నిన్న హైపర్ ఆది ఏవేవో పంచులు వేస్తూ ఓ మాటన్నాడు… బిగ్‌బాస్‌లో మిగిలిన ఈ రాజమాతలు కప్పు పట్టుకుపోవడం మాటేమో గానీ కొప్పులు పట్టుకుని కొట్టుకునేట్టున్నారు అని…!! ఈరోజు నామినేషన్లలో దాదాపు ఇదే స్థితి… శోభాశెట్టి, రతిక రోజ్, అశ్విని, ప్రియాంక జైన్ నడుమ శివాజీ భలే మంటపెట్టాడు… నాగార్జున దత్తపుత్రుడు కదా… చాణక్య అట పైగా…
అంతా శివాజీ వారి చలవే… తనను నమ్మి, తన కరుణ కోసం వెంపర్లాడే ఓ బుర్రలేని పిల్ల… శివాజీకి కోపమొస్తే హౌజులో ఉండలేనని భావించే ఓ తింగరి పిల్ల… ఆ రతిక రోజ్‌కు బాగా ఎక్కించాడు… తనకు పడని శోభాశెట్టి, ప్రియాంకల మీదకు ఉసిగొల్పాడు… ఆడ లేడీస్ మీద తన ప్రతాపం… ఆడవాళ్లనే ప్రయోగించాడు… వాళ్లు మాటలతో తన్నుకుంటుంటే కన్నింగ్ లుక్స్‌తో లోలోపల ఆనందపడ్డాడు…
కానీ శివాజీ విసిరిన రతిక సరైన అస్త్రం కాదు… తను విన్నది ఒకటి, అర్థమైంది మరొకటి… పైగా సరిగ్గా మాట్లాడటం రాదు… ఇంకేం, ఫ్లోలో నాగార్జుననే ఓ చీపురుపుల్లలా తీసిపారేసింది… తను జస్ట్, ఓ హోస్ట్ మాత్రమే, తనేమీ హౌజ్ మేట్ కాదు అనేసింది… దీంతో ఆ అస్త్రం ఎటు పోతుందో తెలియని శివాజీ బుర్రపట్టుకున్నాడు… హేమయ్యా నాగార్జునా, నీ శివాజీ నిర్వాకం చూస్తున్నావా..?
Ads
ఐనా నీకేం తెలుస్తుందిలే… ఆట చూసేవాడివి కాదు, సొంతంగా ఒపీనియన్ చెప్పేవాడివీ కాదు… రతిక చెప్పినట్టు జస్ట్, ఓ హోస్ట్వి… బిగ్‌బాస్ టీం రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివేస్తే సరి అనుకునేవాడివి… శివాాజీ విజేత అయితే చాలు నీకు… అంతేనా…? అసలు రతిక అనే కేరక్టరే చాలా తింగరి కేరక్టర్… ఒకవైపు శోభాశెట్టి, ప్రియాంక జైన్ తెలివిగా, ధైర్యంగా, శివాజీ వంటి గ్యాంగ్ లీడర్‌ను ఎదుర్కొని ఆడుతుంటే… శివాజీ కాళ్ల మీద పడి రతిక తన ఇండివిడ్యుయాలిటీని పోగొట్టుకుంది…
ఎలాగూ శివాజీ ఎక్కించి వదిలాడు కదా… ఇక అరుపులతో రెచ్చిపోయింది… తన బాడీ లాంగ్వేజీ, తన అరుపులు, తన పాయింట్స్ మాత్రమే కాదు… చివరకు అశ్విని, ప్రియాంక కొట్లాట నడుమ దూరి మరింత మంటపెట్టింది… పైగా బిగ్‌బాస్‌ను పెద్దయ్యా అని పిలుపు… మొత్తానికి భలే చికాకు తెప్పించారు అశ్విని, రతిక…
నిజానికి రతిక లాస్ట్ టైం పోవాల్సిందే… భోలేను బయటికి పంపించాలనే బిగ్‌బాస్ నిర్ణయంతో సేవ్ అయిపోయింది… ఎలిమినేషన్ ప్రక్రియ టైంలో కూడా ఒకటే ఏడుపు… మొదట హౌజ్ మేట్స్ అందరూ ఆమెను పంపించేశారు… రీఎంట్రీ అంటే కూడా ఎవరూ వోట్లేయలేదు… అంతా ఉల్టాపుల్టా కదా, ఆమెనే ప్రవేశపెట్టారు… నాలుగు రోజులు బయట ఉంది కదా, ఆట తీరు అర్థం కావల్సింది… అదేమీ లేదు… వచ్చి శివాజీ గ్యాంగు ఎదుట సాగిలపడిపోయింది…
ప్రేక్షకులు సరిగ్గా వోట్లేస్తే ఈసారి రతిక సేవ్ కావడం కష్టమే… మరీ విసుగు తెప్పిస్తోంది… ఆమెకు తోడు అశ్విని… ఎందుకు అరుస్తుందో అర్థం కాదు, ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు… ఆమె మిడిల్ ఎంట్రీ కదా… చాలా మెచ్యూర్డ్‌గా ఆడాల్సింది… హౌజ్‌ను కొన్నాళ్లు అబ్జర్వ్ చేసింది కదా… పైగా ఇప్పుడు నేను కప్పు గెలవటానికి రాలేదంటూ కన్ఫెషన్ ఎందుకో ఆమెకే తెలియాలి… 11 వారాలుగా అక్కడే ఉంటూ ఢక్కామొక్కీలు తింటూ శివాజీ బ్యాచ్ ను తట్టుకుంటూ ఉన్న శోభ, ప్రియాంక వేరు… మధ్యలో వచ్చిన అశ్విని, బయటికి పోయివచ్చిన రతిక వేరు… మొత్తానికి శివాజీ ఓ చిత్రమైన ప్లే ఆడుతుంటే హౌజ్ మొత్తం ఆ ప్రభావాానికి గురవుతోంది…!!
Share this Article