Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బ్రాడ్‌వే షో – ఓ రంగస్థల అబ్బురం..! సురభి నాటకాలకు వంద మెట్లు పైన !!

October 10, 2026 by M S R

.

అబ్బురం… కళ్లప్పగించి చూడటం… నడుమ నడుమ చప్పట్లు… కాదు, ఫుల్ గ్రాఫిక్స్, 4కే క్వాలిటీ, 3డీ, ఐమాక్స్ స్క్రీన్, డోల్బీ సౌండ్, ఎవరో స్టార్ హీరోయిన్, తోడుగా స్టార్ హీరోయిన్, పంచ్ డైలుగులు, ఏశనాగుల కట్ట పాటలున్న సినిమా కాదు… ఒక నాటకం… అవును, ఒక నాటకం…

మీకు అల్లావుద్దీన్ అద్బుతదీపం కథ తెలుసా..? ఈ జనరేషన్‌కు తెలియకపోవచ్చు… మాంచి ఫాంటసీ జానపద కథ… మీరు ఎప్పుడైనా సురభి నాటకాలు చూశారా..? ఈ జనరేషన్‌కు ఆ నాటకసమాజం గురించి అసలే తెలిసి ఉండకపోవచ్చు… మీరు పాతాళ భైరవి సినిమా చూశారా..? పాత తరంలో చూడనివాడు లేడేమో బహుశా… సరే, ఇక కథనంలోకి వెళ్దాం…

Ads

అమెరికాకు గుండెకాయ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్… అల్లావుద్దీన్  (Alladdin) బ్రాడ్‌వే షో చూద్దామా అని ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి అడిగినప్పుడు ఏదో సురభి మార్క్ నాటకం కావచ్చు అనుకున్నాను… పొరపాటు అని తరువాత అర్థమైంది… మా తరానికి సురభి నాటకాలే అద్భుతం… ఇది దాన్ని మించి అనేకరెట్లు… అసలు హైటెక్నాలజీ సినిమాలు, వీడియోలకు అలవాటుపడిన అమెరికన్ సమాజం రంగస్థలాన్ని ఇప్పటికీ ప్రేమిస్తున్న తీరు మరో అద్బుతం…

alladdin

బ్రాడ్‌వే షోలు రకరకాల కథలతో ఉంటాయి, మేం చూసింది అల్లావుద్దీన్ షో… ఇలాంటి షోలు ప్రపంచంలో రెండేచోట్ల… ఒకటి టైమ్ స్క్వేర్… రెండు లండన్… సురభి నాటకం చూస్తుంటే, ప్రత్యేకించి పాతాళబైరవి వంటి నాటకాలు చూస్తుంటే… అనేకచోట్ల మనకు సినిమాను మించి అనుభూతి కలిగించేది… విఠలాచార్య సినిమాల్లో రకరకాల గారడీలు మనల్ని విభ్రమకు గురిచేసినట్టే… ఈ బ్రాడ్‌వే షో కూడా ఓ త్రీడీ సినిమా చూసినట్టు… అక్కడక్కడా ఓ యానిమేటెడ్ షో చూస్తున్నట్టు…

అల్లావుద్దీన్ కథలో ఈ కాలం జనరేషన్‌ను కనెక్టయ్యే పదాలతో డైలాగులు రాసుకుని… రియల్ టైమ్ బీజీఎం, పాటలతో అలరించారు… పర్‌ఫెక్షన్ అంటాం కదా, అది నటుల నడుమ సమన్వయంలో కనిపిస్తుంది… కర్టెన్లను వాడుకున్న తీరు నభూతో… ప్రత్యేకించి లైటింగ్… ఎక్కడ ఏ పాత్రధారిపై ఏ కలర్ ఫోకస్ కావాలి, దానికి బ్యాక్ గ్రౌండ్ ఏ కలర్ కనిపించాలి…  అప్పడప్పుడూ స్టేజీ కింద నుంచి పైకి రావడం, స్మోక్…

ఎంతో కఠోర సాధన ఉంటే తప్ప సాధ్యం కాదు… ఆ కథ తాలూకు ఎడారి జీవితం, వీథులు, భవనాలు… కథలో రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది, ఫాంటసీ ఉంది, డ్రామా ఉంది, డాన్స్ ఉంది, సంగీతం ఉంది, లవ్ ఉంది, రాజుల కాలం నాటి అట్టహాసం ఉంది… వాట్ నాట్..?

alladdin

దాదాపు పదీపదిహేనేళ్లుగా ఇదే కథను ప్రదర్శిస్తున్నా ప్రేక్షకుల రద్దీ తగ్గడం లేదు… చప్పట్ల ఆగడం లేదు… ఒకరోజు షో ఆదాయం 15 కోట్లు… మీరు చదివింది నిజమే… స్టేజీకి దగ్గరలో సీటు కావాలంటే 350 డాలర్లు… అంటే 35 వేల రూపాయలు… అర్థమైంది కదా… మన వాళ్లలో మెజారిటీ ఈ షోలు చూసి ఉండరు…

సరే, నేను చెప్పాలనుకున్నది వేరు… ఎవరైనా పాత సురభి నాటకసమాజం ఆర్టిస్టులో, బాధ్యులో గనుక ఈ బ్రాడ్‌వే షోలను కీన్‌గా పరిశీలిస్తే… ఈ బ్రాడ్‌వే షోను మళ్లీ ఇండియాలో పాపులర్ జానపద కథలతో ఇలాగే హైలైట్ చేయలేరా..? చేయగలరు… అబ్బే, ఇప్పుడు నాటకాలు ఎవడు చూస్తాడు అంటారా..? లేదు, చూస్తారు… టైమ్ స్క్వేర్ బ్రాడ్‌వే షో నిరూపణ అది… అనేక దేశాల ప్రేక్షకులు వస్తున్నారు అక్కడికి…

ఈ షో చూస్తున్నప్పుడు చిన్నప్పుడు నేను చూసిన సురభి పాతాళ భైరవి నాటకం ప్లస్ పాతాళభైరవి సినిమాయే పదే పదే గుర్తొచ్చింది… సేమ్, మాంత్రికుడు, వాడి పక్కన సదాజపుడు, ఓ రాజకుమారి, ఓ సామాన్యుడు, మాయలు, మంత్రాలు… సాహసం సేయరా డింభకా, రాజకుమారి లభించునురా, నరుడా ఏమీ నీకోరిక వంటి డైలాగులు…

ఇప్పటికే దేశంలో రంగస్థలం ఊపిరి ఆగిపోలేదు… నాటకం బతికే ఉంది… రకరకాల కథలను ప్రదర్శిస్తూనే ఉన్నారు అనేకచోట్ల… వాటిని ఈ బ్రాడ్‌వే షోల్లాగా మరో పది మెట్లు ఎక్కించగలిగితే… మనం ఈ వెండి తెరలతోపాటు రంగస్థలాన్నీ ఆస్వాదించగలం… నాకైతే నమ్మకముంది…!!

గ్రాఫిక్కులు ఓ మోతాదు దాటితే వెగటు, కృతిమత్వం… కానీ నాటకం కళ్ల ముందు రియాలిటీ… నటీనటుల మెరిట్, కలర్స్, లైట్స్, కర్టెన్స్, సాంగ్స్… వావ్… ప్యూర్ ఒరిజినాలిటీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బ్రాడ్‌వే షో – ఓ రంగస్థల అబ్బురం..! సురభి నాటకాలకు వంద మెట్లు పైన !!
  • స్టాక్ మార్కెట్… మహా పతనం వైపా? తాత్కాలిక సర్దుబాటా?
  • అవే పాత్రలు- భాషలు వేరు – నానా పటేకర్ ముందు ప్రకాశ్ రాజ్ దిగదుడుపే !!
  • ఇదొక ‘PRESS’ దందా ! ఐడీ కార్డులిస్తారట – స్టిక్కర్లు కూడా ఇస్తారట !!
  • ఎలన్ మస్క్ Vs ముఖేష్ అంబానీ ! స్టార్‌లింక్‌ అడ్డుకునే ఆలిగార్కులు !!
  • తన స్టెప్పులతో రష్యన్లను మరోసారి షేక్ చేసిన డిస్కో డ్యాన్సర్!
  • బిగ్గర్ దేన్ హీరో ! అందుకే హీరోలు తన పక్కన చేయడానికి భయపడతారు !!
  • Evil Dead – నానా పటేకర్ మృతిపై ఓ చేదు స్పందన – ఎవరామె? ఏంటీ కథ?
  • నానా పేర్లన్నీ ఒకవైపు – నానా పేరొకవైపు..! వీరుడా సెల్యూట్ !!
  • … కల్కి భక్తులు రెచ్చిపోయి వార్త ఆఫీసులపై దాడులు చేశారు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions