Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి రాజేష్ ఖన్నాను మించి ఎన్టీఆర్ అదరగొట్టేసిన సూపర్ హిట్…!

September 2, 2024 by M S R

NTR- యస్ డి లాల్ కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ , షిఫ్టింగులు లేని వంద రోజుల సినిమా . హిందీలో సూపర్ హిట్టయిన రోటీ సినిమా ఆధారంగా 1976 లో నేరం నాది కాదు ఆకలిది అనే ఈ సినిమా వచ్చింది . ప్రముఖ నటి లక్ష్మి తండ్రి వై వి రావు నిర్మాత .

హిందీలో లీడ్ రోల్సుని రాజేష్ ఖన్నా-ముంతాజులు పోషించారు . రాజేష్ ఖన్నా కన్నా మన యన్టీఆరే బాగా నటించారు . రాజేష్ ఖన్నా అభిమానులు నన్ను మన్నించాలి .

కధాంశం పగ , కక్ష , నేరాలు , పోలీసులు వంటి రొటీన్ అంశాలే అయినా టేకింగ్ , లోకేషన్స్ , ముఖ్యంగా సత్యం సంగీతం , లిరిక్స్ , గొల్లపూడి మారుతీరావు డైలాగులు ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు . ఈ సినిమా పేరు చెప్పగానే చాలామందికి ముందు గుర్తు వచ్చేది సి నారాయణరెడ్డి వ్రాసిన *మనలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి* అనే పాట . ప్రభ మీద జనం రాళ్లు వేస్తుంటే , NTR అడ్డం వెళ్లి , ఆ అరాచకాన్ని ఆపటానికి పాడే పాట . చాలా బాగుంటుంది . బాల సుబ్రమణ్యం పాడారు .

Ads

డైమండ్ రాణి అనే జయమాలిని మీద పాట తప్పించి , మిగిలిన పాటలన్నీ నారాయణరెడ్డే వ్రాసారు . అన్ని పాటల్లో మేల్ వాయిస్ బాలుదే . *ఓ హైదరాబాద్ బుల్ బుల్* అనే ఖవాలీ పాట ప్రభ- NTR ల మీదది కూడా బాగుంటుంది . ఈ పాటలో కూడా NTR ఇంటెన్సుతో నటించారు . NTR-మంజుల కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయిందీ సినిమాలో .

*చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా* అనే గ్రూప్ డాన్స్ చాలా అందంగా ఉంటుంది . మంజుల డాన్స్ బాగుంటుంది . *పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా* అనే అల్లు రామలింగయ్యని అల్లరి పెట్టే పాటలో కూడా NTR- మంజుల జంట హుషారైన నటన బాగుంటుంది .

ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది గుడ్డి తల్లిదండ్రులయిన గుమ్మడి- పండరీబాయిల కుమారుడు మురళీమోహన్ పాత్రకు పేరు శ్రవణ్ అని పెట్టడం . గొల్లపూడిని మెచ్చుకోవాల్సిందే . రామాయణంలో శ్రవణుడిని దశరధుడు పొరపాటున చంపుతాడు . ఈ సినిమాలో కూడా NTR పొరపాటున మురళీమోహన్ నదిలో పడటానికి కారణమయి , శ్రవణుని తల్లిదండ్రులను సేవిస్తాడు . రచయిత ఆలోచనకు జోహార్ .

కాంతారావు , గుమ్మడి , పండరీబాయి , త్యాగరాజు , గిరిబాబు , నూతన్ ప్రసాద్ , రాజబాబు , రమణమూర్తి , ప్రభాకరరెడ్డి ప్రభృతులు నటించారు . విశేషం ఏమిటంటే ఆరుద్ర జడ్జిగా ఓ అతిధి పాత్రలో తళుక్కుమంటారు . ఔట్ డోర్ షూటింగులో ఎక్కువ భాగం ఊటీలో తీయటం వలన లొకేషన్స్ ఆకర్షణీయంగా ఉంటాయి .

హిందీ సినిమా ట్రాజెడీ . రాజేష్ ఖన్నా- ముంతాజ్ చనిపోతారు . ఈ సినిమా నిర్మాతకు డబ్బులు వచ్చే ప్రాప్తం ఉండి , మన తెలుగు సినిమాను సుఖాంతం చేసారు . మన తెలుగు వాళ్ళు హీరో చనిపోవటాన్ని జీర్ణించుకోలేరు కదా ! హిందీ సినిమా హిట్ అయినప్పటికీ , దానికన్నా కూడా బాగుంటుంది మన తెలుగు సినిమా .

రెండూ యూట్యూబులో ఉన్నాయి . మీరే చూసి చెప్పండి ఏ సినిమా బాగుందో ! An excellent entertaining and one of the NTR’s unmissable movies . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం, మనం అర్థం చేసుకోలేం గానీ… కోటీశ్వరులకూ కోటి కష్టాలు…
  • నాటి బేబీ షామిలి… తెరపై ‘అంజలి’… నిజజీవితంలో ‘చిత్రలేఖిని’…
  • అంజలి..! ఇలాంటి మణిరత్నం క్లాసిక్స్ మళ్లీ ఎప్పుడు చూస్తామో..!
  • హిందూ మహా సముద్రంలో ఇండియాకు రెండు ‘సెక్యూరిటీ గార్డులు’…
  • ఆ జర్నలిజాన్ని మార్కెట్ తిరస్కరించింది… వాషింగ్టన్ పోస్ట్ వైఫల్యం అదే…
  • కాళ్లు తోక… చేతులే మొప్పలు… ఒళ్లు వలను కొరికి బయట పడ్డ చేపపిల్ల…
  • ఏమోయ్ జై షా… ఒక పాకిస్థానీ ఉగ్ర బంకర్ పేల్చిన ఖర్చు తెలుసా నీకు..?!
  • ఎవరీమె..? అస్సాం ముఖ్యమంత్రి ఎందుకు వేటాడుతున్నాడు..?
  • మంచు అల్లుడు గారు… కామెడీ విలన్ నుంచి ‘మంచి’ పాత్రల్లోకి…
  • ‘సర్’.., భలే చెప్పారు సర్… మమత క్షుద్ర విన్యాసాలకు సుప్రీం చెక్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions