Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!

June 20, 2026 by M S R

.

అప్పుడు బహుశా నాకు పదేళ్లుంటాయేమో… ఓరోజు మా డాడీ క్లోజ్ ఫ్రెండ్ హఠాత్తుగా జబ్బుపడ్డాడు… కొన్నాళ్లకే చనిపోయాడు… జబ్బు, ఇతర కారణాలు తెలియవు… డాడీ నన్ను తన అంత్యక్రియల దగ్గరకు తీసుకెళ్లాడు…

ఓ మృతదేహం మొహం చూడటం నాకు అదే మొదటిసారి… చూస్తున్నాను పరీక్షగా… నాకు భయమేమీ వేయడం లేదు… ఈలోపు నన్ను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు ఎవరో… పిల్లలూ చూడొద్దు అంటూ…
అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి… బంధుమిత్రగణం హడావుడి ఉంది… నేను నిర్వికారంగా చూస్తున్నాను… దూరం నుంచే…

Ads

అకస్మాత్తుగా నా భుజం మీద ఓ చేయి పడింది…
‘‘మనసులో బాధలు ఉంచుకోకు, మెదడుపై ఆ ఒత్తిడి పడనివ్వకు, బతికినన్నాళ్లూ హేపీగా బతకడానికి ప్రయత్నించు, ఎందుకంటే… ఎవరైనా సరే అంతిమ గమ్యం ఇదే… నేను అనేక బాధల్ని ఇలా తేలికగా తీసుకోలేకపోయాను, అందుకే హేపీగా బతకలేకపోయానే అని బాధగా ఉంది’’ అని చెబుతున్నాడు…

వెనక్కి తిరిగి చూస్తే… అతను ఆ మరణించిన వ్యక్తి మొహమే… నా నోట మాట రాలేదు… కింద తడిసిపోతోంది…
ఈలోపు ఎవరో రావడంతో తను అక్కడి నుంచి నిశ్శబ్దంగా అదోరకం నవ్వుతో అక్కడి గుంపులోకి వెళ్లిపోయాడు… ఇక కనిపించలేదు… అంత్యక్రియలు జరిగిపోయాయి… ఇంటికి వచ్చేశాం…

కానీ ఆ సంఘటన నన్ను వదిలితే కదా… మాటిమాటికీ తరుముతోంది… ఆ మొహమే పదే పదే యాదికొస్తోంది… భయమేస్తోంది… మరణించిన వ్యక్తి నాకేదో చెప్పడం ఏమిటి..? డాడీకి చెప్పడానికి భయం…

స్కూల్‌లో ఓరోజు ఫ్రెండ్స్ నడుమ చర్చ… మరణించినవాళ్లు దెయ్యాలు అవుతారు అని… నా భయం ఇంకొన్ని రెట్లు పెరిగింది… అంటే, నాకు కనిపించిన వ్యక్తి దెయ్యమా…? వామ్మో…

కొద్దిరోజులకే మా ఇంటి బయట నిలబడి ఎటో చూస్తున్నాను… అనుకోకుండా మళ్లీ ఆ మొహమే కనిపించింది… నిశ్చేష్టుడనై చూస్తున్నాను… నవ్వుతూ మీ నాన్న ఉన్నాడా అనడిగాడు… నోట్లో నుంచి నాకు మాట వస్తే కదా… నా కళ్లల్లో భయం…

గబగబా ఇంట్లోకి పరుగెత్తి నాన్నా నాన్నా అని అరుస్తూ… చనిపోయిన మీ ఫ్రెండ్ వచ్చి గేటు దగ్గర నిలబడ్డాడు, నువ్వున్నావా అనడుగుతున్నాడు… రా, త్వరగా… అన్నాను…
తను కూడా బయటికి వచ్చాడు… ఈలోపు ఆ మొహం మాయం… డాడీ అడిగాడు… అంత్యక్రియల నాటి అనుభవం వివరాలు కూడా చెప్పాను… తను పకపకా నవ్వాడు..

ఒరేయ్, చనిపోయిన నా ఫ్రెండ్‌కు అచ్చంగా అలాగే ఉండే కవల సోదరుడు ఉన్నాడురా అన్నాడు… హమ్మయ్య, అదా సంగతి అనుకున్నాను… నా భయం, నా ఆందోళన డస్టర్‌తో బ్లాక్‌ బోర్డు మీద రాతల్ని చెరిపేసినట్టుగా మాయమయ్యాయి…
ఈలోపు నవ్వుతున్న నాన్న మొహంలో ఎందుకో ఒక్కసారిగా అర్థంకాని ఫీలింగ్… నవ్వు మాయం…
.

  • ‘‘స్టాంపింగ్ చిక్కులు, ట్రంపు వీసా పైత్యాలతో, ఆంక్షలతో అమెరికా నుంచి రాలేకపోతున్నాను, మీరు దగ్గరుండి అన్నీ పద్ధతి ప్రకారం జరిపించండి అంటూ నాకే మెసేజ్ పెట్టాడు కదరా తను… రానే లేదు కెదా తను… మరి నీకు అంత్యక్రియల దగ్గర ఎలా కనిపించాడు..? మన ఇంటికి ఎలా వచ్చాడు..?’’

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…
  • Alia Bhatt … ‘Alpha’ మోడల్… ఏ చట్రంలోనూ బందీ కాదు…
  • ఈవీవీ మార్క్ అప‘హాస్యం ట్రాక్… లేటు వయస్సుల రొమాన్స్…
  • పంప్డ్ స్టోరేజీ..! తెలంగాణ పవర్ సెక్టార్‌లో ఓ నిశ్శబ్ద విప్లవం..!
  • పేదల వాహనం..! పల్లె బాటలపై ఈరోజుకూ తోపు టూవీలర్ ఈ మోపెడ్..!
  • సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?
  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions