Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే పవన్ కల్యాణ్, ఆపై హిందుత్వ, తోడుగా బీజేపీ… ప్రకాష్‌రాజ్ గోకుడే గోకుడు..!!

September 26, 2024 by M S R

రాజకీయాల మొదట్లో ధరించిన లౌకిక అవతారం వదిలేసి, తాజాగా సనాతన కాషాయ వస్త్రాలు ధరించిన పవన్ కల్యాణ్ మతం, ఆయన అభిమతం… ఆయన అభీష్టం… అది రాజకీయ అవసరమా..? మానసిక పరివర్తనా..? మరేదో పరిణామ క్రమమా..? అదంతా వేరే చర్చ… కానీ నువ్వలా మారడానికి వీల్లేదు, అది తప్పు అని తప్పుపట్టలేం…

నాస్తికుడు ఆస్తికుడిగా… ఆస్తికుడు నాస్తికుడిగా మారడం అసాధారణమేమీ కాదు… అనుభవాలు, అవసరాలు, జీవిత పాఠాలు మార్చేస్తుంటాయి… పవన్ కల్యాణ్ కూడా అంతే… అత్యంత చంచల సిద్ధాంతి తను… ఈ అవతారం కూడా ఇలాగే ఉంటుందని అనుకోలేం… కానీ ప్రకాష్ రాజ్ వంటి వాళ్లు ఊరుకోరు…

ఊరుకోకపోవడానికి పవన్ కల్యాణ్ మీద ద్వేషం కాదు…అది  హిందూ మతంపై..! హిందుత్వ మీద, హిందువుల విశ్వాసాల మీద, హిందూ దేవుళ్ల మీద ఎప్పుడూ ఏదో ఒకటి కూస్తూనే ఉంటాడు, ఎవర్ రెడీ కేరక్టర్… ఇప్పుడిక పవన్ కల్యాణ్ దొరికాడు తనకు… గోకుతున్నాడు, గిల్లుతున్నాడు… పవన్ కల్యాణ్ ఏం చేయగలడో చూస్తానులే అన్నంత దూకుడులో…

Ads

లడ్డూ వివాదంపై ఫస్ట్ ఏదో ట్వీటాడు… ట్వీటకపోతేనే ఆశ్చర్యం కదా… అధికారంలో ఉన్నావ్, విచారించి నేరస్థులను శిక్షించు, అంతేగానీ విద్వేషాలు రెచ్చగొట్టే పనేమిటి..? ఇప్పటికి దేశంలో ఉన్న ఉద్రిక్తతలు చాలవా అనడిగాడు… పనిలోపనిగా ఏం మాట్లాడినా బీజేపీని తిట్టాలి కదా… కేంద్రంలో ఉన్న నీ స్నేహితులకు ధన్యవాదాలు అని ఎప్పటిలాగే వ్యంగ్యాన్ని దట్టించాడు…

పవన్ కల్యాణ్ పొన్నవోలును, కార్తిని మడతపెట్టినట్టుగానే… ప్రకాష్ రాజ్‌కూ చురకలు పెట్టే ప్రయత్నం చేశాడు… తెలుసుకుని మాట్లాడు అన్నాడు… ‘‘ఎక్కడో ఉన్నాను, నేనొచ్చాక బదులిస్తా, కాస్త ఆగు’’ అని సమాధానమిచ్చాడు ప్రకాష్ రాజ్… అదీ ట్వీటే… అన్నాడు కదా, ఆగుతాడా..? ఆగడు… ఆగితే ప్రకాష్ రాజ్ ఎందుకవుతాడు..?

https://x.com/prakashraaj

కార్తి సారీ చెప్పడంపై… చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడం ఏమిటో అని వెటకరించాడు… ప్చ్, సరిపోలేదు… తాజాగా మరో కూత… అదే ట్వీట్…

గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం..
ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం?
జస్ట్‌ ఆస్కింగ్‌?

అంటే, గెలిచే ముందు లౌకిక అవతారం, గెలిచాక ఈ మతావతారం అని పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను దెప్పిపొడుస్తున్నాడు… నేనొచ్చాక జవాబులు చెబుతాను అన్నవాడు మళ్లీ మళ్లీ ఎందుకు అక్కడే ఉండి ఇలా గోకుతున్నాడు..? అదంతే… హిందుత్వ మీద, బీజేపీ మీద, సనాతన ధర్మం మీద ఆపుకోలేడు… పెద్దగా తనను ఖండించడానికి కూడా ఎవరూ ఇష్టపడరు… చూడాలిక, ఈ గోకుడుకు పవన్ కల్యాణ్ ఏం మందు వేస్తాడో…!!

అవునూ, పవన్ కల్యాణ్‌కూ ప్రకాష్ రాజ్‌కూ నడుమ ఇండస్ట్రీలో ఏమైనా పాత పంచాయితీలున్నాయా..? తెలియకే… జస్ట్ ఆస్కింగ్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొమ్మినేని అరెస్టు… పత్రికాస్వేచ్ఛ మీద ఓ సుదీర్ఘ తటస్థ విశ్లేషణ..!!
  • తెలంగాణ అంటే ఇక తాగుడేనా..? ఇవేం ముద్రలురా భయ్..?!
  • ఎలన్ మస్క్‌‌కు రాయునది ఏమనగా… కాస్త నేను చెప్పేదీ ఓసారి విను…
  • కృతి మహేశ్… లండన్‌లో ఫోరెన్సిక్ సైన్స్ పీజీ… ఇప్పుడు డాన్స్ ఫ్లోరే బతుకు…
  • జయమాలిని కేవలం మసాలా డాన్సర్ కాదు… ఫుల్ లెంగ్త్ రోల్ సుమలతలాగే…
  • ఆడదాని ఒళ్లు ఎఫెక్టివ్‌‌గా అమ్మగలగడమే సినీవ్యాపార సూత్రం..!!
  • ఆ దంపతులు నడిపితేనే.. నాటి రాజకీయ ప్రముఖుల విమానయానం…
  • జైన వెడ్స్ బ్రాహ్మణ… ఒక సంపూర్ణ సంప్రదాయిక పెళ్లి వేడుక…
  • ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
  • ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions