Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హర్యానాలో కాంగ్రెస్ విజయానికి శిఖండిలా అడ్డుపడిన కేజ్రీవాల్..!

October 9, 2024 by M S R

.

ముందుగా కేజ్రీవాల్ కి అభినందనలు … ఎందుకంటే కాంగ్రెస్ గెలుపుకి శిఖండిలా అడ్డుపడి నందుకు! జార్జ్ సోరోస్ కి సారీ చెప్పి ఉంటాడు!

అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి! ఇండియా టుడేకి ఇది జీర్ణించుకోలేని అంశం! ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అని ఉన్నచోట రాహుల్ ఫోటోతో లీడింగ్ అని చూపించింది.
కాంగ్రెస్ లీడ్ తగ్గుతూ వస్తున్నప్పుడేమో మల్లిఖార్జున ఖర్గే ఫోటో పెట్టింది. బానిస మీడియా! చివరికి ఇండియా టుడే ఏ స్థాయికి దిగజారింది అంటే abn, సాక్షి స్థాయికి అన్నమాట!

Ads

********
ఎక్కడ ఏం జరిగింది?

అమిత్ షా వ్యూహ రచన గురుంచి చెప్పుకోవాలి.

1.ఎన్నికలకి ముందే కేజ్రీ వాల్ కి బెయిల్ వచ్చేట్లు చేసి స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి వీలు కల్పించడం రాజకీయ ఎత్తుగడ! అఫ్కోర్స్, అభ్యంతరం చెప్పినా ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమే! తల్లీ బిడ్డా న్యాయం కదా!

2. పొలిటికల్ మ్యాప్ చూడండి. రెండు ప్రాంతాలకి రెండు నంబర్లు ఇచ్చాను. ఒకటవ నంబర్ ప్రాంతం అహిర్ వాల్ రీజియన్ అంటారు. రెండవ నంబర్ ఉన్న ప్రాంతం GT కర్నాల్ రోడ్ రీజియన్.

haryana

3.GT కర్నాల్ రోడ్ బెల్ట్, అహిర్వాల్ రీజియన్ లు బీజేపికి బాగా పట్టు ఉన్న ప్రాంతాలు.

4.2015 లో జరిగిన ఎన్నికలలో 50% సీట్లు GT కర్నాల్ రోడ్ బెల్ట్ నుండీ గెలుచుకుంది. 40% సీట్లు అహిర్వాల్ ప్రాంతం నుండీ గెలిచింది.

******
GT (Grand Trunk Road Karnal ) కర్నాల్ రోడ్ బెల్ట్ ( నంబర్ 2).

5.GT కర్నాల్ రోడ్ గురుంచి తెలుసుకోవాలి. హర్యానా నుండీ పంజాబ్ లోకి వెళ్లే GT కర్నాల్ రోడ్ ఏ ప్రాంతాల గుండా వెళుతుందో తెలుసా?
సోనేపట్, పానిపట్, కర్నాల్, కురుక్షేత్రం, అంబాలా. మొదటి పానిపట్ యుద్ధం, రెండవ పానిపట్ యుద్ధం గురుంచి చరిత్రలో భాగంగా మనం చదువుకున్నాం. ఇక మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్రం ఇప్పటికీ అదే పేరుతో కొనసాగుతున్నది కాబట్టి బ్రాహ్మణులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఈ ప్రాంతంలో. అన్నట్లు యమునా నగర్, పంచకుల ప్రాంతాలు కూడా ఇదే జోన్ లో ఉన్నాయి.

6.చరిత్రలో యుద్దాలకి నిలయం అయిన ఈ ప్రాంతంలో రాజపుత్, రోర్ ( మరాఠా ) వీరుల జనాభా కూడా ఎక్కువే. ఇతర OBC లు అయిన సైనీ, కాంభోజలు కూడా ఎక్కువ సంఖ్య లో ఉన్నారు.

7.బ్రాహ్మణులు, రాజపుత్రులు, ఖత్రీలు, యాదవులు, సైనీలు, పంజాబీలు, కాంభోజలు ఇలా ఈ కులాల వాళ్ళు బీజేపికి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు గత 15 ఏళ్లుగా!

8.బీజేపికి బాగా పట్టు ఉన్నది అర్బన్ ఏరియాలలో మాత్రమే. గ్రామీణ ప్రాంతాలలో బీజేపికి పట్టు తక్కువ. పైన పేర్కొన్న ప్రాంతాలు అర్బన్ ఏరియా కిందికి వస్తాయి! కాషాయ ధ్వజం రెపరెపలాడింది అందుకే!

*********
అహిర్వాల్ రీజియన్ ( నంబర్ 1). అసలు హర్యానా అంటే జాట్ లాండ్! 20% నుండీ 25% మధ్యలో ఉంటుంది జాట్ కులస్థుల జనాభా!

అహిర్వాల్ రీజియన్ లో జాట్ ల తరువాత ఎక్కువ జనాభా ఉన్నది 16% అహిర్ ( యాదవులు ). జాట్ల ఆధిపత్యం కారణంగా అహిర్ లు పెద్దగా వెలుగులోకి రాలేకపోయారు.

రైతు ఉద్యమంలో జాట్ లదే ఆధిపత్యం అది హర్యానా కావొచ్చు లేదా పంజాబ్ కావొచ్చు. సహజంగానే జాట్లు కాంగ్రెస్ వైపు ఉంటారు ఎక్కువశాతం. అయితే అహిర్ లు జాట్ లు ఎవరికీ ఓటు వేస్తే వాళ్లకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. జాట్లు కాంగ్రెస్ కి ఓట్లు వేస్తె అహిర్ లు బీజేపికి ఓట్లు వేస్తారు.

అహిర్వాల్ రీజియన్ లో అహిర్ లకి చెందిన పెద్ద నాయకుడు రావు ఇంద్రజీత్ సింగ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి కొడుకు. రావు ఇంద్రజీత్ సింగ్ నార్నోల్ పట్టణానికి చెందిన వాడు కానీ గురుగావ్ నుండీ ఎన్నికలలో పోటీ చేస్తాడు.

రావు ఇంద్రజీత్ సింగ్ ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకే ఓటు వేస్తారు అహిర్ లు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అహిర్ లు ఎక్కువ సంఖ్యలో త్రివిధ దళాలలో పనిచేస్తున్నారు కాబట్టి ఎవరూ చెప్పకపోయినా బీజేపికే ఓటు వేస్తారు.

********
GT కర్నాల్ రోడ్ బెల్ట్, అహిర్వాల్ రీజియన్ లు బీజేపికి ఎక్కువ సీట్లు ఇచ్చాయి. అసలు హర్యానాలో జాట్ పొలిటిక్స్ కి ప్రధాన కేంద్రం అయిన దేశ్వాలి రీజియన్ లో కూడా బీజేపికి ఓట్లు పడ్డాయి. కేజ్రీవాల్ తన వంతుగా షుమారుగా 3 % శాతం ఓట్లు కాంగ్రెస్ వి చీల్చగలిగాడు.

మన దేశ సైన్యంలో ఆర్మీ, పారామిలిటరీ, నావీ, ఎయిర్ ఫోర్స్ లలో హర్యానా వాళ్ళు ఉన్నారు. కాబట్టి బీజేపి గెలుపు ఖాయం అయింది.

******
ఉత్తర ప్రదేశ్ లోక్ సభ ఎన్నికలలో బీజేపికి తక్కువ సీట్లు రావడం ఒకందుకు మంచిదే అయ్యింది! అందరూ ఒక వ్యూహం ప్రకారం పనిచేశారు.

అమిత్ షా ఏమి చేశాడు?
సింపుల్! విద్యార్థి పరీక్ష వ్రాసేటప్పుడు ముందు ఏ ప్రశ్నలకి సమాధానం తెలుసో వాటికి ముందు సమాధానాలు వ్రాస్తాడు. తెలియని వాటికి చివరి వరకూ హాల్లోనే ఉండి అంతో కొంత వ్రాస్తాడు.

అమిత్ షా అదే చేశాడు. బీజేపి కి పట్టు ఉన్న ప్రాంతాల్లో తన దృష్టిని కేంద్రీకరించాడు! గెలవని చోట ప్రయత్నించలేదు. అంటే సమాధానం తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబు వ్రాసాడు!

పాస్ మార్కులు వచ్చాయి!

RSS కృషి ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో హర్యానా ఎన్నికల ఫలితాలు మాట్లాడుతున్నాయి!

 

*******
రాహుల్ బీజేపి గెలవడానికి తన వంతు కృషి చేశాడు!
ఎలా?
ఏముంది! ఉచిత పధకాలు ప్రకటించాడు!
ప్రజలు నమ్మలేదు. ఉత్తరప్రదేశ్ లో ఖటాఖట్ వాగ్దానం ఫలితం ఏమిటో హర్యానా ప్రజలు తెలుసుకున్నారు.

అఫ్కోర్స్! దీపేందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రి అయితే రాబర్ట్ వాద్రా రంగంలోకి దిగుతాడు అని తెలుసు. గతంలో ఇదే దీపేందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా రాబర్ట్ వాద్రాకి అక్రమంగా విలువైన భూములు కట్టబెట్టింది!

********
హర్యానాలో కాంగ్రెస్ ఓటమి ప్రభావం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంటుంది అనడంలో సందేహం లేదు. మూసీ సుందరీకరణ పేరుతో పెద్ద ప్లాన్ వేసింది రాబర్ట్ వాద్రా కోసం అంటూ BRS నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఖండిస్తున్నది అలాంటిది ఏదీ లేదు అంటూ!

హర్యానాలో తెలంగాణ కంటే భూముల ధరలు ఎక్కువ! దీపేందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రి అయితే రాబర్ట్ వాద్రా దృష్టి హర్యానా మీదే ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ మీద ఉంటుంది! ఇవ్వాళ కాకపొతే రేపు అయినా మూసీ – రాబర్ట్ వాద్రా ఆరోపణలు నిజమా కాదా అన్నది బయటపడుతుంది. రాహుల్ మాత్రం కర్ణాటక సిద్ధ రామయ్య MUDA ( Mysore Urban Development Authority ) కుంభకోణం గురుంచి ఏమీ తెలియనట్లుగా ఉంటాడు…… (పొట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions