Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రదీప్‌తోపాటు ప్రియమణినీ తరిమేశారు… కన్నడ ప్రణితను రప్పించారు…

December 18, 2023 by M S R

మొన్న ఎప్పుడో చెప్పుకున్నాం కదా… ఈటీవీ డాన్సింగ్ షో ఢీ నుంచి యాంకర్ ప్రదీప్‌ను తరిమేశారని… సరే, సరే, తనే వెళ్లిపోయాడు… ఇదే ఈటీవీలో క్రియేటివ్ డైరెక్టర్లుగా ఉన్న నితిన్, భరత్ దర్శకులుగా ప్రదీప్, దీపిక పిల్లి హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తీస్తున్నారు, సో, వెళ్లిపోయాడు… తనే కాదు, ఇన్ని సీజన్లుగా జడ్జి కుర్చీలో ఓ అసెట్‌గా ఉన్న ప్రియమణిని కూడా తరిమేశారు…

మూలిగే నక్క మీద తాటిపండులా… అసలే పూర్ రేటింగులతో మూలుగుతున్న ఈటీవీ ఢీ షోకు ప్రియమణి లేకపోవడం కూడా ఓ తాటిపండు పడ్డట్టే… శేఖర్ మాస్టర్ వస్తుంటాడు, పోతుంటాడు… అటూఇటూ తిరిగీ తిరిగీ, మంచి మంచి సినిమా అవకాశాల నడుమ సైతం ఏదేని టీవీ డాన్సింగ్ షోలో జడ్జిగా కనిపిస్తుంటాడు… ఇప్పుడిక అటూఇటూ తిరగడంకన్నా ఈటీవీ ఢీయే బెటర్ అని ఫిక్సయిపోయి, ఆ జడ్జి సీట్లోకి వచ్చి కూర్చున్నాడు…

అప్పట్లో పూర్ణ ఒక జడ్జి… ప్రియమణి మరో జడ్జి… మగ జడ్జిగా శేఖర్… టీం లీడర్లుగా సుధీర్, రష్మి… హోస్టుగా ప్రదీప్ ఉండేవాళ్లు… బాగుండేది… ఒకటీరెండు సీజన్లలో వర్షిణి, ఆర్‌జే హేమంత్ కూడా టీమ్ కో-లీడర్లుగా ఉన్నారు… తరువాత హైపర్ ఆది ప్రవేశించడం, సుధీర్- రష్మి వెళ్లిపోవడంతో ఢీ షోకు ఫస్ట్ షాక్… తరువాత ఏవేవో ప్రయోగాలు చేశారు, ఎవరెవరినో తీసుకొచ్చారు… అందరూ విసిగించారు తప్ప రేటింగ్స్‌కు వచ్చిన ఫాయిదా లేదు… గణేష్ మాస్టర్, నందిత శ్వేత, జానీ మాస్టర్, శ్రద్ధా దాస్, నవ్య, రవి, అఖిల్ సార్థక్, సుస్మిత… ఎవరూ తమ ముద్రను వేయలేకపోయారు…

Ads

ఇప్పుడు సెలబ్రిటీ స్పెషల్ అని కొత్త సీజన్ స్టార్ట్ చేస్తున్నారు… ఢీ17… ఏముంది..? సెలబ్రిటీలే పోటీదార్లు… కానీ దీనికి ప్రియమణి జడ్జిగా లేదు… కన్నడ నటి ప్రణిత సుభాష్‌ను పట్టుకొచ్చారు… అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది తెలుసు కదా… ఆమే… కరోనా కాలంలో తన సొంత ఖర్చుతో వేలాది మందికి ఫుడ్ సప్లయ్ చేసి మంచి పేరు సంపాదించింది… బట్, మళ్లీ అదే హైపర్ ఆది… తనకు తోడుగా ఓ ఆడ తోకను తగిలిస్తారు కదా, ఎవరనే ఆ క్లారిటీ లేదు…

సరే, ఎవరెవరు సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా పోటీపడతారో పూర్తి వివరాలు తెలియాలి… ఒక్కొక్క ప్రోమో రిలీజ్ చేస్తున్నారు… అదే హైపర్ ఆది మార్క్ అతి కనిపిస్తూనే ఉంది… కార్తీకదీపంలో ఓ పిల్లగా కనిపించిన సుహృద ఓ కంటెస్టెంటుగా వచ్చింది… బాగా చేసింది… టీన్స్‌లోకి వచ్చేసింది… ప్రదీప్ బదులు హోస్ట్‌గా కనిపిస్తున్న నందు సో సో… అవునూ, ప్రదీప్ ఏదో సినిమా హీరో చాన్స్ అని వెళ్లిపోయాడు… మరి పూర్ణ..? అన్నింటికీ మించి ప్రియమణి ఎందుకు వెళ్లిపోయింది..? పలు సినిమాలు చేస్తున్నా సరే ఈటీవీ ఢీ షోను వదిలిపెట్టలేదు ఆమె… మరేమైంది..? మల్లెమాల వాళ్లు చేతులు కాల్చుకోబోతున్నారా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • *99 రోజుల ప్రోగ్రాం* వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యాలేంటి- సవాళ్లేంటి…!!
  • ‘‘ఏం..? ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు, తప్పేంటి..?’’
  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions