మనం అప్పుడప్పుడూ టీవీ చానెళ్ల రేటింగుల గురించి మాట్లాడుకుంటున్నాం… ఇప్పుడిక ఎన్టీవీ స్థిరంగా ఫస్ట్ ప్లేసులో కూర్చుండిపోయింది… ఇప్పట్లో టీవీ9 దాన్నికొట్టేసే పరిస్థితి, సూచనలు కనిపించడం లేదు… ఆ రెండే… మిగతావన్నీ సోసో… మరి వినోదచానెళ్లు..? మనకు ఉన్నవే నాలుగు ప్రధానమైన వినోద చానెళ్లు… అందులో జెమిని టీవీని పక్కన పెట్టాల్సిందే… ఒకప్పుడు టాప్… ఇప్పుడది ఆరో ప్లేసు… ఎప్పుడో ఓసారి ఏదైనా హిట్ చిత్రాన్ని టెలికాస్ట్ చేసినప్పుడు తప్ప ఆ చానెల్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు… […]
అక్షర కాష్మోరాలు… క్షుద్ర అనువాదాల్లో వాణిజ్య ప్రకటనలే టాప్…
Telugu-Tegulu: తెలుగులో హాస్య రచనలు బాగా తగ్గిపోయాయని బాధ పడాల్సిన పనిలేదు. జంధ్యాల తరువాత ఆ స్థాయిలో ప్రతి పదానికి నవ్వుల పూత పూసే కలాలు లేవని దిగులు పడాల్సిన పనే లేదు. రోజూ పత్రికల్లో వచ్చే తెలుగు ప్రకటనలు చదివితే…ప్రతి పదంలో నవ్వులే నవ్వులు. ప్రతి లైనుకు పొట్ట చెక్కలయ్యే నవ్వులే నవ్వులు. నవ్వలేక నవ్వలేక మన కళ్లల్లో నీళ్లు తిరిగేలా ప్రకటనలు తయారు చేస్తున్న యాడ్ ఏజెన్సీలకు, అనువాదకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మనల్ను కడుపుబ్బా నవ్వించడానికి ఒక ప్లాటినం […]
దివాలా దిశ… చివరకు ఆర్మీ డ్రిల్స్‌కు కూడా కత్తెర్లు… ఫాఫం పాకిస్థాన్…
పార్ధసారధి పోట్లూరి ….. బస్! ఖేల్ ఖతం! దుకాణ్ బంద్! ఈ సంవత్సరం చివరి వరకు పాకిస్థాన్ సైన్యం రోజువారీ సైనిక డ్రిల్స్ తో పాటు పెట్రోల్, డీజిల్ తో నడిచే ఎలాంటి సైనిక యుద్ధ టాంకులు కూడా డ్రిల్స్ లో పాల్గొనడానికి వీల్లేదు! ఒక T-80 యుద్ధ టాంక్ ఒక కిలోమీటర్ దూరం వెళ్ళడానికి రెండు లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. ఇక రోజు వారీ డ్రిల్ కోసం F-16 ఫైటర్ జెట్ కి అయితే […]
ఎడిటరోక్రసీ… తాము లేనిదే పొయ్యిలో పిల్లి లేవదనుకుంటారు ఎడిటర్లు…
మీరు ఎడిటర్ కు చెబుతారేమో చెప్పుకోండి . నేనేమీ భయపడను అంటూ కాసింత కోపంతో అతను అనగానే నాకు నిజంగానే ఒక్కసారి భయం వేసింది . అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయాను . మీడియాలో బాస్ ల నియంతృత్వం , సిబ్బందిని బానిసల్లా చూస్తూ మానసికంగా ఎంత హింసిస్తున్నారో ఒక్కసారి తలుచుకొంటూ అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయాను . ఎడిటర్లు మానసికంగా వేధించడం గురించి తెలుసు . కానీ దాని ప్రభావం ఇంతగా ఉంటుంది […]
… అండ్ దటీజ్ చంద్రబాబు, సమయం చూసి ప్రతీకారంతో అలా కాటేశాడు…
అత్తా అల్లుడు, మధ్యలో మామ… లక్ష్మీ పార్వతి చిటికేసి పిలిస్తే బాబు వాలిపోయారు … ఆ పార్టీ ఆంతరంగికులు అంతా ఒకే పత్రిక వాళ్ళు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————————– 1994 వరంగల్ లో టీడీపీ సమావేశం . వేదికపై ఒక వైపు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి ఉంటే అదే వేదిక చివరి వైపు చంద్రబాబు . లక్ష్మీ పార్వతి వేలు చూపుతూ పిలవగానే చంద్రబాబు పరిగెత్తుకెళ్లారు . ఆమె ఏదో చెబుతుంటే చెవి ఒగ్గి, విని, తల ఊపి, […]
హఠాత్తుగా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్ సూపర్ ట్రెండింగ్… నెట్లో హల్చల్…
ఒకప్పుడు తెలంగాణ భాష అన్నా, సంస్కృతి అన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిన్నచూపు, ఎగతాళి, వెక్కిరింపు… ఇప్పుడదే తెలంగాణ భాష, ఆట, పాట, కల్చర్, సామాజిక జీవన నేపథ్యం అన్నీ కొత్త ట్రెండ్… హీరోహీరోయిన్లు కూడా తెలంగాణ పాటలు పాడతారు, ఈ యాసలోనే మాట్లాడతారు… ట్రెండ్ కాబట్టే ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటోంది అనేది నిజం… ప్రేమతో కాదు అనేది సారాంశం… బలగం, దసరా సినిమాలే కాదు, ఈమధ్య పలు సినిమాల్లో సగటు తెలంగాణ కుటుంబ జీవనమే కథావస్తువే… […]
బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు
బాబు తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మతో సీకులు అమ్మించగలడు… మద్యం తో మీడియా, పార్టీల రాజకీయాలు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – —————————————– మీకు చంద్రబాబు అంటే ఏమిటో అర్థం కావడం లేదు . ఆయన తలుచుకుంటే మల్లాది సుబ్బమ్మ చేత సీకులు అమ్మించగలరు . నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు . మనతో చెప్పిస్తున్నారు అంటూ చంద్రబాబు ముందే మాట్లాడేసరికి అంతా విస్తుపోయారు . సంక్షిప్తంగా చెప్పాల్సిందిచెప్పి కిందకు వచ్చాను . అది ప్రెస్ క్లబ్ లో సమావేశం . వేదికపై అప్పటి […]
బర్డ్ వ్యూ… పక్షులకు పుట్టుకతోనే నేచురల్ జీపీఎస్… శాటిలైట్ల చూపుకు దీటుగా…
GPS: వాల్మీకి రామాయణం రాయడానికి ముందే అన్నదమ్ములయిన సంపాతి- జటాయువు పుట్టి ఉండాలి. సంపాతి- జటాయువు పెద్ద డేగజాతి పక్షులు. వాటి వేగానికి సాటిరాగల పక్షులే ఆకాలంలో ఉండేవి కావు. చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఆ చెట్టుదాకా పరుగెత్తి వెళ్లి మళ్లీ వేగంగా వెనక్కు రావాలి- ముందు ఎవరొస్తారో చూద్దామా? అన్నట్లు ఒకరోజు జటాయువు సోదరుడు సంపాతితో సరదాగా పందెం వేసింది. సూర్యుడిదాకా వేగంగా వెళ్లి మళ్లీ భూమికి తిరిగి రావాలి- అని. సంపాతి సై అంది. అంతే […]
ఎస్పీ ప్రాణాలకు మీడియా కవచం… సుధీర్‌ను నక్సల్స్ రిలీజ్ చేసినరోజున…
ఎమ్మెల్యే సుధీర్ కుమార్ ను నక్సల్స్ విడుదల రోజు ఏమైందంటే … జర్నలిస్టు లను అడవిలోకి ఎందుకు తీసుకు వెళ్తున్నదీ ఎస్పీ చెప్పాక …. నీ ప్రాణం నీకు ముఖ్యం … బాస్ దేవుడు కాదు……… జర్నలిస్ట్ జ్ఞాపకం ——————————– ఇదీ విషయం, సార్ రమ్మంటున్నారు వస్తారా ? అని పోలీస్ కానిబుల్ చెప్పగానే ఎగిరి గంతేశాము . నలుగురం జర్నలిస్టులం ఆ కానిస్టేబుల్ వెంట నడిచాం . 1991 మే నెల .. నక్సల్స్ ప్రభావం ఉదృతంగా […]
అతనొక్కడే మిగిలిన లోకాన్ని నాలుకతో వెవ్వెవ్వె అని తిరిగి వెక్కిరించాడు…
తాడి ప్రకాష్… నగ్నముని రచయితేనా ? రచయితా , సంపాదకుడూ కెఎన్ వై పతంజలి 30 ఏళ్ల క్రితం వుదయం దినపత్రికలో రాసిన వ్యాసం ఇది. కవి నగ్నముని గురించి ఎంత Bold గా , ఎంత దూకుడుగా రాశాడో…. చదవండి … నవ్య కవనఖని నగ్నముని K.N .Y. Patanjali వాడు పంద్రాగస్టునాడు ఎర్రకోట మీది జాతీయ పతాకను పీకి, పీలికలు చేసి గోపాతల్లేని వాళ్ళందరికీ పంచి- ‘ఇదే భారతీమాన సంరక్షణం ఇదే’ అని ప్రకటించగలడు […]
అపూర్వ సహోదరుడు, అపురూప సోదరి… అన్నాచెల్లెళ్ల అనిర్వచనీయ అనుబంధం…
బాబులోని మహానటుడే ఆ దృశ్యానికి విస్తుపోయారు… రాఖీ కట్టు ల్యాండ్ కొట్టు… జర్నలిస్ట్ జ్ఞాపకాలు అన్నమా చార్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32వేల కీర్తనలు రాశారట … ఔను, అందరికీ తెలుసు, ఐతే ? ఎన్ని ఎకరాల స్థలంలో కూర్చోని ఈ కీర్తనలు రాసి ఉంటారు ? ఇదేం ప్రశ్న, ఇంట్లో ఓ గది ఉంటే చాలు . దీనికోసం ఎకరాలు కావాలా ? ఐనా నాకు తెలియదు . పోనీ, బాబు […]
లెఫ్ట్ దీనావస్థ… రైట్ తన్నులాట… బరిలో కొట్లాడేది మళ్లీ కాంగ్రెసే…
బీజేపీ కంప్లీట్ రైట్ దారి… సీపీఎం, సీపీఐ కంప్లీట్ లెఫ్ట్ దారి… తెలంగాణలో ఈ రెండు పక్షాలూ గందరగోళంలో పడిపోతూ కొట్టుకుంటున్నాయి… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే సీటు గెలుచుకుని దారుణంగా భంగపడిన బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్నాక కాస్త తెరిపిన పడింది… తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలనూ గెలుచుకుంది… ఆ ఊపులో ఏకంగా తెలంగాణలో తామే అధికారంలోకి వచ్చేసినట్లు కలలు కనడం మొదలుపెట్టారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా… ఒకే ఒక్క రాజాసింగ్… […]
బిగ్‌బాస్ అని దుమ్ము దులిపాడు… ఎస్ బాస్ అంటూ దగ్గరయ్యాడు…
రాజకీయాల్లో శాశ్వత కుడి భుజాలు , ఎడమ భుజాలు ఉండవు…… బిగ్ బాస్ అని తాట తీశాడు … యస్ బాస్ అని దగ్గరయ్యాడు .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————— 2004 ఎన్నికలకు ముందు టీడీపీ బీట్ రిపోర్టర్లు సచివాలయంలో సీఎం పేషీ వద్దకు వెళుతుంటే కడప జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనాయకులు మాకు ఎదురుగా వచ్చారు . అవాక్కయ్యారా ? అనిపించేట్టుగా ఓ వార్త చెప్పారు . మైసూరారెడ్డి టీడీపీలో చేరుతున్నారు అనేది ఆ […]
తిడితే పడాలి… మళ్లీ అదే అదే మాట్లాడాలి… తిట్లు తట్టుకోవడం ఓ కళ…
Bharadwaja Rangavajhala…… తిట్టను అరిగించుకోవడం ఎలా? మొన్నామధ్య నెల్లూరు వెంకటనారాయణ గారు భోజనానికి పిల్చినప్పుడు … ఓ మాట అడిగారు. ఆయనకి నా కజిన్ తో ఫ్రెండ్సిప్ ఉంది. కజిన్ అంటే …. మా మేనత్తగారి అల్లుడు… ఈయన నాతో ఫేసుబుక్కులో స్నేహం చేస్తున్న సందర్భంలో … వారి దగ్గర నా ప్రస్తావన వచ్చిందట … అప్పుడు మా మేనత్తగారి అమ్మాయి … (వీళ్లందరినీ … నేను చాలా చిన్నపిల్లలుగానే చూస్తానిప్పటికీ … వీళ్లు ఇంకా ఎలిమెంటరీ స్కూలు […]
అవసరార్థం పాత్రల పుట్టుక… నాలుగు రోజులకు ఆ జన్మలు హఠాత్తుగా ఖతం…
మీడియా కొన్ని పాత్రలను పుట్టిస్తుంది .. హఠాత్తుగా మాయం అవుతారు జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ——————————————————- సార్, ఐడెంటీ కార్డు చూపించండి అని ఆ కుర్రాడు వినయంగా అడిగేసరికి నవ్వుతూ అతని ముందే భారీ బహిరంగ సభకు హాజరైన వారిని లెక్కించాను . నేనూ , మరో జర్నలిస్ట్ , ఆ కుర్రాడి లాంటి మరో పది మంది వాలంటీర్లు , హాజరైన అశేష ప్రజానీకం అంతా కలిసి 50 మంది దాటడం లేదు . ఆ […]
అసలు జర్నలిస్టు అంటే ఎవరు..? నిజంగా తెలంగాణలో పత్రికా స్వేచ్ఛ లేదా..?
అసలు జర్నలిస్టు అంటే ఎవరు..? పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది మాత్రమేనా..? లేక ఇతర మీడియా, అంటే సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర ప్రసార సాధనాల్లో పనిచేసే సిబ్బంది కూడా జర్నలిస్టుల కేటగిరీలో వస్తారా..? డిజిటల్ మీడియా కూడా ఉంది… అంటే వెబ్ పత్రికలు… ఈ-పేపర్లు, వాట్సప్ ఎడిషన్లు అన్నమాట… ఒక వ్యక్తి తనను పోషిస్తున్న పార్టీ బాసు ప్రయోజనాల కోసం యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో వర్క్ చేస్తుంటాడు… తనను జర్నలిస్టు అనాలా..? యాక్టివిస్టు అనాలా..? ఓ […]
తొట్లె వేసుడు… నామకరణం… ఉయ్యాల్లో వేయడం… మరి ఈ డోలారోహణం ఏమిటో…
డోలారోహణం అనగా ఉయ్యాల్లో వెయ్యడం… తెలుగు ఉయ్యాల వద్దు, సంస్కృత డోల ముద్దు… ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు వేయడం సాధారణం. లేదా అత్యధిక మంది వాడే భాష సహజంగా గొప్పది అనుకుంటాం. ఈ కోణంలో చూసినప్పుడు ఆధునిక కాలంలో నిత్యవ్యవహారంలో వాడుకలో లేనే లేని భాష- సంస్కృతం. ఆ సంస్కృతం […]
ఓ ఆడపిల్ల పుడితే అదొక ప్రపంచ వింత… ఈ ‘మంచు అడుగులు’ మాత్రం కనిపించవు…
పనికిమాలిన పిచ్చి సినిమా వార్తల్ని, గాసిప్స్‌ను, ఇంటర్వ్యూలను రోజూ పేజీల కొద్దీ పత్రికల్లో, గంటలకొద్దీ టీవీల్లో… అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఊదరగొట్టే జర్నలిస్టులు (?) ఓ తార చేసే మంచి పనిని హైలైట్ చేయలేకపోయాయి… మంచు లక్ష్మి… మోహన్‌బాబు బిడ్డ… చిత్రమైన పోకడలతో, మాటలతో, అహంతో ఆ కుటుంబంలోని ముగ్గురు హీరోలు బదనాం అవుతూ ఉంటారు… లక్ష్మి తెలుగు మాట్లాడే తీరు మీద వచ్చినన్ని విమర్శలు, చెణుకులు, వెక్కిరింతలు బహుశా ఏ తార మీద వచ్చి […]
రంగనాయకమ్మ వ్యాసానికి జవాబు రాసి… వెవ్వెవ్వే అని హెడింగ్ పెట్టేశాడు…
పతంజలి అని ఒకడుండేవాడు. కలాన్ని కత్తిలా పట్టుకుని, సిగరెట్ కాలుస్తూ రోడ్లమీద తిరుగుతుండేవాడు. కొన్ని కథలూ, నవలలూ రాశాడు. జర్నలిస్టుగా వుద్యోగం చేశాడు. ‘ఉదయం’ దినపత్రిక ఎడిటర్ గా పనిచేశాడు. వుద్యోగం పోయి ఖాళీగా వున్నప్పుడు, హైదరాబాద్ శంకరమఠం దగ్గర రెండు గదుల ఆఫీసులో నడుస్తున్న ‘మహానగర్’ అనే చిన్న పత్రికలో చేరాడు. అతి తక్కువ సర్క్యులేషన్ వున్న, పాంచజన్య అనే జర్నలిస్టు నడిపే ఆ పత్రికలో ఒకసారి పతంజలి ఈ సంపాదకీయం రాశాడు. ఇది చదివి […]
మనం చదవడం ఏమిటి బ్రదర్… మనమే వార్తల్ని సృష్టించాలి…
నాయకులు , జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? పత్రికల వార్తలపై కేటీఆర్ కు కెసిఆర్ పరీక్ష… మనం వార్తలు సృష్టించాలి కానీ చదవడమా అన్న ఎన్టీఆర్……. జర్నలిస్ట్ జ్ఞాపకాలు – _______________________ జర్నలిస్ట్ లు పత్రికలు చదువుతారా ? అంటే ఇదేం ప్రశ్న ? వారే చదవకపోతే ఇంకెవరు చదువుతారు , చదవకపోతే జర్నలిస్ట్ గా ఉద్యోగం ఎలా చేస్తారు అనిపిస్తుంది . నిజమే చదువుతారేమో కానీ ఎలా చదువుతారు ? ఏం చదువుతారు ? […]
- « Previous Page
- 1
- …
- 79
- 80
- 81
- 82
- 83
- …
- 125
- Next Page »