.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు..? ‘‘మీ ఊర్లో ఎవరైనా ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థి ఉంటే.. ఒక తెల్ల కాగితం ఇచ్చి, ఉద్యోగం కోసం దరఖాస్తు పత్రం రాయమనండి.. రాయలేరు.. అలాంటివారు రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. వారికి ఉద్యోగాలెలా వస్తాయి? ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్. ఇక్కడ తప్పు కేవలం విద్యార్థిదే కాదు.. వారికి సరైన చదువు చెప్పలేకపోతున్నాం. ఇన్నాళ్లూ సరిగా నైపుణ్యాలు నేర్పించలేకపోయాం. సరిగా చెబితే ఎందుకు నేర్చుకోరు’’
… ఇదే కాదు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థుల నైపుణ్యాల పెంపుకి ప్రత్యేక కార్యాచరణ స్టార్ట్ చేయబోెతున్నామనీ చెప్పాడు… వెంటనే కేటీయార్, హరీష్ రావు అందుకున్నారు, దుర్మార్గమైన వ్యాఖ్యలు, జెన్-జీని అవమానించడం అని! ఈ ఇద్దరూ ఈమధ్య పూర్తిగా విజ్ఞతను, రాజకీయ పరిణతినీ కోల్పోయారు…
Ads
అసలు జెన్-జీకి, ఇంజినీరింగ్ విద్యలో ప్రమాణాలు పడిపోయాయనే వ్యాఖ్యకూ లింక్ ఏమిటసలు? ఎస్, రేవంత్ రెడ్డి చెప్పింది నిజం… ఎడాపెడా కాలేజీలు పెట్టారు, సీట్లు పెంచేసుకున్నారు, ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది కదాని, ఏదో చెబుతున్నారు, లోకంలోకి వదులుతున్నారు… కానీ ఆ విద్యలో ప్రస్తుత పరిస్థితులకు పనికొచ్చేది ఏమైనా చెబుతున్నారా? ఎఐసీఈటీకి ఆ సోయి ఈరోజుకూ లేదు, అందినకాడికి దండుకునే ఉన్నతాధికారులు తప్ప… అఫ్‌కోర్స్, ఎన్డీయే ప్రభుత్వంలోని మానవవనరుల అభివృద్ధి విభాగం ఓ శుద్ధ దండుగ ప్రాంగణం!
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రొబోటిక్ టెక్నాలజీ, డేటా సైన్స్ తదితర అంశాలు రాబోయే రోజుల్లో ప్రపంచాన్నే శాసించబోతున్నాయి… మరి మనం ఏం నేర్పిస్తున్నాం..? ఈ పాసవుట్లు ఇండస్ట్రీకి ఏమైనా ఉపయోగపడుతున్నారా..? నిల్… ఎటూ దిక్కుతోచక గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నవాళ్లు వేలల్లో..!! కారణం, ఇండస్ట్రీకి పనికొచ్చే స్కిల్స్ లేకపోవడం, కాలేజీలు నేర్పించకపోవడం, ఆ ఇంజినీరింగ్ విద్య కరిక్యులమే వర్తమాన అవసరాలకు సరిపడా లేకపోవడం..!!
చివరకు బేసిక్ కమ్యూనికేషన్స్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్ కూడా నేర్పించలేదు ప్రస్తుత ఇంజినీరింగ్ కాలేజీల విద్యాబోధన..! పైగా ప్రతి ఏటా ఫీజ్ రివిజన్ కావాలి, ఫీజేతర వసూళ్ల దందా సరేసరి..!
ముఖ్యమంత్రి చెప్పిందీ అదే… కటువుగా చెప్పినా కఠిన వాస్తవమే అది… ఈ సంవత్సరం, గత సంవత్సరం క్యాంపస్ ప్లేస్‌మెంట్ల దుస్థితిపై లెక్కలు తీస్తే అర్థమవుతుంది… గతంలోలాగా రయ్యిమని అమెరికా వెళ్లే వీలు కూడా లేదిప్పుడు… సో, ఐటీరంగంలో పాతబడిపోయిన తుప్పు కరిక్యులమ్, స్టాండర్డ్స్ ఇప్పుడు పనికిరావు… సమాజానికి కావల్సింది ఆధునిక టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలిగే నాణ్యమైన ఇంజనీర్లు…
వందల కాలేజీలు ఈ నాసిరకం ఇంజినీర్లను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలయ్యాయి… వీళ్లు రెంటికీ చెడ్డ రేవడులు… వేరే రంగాలకు పనికిరారు, తామెంచుకున్న రంగం తమ కడుపు నింపదు… మరేం చేయమంటారు కేటీయార్ అండ్ హరీష్… ప్రతి సమస్యనూ రాజకీయం చేయడం కాదు, కాస్త సమాజానికి ఉపయోగపడే ఆలోచన చేయడం, నిర్మాణాత్మక విమర్శ తక్షణం ప్రాధాన్య అవసరం..!! మరీ మీరు సైతం దాసోజు కేటీయార్, దాసోజు హరీష్ రావు అయిపోతే ఎలా..?!
భవిష్యత్తు తరాల్ని నిర్వీర్యం చేసే ఇంజినీరింగ్ విద్య పక్కాగా ఓ క్రిమినల్ వేస్ట్… రేవంత్ రెడ్డి అన్నదాంట్లో తప్పేమీ లేదు… కాకపోతే తను పాలిష్డ్‌గా ఏదీ చెప్పలేడు, అచ్చం మన ఇంజినీరింగ్ విద్య ప్రమాణాల్లాగే… అదొక విషాదం పాపం..!!
Share this Article