.
అటు అసదుద్దీన్, ఇటు రేవంత్… నిన్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభం దగ్గర మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి… రేవంత్ తను ఏమైనా ముందస్తుగా ప్రిపేరయ్యాడో, యథాలాపంగానే ఫ్లోలో మాట్లాడాడో తెలియదు గానీ, చాలా బ్యాలెన్స్‌డ్, తను అభిమానంతో తలెత్తుకునేలా ఉంది… అదేసమయంలో ఓల్డ్ సిటీని ఓన్ చేసుకుని, ఆ ఆదరణ పొందేలా ఉంది…
అసదుద్దీన్ బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడతాడు గానీ తన తమ్ముడు అక్బరుద్దీన్ మాటల్లో దూకుడు, ఎదుటివారిని నువ్వెంత అనే తరహా కనిపిస్తుంది… ఎవరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనేం, మా దగ్గరకు రావల్సిందే అని వ్యాఖ్యలు కూడా చేశాడు కదా… టైమ్ దొరికింది కదాని రేవంత్ భలే జవాబు చెప్పాడు… అదీ స్ట్రెయిటుగా…
Ads
‘‘బెదిరింపులతో నన్నెవరూ భయపెట్టలేరు, ఏ ఒత్తిళ్లూ నాపై పనిచేయవు, స్నేహం చేస్తే ఏదడిగినా చేస్తా… దోస్తీకి మాత్రమే నేను గులాం’’ ఇదీ తన జవాబు… ‘ఎన్నికలప్పుడు ఎవరెవరి ధోరణి ఏమిటనేది అప్పుడు చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు సీఎం హోదాలో ఈ ఏరియా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు ఏమడిగినా చేయడానికి రెడీ…’’ అన్నాడు…
అంతేకాదు ‘‘నేనేదో పరాయివాడిని కాదు, మలక్‌పేట అల్లుడిని, మూసారాంబాగ్, శాలివాహననగర్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నా… ఈ ఏరియాలో బజార్లన్నీ తిరిగాను… ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా బిర్యానీ తినకుండా వెళ్తున్నా, కొన్ని పనుల ప్రారంభానికి వచ్చినప్పుడు సుష్టుగా తింటాను… నాగోల్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయం కలిపే మెట్రో కారిడార్ డెవలప్ చేద్దాం, మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి కడతాం, మూసీ పరీవాహకాన్ని అభివృద్ధి చేద్దాం అంటూ ఏకరువు పెట్టాడు… సభలో చప్పట్లే చప్పట్లు…
అదేసమయంలో ఒవైసీ బ్రదర్స్‌కు దేశభక్తి లేదనేది ఉత్తమాట, అమిత్ షా, మోదీలకన్నా తక్కువేమీ కాదు అని మద్దతుగా మాట్లాడాడు… నిజానికి అక్కడ ఆ ప్రస్తావన అనవసరం… ఒవైసీ మాటలు ఇంకా బ్యాలెన్స్‌డ్… మేం కాంగ్రెస్ పార్టీకి మద్దతు కాదు, రేవంత్ రెడ్డికి మాత్రమే మా మద్దతు… గతంలో కేసీయార్‌కు కూడా చెప్పాను, గతంలో బీఆర్ఎస్‌తో దోస్తీ ఉండేది…
రేవంత్ రెడ్డి దూకుడు ఆపలేకపోతే ఇంటికి పోతారు అని అప్పుడే చెప్పాను, సీఎం అయ్యాక రేవంత్ మర్యాదస్తుడిలా మారిపోయాడు, మళ్లీ పాత రేవంత్ అయిపోవాలి, జనంలోకి రండి, ఎవరూ ఆపలేరు మిమ్మల్ని అని చెప్పుకొచ్చాడు… ఇద్దరూ పార్టీల నడుమ సయోధ్య, అవగాహన అనే అంశాలేమీ రాకుండా జాగ్రత్తపడ్డ తీరు ఆసక్తికరం..!! వేర్వేరు పార్టీల నాయకులుగా ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకున్న తీరు కూడా ఇంట్రస్టింగు !!
Share this Article