. ( అప్పరుసు శ్రీనివాసరావు ) ….. గత రెండుమూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక డిజిటల్ ఛానల్‌కు చెందిన ఇంటర్వ్యూలో ఓ సినీ విశ్లేషకుడు (ఆయనెవరో నాకు తెలియదు) తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన “దేవదాసు” (1953) చిత్రంలోని ప్రసిద్ధ గీతం గురించి ఒక వినూత్న వ్యాఖ్యానం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలోని పాట — “కుడి ఎడమైతే పొరబాటు […]
‘‘భలేవారే మాస్టారూ… తాగినోడి మాటలకు అర్థాలేమిటి? మర్మాలేమిటి…’’
. అప్పట్లో… చెన్నై వీథులు… ఆత్రేయ ఓ రిక్షా ఎక్కాడు… స్మార్ట్ ఫోన్లు గట్రా లేవు కదా… సదరు రిక్షావాడు అప్పటికే కాస్త ‘కరెంటు’ మీదున్నట్టున్నాడు… కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని హమ్ చేస్తున్నాడు, తెలుగు వాడు అయి ఉంటాడు… ఆత్రేయ కవి కదా, పట్టుకున్నాడు… ‘ఒరేయ్, ఆ పాట అంత నచ్చిందా’ అన్నాడు… ‘భలేవారే, బాగా నచ్చేసింది, రాసిందెవరనుకున్నారు, చాలా పెద్ద కవి, నటించింది ఎవరనుకున్నారు, చాలా పెద్ద నటుడు, నాగేస్పర్రావు…’ అని చెబుతున్నాడు… […]
