.
గీత రచయిత అనంత శ్రీరామ్ పిచ్చి రాతలకే కాదు, ఈమధ్య పిచ్చి కూతలకూ ప్రసిద్ధుడైపోతున్నాడు, అఫ్‌కోర్స్, ఆమధ్య ఏదో టీవీషోలో పిచ్చి గెంతులతో కూడా ప్రసిద్ధుడయ్యాడు… ఈమధ్య పెద్ది సినిమాలో ఓ వెగటు ఐటమ్ సాంగ్ ఏదో కిలికిలి భాషలో, రెండు నెలలపాటు కష్టపడి, మెదడు చింపుకుని, నిద్రాహారాలు మానేసి, మరీ ప్రసవించాడు కదా…
ఆ పాట మీద బోలెడు విమర్శలొచ్చాయి… తీసిన నిర్మాత మీద, దర్శకుడి మీద, నటించినవాళ్ల మీద కూడా… అందరికన్నా ఎక్కువగా కవి చౌడప్ప పూనిన అనంత శ్రీరామ్ మీద ఎక్కువ విమర్శలు… అదేదో రెడ్ లైట్ ఏరియాలో ఓ కొంప ఓనర్ పాడినట్టుగా ఆ పాట సాహిత్యం… సారీ, సాహిత్యం అన్న పదం వాడినందుకు… సరే, కంటెంటు…
Ads
దీనిపై ఎవరో అడిగారు తనను, దాంతో కోపం వచ్చింది తనకు… సాహిత్య విలువలు తెలిసినవాళ్లు, అర్థం చేసుకునేవాళ్లతో సమస్య లేదట, నిర్దిష్టంగా ఏదైనా అడిగితే జవాబిస్తాడట… అంతేకాదు ‘‘ఐటెం సాంగ్ ఆస్వాదించలేని వాళ్ళు ఐటెంగాళ్ళు’’ అని వ్యాఖ్యానించాడు…
ఐటమ్ గాళ్స్ గురించిన నీ పాట నీకు అంత అద్భుతం కావచ్చు, నచ్చనివాళ్లు ఐటమ్ గాళ్లు ఎలా అవుతారు మిస్టర్..? వారానికి కొంత డబ్బు దాసుకొండి, వ్యభిచార కొంపలకు వెళ్లిరండి, లేకపోతే జీవితంలో ఏం మజా ఉంటుందంటూ పురికొల్పే నీ కంటెంటు నచ్చకపోవడమూ తప్పేనా..? నీ అంత ఉత్కృష్టమైన టేస్టు లేక నచ్చలేదని చెబితే నీ దృష్టిలో ఐటమ్ గాళ్లు అయిపోతారా..?
అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచి, దుర్మార్గంగా దండుకుంటున్నా, అంత బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి, సినిమా చూసి, ఆ పాట నచ్చితే నచ్చలేదంటాం, నచ్చితే నచ్చిందంటాం… దానికి నిందిస్తావా, తిట్టిపోస్తావా..? నీకు తిండిపెట్టే ప్రేక్షకులను అవమానించడమే ఇది…
నిర్దిష్టంగా అడిగితే చెబుతానంటున్నావు కదా… నీ పాటలో నువ్వు చెబుతున్న సోకాల్డ్ సాహిత్యం ఎక్కడ సచ్చింది..? ఇది నిర్దిష్టమైన, స్ట్రెయిట్ ప్రశ్నే… జవాబు చెప్పు… పైగా జాన్వీకపూర్ సోయగాల కుచిత్రీకరణపై సాక్షాత్తూ దర్శకుడే సిగ్గుపడ్డాడు,, లెంపలేసుకున్నాడు, సారీ చెప్పాడు, ఆ సీన్లు తీసేశాడు… తనకున్న ‘సంస్కారం’ నీకు లేకపోతే నువ్వు సిగ్గుపడాలి గానీ… సారీ చెప్పడం తప్పంటావేమిటి సంస్కారీ..?
ఐటమ్ సాంగ్ అయినా సరే, బాగుంటే నచ్చిందంటారు… ఊ అంటావా మావా పాట సూపర్ హిట్… ఆ సినిమా బ్లాక్ బస్టర్… అన్ని భాషల్లోనూ… కానీ పెద్ది… హిందీలో ఫ్లాప్… తమిళంలో ఫ్లాప్… ఇప్పుడేమందాం మరి..? నచ్చితే చూస్తారు, నచ్చకపోతే ఎహెపోరా అంటారు ప్రేక్షకులు… ప్రేక్షకుడు నియంత…
ఇప్పుడు చెప్పు… రోజుకి ఇరవై కూలి సంపాదించే వాడిని ఉద్దేశించి వారానికి వెయ్యి దాయి నీకిస్తా హాయి అనడంలో ఎలాంటి సాహిత్యాన్ని వెతుక్కోవాలో వివరించు… దీన్ని సాహిత్యం అనాలా..? పైత్యం అనాలా..? ఇలా చెబుతుంటే కటువుగా, పరుషంగా ఉన్నట్టుంది కదా… రెడ్ లైట్ కొంపలకు వెళ్లండి, ఎంజాయ్ చేయండి అని నువ్వు ఇచ్చిన పిలుపు కూడా అలాగే ఏడ్చింది మరి…
పైగా ఆ టేస్టు లేనివాళ్లంతా ఐటమ్‌గాళ్లు అంటూ విటుకరింపు… సారీ, వెటకరింపు… నువ్వు రాసిన కంటెంటు నాణ్యత గురించి చెప్పడానికి సాహిత్యంలో పీహెచ్‌డీలు అవసరం లేదు, నేలక్లాసు అర బీడీ గాళ్లు కూడా చెబుతారు… హేమిటో, ఈమధ్య నువ్వు ఏదేదో అయిపోతున్నావు..!!
Share this Article