. అంతే భయ్యా… అంతే… ఆంధ్రా మీడియాకు మర్యాద దక్కదు అని స్ట్రాంగ్ డోస్ ఇవ్వాల్సిందే… నువ్వు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినవాళ్లంటే, తెలంగాణ నాయకులంటే ఎంత అమర్యాద వాళ్లకు..? హమ్మా..! బరితెగిస్తున్నారు, హైదరాబాదులో బతుకుతూ…!! అఫకోర్స్, నువ్వేమైనా తక్కువా..? ఇప్పుడంటే అచ్చ కాంగ్రెస్ అంటున్నావు కానీ మధ్యలో కాషాయ కాంగ్రెస్ కదా…! పోతేపోనీ, అదొక గ్రహణకాలం అనుకుందాం… ఇప్పుడు పోవడానికి మరో క్యాంపు లేదు, కేసీయార్, కేటీయార్ పెత్తందారీ పోకడలు మనం భరించలేం… పెట్టాల్సిందే… అవసరమైతే […]
ఆదివాసీల మనోభావాలకు ఆంధ్రా మీడియా పాతర… సమ్మక్కపై వివక్ష…
ఆంధ్రా మీడియాకు తెలంగాణ భాష, సంస్కృతి, పండుగలు, చివరకు తిండి మీద కూడా చిన్నచూపే, వివక్షే… పదే పదే దాన్ని గురించి చెప్పుకునే పనిలేదు… కోట్లసార్లు చెప్పుకున్నదే, బాధపడిందే, తిరగబడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నదే… అలాంటి ఆంధ్రా మీడియాకు కోట్లాది ఆదివాసీ మూలవాసుల మీద ప్రేమ ఎందుకుంటుంది..? వాళ్ల మనోభావాల్ని ఎందుకు గౌరవిస్తుంది..? సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం దగ్గర నుంచీ సమ్మక్క తిరిగి వనప్రవేశం చేసేవరకు… వనం జనం అవుతుంది… అది మన కుంభమేళా… అధికారిక లెక్కల ప్రకారమే […]

