Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక బీసీ మహిళ ఔట్… బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు

September 3, 2026 by M S R

.

అనుకున్నదే… ఆమె వినదు… అధిష్టానం చిలక్కి చెప్పినట్టుగా వినలేదు… రాజీనామా చేయి, మర్యాదగా ఉంటుంది అని చెప్పింది… కానీ ఆమె ఉద్దేశం వేరు కదా… వినలేదు… రేవంత్ రెడ్డి ఆమెను బర్తరఫ్ చేశాడు… ఆమె బీసీ కార్డు తీసింది కదా… ఇక్కడ రేవంత్ రెడ్డి తన రాజకీయం ప్రదర్శించాడు…

ఒకరు పోతేనేం, ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు వచ్చాయి… 1) జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా కేబినెట్ హోదాలో నియమించారు… (మున్నూరు కాపు)… 2) మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమించారు…. (గౌడ)… 3) కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమించారు… (పద్మశాలి, అదే వరంగల్ జిల్లా మహిళ)…

Ads

కొండా మురళి కాపు, సురేఖ పద్మశాలి… ఇప్పుడు ఆ రెండు కులాలకూ పదవులు దక్కాయి… ఏదో చాలా చాకచక్యంగా బీసీ కార్డు ప్రయోగించాను అనుకుంది కొండా సురేఖ… రేవంత్ రెడ్డి చాణక్యానికి అది కొట్టుకుపోయింది… మా బీసీలపైనే చర్యలు దేనికి అని ఆరోపించింది కదా సురేఖ… చిన్నారెడ్డిని కూడా తొలగించారు ఆ పోస్టు నుంచి… శుభం… ఆలస్యమైనా సరే, రేవంత్ రెడ్డి కొరడా పర్‌ఫెక్ట్‌గా పనిచేసింది…

తను కాంగ్రెస్ నుంచి, కేబినెట్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందని ఆమెకూ తెలుసు… కాకపోతే బీసీ కార్డు బయటికి తీసి, ఓ బాధితురాలిగా బయటికి రావాలని అనుకుంది… బర్తరఫ్ చేస్తే మరీ మంచిదనీ అనుకుంది… తద్వారా తనకు సానుభూతి లభిస్తుందనీ, రాజకీయంగా ఉపయోగపడుతుందనీ భావించిందేమో బహుశా…

అందుకే ఖర్గే దాకా సంప్రదింపులు… వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కోసం పైరవీలు… పార్టీలోనే సీనియర్ల మద్దతుకై ప్రయత్నాలు… కానీ ఎప్పుడైతే కొండా మురళి ప్లాన్-బి అన్నాడో రేవంత్ రెడ్డి టీమ్ అలర్ట్ అయిపోయింది… తన వెనుక ఏదో రాజకీయ కుట్రకు ప్లాన్ జరుగుతోందని వివరాలు సేకరించి, హైకమాండ్ ఎదుట పెట్టి, ఫిక్స్ చేసి, సైలెంటుగా ఢిల్లీ నుంచి వెనుదిరిగాడు…

ఈ ధిక్కార స్వరాలు ఇలాగే పెరిగితే ఈ కీలకదశలో పార్టీకి జరిగే నష్టం ఏమిటో హైకమాండ్‌కు సరిగ్గా వివరించడమే కాదు… ఆమె కేబినెట్‌లో అక్కర్లేదు అనే తన వాదనకు స్థిరంగా నిలబడ్డాడు… సో, ఇదంతా ఎటువైపో దారితీస్తుందని గమనించిన హైకమాండ్ ఇక సురేఖకు చెప్పేసింది… నువ్వే రాజీనామా చేసెయ్ లేదంటే బర్తరఫ్ తప్పదని…! ఎప్పుడైతే వేణుగోపాల్ ఆమెను కలవడానికి కూడా ఇష్టపడలేదో అప్పుడే అందరికీ అర్థమైపోయింది ఆమెకు కాంగ్రెస్ పార్టీ గుడ్‌బై చెప్పేసినట్టేనని!

మొదట 3 గంటలకు మీడియా మీట్ అన్నారు, రాజీనామా ప్రకటిస్తుంది అనుకున్నారు, చేయలేదు… రేవంత్ రెడ్డికి తప్పలేదు… వేటు పడింది… ఇక మిగిలిన ధిక్కార స్వరాల్లో మిగతావి పెద్ద పరిగణనలోకి తీసుకోవాల్సినవి కావు, ఒక్క రాజగోపాలరెడ్డి మినహా… తనది తరువాత దశ….

భట్టి భార్య కమీషన్లు, పొంగులేటి కంట్రాక్టులు, రేవంత్ సోదరుల వ్యవహారాలు అంటూ ఏదో సంచలన లేఖను ఖర్గేకు ఇచ్చానని సురేఖ చెబుతున్నా… అవి నిరూపణకు నిలబడవు, ఎలాగూ వెళ్లి పోతుంది కాబట్టి ఏదో చెబుతోంది అనుకుంటారు… ఆ మాటలకు విలువ ఉండదు… కాకపోతే ఇప్పటికీ ఓ మిస్టరీగా మిగిలింది మాత్రం… సురేఖ ఎందుకంత తొందరపడింది..? ఆమె వెనుక ఎవరున్నారు..? ఏ కుట్రకు రచన జరుగుతోంది..? ఈవిషయాల్లో క్లారిటీ రావల్సి ఉంది….

కానీ ఎప్పుడైతే ఆమె బీసీ కార్డు తీసిందో, రేవంత్ రెడ్డికి కూడా ఓ బీసీ ఎమ్మెల్యేను కేబినెట్‌లోకి తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డట్టే అనుకున్నారు అందరూ… ఆమె ప్లేసులో ఎవరు అనేది ఆసక్తికరంగా చర్చల్లోకి వచ్చింది… ఎలాగూ త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది… కొందరి శాఖల్లో మార్పులు, కొందరికి ఉద్వాసన ఖాయం… తద్వారా వచ్చే అసంతృప్తికి పార్టీ సిద్దపడాల్సిందే అనుకున్నారు, కానీ ఏకంగా మూడు మంచి అధికార హోదాల్ని బీసీ మహిళలకు కట్టబెట్టాడు రేవంత్…

నిజానికి ఇంత తాత్సారం కూడా కరెక్టు కాదు… వేరే పార్టీల్లోనైతే ఇంత జాప్యం ఉండదు… కాంగ్రెస్ కాబట్టి కాస్త లిబరల్‌గా సురేఖ తన వాదనేమిటో చెప్పుకోనీ అన్నట్టుగా వ్యవహరించింది… రేవంత్ రెడ్డి మెల్లిమెల్లిగా పార్టీలో ధిక్కార గొంతులకు నట్లు బిగిస్తున్నాడు… రాజకీయంగా మరింత దూకుడు ప్రదర్శించవచ్చు…

కేసీయార్‌ను రాజీనామా చేయమని డిమాండ్ చేయడం, నువ్వు ప్రతిపక్షనేతగా కూడా పనికిరావు అని ఎద్దేవా చేయడం అందులో భాగమే… బహుశా పాడి కౌశిక్ రెడ్డిపై కూడా అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ వేటు వేయవచ్చు…

పీసీసీ అధ్యక్షుడు, స్పీకర్‌లను మంత్రివర్గంలోకి తీసుకుని, పొన్నంకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం అయితే ఉంది… ఐతే కాంగ్రెస్‌లో ప్రచారాలను బట్టి ఫలితాలు ఉండవు, తెలుసు కదా… కాకపోతే ఇవన్నీ అనుకున్నట్టుగా జరిగితే… పార్టీ మీద రేవంత్ పట్టు మరింత పెరుగుతుంది… అఫ్‌కోర్స్, ప్రభుత్వం మీద కూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక బీసీ మహిళ ఔట్… బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు
  • డియర్ యానిమల్ వంగా ! ఒక్క రోమమూ నిక్కబొడుచుకుంటే ఒట్టు !!
  • యుద్ధరంగంలో ఇక ఈ వీరప్పన్ మార్క్ మీసాలు తిప్పబడవు !
  • సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !
  • బిగ్‌బాస్ ట్రోఫీ – జస్ట్, ఇంట్లో పెట్టుకునే ఓ షో పీస్‌ మాత్రమే…
  • ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు..!
  • మెలితిరిగిన మీసాల తెలుగు ముఖ్యమంత్రి… ఓ సరదా కథనం…
  • జితేంద్ర మిశ్రా ! ‘ఆపరేషన్ సిందూర్’ లీడర్‌‌కు ఇక ‘ఆపరేషన్ అయోధ్య’…
  • Dear You – రూపాయి పెడితే 150 రూపాయలు – గ్లేసియర్ బ్రేక్ బస్టర్ !!
  • ఇది మునుపటి ఇండియా కాదు ! రెండు బలమైన తాజా తార్కాణాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions