈమెపై… అలాంటి ట్వీటే చేసినందుకు కునాల్ కమ్రా అనే హాస్యనటుడిపైనా సేమ్ కేసు నమోదైంది… వీటిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఓ వ్యాఖ్య చేసింది… ‘న్యాయస్థానాల్ని విమర్శించడం పెరుగుతోంది, అందరూ అదే పనిచేస్తున్నారు’ ఇదీ ఆ వ్యాఖ్య… ఓహ్, గమనించారన్నమాట…! […]

తనను చూడడానికి విరగబడేవాళ్లను చూస్తూ షకీలా ఎందుకేడ్చింది..?

January 30, 2021 by M S R

rgv mia

…….. By….. Gottimukkala Kamalakar………………… వర్మ శ్రద్ధగా చదివి, ఫెళ్లుమని నవ్విన పచ్చి జ్ఞాపకం అలాగే ఉంది… రెండేళ్ల క్రితం నాటి పోస్టు ఇది…. కళారంగంలోకి వచ్చిన, రావాలనుకుంటున్న ఏ మహిళకైనా మగపురుషపుంగవుల నుండి అసంఖ్యాకంగా అభ్యర్ధనలూ; వేడుకోళ్లూ; బెదిరింపులూ; ప్రలోభాలూ రాజకీయ నాయకుల వాగ్దానాలకు మించి వస్తూనే ఉంటాయి. మియా మల్కోవా అందుకు మినహాయింపేం కాదు. ఆమెని శారీరకంగా వాడుకుని, అమ్ముకుని తన వాటా న్యాయంగా పంచిన శృంగార పరిశ్రమ నిజాయితీ ముందు; ఆమె అంతరంగాన్ని […]

చివరకు కాశీకి వెళ్లినా ఆ పడికట్టు పదాలేనా కవితమ్మా..!!

January 29, 2021 by M S R

varanasi

ఏ పూజకైనా సరే… సంకల్పం స్థిరంగా, సూటిగా ఉండాలి… ఏ ఫలితం కోసం ఆ పూజ చేయబడిందో, ఆ ఫలితాన్నే ఆశించేలా దృష్టి కేంద్రీకృతమై ఉండాలి, ఆ సంకల్పాన్ని పక్కదోవ పట్టించే మాటలు, చేష్టలు ఉండకూడదు… అలా చేస్తే పూజాఫలమే సిద్ధించదు……….. అప్పుడప్పుడూ పురోహితులు చెప్పే మాటలివి… ఇవెందుకు గుర్తొచ్చాయంటే… ఓ వార్త చదివాక..! సీఎం కేసీయార్ కుటుంబం కాశికి పోయి, గంగకు హారతి ఇచ్చి, దేవుడిని ప్రార్థించింది అనేది ఆ వార్త… ‘‘ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని […]

సక్కగ సమజైత లేదు గానీ… ఏదో అసలు రీజన్ ఉండే ఉంటది…

January 28, 2021 by M S R

rail gandhi

దక్షిణాఫ్రికాల తెల్లోడు మోహన్ దాస్ కరంచంద్ ను రైలుడబ్బలకెల్లి కిందికి నూకకుంటె మనకు సొతంత్రం రాకపొయ్యుండె…! బ్రిటీషోడు మనల బాగజేసుడు “వైట్ మాన్ బర్డెన్” అన్న తీర్న అయ్యదేవర కాళేశ్వరరావు సారు తెలంగాణను బాగజేసుడు “ఆంధ్రమాన్ బర్డెన్” అనకపొయ్యుంటె జయశంకర్ సారుకు విడిపోదామనే పిచ్చి పట్టకుండె..! సుమన్ జైలుకువోకపోతె శిరంజీవి మెగాస్టారు కాకపోతుండె..! సుమన్ సచ్చిపోకుంటె, ప్రభాకర్ ఈటీవీలనే పనిజేస్తుండె…! ప్రజారాజ్యం గిట్ల పవర్లకొస్తె, జనసేన జాడకు లేకపోతుండె..! మియామల్కోవా పుట్టకుంటె, ఆర్జీవీకి పిచ్చులు పుట్టకుంటుండె…! ఎన్టీవోడిని […]

పిచ్చితనం అంటే చిరిగిన దుస్తువులు చింపిరి నెత్తి కాదు…

January 28, 2021 by M S R

mad

By…… విరించి విరివింటి…………..  మొన్న మదనపల్లి సంఘటనతో అందరిలో వచ్చిన ఒక నిశ్చిత అభిప్రాయం ఏమంటే మనమధ్యే చాలామంది పిచ్చివాళ్ళు తిరుగుతూ ఉన్నారని. మన దేశంలో మన కల్చర్ లో మన భాషలో పిచ్చివాళ్ళు అనగానే ఒక లేకి అభిప్రాయం, చిన్నచూపు, అసహ్యమూ కలిగించే పరిస్థితి ఉంది. కానీ పిచ్చివాళ్ళు నేరస్థులు కాదు. వారు కొన్ని నమ్మకాలకు విక్టిమ్స్ అని గుర్తించడమే కాక వారిని సరైన సమయంలో గుర్తించి వారికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే […]

లైసెన్సు తీసుకోండి! ఇళ్లల్లో బాటిళ్లకు బాటిళ్లు తాగండి!!

January 26, 2021 by M S R

liquor

మనదేశంలో ఉత్తర ప్రదేశ్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఇరవై కోట్ల జనాభా అంటే నాలుగయిదు యూరోప్ దేశాల జనాభాకు సమానం. ఉత్తర ప్రదేశ్ లో పరమ పవిత్ర గంగ ప్రవహిస్తుంది. కోట్ల పుణ్యక్షేత్రాల సమానమయిన కాశీ ఉంది. త్రేతాయుగం నాటి పావన అయోధ్య ఉంది. త్రివేణీ సంగమ ప్రయాగ ఉంది. సనాతన రుషులు కోరి కోరి తపస్సుకోసం ఎంచుకున్న నైమిశారణ్యం ఉంది. ఇంకా లెక్కలేనన్ని పుణ్యక్షేత్రాలున్నాయి. గోమతి లాంటి పుణ్యతీర్థాలున్నాయి. పుణ్యపురుషులు పుట్టారు. పెరిగారు. ఇంకా […]

రంధి అంటే..? తెలుగులో ఏరియాను బట్టి అర్థం… పూర్తి భిన్నంగా కూడా..!!

January 26, 2021 by M S R

randhi1

ఒక నాణేన్ని తీసుకొండి… తెలంగాణలో కొన్నిచోట్ల పైసలు అంటారు… కొందరు సిక్కా అంటారు… కొన్ని ప్రాంతాల్లో కొత్తలు అంటారు… ఆంధ్రాలో అడిగి చూడండి… నాణేలు అనే అంటారు, డబ్బులు అంటారు…….. అంటే, ఒకే దాన్ని వేర్వేరుగా పిలుచుకుంటున్నాం… అన్నీ తెలుగే మళ్లీ… వేర్వేరు అర్థాలు కావు… ఒకే అర్థం, వేర్వేరు పదాలు…… అయితే ఉల్టా చేయండి ఓసారి… వేర్వేరు అర్థాలు, ఒకే పదం… అన్నీ తెలుగే మళ్లీ… కాకపోతే ఒకే పదాన్ని అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం, బాష్యం […]

రాజధాని వీధుల్లో లేపాక్షి జయకేతనం

January 26, 2021 by M S R

lepakshi

ఏటా దేశరాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పెరేడ్లో వివిధ రాష్ట్రాల శకటాలను ప్రదర్శించడం ఒక ఆనవాయితీ. ఆసేతు హిమాచలం వివిధ సంస్కృతులకు ఈ శకటాలు ప్రతిరూపం. ఈ ఏడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గణతంత్ర పెరేడ్లో లేపాక్షి శకటం ప్రాతినిధ్యం వహిస్తోంది. “లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా!” అని అడవిబాపిరాజు ఆత్మీయంగా అడిగితే కాదనకుండా లేవబోయిన; కైలాస శిఖరిలా కదలబోయిన; కదిలితే పొంగేటి పాల్కడలి గంగడోలు అటు ఇటు ఊగిన, అర్రెత్తి చూస్తే ఆకాశగంగ కిందికి […]

హలో… అప్పటి శేషన్‌కు ప్రధాని పీవీ కీలెరిగి వాతపెట్టిన తీరు తెలుసా..?!

January 25, 2021 by M S R

seshan

టీఎన్ శేషన్… 1990 చివరలో ఈ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యాడు… అత్యంత కీలకమైన కేబినెట్ సెక్రెటరీ ర్యాంకు దాకా ఎదిగిన ఉన్నతాధికారి… అధికార వ్యవస్థలో తెలియని కిటుకుల్లేవు… పైగా పెద్ద బుర్ర… ఎప్పుడయితే ఎన్నికల కమిషనర్ అయ్యాడో, ఇక పెద్ద కొరడా పట్టుకున్నాడు… ఎన్నికల అక్రమాలపై ఝలిపించడం ప్రారంభించాడు… ఎన్నికల సంఘం అనేది ఒకటి ఉంటుంది, తలుచుకుంటే అది తాట తీసి, దండెం మీద ఆరేస్తుంది అని ఆచరణలో చూపించాడు… అప్పటిదాకా కాగితాలు, చట్టాలకే […]

పల్లిక్కట్టు శబరిమలక్కూ..! రోజూ సంధ్య వార్చేవాడికి మాలెందుకోయ్..?!

January 25, 2021 by M S R

sabari

By…. Gottimukkala Kamalakar……………  #పల్లిక్కట్టుశబరిమలక్కూ..!    1995 నుండి 1998 వరకు ఆర్ధిక స్థితి అడ్డదిడ్డమైపోయిన సంవత్సరాలు. మూడు వేల రూపాయల జీతంతో ఎనిమిది వేల ఖర్చుతో 1998 అక్టోబర్ కల్లా లక్ష రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయాను. రైల్వే స్టేషన్ లో జేబుదొంగలా ఏ చుట్టం, పరిచయస్తుడి జేబు ఎత్తుగా ఉందా ఓ రెండు వేలడుగుదాం అని చూస్తుండేవాణ్ని. ఐదొందల అప్పు కోసం అంతులేనన్ని అబద్ధాలు చెప్పేవాణ్ని. తట్టుకోలేనంత భారం..! నెలకోసారి జీతం..! నిమిషనిమిషానికీ ఖర్చు..!! […]

పర్ సపోజ్, ఆమె వేరే పెళ్లిచేసుకుంటే… మాజీ భర్త వీర్యంపై హక్కులేమవుతయ్..?

January 23, 2021 by M S R

sperm

నిజంగా ఓ ఇంట్రస్టింగు అంశమే… ముందుగా ఒరిజినల్ వార్త చదవండి ఓసారి… సంక్షిప్తంగా… ‘‘భర్త వీర్యంపై అతడి భార్యకే పూర్తి హక్కులు ఉంటాయని కోల్‌కతా హైకోర్టు స్పష్టం చేసింది… ఇతరులు ఎవరైనా హక్కులు పొందాలంటే.. తప్పనిసరిగా ఆ భార్య అనుమతి పొందాల్సిందేనని తీర్పు చెప్పింది… కోల్‌కతా వ్యక్తికి 2015లో ఢిల్లీ మహిళతో వివాహమైంది… తనకు తలసేమియా వ్యాధి…  2018లో మరణించాడు… మరణానికి ముందే ఢిల్లీలోని ఓ స్పెరమ్ బ్యాంకులో తన వీర్యాన్ని భద్రపరిచాడు…. 2020 మార్చిలో ఆయన […]

జగనన్న వింత జీవో..! విజయనగరం విద్యావిభాగమే విస్తుపోయింది..!!

January 23, 2021 by M S R

deo

ఆ నిమ్మగడ్డ వర్సెస్ జగన్ పంచాయితీ ఇప్పట్లో తేలదు గానీ… వేరే సబ్జెక్టుల్లోకి వెళ్లిపోదాం ఓసారి… చిన్న చిన్నవే కానీ కొన్ని ఆలోచనల్లో పడేస్తుంటయ్ కొన్ని వార్తలు… అలాంటిదే ఇది కూడా…! అప్పుడప్పుడూ జగన్ పాలనలో కొన్ని విచిత్ర జీవోలు… అనగా విస్తుపోయే ఆదేశాలు వస్తుంటాయి… చూచువారలకు చూడముచ్చటట టైపు ఉత్తర్వులు కావు అవి… చదువువారలకు జుత్తు పీకునట టైపు… విషయం ఏమిటంటే..? ఉత్తర కోస్తాలో ఓ జిల్లా… ఫాపం, వెనుకబడిన జిల్లాలు కదా, అధికార యంత్రాంగానికి […]

మందు లేని మాయదారి రోగం… మందు తాగడాన్ని పెంచేసింది…

January 22, 2021 by M S R

alcoholism

కరోనాతో పెరిగిన మద్యం కిక్కు! కాపురాల్లో చిచ్చు!! ———————— “తాగితే మరిచిపోగలను- తాగనివ్వదు; మరిచిపోతే తాగగలను- మరవనివ్వదు; మనసు గతియింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికీ సుఖము లేదంతే… కరోనా వస్తే మరలిపోదు; మందువేసుకున్నా మరిచిపోదు; వైరస్ ఉంటే మాసిపోదు; ఐసొలేషన్లో ఉన్నా కునుకుపడదు… అంతా కోవిడనే తెలుసు; అదీ ఒక మాయేనని తెలుసు; తెలిసీ తిరిగీ విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు? మరుజన్మ వున్నదో లేదో? ఈ వైరస్సులప్పుడేమవుతాయో? మనిషికి వైరస్సే తీరని శిక్ష! దేవుడిలా […]

యాభై ఏళ్ల కిందటి వాణిజ్య ప్రకటనల్లో తెలుగు వెలుగు..!!

January 21, 2021 by M S R

advt2

ఇప్పుడంటే వాణిజ్య ప్రకటనల్లో తెలుగుకు గోచీ గుడ్డ కూడా మిగల్లేదు కానీ- అర్ధ శతాబ్దం కిందటి ప్రకటనల్లో తెలుగు తెలుగుగానే ఉండేది. కవితాత్మకశైలిలో చక్కటి, చిక్కటి తెలుగు ఉండేది. వాక్యంలో కర్త, కర్మ, క్రియ అన్వయం కుదిరి చదివిన వెంటనే అర్థమయ్యేది. సాంకేతిక విషయాలను కూడా అరటి పండు ఒలిచిపెట్టినట్లు సులభంగా చెప్పే ప్రయత్నం ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తెలుగు సంస్కృతికి సొంతమయిన సంగీత, నాటకాభివృద్ధికి ఒక అకాడెమీ ఉండేది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన అన్న […]

చంద్రబోస్… నవ్వుతూ కాదు, సిగ్గుతో తలదించుకో ఓసారి… నువ్వు జడ్జివా..?!

January 21, 2021 by M S R

chandrabose

యాంకర్ ప్రదీప్ ఓ చిల్లర్… తనకు ఎలాగూ లేదు… చంద్రబోస్‌కు ఏం పుట్టింది..? ఈ మాట అనడానికి, ఈ విమర్శ చేయడానికి ‘ముచ్చట’ సాహసిస్తోంది… నువ్వెన్ని పాటలు రాశావో, ఏం సంపాదించుకున్నావో పక్కన పెట్టు బ్రో… నీ కూతురు వయస్సున్న ఓ పొరుగు రాష్ట్రపు సింగర్‌ అమాయకత్వాన్ని పరిహసిస్తూ, వెకిలి చేస్తున్నప్పుడే నీ అసలు వికృతరూపం అర్థమైపోయింది… ఇక కాస్త మూసుకో భయ్……. అరెరె, విషయం ఏమిటీ అంటారా..? కాస్త వివరంగా చెప్పాలి… జీతెలుగు టీవీలో ఓ […]

  • « Previous Page
  • 1
  • …
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • …
  • 35
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions