Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణలో కోల్ పాలిటిక్స్! కిషన్‌రెడ్డి మస్తు ప్లాన్ వేశాడుగా!!

July 9, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కిషన్ రెడ్డిని ముందుపెట్టి ఓ గేమ్ ప్లే చేస్తున్నాడు కదా… అది రాజకీయం ప్లస్ అభివృద్ధి కలగలిసిన స్ట్రాటజీ… మెట్రో1, మెట్రో2, మూసీ, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ… ఇలాా అన్నీ… కేంద్రం సహకరిస్తాిను అంటూ ఏం చేయడం లేదు, బీజేపీ కేంద్ర మంత్రిగా నీకు బాధ్యత లేదా అని కార్నర్ చేయడం… ఇది స్థానికంగా బీజేపీని డిఫెన్సులో పడేయడం..!

సరే, మెట్రో మీద కిషన్ రెడ్డి ఏదో స్పందించాడు, కానీ ప్రోగ్రెస్ లేదు, అది రేవంత్ రెడ్డికీ తెలుసు… కానీ అడగాల్సిందే, నిలదీయాల్సిందే… బీఆర్ఎస్- బీజేపీ రహస్య సంసారాన్ని ఎక్స్‌పోజ్ చేయాల్సిందే… దీనికి కిషన్ రెడ్డి తెలివిగా తనూ ఓ గేమ్ ఆడాడు… దాని పేరు తాడిచర్ల బ్లాక్-2…

Ads

మన సింగరేణిెకి ఆక్సిజెన్ అందించే తాడిచర్ల-2 బ్లాక్‌ను కేంద్రం కేటాయించిందనీ, తెలంగాణకు వరం అనీ ప్రకటించాడు… (తనే కేంద్ర మైనింగ్ మంత్రి… అఫ్‌కోర్స్, తనే సింగరేణిని అప్రతిష్టపాలు చేయడానికి 40 లక్షల టన్నుల బొగ్గు మాయంపై దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం ఓ పేద్ద పారడాక్స్…)(ఆమధ్య నైనీ బొగ్గుగని యవ్వారం కూడా వివాదాస్పదమైన సంగతి తెలుసు కదా)…

కిషన్ రెడ్డి ప్లాన్ భట్టికి కూడా మొదట అర్థం కానట్టుంది… ఆహా, కిషన్ రెడ్డి నిర్ణయం హర్షణీయం, స్వాగతిస్తున్నాం అంటూ తొలి స్పందన… రాష్ట్ర మంత్రి వివేక్ కొడుకు, ఎంపీ వంశీకృష్ణ తదితరులు స్టేట్‌మెంట్లు ఇచ్చారు ఇలాగే… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అయితే భారీ భారీ ప్రకటనలు చేశాడు, తెలంగాణకు బీజేపీయే దిక్కు అన్నట్టుగా… (తుమ్మల మాత్రం సత్తుపల్లి-3 బ్లాక్ కూడా ఇలాగే కేటాయించాలని డిమాండ్ చేశాడు)…

మెల్లిగా అర్థమైంది భట్టికి… ప్రెస్ మీట్ పెట్టి… అసలు నిజాలు తెప్పించుకుని మీడియాకు వివరించాడు… అందులో కొన్ని ముఖ్యాంశాలు…

1. సింగరేణిపై నిజంగా ప్రేముంటే గోదావరి లోయ బ్లాకులన్నీ కేటాయించాలి

2. ​తాడిచెర్ల కొత్త కేటాయింపు కాదు.. పాతదానికే అనుమతి

3. ​గిరిజన ప్రాంతాల్లో బొగ్గు బ్లాకుల వేలం చట్టవిరుద్ధం

వివరాల్లోకి వెళ్తే… సింగరేణికి కేంద్రం 2013లోనే (యూపీఏ హయాంలో) కేటాయించింది తాడిచర్ల -2 బ్లాకును… మళ్లీ సింగరేణికి కేటాయిస్తున్నట్టు కిషన్ రెడ్డి ప్రకటించడం ఏమిటి..? ఆ బ్లాక్ కు కిషన్ రెడ్డి మంజూరు చేసింది కేవలం లీజు మాత్రమే… అసలు 2013 నుంచి ఇప్పటివరకు జరిగిన జాప్యం మాటేమిటి..? సింగరేణికి జరిగిన నష్టం మాటేమిటి..? కిషన్ రెడ్డి న్యాయం చేశాడా..? పెండింగులో ఉన్న డిమాండ్‌కు వోకే చెప్పాడా..?

ఈ విషయంలో రాష్ట్రం ఎన్నో ఏళ్లుగా లేఖలు రాస్తూనే ఉంది… నిజానికి ఈ బ్లాకులో గిరిజన భూములు ఉన్నందున వాటిని ప్రభుత్వ రంగ సంస్థలే బొగ్గును తీయాలి… అందుకే ప్రైవేటుకు ధారాదత్తం చేయకుండా సింగరేణికి ఇచ్చారు… (సింగరేణిలో స్టేట్‌తోపాటు కేంద్రం కూడా భాగస్వామే)…

2024, 2026 సంవత్సరాల్లో నేను స్వయంగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశానని, కానీ ఇన్నాళ్లూ కేంద్రం నాన్చిందని అసలు నిజం చెప్పాడు భట్టి… మరి ఇప్పుడు కిషన్ రెడ్డి ఏదో కొత్త గనిని కేటాయిస్తున్నట్టు ఓన్ చేసుకోవడం దేనికి..? జస్ట్, రాజకీయం!!

పదే పదే రేవంత్ రెడ్డి తనను కార్నర్ చేస్తున్నాడు కదా, నో, నో, నేను తెలంగాణకు మస్తు పనిచేస్తున్నాననే కవరింగు కోసం..! అసలు తాడిచర్ల మాత్రమే కాదు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, ఇల్లందు వంటి సింగరేణి ప్రాంతాలు 1/70 గిరిజన చట్టం పరిధిలోకి వస్తాయి…

అలాంటప్పుడు కేంద్రం ఇల్లందు సమీపంలోని కోయగూడెం-3 ఓపెన్ కాస్ట్ బ్లాక్ ను, మణుగూరులోని ఓపెన్ కాస్ట్ డిప్ సైడు గనిని వేలం పాటలో పెట్టడం సింగరేణి వ్యతిరేక చర్యలు కాదా..? నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రైవేటు వారికి కేటాయించిన కోయగూడెం-3 ఓపెన్ కాస్ట్ బ్లాక్, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్-3 బ్లాక్ లలో ఇప్పటివరకు మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించలేదు…

నిజంగా కిషన్ రెడ్డికి ప్రేమ ఉంటే సమీక్ష జరిపి, తగు సవరింపు, దిద్దుబాటు నిర్ణయాలు ఎందుకు తీసుకోవడం లేదు..? సో, తాడిచర్ల బాపతు అసలు నిజాలు ఇవీ..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక మెస్సీ తలవంచిన రాత్రి… ఒక యమాల్ తలెత్తిన ఉదయం!
  • ఆ బరాజులు పనికిరానట్టేనా? కాళేశ్వరం తాజా స్థితిపై సాంకేతిక విశ్లేషణ !!
  • ‘పెళ్లాల మార్పిడి’ – సొసైటీయే మారుతోంది – సర్కారు ఏం చేయగలదు..?
  • తిట్టు నేరం కాదా..? ఏది అశ్లీల నేరం..? ఏది కాదు..? వర్గీకరణ ఎలా..?
  • ఇదుగో… కేసీఆర్ క్యాంప్ నుంచి మరో దిక్కుమాలిన బురద ప్రచారం !!
  • అవున్నిజమే… బిగ్‌బాస్ మేకప్ తుడిచేస్తే… ఎవరి బతుకులు వాళ్లవే
  • ఏది మునిగే టైటానిక్? ఏది తస్కిన మేడిగడ్డ? ఎవరి గాచారం ఏంటి?
  • సినీ సంగీత ప్రేమికులా మీరు ? ఈమె గురించి తప్పక చదవాలి !!
  • మోడీ షా బ్లండర్ ! బొద్దింకలపై మొదటి నుంచీ పిరికి వైఫల్యమే..!!
  • రాజకీయులు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions