Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాడీయే బార్… పేగుల్లోనే బ్రూవరీ… కడుపులోనే నైన్టీ తయారీ…

May 6, 2024 by M S R

brewery

మందు… మెడిసిన్ కాదు, మద్యం… తాగితే వ్యసనం… నాలుక ఊరుకోదు, టైమయితే చాలు ఎప్పుడెప్పుడు అంటూ నాలుక పిడచకట్టుకుపోతుంది… అలవాటు చేశావు కదా, ఏదీ పెగ్గు, రానియ్ రానియ్ అని గోలపెడుతుంది కాలేయం… ఆత్మారాముడు ఆవురావురు అంటుంటాడు… అప్పోసప్పో చేసెయ్, సీసా మూత తీసెయ్… వచ్చిన జీతం అధికశాతం బారులోనే హరీమంటుంది… పైగా రకరకాల వింత వింత పేర్లతో ప్రభుత్వమే ఎంకరేజ్ చేసే చీపెస్ట్ లిక్కర్, అనగా రంగుసారా… రిస్క్ చేస్తే కిక్కేమిటో గానీ కక్కు గ్యారంటీ, […]

దర్శకుడిగా 16 సినిమాలు… 14 సినిమాలకు జాతీయ అవార్డులు…

May 6, 2024 by M S R

girish

Sai Vamshi……. * నేను తీసిన ‘గులాబీ టాకీస్’ సినిమా చివర్లో ఒక టీవీ మీద కుక్క కూర్చుని ఉంటుంది‌. ఆ కుక్క దేనికి సంకేతం అని కొందరు అడిగారు. “కుక్క కుక్కకే సంకేతం” అని చెప్పాను. మరేదో సూచించడానికి నేను కుక్కని సింబల్‌గా పెట్టానని వాళ్ల ఊహ. అలాంటి లెక్కలు వేసుకుని సినిమా చూస్తే ఎలా? అందుకే “For the God Sake, Please don’t read Cinema. Watch it” అని నా అసిస్టెంట్లకు, […]

ముసలోళ్లు మాత్రమే కాదు, పడుచువాళ్లూ తప్పక చదవాల్సిన స్టోరీ…

May 6, 2024 by M S R

dr hideki wada

Hideki wada… ఈయన ఓ Psychiatrist… గత మార్చిలో “80-Year-Old Wall” అని ఓ పుస్తకం రాశాడు… మార్కెట్‌లోకి రిలీజైంది… వేగంగా 5 లక్షల కాపీలు అమ్ముడైపోయాయి… ఈ వేగం ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 లక్షల కాపీల మార్క్ సాధిస్తుంది… అంటే ఈ సంవత్సరం జపాన్‌లో అత్యధికంగా విక్రయించబడే పుస్తకం అన్నమాట… ఎవరీయన..? వృద్ధుల్లో వచ్చే మానసిక సమస్యలను ట్రీట్ చేసే డాక్టర్… 61 ఏళ్లు… గత 35 ఏళ్లలో 6 వేల మందిని ట్రీట్ […]

పారిపోవడం కూడా యుద్ధవ్యూహంలో ఓ భాగమే అంటారు పెద్దలు…

May 5, 2024 by M S R

rahul

Subramanyam Dogiparthi….. పారిపోవటం కూడా యుధ్ధ వ్యూహంలో ఒక భాగమే అని ఈమధ్య వచ్చిన మహాభారతం సీరియల్లో శ్రీకృష్ణుడు చెపుతాడు . సీరియల్ అని ఎందుకు అన్నానంటే వ్యాస భారతంలో అన్నాడో, భాగవతంలో అన్నాడో నాకు తెలియదు . ప్రవచనకర్తలు జరాసంధుని గోల పడలేక కృష్ణుడు మధుర నుండి ద్వారకకు షిఫ్ట్ అయ్యాడని చెపుతుంటారు . సరే . ఇప్పుడు కలియుగ భారతానికి వద్దాం … పాపం రాహుల్ ! 2004 , 2009 , 2014 […]

ఎన్ఆర్ఐ అంటే దేశవ్యతిరేకా..? నటులంటే నాస్తికులా..? ఇవేం సూత్రీకరణలు..?!

May 5, 2024 by M S R

aj rk

‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్‌ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు. ప్రవాస భారతీయులు దేశాన్నెలా ప్రేమించాలో చెబుతారు. నేరగాళ్లు విలువలను బోధిస్తారు. రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు. దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు!’’ అని దేవులపల్లి కృష్ణశాస్రి అనే రచయిత ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఆవేదన చెందాడు…. …. ఆంధ్రజ్యోతి పత్రికలో […]

ఎక్కడైనా అక్షింతలు అంటే బియ్యమే… ఆకాశం వర్షించే గింజలు కావు…

May 5, 2024 by M S R

ktr

బీజేపీ హిందూ సంఘటన వ్యూహాల్ని ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్‌కు అస్సలు అర్థం కావడం లేదు, ప్రసంగాల్లో గందరగోళం కనిపిస్తోంది… అప్పుడే ఒక మాట, మళ్లీ అప్పుడే మరో మాట… కేడర్‌లోనూ అయోమయం నింపుతున్నారు… అన్నింటికన్నా ముందుగా… బీఆర్ఎస్‌కు మొన్నమొన్నటిదాకా మజ్లిస్ సెక్యులర్ పార్టీ, జాన్ జిగ్రీ… కానీ బీజేపీ మాత్రం మత పార్టీ… చేతనైతే బీజేపీ విధానాల్ని ఖండితంగా వ్యతిరేకించాలి, తప్పదు, తప్పులేదు, అది రాజకీయ అవసరం… అది అమాంతం మింగేయడానికి వస్తున్న అనకొండ… కానీ అటూఇటూ […]

ఆ పాత చంద్రబాబు నేడు లేడేమి..? అంత అనుభవంతోనూ ఈ కంగారేమి..?

May 5, 2024 by M S R

babu

Nancharaiah Merugumala….. జరగమంటే జరుగుతాడా, జగన్‌? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ……………………………………………………………… ‘ జరుగు జరుగు జగన్‌–ఖాళీ చెయ్యి కుర్చీ ’…….. ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్‌ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో ఏం సాధించాలనుకుంటున్నారో అర్ధం […]

బంగారంపై పిచ్చి అక్షయం… వ్యాపారుల టెక్నిక్కులు అ‘త్రితియం’…

May 5, 2024 by M S R

akshaya

కొత్త పండగ అక్షయ త్రితియ! అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే. లలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ- అక్షయ తృతీయ రోజు పూజ చేస్తే కనకధార ఊరికే కురుస్తుందంటే కాదనాల్సిన పనిలేదు. అక్షయ తృతీయ రోజు ఏ దేవుడిని పూజించినా తరగని సంపద వస్తుందనేది ఇంకొంచెం బ్రాడర్ భక్తి సూత్రం. ఇదీ మంచిదే. అక్షయ తృతీయ […]

లాపతా లేడీస్‌లో ఆ సీన్… యానిమల్ కౌంటర్‌కు కిరణ్‌రావు రీకౌంటర్…

May 5, 2024 by M S R

vanga

యానిమల్… వసూళ్లతో దున్నేసిన ఈ సినిమాపై బుద్ధిజీవుల విమర్శలు కూడా ఆ వసూళ్ల స్థాయిలోనే ఉన్నాయి… అర్జున్‌రెడ్డి దగ్గర నుంచీ దర్శకుడు వంగ సందీప్‌రెడ్డి మీద విమర్శలు ఆగలేదు కదా… కాకపోతే గతంలో సైలెంటుగా ఉండేవాడు… ఇప్పుడేమో తన సినిమాపై నేరుగానో, వ్యంగ్యంగానో వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరికీ తన భాషలోనే జవాబులు చెబుతున్నాడు… సరే, అవి కన్విన్సింగుగా ఉన్నాయా అనేది మన దృక్కోణాన్ని బట్టి ఉంటుంది… కానీ పెద్దగా వివాదాల తెర మీద కనిపించని ఆమీర్ […]

ఫలితాల అంచనాల్లో రవిప్రకాష్ సాహసం… నాలుగో ‘ఆర్’ అవుతాడా..?

May 5, 2024 by M S R

raviprakash

ఆర్… రామోజీరావు ఈనాడు, ఆర్… రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి, ఆర్… రాజగోపాలనాయుడు టీవీ5… ట్రిపుల్ ఆర్… వీళ్లంతా జగన్ వ్యతిరేక శక్తులే… చంద్రబాబు అనుకూల వ్యక్తులే… బయటికి ఏం చెప్పుకోబడినా సరే, ప్రస్తుతం జగన్ అధికారాన్ని కూల్చాలని విశ్వప్రయత్నం చేస్తున్నవారే… అందరి సామాజికవర్గమూ ఒకటే… అందరూ జగన్ ప్రారంభించిన కులసమరంలో ఒకవైపుకు నెట్టేయబడినవారే… ఈ ట్రిపుల్ ఆర్‌కు మరో ఆర్ జతచేరుతుందా..? అదే సామాజికవర్గం… గతంలో అదే జగన్ వ్యతిరేకత… ఈ ఆర్ పేరు రవిప్రకాష్… టీవీ9 ఫౌండర్… […]

ఈయన ఇప్పటి ఏఆర్ రెహమాన్ కాదు, పాత ఎంఏ రెహమాన్…

May 5, 2024 by M S R

rahman

Bharadwaja Rangavajhala….. త్యాగయ్య బర్త్ డే సందర్భంగా… రెహమాన్ గురించి… రెహమాన్ అనగానే ఏఆర్ రెహమాన్ అనుకుంటున్నారా కాదు… ఎమ్ఏ రెహమాన్ గురించి అన్నమాట… పాత సినిమాలు చూసేవాళ్లకు బాగా గుర్తుండే కెమేరా దర్శకుడు రెహమాన్. ఆయన పూర్తి పేరు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్. రెహమాన్ అనగానే నాగయ్యగారి త్యాగయ్య గుర్తొస్తుంది నాకు. అన్నట్టు ఈ రోజు త్యాగయ్యగారి బర్త్ డే కూడాను. అందులో త్యాగయ్య కావేరీ నదిని దాటుతోంటే పోయిన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపించి కనుగొంటినీ […]

సాయిబాబా పడకగదిలో హత్యలు… ఇక ఎప్పటికీ తేలని ఓ మిస్టరీ…

May 5, 2024 by M S R

6 murders

Sai Vamshi….   … 1993లో పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన 6 హత్యల గురించి కేరళకు చెందిన హేతువాది బసవ ప్రేమానంద్ గారు రాసిన పుస్తకం ఇది. మహిమలు, స్వామీజీలకు వ్యతిరేకంగా జీవితమంతా కృషి చేసిన ప్రేమానంద్ 1974 నుంచి సత్యసాయి బాబా మీద పోరాడారు. 1986లో దాదాపు 500 మంది కార్యకర్తలతో కలిసి పుట్టపర్తిలో కవాతు నిర్వహించినందుకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అదే ఏడాది ఆయన కోర్టులో బాబా మీద కేసు వేశారు. శూన్యం […]

దిమాక్‌లో చటాక్… వోటుపై ప్రశ్నకు హీరోయిన్ జ్యోతిక బుర్ర గిరగిరా…

May 5, 2024 by M S R

jyothika

ఓసారి ఓ ప్రసిద్ధ మేధావిని కలిసినప్పుడు ఓ ప్రపంచ అందగత్తె … మనం పెళ్లి చేసుకుందాం, మనకు పుట్టబోయేవాడు నా అందంతో, మీ తెలివితో పుడతాడు అని అడిగిందట… ఆయన ఆశ్చర్యపోయి, ఆమెను ఎగాదిగా చూసి నవ్వుతూ… నిజమే గానీ, వాడు నీ బుద్దితో, నా అందంతో పుడితే ఎలా అన్నాట్ట… ఎప్పుడో చదివినట్టు గుర్తు ఇది… నటి జ్యోతిక ప్రెస్ మీట్ వార్త చదువుతుంటే హఠాత్తుగా ఇదెందుకు గుర్తొచ్చిందో కూడా తెలియదు… కానీ ఒక్కటి మాత్రం […]

అరెరే! సుప్రీం కోర్టు పుసుక్కున ఎంతమాట అనేసింది!

May 4, 2024 by M S R

pre wed

ఇప్పటి మన పెళ్లి అసలు పెళ్లే కాదా? అరెరే! భారత సర్వోన్నత న్యాయస్థానం- సుప్రీం కోర్టు పుసుక్కున ఎంతమాట అనేసింది! ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే! అంటే… కొన్ని దశాబ్దాలుగా ట్రెండు మారిన మన భారతీయ హిందూ పెళ్లి అసలు పెళ్లే కాదా? వివాహ ఆహ్వానపత్రికలు ముద్రింపించి…మూలలకు పసుపు, కుంకుమ రాసి…మధ్యలో అక్షతలు అద్ది…ఊరూరూ తిరిగి…ఇంటింటికి వెళ్లి…బొట్టు పెట్టి…పెళ్లికి పిలిచే సంప్రదాయాన్ని వాట్సాప్ యూనివర్సిటీ మింగేసింది. వాట్సాప్ లో కాబోయే వధూవరులు పెళ్లికి ముందే తొందరపడి కూసిన…ఎగిరిన…ఒకరి […]

ఏపీ వాలంటీర్లపై రాజకీయాల్లాగే… ఒడిశా మహిళా గ్రూపులపై కన్నెర్ర…

May 4, 2024 by M S R

sujatha

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఈ ఎన్నికల వేళ బాగా చర్చనీయాంశం అయ్యింది… వైసీపీ కోసం ఆ వ్యవస్థ పనిచేస్తుందనేది టీడీపీ కూటమి నమ్మకం… అందుకే ఎన్నికలు ముగిసేదాకా వాళ్లతో పెన్షన్లు కూడా ఆపివేయించింది ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి… ఇంకేం, సమయానికి పెన్షన్లు రాక ఎవరెవరో చనిపోయారనీ, దుర్మార్గుడైన చంద్రబాబు వల్లే ఈ మరణాలు అని వైసీపీ గగ్గోలు స్టార్ట్ చేయగా… అధికార వ్యవస్థతో పెన్షన్లు పంపిణీ చేయకుండా జగనే ఆ మరణాలకు బాధ్యుడని చంద్రబాబు ఆరోపణ… […]

నిజంగా కిన్నెర మొగులయ్యకు తెలంగాణ సమాజం ఏమీ చేయలేదా..?!

May 3, 2024 by M S R

mogulayya

ముందుగా ఓ క్లారిటీ… కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిందీ అంటే… అది వివిధ రంగాల్లో ఆయా వ్యక్తుల ప్రతిభ, చేస్తున్న సేవలకు ఓ గుర్తింపు… పనిలోపనిగా ప్రోత్సాహకంగా పెద్ద మొత్తంలో డబ్బు… అంతే తప్ప ఒకసారి పద్మ పురస్కారం ప్రకటించినంత మాత్రాన ఇక ఆ వ్యక్తుల కుటుంబాల అన్ని ఖర్చులకూ కేంద్రమే పూచీపడ్డట్టు కాదు..! పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య కూలీ పనులు చేసుకుని బతుకుతున్నాడు అని సోషల్ మీడియాలో, మీడియాలో బోలెడుమంది సానుభూతి కురిపిస్తున్నారు… […]

అమెఠీలో స్మృతి జోలికి పోవద్దు సరే… రాయబరేలీయే ఎందుకు..?

May 3, 2024 by M S R

rahul

Nancharaiah Merugumala……… అమెఠీలో గుజరాతీ పార్శీల కోడలు స్మృతి చేతిలో రెండోసారి ఓడిపోవడం మరో పార్శీ ప్రముఖుడు ఫిరోజ్‌ గాంధీ మనవడు రాహుల్‌ కు ఇబ్బందికరమే మరి! ‘అమ్మ ఒడి’ రాయ్‌ బరేలీయే అత్యంత సురక్షిత స్థానం –––––––––––––––––––––– ఒక గుజరాతీ జొరాస్ట్రియన్‌ (జుబిన్‌ ఇరానీ) భార్య స్మృతి ‘మల్హోత్రా’ ఇరానీ చేతిలో వరుసగా రెండోసారి బాబాయి ఒరిజినల్‌ సీటు అమేఠీలో ఓడిపోవడం ఎందుకో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఇష్టం లేదనుకుంటా… తొలి ప్రధాని పండిత […]

నా 2,700 అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్‌లంటారా? అదొక నంబర్- అంతే…

May 3, 2024 by M S R

revanna

ఇచ్చట రాసలీలల వీడియోలు చేయబడును… నా పార్లమెంటు పరిధిలోని అపహాస్యాస్పదోపహతులైన నిర్హాస ప్రజలకు జర్మనీనుండి మీ ఓటు ప్రజ్ఞకు ప్రతిరూపమైన నానావికార ప్రజ్వలిత ప్రతినిధి వ్రాయు బహిరంగ లేఖార్థములు ఏమనగా:- ఉభయకుశలోపరి నేనిక్కడ క్షేమముగాయున్నాను. మీ క్షేమమునకై ఇక్కడ చల్లని వాతావరణంలో చలికి చిల్ అవుతూ దేవుడిని ప్రార్థించుచున్నాను. “అర్థాతురాణాం నగురుర్నబంధు:, కామాతురాణాం నభయం నలజ్జా; విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వం” ఈ శ్లోకాన్ని కొన్ని లక్షల మంది భారతీయులు నా వాట్సాప్ కు […]

కోవిషీల్డ్, కోవాక్సిన్… భయమొద్దు.,. ఇవీ వాటి తయారీలో తేడాలు…

May 2, 2024 by M S R

vaccine

Jagan Rao….. వ్యాక్సిన్ పంచాయతీ మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అసలు కొవీషీల్డ్ వ్యాక్సిన్ అయినా, కోవాక్సిన్ వ్యాక్సిన్ అయినా ఎలా తయారు చేశారు..? నేను చికాగో యూనివర్శిటీ, అమెరికాలో Ph.D చేస్తున్నప్పుడు వైరాలజీ కోర్స్ ఒక సెమిస్టర్ చదవాలి. దానిలో భాగంగా 10 కంటే ఎక్కువే వ్యాక్సిన్స్ తయారు చేశాను. నేనే కాదు, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, వైరాలజీ మాస్టర్ స్టూడెంట్ ఎవరైనా 2 రోజుల్లో వ్యాక్సిన్ తయారు చేయవచ్చు. మొదట కోవాక్సిన్ వ్యాక్సిన్ ఎలా తయారు […]

శ్రీశ్రీని తాకినవాణ్ని, శ్రీశ్రీతో మాట్లాడినవాణ్ని… శ్రీశ్రీ పాడె మోసినవాణ్ని…

May 2, 2024 by M S R

శ్రీశ్రీ

Taadi Prakash…….  శ్రీశ్రీకి… అశ్రుదీపాల అల్విదా!   Last Journey of the greatest poet of 20th century ——————————————— రాయగడలో సూర్యోదయంతోపాటే లేచారు శ్రీశ్రీ. ఉదయం 8.30కే చర్చావేదిక. ప్రశ్న జవాబు సెషన్. సాయంత్రం బహిరంగ సభ. 1981 మే నెల 2వ తేదీ శనివారం. రాయగడ మున్సిపల్ టౌన్ హాలు. శ్రీశ్రీకి సన్మానం. రచయితలు అర్నాద్, మంథా వెంకట రమణ, పంతుల జోగారావు ముఖ్య అతిథులు. జర్నలిస్టు ‘జోత్స్న’, వెలుగు రామినీడు మరికొందరు నిర్వాహకులు. […]

  • « Previous Page
  • 1
  • …
  • 58
  • 59
  • 60
  • 61
  • 62
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions