Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిట్టిచెల్లెలు… ఇలాంటి కథలు, ఎన్టీవోడి నటన మళ్లీ చూడగలమా…?

March 24, 2024 by M S R

Subramanyam Dogiparthi……. వాణిశ్రీ జైత్రయాత్రలో మరో సినిమా 1970 లో వచ్చిన ఈ చిట్టిచెల్లెలు సినిమా . NTR- సావిత్రిల రక్తసంబంధం సినిమాలో సూరేకాంతం అన్నాచెల్లెళ్ళను హింసిస్తే , ఈ చిట్టిచెల్లెలు సినిమాలో అన్నను విధి హింసిస్తుంది . NTR నటన అద్భుతం . చిన్నప్పటి నుంచి తానే తల్లీతండ్రయి చెల్లెల్ని పెంచి , విధి ఆడిన నాటకంలో తన తండ్రే చెల్లెలు భర్తను హత్య చేస్తే , ఆ నిజాన్ని చెల్లెలుకు తెలియకుండా , బిడ్డను కని చనిపోయిన చెల్లెలు బిడ్డకు మళ్లా తానే తల్లీతండ్రి కావటానికి సిధ్ధపడటం . ఇదే క్లుప్తంగా ఆయన పాత్ర . విషాద సన్నివేశాల్లో ఆయన నటన బ్రహ్మాండం .

అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ ఏ రోజుల్లో అయినా పండుతుంది . NTR రక్తసంబంధం , ఆడపడుచు , ఈ చిట్టిచెల్లెలు , ANR బంగారుగాజులు , రజనీకాంత్- కీర్తి సురేష్ పెద్దన్న , రాధిక- శశికుమార్ రక్తసంబంధం , రాజశేఖర్ గోరింటాకు ఇందుకు తార్కాణాలు . అయితే , NTR తో మరొకరిని పోల్చలేం . ఈ సినిమాలో కూడా మనకు ఎన్టీఆర్- సావిత్రిలను గుర్తుకుతెస్తారు NTR- వాణిశ్రీ .

ఎలా అయితే రక్తసంబంధం సినిమా చూసి కళ్ళు చెమర్చకుండా ఉండవో , అలాగే ఈ చిట్టిచెల్లెలు సినిమా కూడా . NTR నటన ఎంతటి పాషాణ హృదయుడికయినా కళ్ళు చెమర్చాల్సిందే .

Ads

యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ ఈరోజుకీ సూపర్ హిట్టే . దాశరధి వ్రాసిన అందాల పసిపాపా అందరికీ కనుపాపా పాట మూడు సార్లు వస్తుంది . సాహిత్యం , సంగీతం , సుశీల -ఘంటసాలల గాత్రం చాలా గొప్పగా ఉంటాయి . నారాయణరెడ్డి వ్రాసిన ఈరేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది పాట శ్రావ్యంగా ఉంటుంది . దాశరధి వ్రాసిన మరో చక్కటి పాట మంగళ గౌరి మముగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మా పాట ఆడవాళ్లు పేరంటాళ్ళల్లో కూడా పాడుతుంటారు . అంత హిట్టయింది .

NTR సినిమా అంటే ఎలాగోలాగా ఓ మారు వేషం ఉండాల్సిందే కదా ! ఈ సినిమాలో మారు వేషమయితే ఉండదు కానీ , ఓ నాటకం వేషం మాత్రం ఉంటుంది . అది శ్రీరామ వనవాసం నాటకంలో రాములోరి పాత్ర . ఆయన నటించటేం ఏంటి నా మొహం ! ఆయనే రాముడయితే . ఈ నాటకంలో ఆయనతోపాటు సీతగా గీతాంజలి , లక్ష్మణుడిగా పద్మనాభం , శూర్పణఖగా సురభి బాలసరస్వతి నటిస్తారు . గీతాంజలి మరోసారి versatile నటి అని మనం కితాబు ఇవ్వక తప్పదు .

NTR శైలిలో పట్టాలి అరక దున్నాలి మెరక అనే వ్యవసాయం పాట , ఝుం ఝం ఝుం తుమ్మెద పాడింది , వన్ టు త్రీ ఇటు రావయ్యా పాటలు బాగుంటాయి . NTR జోడీగా రాజశ్రీకు చాలా హుందా అయిన పాత్ర లభించింది ఈ సినిమాలో . ప్రేమించిన వ్యక్తికి అండగా , కొండంత అండగా నిలబడే పాత్ర . ఇప్పటి తరం ప్రేమికులకు ఆశ్చర్యం కూడా కలుగుతుందేమో ! ఇప్పుడు ప్రేమంటే use & throw కదా ! సతీ సుమతిలు , సతీ సావిత్రిలు , శ్రీరామచంద్రులూ ఎక్కడ దొరుకుతారు . Materialistic , opportunistic and pecuniary relationships .

మహిళల మెప్పు పొందిన ఈ సినిమా వంద రోజులు ఆడింది . కమర్షియల్ గా , కళాపరంగా , అన్ని కోణాల్లో గొప్ప చిత్రం . చూడని వాళ్ళు ఎవరయినా ఉంటే యూట్యూబులో తప్పక చూడండి . NTR- వాణిశ్రీల నటన అలరిస్తుంది . Unmissable , sentimental , emotional movie .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #telugumovies #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తడి తడిమే ఓ ఆర్ద్రగీతం- కర్కశ హృదయుల కళ్లూ చెమర్చాల్సిందే
  • మంత్రి క్షమాపణ ! ఇది స్వీయ అభిశంసన !! అయ్యో, పొంగులేటి !!
  • ధ్రువ… ఆ రీల్ అపరిచితుడి కొడుకేనా ఈ రియల్ అపరిచితుడు..?!
  • ఛిన్న మస్తాదేవి ! ఓ స్టేజ్ షో ప్రదర్శనపై రచ్చ ! అసలేం జరిగిందంటే !!
  • ఫాఫం తెలంగాణ బీజేపీ ! హైకమాండ్ గాలికి వదిలేసినట్టుగా ఉంది !!
  • ఏసేశాడు, రేవంత్ రెడ్డి మళ్లీ ఏసేశాడు..! సెటైర్ భలే పేలింది !!
  • సంస్కార దారిద్య్రం !! మీ దుంపతెగ- ఇదేం భాషరా బాబూ..!!
  • నా లైఫ్ నేను మాత్రమే మార్చుకోవాలి… ఇంకెవరో ఆ పని చేయరు…
  • మహేశ్ బాబూ – ఇక ఈ యాడ్స్ జోలికి వెళ్లకు – అవి శిక్షార్హమే !!
  • Flipkart – నీ దుంపతెగ- చావును కూడా అమ్ముకోవడం ఏమిట్రా ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions