FastTag…. అందరికీ తెలుసు… టోల్ టాక్స్‌ను ఆటోమేటిక్‌గా కట్ చేసుకునే ఓ దోపిడీ యంత్రాంగం… హార్ష్ అనిపిస్తోంది కదా… కానీ అదే రియాలిటీ… కాస్త లోతుల్లోకి వెళ్దాం…
టోల్ గేట్ల దగ్గర ఆగి, క్యాష్ కట్టాల్సిన అవసరం లేకుండా… వేగంగా దోపిడీ చేసుకునే ఓ డిజిటల్ ఏర్పాటు… టోల్ టాక్స్ దోపిడీదార్లకు అదొక డిజిటల్ దారి… ఆగండాగండి, సోకాల్డ్ జాతీయవాదులూ… ఆగండి… డోన్ట్ బీ ఫూలిష్…
- తలతిక్క సంక్షేమ జనాకర్షక పథకాలు కాదురా బాబూ… ఆయుష్మాన్, పంటల బీమా, బీపీఎల్ రైస్, పక్కా ఇళ్లు వంటి కేంద్ర ప్రభుత్వ డొల్ల పథకాల డొల్లతనం గురించీ ఇక్కడ అక్కర్లేదు… రోడ్లు, రైల్వేలు, వంతెనలు కేంద్ర ప్రభుత్వ విధి, బాధ్యత…
- నో, నో, నా దగ్గర డబ్బుల్లేవు, ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తాం, ఆ డబ్బు మీరు టోల్ రూపంలో కట్టండి అనేదే పెద్ద మాదచ్చోద్ విధానం… అందులోనూ నితిన్ గడ్కరీ అనే పిచ్చోడికి ఏమీ తెలియదు, నాగపూర్ కాషాయ శిబిరం మద్దతు తప్ప… ఈ మాట అనడానికి సాహసిస్తున్నా… గడ్కరీ ఒక పెద్ద అజ్ఞాని… (పొరపాటున తను ప్రధాని అయితే దేశం కథ బంగాళాఖాతమే…)
- అదే గడ్కరీ పట్ల మోడీ సగం దాసోహం, సగం తిరుగుబాటు… మళ్లీ ఆ కథ, ఆ కాళ్లబేరం వేరు… కానీ ఈ టోల్ దోపిడీలో మోడీ కూడా నేరస్తుడే… ఖచ్చితంగా…
- దిక్కుమాలిన పథకాల పేరిట ప్రజాధనం తగలేసే బదులు, ప్రభుత్వమే సొంతంగా రహదారులు, రైల్వే దారులను జనానికి అందుబాటులోకి తేవాలి కదా… సారీ, మోడీ భాయ్‌కు అంత పరిణతీ లేదు, అంత సీనూ లేదు… నితిన్ గడ్కరీ స్వతహాగా ఓ వ్యాపారి… అంతకుమించి ఆలోచించలేడు…
అసలు విషయానికి వద్దాం… ఫాస్ట్ ట్యాగ్ తీసేస్తారట… ఆటోమేటిక్‌గా శాటిలైట్ సిస్టంతో టోల్ కట్ చేస్తారట… అంటే గేట్ల దగ్గర ఆగే ప్రయాస లేదు చూశారా, మేం ఎంత సేవ చేస్తున్నామో అంటాడు గడ్కరీ… అదొక దిక్కుమాలిన సమర్థన, బేకార్ సిస్టం…
Ads
అసలు ఈ దేశంలో ఏ రోడ్డు, ఏ బ్రిడ్జికి ఎంత ఖర్చయింది, ఎన్నేళ్లపాటు ఎంత వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారో ప్రపంచంలో చివరకు మోసాద్ కూడా తేల్చిచెప్పలేని దందా అది… ఏటా వేల కోట్ల స్కాం… గడ్కరీ అనేవాడికి సోయి లేదు, సమీక్ష లేదు… ఇంకెలా ఈజీగా వాహనదారుల జేబులు కత్తిరించాలనే మూర్ఖపు మెంటాలిటీ తప్ప… ఇంకా తను ప్రధాని కావాలట…
ఇక చూసుకొండి, నిజంగానే తను ప్రధాని అయితే ఏం కానుందో..? (సోకాల్డ్ హిందూ ఉద్దారకులు మోహన్ భగవత్, ప్రవీణ్ తొగాడియా, నితిన్ గడ్కరీ ఒక్కటవుతారట… తీసుకెళ్లండి అర్జెంటుగా ఆ సత్యకాలానికి… ఆ రాతి యుగాల్లోకి… చీకటి యుగాల్లోకి… దేశం ఏం కానుందో… అసలే రాహుల్ వంటి అపార జ్ఞాన సంపన్నులు, ఇదుగో ఇలాంటి అజ్ఙానులు…)
బ్యాంకుల ఫాస్ట్ ట్యాగుల విధానాలు వేరు… అది మరీ గడ్కరీని మించిన ఆటవికం… పాత ట్యాగ్ తీసేయాలంటే అది పీకి, పాత ఫోటో, కొత్త ఫోటో యాడ్ చేయాలట ఆన్‌లైన్‌లో… ఒక నంబరుతో ఒక ట్యాగ్ అంటే ఇంకొకటి ఇవ్వరట…
రేయ్, ఎవడ్రా మీరంతా… ట్యాగ్ పీకేయడమే కష్టం, దాన్ని మళ్లీ ఫోటో తీసి అప్‌లోడ్ చేసి, ఆ ఖాతా డిలిట్ అయితే తప్ప ఆ పాత బ్యాలెన్స్ రిటర్న్ ఇవ్వరు, కొత్తవాడు కొత్త ట్యాగ్ ఇవ్వడు… జస్ట్, ఓ పెద్ద పైత్యపు పాలసీలు… ఒకడికి పది వాహనాలు ఉంటే, పది ఒకే మొబైల్ నంబరుతో తీసుకుంటే లాస్ ఏమిటి..? అంత ఆలోచిస్తే బాగానే ఉండేది…
దేశానికి మోడీలు, గడ్కరీలు కాదు… సారీ, రాహుల్ అస్సలు కాదు… అది మరీ చీకటి యుగంలోకి ప్రయాణం… ఇంకేదో కొత్త నాయకత్వం కావాలి… సారీ, కేసీయార్, జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్, స్టాలిన్, మమత, అఖిలేష్, తేజస్వి, పినరై, పవార్, ఒమర్ అసలే కాదు… అవి మరీ కరోనా వైరసులను మించిన వైపరీత్యాలు… ఏదో కొత్త నాయకత్వం కావాలి… అదే అర్థం కాదు…!!
Share this Article