Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లోకేష్ బాబు సారు గారూ… ఆ మంగ్లీకే మళ్లీ మళ్లీ పెద్ద పీట వేస్తారటయ్యా…

January 31, 2025 by M S R

.

(( Ratna Kishore Sambhumahanti ……. పోస్టులోని కొన్ని అంశాలు… ))  తెరపై తెలుగు దేశం : మంగ్లీ ఎవరు ? స్థానికత్వం ఎటు పోయింది ?

రథ సప్తమి వేడుకలలో స్వాతి స్వామినాథన్ హల్చల్ ? ఎవర్రా వీళ్లంతా ! ఈనాడు, సాక్షి మీడియాలకు కళ్లు కనపడవు.. వాళ్లకు చూపు ప్రసాదించండి సామీ !

Ads

ప్రజలకు జ్ఞానం లేదు. అధికారులకూ జ్ఞానం అస్సలు లేదు. రథ సప్తమి వేళ అధికారులకు చూపుతో పాటే జ్ఞానం కూడా దేవుడు.. దేవదేవుడు ప్రసాదించాలని సూర్య నారాయణ మూర్తిని వేడుకోవడం ఓ బాధ్యత. చెడ్డ వాడైన దేవుడికి ఇవి వినిపిస్తాయో లేదో అన్నది నాకొక నమ్మకం లేదు గాక లేదు.

పాలకులంతా స్థానిక నాయకత్వాలంతా స్థానిక కళాకారులకో అవకాశం ఇచ్చి ఆదుకుంటున్నారని ఏనాడూ పాపానికి కూడా అనుకోను. ప్లీజ్… నాకెందుకనో.. తిండికి దిక్కులేని లేదా నోచుకోని యాచించే కళాకారులే కంటికి కనిపిస్తారు. వెలుగులు పంచే సూరీడు చెంత అంధకారం నిలదొక్కుకోదు. కాదనను కానీ పాపం రా ! అజ్ఞానం ఎందుకని రాజ్యమేలుతుందని ?

చాలా మంది కళాకారులకు పేరూ డబ్బూ రెండూ ఉంటాయి. కానీ స్థానిక కళాకారులకు అవేవీ ఉండవు. తమ కళను ప్రదర్శించాలి అన్న ఆలోచన తప్ప మరొక్కటి ఉండదు. రాజ్యంలో మీడియా, రాజకీయం , యంత్రాంగం అన్నవి మూడుగా ఉంటాయి. వీటిని సమన్వయ పరిచేందుకు ఎవరో ఒకరు ఉంటారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఉన్నవారికి ఈ పాటి తెలియదా ? పోనీ గౌరవ ఎమ్మెల్యే గొండు శంకర్ కు ఇవి తెలియవా ? ఇవాళ్టికీ పింఛనుకు కూడా నోచుకోని కళాకారులు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గంలోనే ఉన్నారని ?

గతంలో ఆయన దగ్గరకు ఈ తరహా అర్జీలు వచ్చినా అవేవీ పరిష్కార యోగ్యతకు నోచుకోలేదని ? మంగ్లీ ఎవరు ? ఆమె గానం ఏ విధంగా ఉంటుంది ? ఆమె నేపథ్యం ఏంటి ? గతంలో ఇలానే హరిహరన్ అనే సింగర్ ను తీసుకుని వచ్చారు. కార్తీక్ అనే సింగర్ ను తీసుకుని వచ్చారు. వీళ్లంతా ఎవరు ? నెల్లూరు పక్షుల సంబరానికీ సినీ తారలకూ ఏంటి సంబంధం ? అలానే సిక్కోలు ఉత్సవాలకు అనంతపూర్ జిల్లా అమ్మాయి అయిన మంగ్లీ గారికి ఏంటి సంబంధం ?

ఇన్ని జన నాట్య సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఉన్నాయి కదా ! వాళ్లెవ్వరూ మాట్లాడరు. వాళ్లకా చైతన్యం లేదు. కమ్యూనిస్టులు కూడా కళ్లు మూసుకునే ఉంటారు. విపక్ష వైసీపీకి గొంతే లేదు. ఇంకేం ఉంది.. పది కోట్ల రూపాయల కార్యక్రమంలో పట్టెడు మెతుకులు దొరకని కళాకారులు ఎందరో ? రండి రా ! మాట్లాడుకుందాం…

ఈనాడు, సాక్షి అనే కాదు ముష్టి రూపాయి పేపర్లకూ చూపు లేదు. చూపు ఉన్నా లేకపోయినా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ.. వాళ్లకు జ్ఞానం కూడా లేదు. ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఈ పాటి దానికి తెల్లారితే మీడియా అనే తోక ఎందుకు…? తల లేని వారికి తోకతో పనేంటి ? తల ఉన్నా ఆ తలలో గుజ్జు లేని వారికి మీడియా అనే తోక ఎందుకు రా ?

ఇవాళ శ్రీకాకుళం కళాకారులు, ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్రకు చెందిన రేలా రే రేలా జానపద కళాకారులు, ఇంకా హరికథ, బుర్ర కథను నమ్ముకున్న కళాకారులు ఎందరెందరో పన్నుల్లేక, తిండిలేక కళా ప్రదర్శనలకు అవకాశం లేక ఉన్నారు. వారెవ్వరూ ఎవ్వరికీ పట్టరు. వారి గోడు అధికారులకు పట్టదు. అవును ! వాళ్లు ఇవి పట్టించుకోకుండా, ఎక్కడో ఉన్న మంగ్లీ లాంటి సినీ గాయకులను పిలిచి నెత్తిన పెట్టుకుంటారు. ఫ్లైట్ లో వచ్చి ఫ్లైట్ లో వెళ్తారు.

పాపం మన కళాకారులకు భోజనం కూడా దక్కదు. కనీస స్థాయిలో గౌరవం కూడా దక్కదు. అరసవల్లి రథ సప్తమి వేడుకలే ఇందుకు నిదర్శనం. పాలకులు ఆలోచిస్తే సంస్కరణలు సాధ్యం. పాలకులు ఆలోచిస్తే మంచి ప్రభుత్వం అని అనిపించుకునేందుకు ఇదొక అవకాశం. ఇవేవీ లేకుండా ఉత్సవాలా ఎందుకని ?

వేడుకలు ఏమయినా మన ప్రాంతం మన ఉత్తరాంధ్ర ప్రాంతం అన్న మాట ఎటు పోతుందో అర్థం కాదు. ఎవరెవరో వస్తారు ఎవరెవరో వెళ్తారు. వారి కారణంగా ఏ ఫలితం ఉండదు. అయ్యో ! ఇక్కడివారికి కనీసం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అని చెప్పి ఎక్కడి నుంచి లక్షలు పోసి కళాకారులను తెప్పించి రెండు గంటల పాటు షోకు అనుమతులు ఇవ్వడం, అనంతరం నగదు కానుకలు ఇవ్వడం ఎంత వరకూ భావ్యం.

ఇక్కడ ప్రదర్శన ఇచ్చే కళాకారులకు ఎవ్వరికీ కనీసం భోజనం కాదు కదా రవాణా ఖర్చులు చెల్లించేందుకు కూడా మన అధికారులకు మనసు ఒప్పుకోదు. గతంలో చేసిన ఏ ఉత్సవాల విషయంలో అయినా ఇదే నిజం అయింది. నిరూపణ అయింది. కానీ ఎక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చే మంగ్లీ లాంటి కళాకారుల సేవలలో మాత్రం మన అధికారులంతా తప్పక తరిస్తారు.

మంగ్లీ ఈ ప్రాంతంకు చెందిన వారు కాదు. కాకపోయినా పర్లేదు. కానీ పది కోట్ల ఉత్సవంలో స్థానిక కళాకారుడు పది నిమిషాలు కూడా మాట్లాడడం కానీ తన కళను ప్రదర్శించడం కానీ చేయడు. చేయలేడు. ఎక్కడి నుంచో వచ్చే కళాకారులకు మాత్రం లక్షలు కుమ్మరించడం నిజంగానే ప్రజాధనం వృథా చేయడమే. విజయనగరం , శ్రీకాకుళం, విశాఖలో ఉన్న జానపద కళాకారులెవ్వరికీ ఏ పాటి అవకాశాలూ లేవు. – శంభుమహంతి రైటింగ్స్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions