Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మగారు ఐరాస మెట్లు ఎక్కుతున్నారు – రచ్చ ముఖ్యం !!

September 21, 2026 by M S R

.

మహువా మొయిత్రా… వివాదాస్పద రాజకీయ నాయకురాలు… పార్లమెంటులో ప్రశ్నల్ని కూడా అమ్మకానికి పెట్టిన ఈమె తరచూ ఏదో వివాదంలో ఉంటుంది… ఇంకా మైనారిటీ జపం పోనట్టుంది టీఎంసీ మార్క్ నేతలకు… తాజాగా ఆమె ఓ వివాదాన్ని ఏకంగా ఐక్యరాజ్యసమితి దాకా తీసుకుపోయింది…

దాని ఫలితం ఏమిటనేది పక్కనపెడితే … ఎక్కడికి వెళ్లినా జనం కోడిగుడ్లతో కొడుతున్న అనుభవాలు టీఎంసీ నేతల్ని మరింత ఫ్రస్ట్రేషన్‌లోకి నెట్టేస్తున్నట్టున్నాయి… సరే, ఈ ఐరాస కథేమిటో చెప్పుకుందాం ఓసారి… మీడియాలో అండర్ ప్లే అయింది…

Ads


ఐరాసకు ఎంపీ ఫిర్యాదు..! బెంగాల్‌లో ముస్లిం అధికారులే ఎందుకు పక్కనపడ్డారు? మహువా మొయిత్రా సంచలన ఆరోపణలు… 

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మతం అనే అంశం కొత్తది కాదు. ఎన్నికల సమయంలో అయితే అది మరింత వేడెక్కుతుంది. కానీ ఇప్పుడు ఆ రాజకీయ చర్చను ఏకంగా అంతర్జాతీయ వేదిక తలుపు దాకా తీసుకెళ్లింది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటనల్లో ముగ్గురు సీనియర్ ముస్లిం IAS, IPS అధికారులను ఉద్దేశపూర్వకంగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంచారని ఆరోపిస్తూ ఆమె ఐరాస మానవ హక్కుల మండలి పరిధిలోని మైనారిటీ వ్యవహారాల ప్రత్యేక నివేదికదారు నికోలస్ లెవ్రాట్‌కు లేఖ రాసింది.

ఇది సాధారణ రాజకీయ విమర్శ కాదు. ఒక ఎంపీ ఒక రాష్ట్రంలో జరిగినట్లు చెబుతున్న అధికారిక వ్యవహారాన్ని అంతర్జాతీయ మైనారిటీ హక్కుల వేదిక దృష్టికి తీసుకెళ్లిన వ్యవహారం.

మహువా మొయిత్రా లేఖలో చెప్పిన కథనం ప్రకారం… జూలై, ఆగస్టు నెలల్లో అమిత్ షా బెంగాల్ పర్యటనల సందర్భంగా మూడు సందర్భాల్లో ముగ్గురు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సిలిగురి పోలీస్ కమిషనర్ సయ్యద్ వక్వార్ రజాను బోర్డర్ సెక్యూరిటీ రివ్యూ సమావేశం నుంచి వెళ్లిపోవాలని చెప్పారని, అమిత్ షా స్వాగతం, వీడ్కోలు ప్రోటోకాల్‌లో కూడా ఆయన స్థానంలో మరో అధికారిని పెట్టారని మహువా ఆరోపణ…  బెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ జావెద్ షమీమ్‌ను అదే సమావేశానికి హాజరు కాకుండా ఆదేశించారని, ఆయన స్థానంలో ఆయన కింద పనిచేసే అధికారి పాల్గొన్నారని అంటోంది.

ఇక జూలై 19న కోల్‌కతాలో జరిగిన లా అండ్ ఆర్డర్, డిజాస్టర్ ప్రిపేర్డ్‌నెస్ సమావేశానికి వచ్చిన సీనియర్ IAS అధికారి ఖలీల్ అహ్మద్‌ను కూడా బయటకు పంపించారట. ఇంతటితో కథ ముగియలేదు. ఆగస్టు 20న సిలిగురిలో జరిగిన మరో బోర్డర్ సెక్యూరిటీ సమావేశంలో కూడా వక్వార్ రజాను పక్కన పెట్టారని, కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించిన ప్రదర్శనలో జావెద్ షమీమ్‌కు కూడా అవకాశం ఇవ్వలేదని మహువా లేఖ చెబుతోంది.

అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇదంతా ప్రోటోకాల్ వ్యవహారమా? లేక మతం ఆధారంగా తీసుకున్న నిర్ణయమా? అసలు ఆమె ఆరోపణల్లో నిజముందా..? బెంగాల్ వ్యవహారాలు కవర్ చేసే ఏ మీడియా సంస్థా వీటిని నిర్దారించడం లేదు సొంతంగా!!

ఈ ముగ్గురు అధికారుల్లో ఒకే సామాన్యత ఏమిటంటే వారు ముస్లింలు కావడమేనని ఆమె తన లేఖలో పేర్కొంది. ఇతర మతాలకు చెందిన అధికారులు మాత్రం ఆయా కార్యక్రమాల్లో కొనసాగారని, అందుకే దీనిని తాను “ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టడం”గా చూస్తున్నానని చెబుతోంది.

ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఐరాసను కోరిన ఆమె అమిత్ షా పర్యటనలకు సంబంధించిన CCTV ఫుటేజ్, టూర్ డైరీలు, అధికారిక రికార్డులను భద్రపరచాలని కూడా కోరుతోంది.

మరి ఐరాస ఏం చేస్తుంది? ఇక్కడే ఈ వార్తలో మరో ముఖ్యమైన కోణం ఉంది.

మహువా లేఖ రాసిందంటే ఐరాస వెంటనే విచారణకు దిగిందని, దిగుతుందని, దిగాలని కాదు. Special Rapporteur అనేది స్వతంత్ర మానవ హక్కుల నిపుణుడి పదవి. ఇలాంటి నిపుణులు వచ్చిన సమాచారాన్ని పరిశీలించి, అవసరమైతే సంబంధిత ప్రభుత్వానికి కమ్యూనికేషన్ పంపి వివరణ కోరే అధికారం కలిగి ఉంటారు.

OHCHR ప్రకారం, Special Proceduresకు వచ్చిన ఫిర్యాదులపై ఆరోపణల స్వభావాన్ని బట్టి ప్రభుత్వాలకు లేఖలు, urgent appeals వంటి కమ్యూనికేషన్లు పంపవచ్చు. ఎలా స్పందించాలి, అసలు స్పందించాలా లేదానేది ప్రభుత్వ ఇష్టం… కానీ మహువాకు ఇష్యూను మైనారిటీ కోణంలో రచ్చ చేయడం మాత్రమే ముఖ్యం.

మరి ఇంత సున్నితమైన ఆరోపణను మహువా ఎందుకు అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లింది… గతంలోలాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా టీఎంసీ నేతల అబద్ధాల్ని, వక్రబాష్యాల్ని, వక్రీకరణల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు… ఇదుగో ఇలాగైతే తప్పకుండా మీడియా కవరేజ్ వస్తుంది, తమ మైనారిటీ విధేయతను మరోసారి నిరూపించుకునేందుకు ఉపయోగపడుతుందనేది ఆమె భ్రమాత్మక ఎత్తుగడ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమ్మగారు ఐరాస మెట్లు ఎక్కుతున్నారు – రచ్చ ముఖ్యం !!
  • ప్రొఫెనలిజం – ఎవరు నిజమైన దొంగలు ? ఓ బ్యాంకు చోరీ కథ !!
  • Only SunDay- Not FunDay… పరమ పేలవంగా నాగార్జున వీకెండ్ షో !
  • మైండ్ బ్లాకయ్యేలా… జన్వాడ భూముల ‘మోడస్ ఆపరెండి’…
  • పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !
  • బాలయ్య కొడుకు ఎంట్రీకి ఈ కథ సరిగ్గా కుదురుతుందేమో..!!
  • మోదీకి తెలిసొచ్చిందట – దక్షిణ రాజకీయాలపై మతప్రభావం !!
  • యుద్ధం ముదురుతోంది – ప్రపంచ దేశాలన్నీ లాగబడుతున్నయ్ !!
  • ‘‘ ఆ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ నా మెంటల్ మ్యాప్ మార్చేశాడు ’’
  • అంతటి కమలహాసన్ సైతం… ఆ అక్కినేని సీన్లలో వెలవెలా..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions