Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరిక ‘ఉమ్మడి పౌరస్మృతి’ అనడం దేనికి..? సెలెక్టివ్ పౌరస్మృతి అనాలి!!

September 21, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. UCC (Uniform Civil Code) అంటే కులాలకు , మతాలకు అతీతంగా పౌరులందరికి ఉండే ఏకైక పౌర స్మృతి . కొన్ని రాష్ట్రాలలో తమకు ఓటు బాంకుగా ఉపయోగపడతారనే రాజకీయ దురాలోచనతో కొన్ని కులాలను మినహాయించుకుంటూపోతే అప్పుడు దానిని Uniform Civil Code అనరు . Selective or Political Civil Code అంటారు .

అధికారికంగా గిరిజనులు , ఆదివాసీలు హిందువులు . విద్యాసంస్థల రికార్డులలో , ఉద్యోగ దరఖాస్తులలో వారందరూ మతం కాలం కింద హిందువులం అనే మెన్షన్ చేస్తారు . అయినా వారందరినీ ఉమ్మడి పౌర స్మృతి నుండి మినహాయిస్తున్నారు . కేవలం ఓట్ల రాజకీయం . పాపం ! నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఆదివాసీలను , గిరిజనులను క్రైస్తవంలోకి మార్చి ఓట్ బ్యాంకుగా మలుచుకుంటున్నారని బాధ పడ్డారు .

Ads

ఇప్పుడు బెంగాల్ ప్రభుత్వం కుర్మీ కులం వారిని మినహాయిస్తున్నామని ప్రకటించారు . ఇలా ఓట్ బ్యాంక్ పౌర స్మృతిగా చేసేస్తున్నారు . ఒక వైపు RSS చీఫ్ భగవత్ గారు ముస్లింల మీద చాలా అభిమానాన్ని చూపుతుంటారు . భాజపా ప్రభుత్వాలు మాత్రం కేవలం ఓట్ల కోసం ముస్లింలను , క్రైస్తవులను exclude చేస్తుంటారు .

ఏది ఏమైనా భాజపా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా తమ ఓట్ బ్యాంకుల కోసం కొన్ని వర్గాలను , మతాలను , కులాలను మినహాయించుకుంటూపోతే గందరగోళం సృష్టించిన వారవుతారు . కామన్ అంటే కామనే . ఇలా మినహాయింపు రాజకీయాలు కాదు . Prof D.A.R. Subramanyam

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ అమెరికన్ గ్రౌండ్ జీరో ! మరి తెలంగాణ ‘గ్రౌండ్ జీరో’ మాటేంటి..?!
  • ఎన్టీయార్, దిలీప్‌కన్నా శివాజీ గణేశన్‌తోనే ఆ పాత్రకు న్యాయం !!
  • ఒక ఫోన్ కాల్ … ఒక అరెస్ట్ … వార్త పంపాక మొదలైన అసలు టెన్షన్…
  • దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విలేకరిపై టాడా కేసు…
  • గాఢనిద్రలో ఉన్న చంద్రబోస్ తెలంగాణతనం సోయి తెచ్చుకుంది !!
  • మీరూ మాలాగే దారితప్పారా పుష్పా? హీరో అంటేనే అన్‌వాంటెడ్ ఎలిమెంటా?
  • గుడ్ రిజల్ట్ ! గుడ్ ఫీడ్ బ్యాక్ ! – రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఓ సర్వే !!
  • సరే, అంతరిక్షంలోనే తలపడదాం – మస్క్ మాటలకు అంబానీ చేతల జవాబు !!
  • కామెడీ కళ్యాణ్ ! రెనిగేడ్ కళ్యాణ్ ! నక్సలైట్లూ కామెడీ సరుకైపోయారా ?!
  • పాపం రాహుల్ ! మాటల్లో, వ్యవహార శైలిలో ఏదో భారీగానే తేడా కొడుతోంది !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions