Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Sing Geetham … ప్రయోగం, వైవిధ్యంపై టేస్టున్న ప్రేక్షకులకు మాత్రమే..!

June 12, 2026 by M S R

.

ఈ సినిమా అందరికీ నచ్చాలనేమీ లేదు… రొటీన్ ఫార్ములా పిచ్చి కథలు, ట్రీట్‌మెంట్లు, భీకరమైన సౌండ్స్, సూపర్ హీరోయిజాల సగటు తెలుగు సినిమాను చూసీ చూసీ… దానికే అలవాటైన (తినగ తినగ వేము) సగటు ప్రేక్షకుడికి ఈ పాటలు ఓ గోలలా అనిపిస్తే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు…

ట్రూ, 94 ఏళ్ల వయస్సులోనూ క్రియేటివిటీ, సినిమా మీద ప్యాషన్, ప్రయోగం పట్ల అనురక్తి తగ్గని సింగీతం శ్రీనివాసరావు 40 ఏళ్ల క్రితం నాటి ప్రయోగాత్మక కథ ఇది… కమలహాసన్ దాకా అప్పట్లోనే వెళ్లిన కథ ఇది… మాటలు తప్ప పాటలే మాటలుగా సాగే ప్రయోగం ఇది… నాగ్ అశ్విన్ అభిరుచితో నిర్మించిన సినిమా ఇది… అన్నీ అభినందనీయమే… అందరినీ మించి 150- 200 ట్యూన్లతో సీన్‌కు తగిన ఉద్వేగాల్ని పాటల్లోనే పలికించడానికి ప్రయాసపడిన దేవిశ్రీ ప్రసాద్ మరీ మరీ అభినందనీయుడు…

Ads

మాటలే పాటలయ్యే కథ అంటే ఓ ఫిక్షన్, ఫాంటసీ కావల్సిందే… అందుకే ఓ చందమామ కథ రాసుకున్నాడు దర్శకుడు… ఒకడు జైలు నుంచి రిలీజ్ అవుతాడు, తనకు కొంత భూమి ఉంది, వెళ్తాడు… తీరా అక్కడికి వెళ్లేసరికి బంగారం కోసం ఊరంతా తవ్వేస్తుంటారు, ఇతని భూమిలోనూ మైనింగ్ జరగాలి, దానికోసం ఓ పేద్ద చెట్టు నరికేస్తారు… అదసలే ఓ మిస్టీరియస్ గ్రామం… ఊరి పేరు కుబేరపురం…

చెట్లే ప్రాణంగా బతికే ఓ పిల్ల దీన్ని తట్టుకోలేక ఓ గుహలోకి వెళ్లి, ఆ ఊరి దేవుడు కుబేరుడిని తిడుతూ… మూడు కోరికలు కోరుకుంటుంది, శపిస్తుంది… దాంతో ఎవరికీ మాటలు రావు, అన్నీ పాటలే… పైగా అన్నీ నిజాలే చెప్పేస్తుంటారు… నిజానికి కథను పర్యావరణం, ప్రకృతి, మైనింగు కోణంలో బాగానే రాసుకున్నాడు దర్శకుడు… మంచి కథే… నటీనటులు కూడా బాగా చేశారు…

ఫస్టాఫ్ అరగంట వరకూ ఈ పాటలు స్టార్ట్ కావు… తరువాత ఇక పాటలే… ఓ దశలో ల్యాగయిపోయి బోర్ అనిపిస్తాయి టేస్టున్న ప్రేక్షకుడికి సైతం, ఫస్టాఫ్ ఫన్ మూమెంట్స్ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు… మరిక మామూలు ప్రేక్షకుడు..? కాకపోతే సెకండాఫ్‌లో ఎమోషన్స్ వర్కవుటయ్యేకొద్దీ ఆ పాటలు కూడా మనకు అలవాటైపోతాయి ఇక… కల్కి బాపతు సినిమా సెట్లలోనే కొన్ని సీన్లున్నాయి, ఆ సెట్లు అంతగా నప్పినట్టు అనిపించదు…

లీడ్ రోల్స్ చేసిన అయాన్, అహిల్య కొత్తదనం బాపతు బెరుకేమీ లేకుండా అనుభవమున్న నటుల్లాగా చేశారు… నివేదా పేతురాజ్, తులసి, రచ్చరవి, శివనారాయణ, మహేష్, బెనర్జీలు అలా మెరుస్తారు… విజయ్ దేవరకొండ కూడా..! నిజానికి దర్శకుడు సింగీతమే అయినా… ఆయన థాట్ ప్రాసెస్ అర్ధం చేసుకుని ఇంప్లిమెంట్ చేసింది మొత్తం సంకల్ప్ గోరా అనే కుర్రాడు… తనకు క్రెడిట్స్ కూడా ఇచ్చారు, గుడ్…

టేస్టున్న నిర్మాతకు, బాగా నటించిన నటులకు, మళ్లీ మంచి ప్రయోగం చేసిన దర్శకుడికి, ఆద్యంతం కష్టపడిన దేవిశ్రీ ప్రసాద్‌కు అభినందనలు… కానీ ఇది కేవలం టేస్టున్న ప్రేక్షకుల కోసం మాత్రమే..!! ఓ సగటు ప్రేక్షకుడికి ఎక్కదు… నిజానికి అందరికీ ఎక్కాలని నిర్మాత కూడా అనుకోలేదు… ఎలాగైనా ఈ సినిమా తనే తీయాలనుకున్నాడు, తీశాడు… శుభం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Sing Geetham … ప్రయోగం, వైవిధ్యంపై టేస్టున్న ప్రేక్షకులకు మాత్రమే..!
  • ఇరాన్- అమెరికా- ఇజ్రాయిల్… ఈ యుద్ధం ఏం నేర్పింది మనకు..?
  • కమ్‌తాయి… అపరిచితుడు… విరోధా‘బాసుడు… వెరసి వీరలౌక్యుడు…
  • 824 సీట్లు… ఖేల్ ఖతం..? ఇదేం ప్రాతిపదిక..? కొత్త ప్రశ్నలకు నాంది..!
  • నిశ్శబ్దంగా కాటేసే క్రౌర్యాన్ని ‘అబ్బాయి గారి’పై చూపించిన ఆ కళ్లు…
  • సినారె..! జ్ఞానపీఠమైనా ఈ కవి పాదపీఠమే…! అనితరసాధ్యం..!!
  • కాల్పులు, కర్ఫ్యూలు… ఆగని నిరసనలు! అట్టుడుకుతున్న పీవోకే..!
  • మెహబూబా మెహబూబా… ఈ పాపులర్ పాటపై ఓ పాపులర్ జోక్…
  • వెంటాడే ‘మిన్నేటి సూరీడు’ భారతీరాజా… ఏదో తెలియని మత్తు…
  • తమిళ రాజకీయ నేతలకు కర్ణాటక అమ్మవార్లే ఎందుకు ప్రత్యేకం?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions