సాగరిక ఘోష్… ప్రముఖ జర్నలిస్టు రాజదీప్ సర్దేశాయ్ భార్య… ఆమె కూడా జర్నలిస్టే… చాలాకాలం ప్రముఖ మీడియా సంస్థల్లో కీలక హోదాల్లోనే పనిచేసింది… బయాస్డ్… భర్తలాగే భార్య కూడా… పక్షపాత జర్నలిజం… నిజంగా ఇన్నేళ్లు ఆమె ప్రముఖ జర్నలిస్టు ఎలా చెలామణీ అయిందో అర్థం కాదు… ఆమె వినేష్ ఫోగట్ మీద రాసిన అడ్డదిడ్డం వ్యాసం సాక్షికి ఎందుకు నచ్చిందో తెలియదు… (అది ది ప్రింట్ వ్యాసానికి అనువాదం)…
భార్యాభర్తలిద్దరూ బీజేపీ వ్యతిరేకులు, మోడీ ద్వేషులు, పర్లేదు, అభిప్రాయాలు ఉండటంలో తప్పు లేదు… కానీ ఒక ప్రొఫెషనల్ జర్నలిస్టుగా ఇన్నేళ్లు పనిచేసిన కలం ఏం రాసినా సరే, పదిమందీ నవ్వుకునేలా ఉండకూడదు… ఫాఫం, సాగరికకు ఆ సోయి లేదు… పైగా ఇప్పుడు మమత పార్టీ తరఫున రాజ్యసభ సభ్యురాలు, ఇంకేముంది..? తన వ్యాసాలన్నీ మోడీ ద్వేషాన్ని నింపుకుని రిలీజ్ అవుతుంటాయి…
వినేష్‌పై అనర్హత వేటు అనేది ధిక్కారానికి మూల్యమా అని ఏదో ప్రశ్నిస్తోంది… ఆమెకు 53 కిలోల కేటగిరీ ఇష్టమట, కానీా 50 కిలోల కేటగిరీలో పాల్గొనాల్సి వచ్చిందట… ఈమాట కనీసం ఆ వినేష్ కూడా ఎప్పుడూ అనలేదు, పైగా 50 కిలోల కేటగిరీలో ఆమే ఇష్టపడి పోటీపడింది… ఆమెకు సరైన స్టాఫ్ కావాలనే ఇవ్వలేదు అంటోంది సాగరిక… అబ్సర్డ్… ఆమె కోరుకున్న కోచ్‌ను ఇచ్చారు, శిక్షణకు డబ్బు ఇచ్చారు, న్యూట్రిషనిస్టు సహా అందరూ ఉన్నారు…
Ads
అందరూ టీమ్ వర్క్ చేశారు కాబట్టే ఆమె ఫైనల్ దాకా వెళ్లగలిగింది… బరువు పెరిగింది, అందులో ఎవరైనా కుట్ర చేయడానికి ఏముంటుంది..? కుట్రే నిజమే అయితే ఫైనల్ దాకా ఎందుకు రానిస్తారు..? అంతుపట్టని సాంకేతిక కారణాలతో ఆమెపై అనర్హత వేటు పడిందని, దేశం ఊపిరి ఆగిందనీ, గుండె ఆగిపోయిందనీ బాధపడింది… అవును, నిజమే… కానీ అంతుపట్టని సాంకేతిక కారణాలేమిటసలు..? అవి ఒలింపిక్ రూల్స్… ఆమే కాదు, మన భారతీయ క్రీడాకారులు పలు సందర్భాల్లో ఈ బరువు అనర్హత నుంచి తప్పించుకోవడానికి పడిన ప్రయాస సాగరిక తెలుసుకుంటే తెలిసేవి… కానీ ఆమెకు అంత ఓపిక ఎక్కడిది..?
ఇదే వినేష్ 2016లోనూ అనర్హతకు గురైంది, ఆమెకు రూల్స్ అన్నీ తెలుసు… మరి అప్పుడెవరు కుట్రపన్నినట్టు..? ఇదే ఒలింపిక్స్‌లో ఓ ఇటాలియన్ క్రీడాకారిణి కూడా బరువు తగ్గించుకోలేక అనర్హతకు గురైంది… ఇప్పటికీ ఫైనల్‌కు వచ్చాను కాబట్టి ఉమ్మడి రజతం అడుగుతోంది ఆమె… అంతేతప్ప తనపై అనర్హత వేటు అనేది తప్పు అనడం లేదు… రజతం రావాలనే కోరుకుందాం, కానీ మరీ సాగరికలా ఏదేదో రాసేసి, వినేష్ ఎపిసోడ్ పితృస్వామ్యంపై ధిక్కారం, తిరుగుబాటు దాకా అన్వయించి, ఏవేవో బాష్యాలు చెప్పాల్సిన పనిలేదు…
రేయ్ హిగుచి అనే జపాన్ రెజ్లర్ 2016 రియో ఒలింపిక్స్‌లో రజత విజేత… కానీ తమ సొంత గడ్డ, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జస్ట్, 50 గ్రాముల అధిక బరువుతో అనర్హతకు గురయ్యాడు… అవును, జస్ట్ చటాక్ అధిక బరువు… 2018లో మన మేరీ చాన్ 4 గంటల వ్యవధిలో రెండు కిలోల బరువు తగ్గింది అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి..!!
అంతెందుకు..? మన అమన్ సెహ్రావత్… సెమీ ఫైనల్స్‌లో పైన చెప్పిన రేయ్ హిగుచి మీద ఓడిపోయాడు… తరువాత చూస్తే 61.5 కిలోల బరువున్నాడు… కానీ కాంస్యం పోరులో నిలబడాలంటే, కలబడాలంటే తను ఖచ్చితంగా 4.5 కిలోగ్రాములు తగ్గాల్సిందే… అవును, తను 57 కిలోల కేటగిరీలో పోటీపడుతున్నాడు కాబట్టి… ఆ బరువుకన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి… పది గంటల్లోనే 4.5 కిలోలు తగ్గి చూపించాడు…
చివరకు కాంస్యం పోటీలో ప్రత్యర్థి మీద గెలిచి ఇండియా యంగెస్ట్ మెడలిస్ట్ అయ్యాడు… జెండా ఎత్తి పట్టుకుని మురిసిపోయాడు…! ఇదంతా సాగరిక భర్త చాన్నాళ్లు పనిచేసిన ఎన్డీటీవీలో వచ్చిన కథనమే… ఇవన్నీ చదివితే తెలిసేది సాగరికకు… ఇలా ఏదేదో రాసి పారేసే అగత్యమూ తప్పేది…!!
Share this Article