. మొన్నటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకొచ్చాడు… రేవంత్ రెడ్డికి పొగ పెట్టడానికి విపరీతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని… చివరకు తనను మార్చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయ సేకరణ కూడా హైకమాండ్ జరిపించింది అని… గ్యాప్ కనిపిస్తోంది… రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే హైకమాండ్‌కూ రేవంత్ రెడ్డికీ నడుమ బాగానే గ్యాప్ ఉందని… రేవంత్ రెడ్డి మీద వస్తున్న ఫిర్యాదులను హైకమాండ్ ఎంటర్టెయిన్ చేస్తున్నదీ అని… ఆల్రెడీ కొందరు మంత్రుల శాఖల జోలికి సాక్షాత్తూ సీఎం అయినా సరే […]
బీఆర్ఎస్ పంథాలో ఏమిటీ మార్పు… KCR ఉద్యమ ధోరణికి వ్యతిరేకం…
. తెలంగాణ ఉద్యమ సాధన దిశలో సమైక్యవాదం ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఏ వేషాలు వేసినా సరే… కేసీయార్ ఏ ఒక్క క్షణమూ అదుపు తప్పలేదు, ఉద్యమాన్ని అదుపు తప్పనివ్వలేదు… ఒక్క ఆంధ్రుడి మీద గానీ, వ్యాపార సంస్థల మీద గానీ, మీడియా ఆఫీసులపై గానీ ఒక్క రాయీ పడలేదు… వాళ్లే భయంతో ఇళ్లకు, ఆఫీసులకు పెద్ద పెద్ద నెట్లు పెట్టించుకున్నారు రాళ్ల దెబ్బల్ని కాచుకోవడానికి… ఒక్క ఉద్యమకారుడూ ఒక్క రాయీ విసరలేదు… అది […]
అధికారంలో ఉంటేనే అవతరణ దినోత్సవాలా కేసీయార్ సాబ్..?!
. ఎస్, విమర్శించాల్సిందే రేవంత్ రెడ్డిని… కవిత గానీ, హరీష్ గానీ, కేటీయార్ గానీ, నమస్తే తెలంగాణ గానీ… కేసీయార్ ఎలాగూ బయటికి రావడం లేదు, యాక్టివ్ ప్రజాజీవితంలో లేడు కాబట్టి ఆయన్ని కాస్త పక్కన పెడితే… తప్పకుండా రేవంత్ రెడ్డిని విమర్శించాలి… ప్రతిదీ రాజకీయం చేయడం కాదు, విమర్శ అవసరమైన చోట్ల… ప్రజలకు ఉపయోగపడాల్సిన చోట్ల.., అనాలి, అనడానికే కదా, తప్పులు ఎత్తిచూపడానికే కదా వాళ్లను ప్రతిపక్ష పాత్ర పోషించాలని జనం తీర్పు చెప్పింది… సో, […]
అదెలా..? కేసీయార్‌కు నోటీసులిస్తే తెలంగాణకు ఇచ్చినట్టేమిటి..?!
. హేమిటో… కవిత చేసే కొన్ని సూత్రీకరణలు నవ్వు పుట్టిస్తాయి… ఇన్నేళ్లూ తెలంగాణను తమ కోసం పదే పదే వాడుకుని, చివరకు తమ అక్రమాలకూ తెలంగాణనే అడ్డుపెట్టుకునే ఆలోచనలు, చర్యలు, మాటలు ఓ రకమైన నెగెటివిటీకి దారితీస్తున్నాయనే ఆత్మవిమర్శ కనిపించదు… ఈ తరహా ఆలోచనల వల్లే గత ఎన్నికల్లో ఇదే తెలంగాణజనం తమను ఓడించినా సరే, ఇంకా ఆ నిజం తెలియరావడం లేదు… ఆమె ఏదో తన పిత మీద (జాతి పిత కాదు) తిరుగుబాటు జెండా ఎగరేసింది […]
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం… మోడీ వద్దన్నాడా..? ఎందుకు కవితమ్మా..?.!
. ఏముంది..? ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొస్తా, మంత్రి పదవి ఇవ్వండి అని కవిత కాంగ్రెస్‌తో రాయబారాలు చేసినట్టు ఆంధ్రజ్యోతి రాసింది… అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కవితే చెబుతోంది మీడియా చిట్‌చాట్‌లో… ప్రముఖంగా కవరేజీ రావాలనే భావనతోనే… హరీష్‌రావును కూడా తీసుకుని వచ్చెయ్, ఇద్దరికీ ఉపముఖ్యమంత్రుల పదవులు ఇస్తాం అని కూడా కాంగ్రెస్ రెడీ అవుతుంది ఆ ఆఫర్‌ను కవిత అంగీకరిస్తే… రాజకీయాల్లో ఇది జరగాలి, ఇలాగే జరగాలి అని ఏమీ […]
ఒక నరేంద్ర, ఒక ఈటల, ఒక విజయశాంతి… సేమ్, ఒక కవిత..?!
. ఒక నరేంద్ర, తన పార్టీనే కేసీయార్ పార్టీలో విలీనం చేశాడు, ఎక్కడో దొర వారికి కోపమొచ్చింది, అంతే, ఆ పాత బస్తీ పులిని అవమానకరంగా పార్టీ నుంచి పంపించేశాడు… ఒక విజయశాంతి, ఆమె కూడా తన పార్టీని కేసీయార్ పార్టీలో విలీనం చేసింది… ఆమె మీద కూడా దొర వారికి ఎందుకో కోపమొచ్చింది… ఆమెనూ అవమానకరంగా పార్టీ నుంచి పంపించేశాడు… ఒక ఈటల రాజేందర్, పార్టీ ఆవిర్భావం నుంచీ వర్క్ చేసిన తెలంగాణ ఉద్యమకారుడు… ఏదో […]
అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
. ఆయన తోవన ఆయన పాపం ఫార్మ్ హౌస్ లో పండుకుంటే… ఆ బీజేపీ ఎన్వీఎస్ ప్రభాకర రావు మీడియా వాళ్ళ ఆకలి తీర్చే పెద్ద చర్చ పెట్టాడు జూన్ 2 కానీ డిసెంబర్లో కానీ BRS పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి కేసీఆర్ సీఎం అవుతాడని డేట్లతో సహా చెప్పేశాడు తద్వారా తిరిగి కేటీఆర్ కు అధికారం అప్పచెప్పి, ఆయన మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్ళిపోతాడనే ఇంకో కొత్త చర్చ లేవనెత్తారు ఇంకేముంది మీడియాకు […]
ఓహో… విజయశాంతి ఇంకా రాజకీయాల్లో కొనసాగుతోందా..?
. ఓహ్… విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉందా..? అరె, ఆమె ఇంకా రాజకీయాల్లో కొనసాగుతోందా..? అబ్బో, ఈమె కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిందట..? అవునూ, ఈమెకు ఎమ్మెల్సీ ఇస్తే కాంగ్రెస్‌కు పైసా ఫాయిదా ఉంటుందా..? అసలు ఆమె పేరు వినిపించక ఎన్నేళ్లయింది,..? ఫాఫం, ఆమె పేరు ఎంపిక వార్త తెలిసి కాంగ్రెస్ శ్రేణులే షాక్‌లో మునిగిపోయాయి… సీఎం, పీసీసీ అధ్యక్షుడు సహా పార్టీ ముఖ్యులందరూ ఇంకా తేరుకోలేదు…… …… కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని మండలికి పంపిస్తున్నదనే వార్త తెలిశాక […]
బాబు కూటమి ఎంట్రీ అట… ఇక కేసీయార్‌కు మళ్లీ మంచిరోజులు…
. ఏమో… నిజంగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చినట్టు… తెలంగాణలో కూడా ఎన్డీయే కూటమి ఎంట్రీ మీద పొలిటికల్ సర్కిళ్లలో బాగా చర్చ జరుగుతూ ఉండొచ్చు… మనకే తెలియడం లేదేమో… ఏపీలో విజయ దుందుభి మోగించారు కదా, ఇక తెలంగాణలో కూడా కూటమి జెండా పాతినట్టే అని కనీసం రాధాకృష్ణ భావనో, ఆశో, కల్పనో, సంకల్పమో… ఏదైనా కావచ్చు… కానీ నిజంగానే అది జరిగితే… ఓటమితో ఇల్లు దాటి బయటికి రాలేని నిస్పృహలో కూరుకుపోయిన కేసీయార్ నెత్తిన పాలు […]
ఫాఫం రేవంత్ సర్కారు..! పాజిటివ్ రిజల్ట్ బదులు ఉల్టా నెగెటివిటీ..!!
. నిజమే… తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వవర్గాల్లోనే ఓ చర్చ సాగుతోంది… ఎలాగూ అవకతవక పాలన విధానాలతో ప్రభుత్వం మీద క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోంది… బీఆర్ఎస్ ప్రతి ఇష్యూను అవకాశంగా తీసుకుంటూ ముప్పేట దాడి చేస్తోంది… మీడియా, పాలిటిక్స్, ఎత్తుగడలు, గాలి పోగేసి రాద్ధాంతం, సోషల్ మీడియా, మీమ్స్, రీల్స్… వాట్ నాట్..? ప్రభుత్వ పనితీరు, విధానాల మీద ఒక ప్రతిపక్షం ఎలా దూకుడుగా విరుచుకుపడొచ్చో హరీష్, కేటీయార్ చేసి చూపిస్తున్నారు… కేసీయార్ ఫామ్ హౌజు దాటని రాజనీతిజ్ఞరాహిత్యం […]
పెరుగుతున్న జనవ్యతిరేకతలో… పాలనలో తొలిసారి రేవంత్ ముద్ర…
. ఛ, మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏవీ 42 శాతం రిజర్వేషన్లు, ఢాం ఢూం అంటూ కేటీయార్ ఎగిరాడు… సహజం… ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, పాలకపక్షం ఏం చేసినా బొక్కలు వెతకాలనే ధోరణి… నాన్సెన్స్, అబ్సర్డ్… 42 శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి పంపించేసి, చేతులు దులుపుకున్నాడు రేవంతుడు… కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతర అని నమస్తే తెలంగాణ రెండు టన్నుల విషాన్ని కుమ్మేసింది… సహజం… యథా బీఆర్ఎస్, తథా నమస్తే… అసలు ఈ […]
తెలంగాణలో బురద రాజకీయం షురూ..! వరద తగ్గేవరకూ ఆగేట్టు లేరుగా..!!
అంటే అన్నామంటారు గానీ… ఈ వార్త చూశారా..? ఇంకెవరు..? ప్రపంచ పాత్రికేయానికే కొత్త పాఠాలు నేర్పించే నమస్తే తెలంగాణలోనే..! కేసీయార్ అసహనంతో ఉడికిపోతున్నాడు… ఇంకా రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోలేదా..? నాన్సెన్స్, కాంగ్రెస్ సీనియర్లు ఏం వెలగబెడుతున్నారు..? అసలు కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా రేవంత్ పోస్టు ఊడబీకలేదేమి..? హయ్యారే, ఎంత దుర్భరం ఈ నిరీక్షణ అంటూ… ఫామ్ హౌజులో రుసరుసలాడుతున్నాడు… తన మైకే కదా… నమస్తే అదే ఫీలింగును తీసుకొచ్చి పత్రిక అనబడే ఆ కాగితాలపై ముద్రిస్తోంది… […]
గురువు మళ్లీ బలపడితే… అది శిష్యుడి ప్రయోజనాలకే పెద్ద దెబ్బ..!!
గురువు లేడు, శిష్యుడు లేడు… చంద్రబాబు పట్ల రేవంత్‌రెడ్డి ఉదాసీనంగానో, గౌరవంగానో వ్యవహరిస్తే అది తన కుర్చీ కిందకు, తన కెరీర్ కిందకు నీళ్లు తెచ్చుకోవడమే… ఇదీ చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం… ఐతే రేవంత్‌రెడ్డిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు… తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించడానికి, బలపడటానికి చంద్రబాబు చేసే ప్రయత్నాలను తను ప్రస్తుతం నిశ్శబ్దంగా గమనిస్తున్నట్టుంది… చంద్రబాబు గనుక టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయడానికి వేసే ప్రతి అడుగూ ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం, కొసప్రాణంతో […]
మాతో చెప్పింతురేమయ్యా… మరి ఈ ఆలింగనాలను ఏమనాలి..?
అయిపోయింది, అంతా అయిపోయింది… ఇంకేముంది..? ఈ రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుకు తెలంగాణను రాసిస్తాడు… తెలంగాణను మళ్లీ ఏపీలో కలిపేస్తాడు… దారుణం, ఘోరం, అక్రమం, అన్యాయం అన్నట్టుగా ఓ మాజీ మంత్రి బీఆర్ఎస్ మౌత్ పీస్ పత్రికలో తెగ ఆక్రోశం వెలిబుచ్చాడు ఈరోజు… తన ఫ్లో ఎలా సాగిందో ఓసారి ఇది చదవండి… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకే తెలంగాణ ఉద్యమాన్ని, రాష్ట్ర ఏర్పాటును పరిహసించి, వికటాట్టహాసం చేసినవాళ్లు ప్రగతిభవన్‌లో కలుసుకునే ఒక దుర్దినం, చారిత్రాత్మక ఘోర […]
కేసీయార్ మంచి కథకుడు… కల్కి రేంజులో ఓ సినిమా కథ చెప్పాడు…
అందరికీ తెలిసిందే కదా… కేసీయార్ మంచి కథకుడు అని..! తను రాజకీయాల్లోకి వచ్చాడు గానీ సినిమాలకు గనుక కంట్రిబ్యూట్ చేసే పక్షంలో కల్కి రేంజ్ కథలు అందించగలడు… రాజమౌళి తండ్రి వీరకథకుడు విజయేంద్రప్రసాద్ కూడా ఎందుకూ కొరగాడు… ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకున్న కొత్తపలుకులోని అంశాలు చదువుతుంటే అలాగే అనిపిస్తుంది… ఈమధ్య ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టుకుని, కాంగ్రెస్‌లోకి వెళ్లకండి, వెళ్లకండి అని కేసీయార్ చెబుతున్న వార్తలు చదువుతున్నాం కదా… మస్తు సీక్రెట్స్ మాట్లాడుకున్నం అని మల్లారెడ్డి కూడా అన్నాడు […]
కేసీయార్ చెప్పింది నిక్కమైన నిజం… ఉద్యమ కేసీయార్ ప్రస్తుతం లేడు…
ఇన్నాళ్లూ శుక్రమహర్దశ నడిచింది కాబట్టి… అనుకున్నట్టు టైమ్ సహకరించింది కాబట్టి… ఆలోచనల్లో, అడుగుల్లో ఎన్ని లోపాలున్నా సరే నడిచిపోయింది… భజనపరులు చుట్టూ చేరి అపర చాణక్యుడు ఎట్సెట్రా భుజకీర్తులు తగిలించారు కాబట్టి నిజంగానే తను చాణక్యుడికి తాతనేమో అనే భ్రమల్లోకి కేసీయార్ జారిపోయినట్టున్నాడు… టైమ్ ఇక చాల్లే అన్నాక ఇప్పుడు తన పాలన వైఫల్యాలు, తన అక్రమాలు గట్రా తెర మీదకు వస్తున్నయ్… నిన్న ఎక్కడో అన్నాడు… 20- 25 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్లోకి వచ్చేస్తాను ఎవరో […]
లీగల్ లిటిగేషన్లతో కొట్టాలి బీఆర్ఎస్ను… రేవంత్‌కు ఆంధ్రజ్యోతి పిలుపు…
గేట్లు తెరిచి, ఎడాపెడా చేరికలకు వోకే చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్యానర్ స్టోరీలో చెప్పిన ఓ సలహా పాటిస్తే బెటరేమో…! మన ఎమ్మెల్యేల సంఖ్య పెరగకపోతేనేం, ఎదుటోడి ఎమ్మెల్యేల సంఖ్య ఎలా తగ్గినా సుఖమే కదానేది ఈ స్టోరీ మార్మిక సారాంశం… ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి ఎలాగూ నిత్యపాఠకుడే కాబట్టి తను సీరియస్‌గానే ఆలోచించే చాన్సయితే ఉంది… విషయం ఏమిటంటే..? మెజారిటీకన్నా అయిదారు స్థానాలే ఎక్కువున్నయ్… ఒకవేళ కేసీయార్, బీజేపీ గనుక కలిస్తే… (అవకాశాలు […]
జై శ్రీరాం అనొద్దు… ఉద్వేగాలు కడుపు నింపవు… శ్రీమాన్ కేటీయార్ ఉవాచ…
సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూసి, నిజంగా కేటీయార్ ఇలా అన్నాడా అనిపించింది… కానీ, అన్నాడు… అన్నాడని ఆయన పత్రిక నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది… ఎండార్స్ చేసింది… ఇంతకీ ఏమన్నాడు..? ‘‘యువత ఎవరైనా జై శ్రీరాం అంటే సముదాయించాలి. జై శ్రీరాం అనే నినాదం కడుపు నింపదు.. నీకు ఉద్యోగం ఇవ్వదు.. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి.. కొట్లాడేటోళ్లు కావాలి… ఈ రాష్ట్రంలో నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందా.. అంటే అది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ […]
ఓహో… కేసీయార్ బలంగా నమ్ముకున్న పోల్ మేనేజ్మెంట్ ఇదా..!!
ఫోన్ ట్యాపింగులు చేయని ప్రభుత్వం ఏదీ ఉండదు.., సంఘ విద్రోహ శక్తుల నిఘాకు, నియంత్రణకు ఒకింత సమర్థనీయమే… రాజ్యం ఎప్పుడూ చేష్టలు దక్కి ఊరుకోదు… తనకు వ్యతిరేకంగా ఉండే ఏ శక్తినైనా, ఏ గొంతునైనా నిరంకుశంగా ట్రీట్ చేస్తుంది… రాజ్యం అన్నా, రాజకీయం అన్నా క్రూరమే… ఐతే, ఫోన్ ట్యాపింగును ఏకంగా ఎన్నికల్లో ఈ స్థాయిలో వ్యూహాత్మకంగా కేసీయార్ వాడుకున్న తీరు బహుశా ప్రపంచంలోనే మొదటిసారి కావచ్చు… ఫోన్ ట్యాపింగు విలన్లలో ఒక్కొక్కడినీ కడిగేస్తుంటే చాలా అబ్బురపడే […]
కేసీయార్ వల్ల వెలమ కులం మొత్తం తెలంగాణలో దోషిగా నిలబడిందా..?!
ఫోన్ ట్యాపింగ్ పుణ్యమా అని తెలంగాణ సమాజంలో వెలమ సామాజిక వర్గం ఇవాళ దోషిగా నిలబడాల్సి వచ్చిందంటే అందుకు కేసీఆర్ మాత్రమే కారణం. గుప్పెడు మందిని ప్రోత్సహించి మొత్తం సామాజిక వర్గానికే నష్టం చేశారు…. ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజా విశ్లేషణ… నిజం కాదు… కేసీయార్ చేసిన అక్రమాలతో మొత్తం వెలమ కులానికే నష్టం వాటిల్లిందనే ముద్ర ఏమాత్రం సరికాదు… ఎస్, కేసీయార్ కులాభిమానంతో చేరదీసిన కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా అక్రమాలకు పాల్పడి, విపరీతంగా లాభపడి […]