Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అల్లు అరవింద్ మాటల్లో తప్పు లేదు- తను యశ్‌ను కించపరచలేదు !!

September 1, 2026 by M S R

.

టాక్సిక్ ఘోర పరాజయం, కొడుకు ఆవేదన చూసి యశ్ తల్లి పుష్ప ఆందోళనకు గురైనట్టుంది, అంతే… ఏవేవో మాట్లాడుతూ… గతంలో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యల్నీ (పేరు తీసుకోకుండా) ప్రస్తావించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది…

‘‘మావాడేమీ టెర్రరిస్ట్ కాదు, తండ్రి అరుణ్ కుమార్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్… చిన్నప్పటి నుంచీ కష్టపడి ఎదిగాడు నా బిడ్డ… అనామకుడు కాదు… దారిన పోయే దానయ్య కాదు, కేజీఎఫ్‌కన్నా ముందే అయిదు వరుస హిట్స్ ఉన్నాయి… కేజీఎఫ్‌కన్నా ముందు యశ్ ఎవరు అనే ప్రశ్నకు వాడు సాధించిన విజయాలే సమాధానం, నా బిడ్డను చూసి నేను గర్వపడుతున్నాను’’ అన్నట్టుగా చెబుతూ పోయింది…

Ads

దానికి నేపథ్యం ఏమిటంటే..? గతంలో, రెండేళ్ల క్రితం… ఏదో ప్రెస్ మీట్… పెద్ద సినిమాలు అనే ప్రస్తావన వచ్చినప్పుడు అల్లు అరవింద్ మాట్లాడుతూ… ప్రస్తుతం హీరోలను భారీ స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తేనే ఫలితం ఉంటోంది, ఉదాహరణకు కేజీఎఫ్‌కన్నా ముందు యశ్ ఎవరు? అన్నాడు…

తను ఓ ఉదాహరణ తీసుకున్నాడు, అంతే.., నిజమే కదా, పుష్పకు ముందు తన కొడుకు అల్లు అర్జున్ కూడా అంతే కదా, కేవలం తెలుగు పాపులర్ హీరో… పుష్పను భారీగా ప్రొజెక్ట్ చేశాక పాన్ ఇండియా స్టార్, ఏకంగా ఫోర్బ్స్ పత్రికల ముఖచిత్రంగా మెరుస్తున్నాడు… అలాగే యశ్ కూడా అప్పట్లో కన్నడ పాపులర్ స్టార్, కేజీఎఫ్ భారీతనం, భారీవిజయం తరువాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు…

టాక్సిక్‌లో పెట్టుబడి పెట్టాడు, కేజీఎఫ్ రేంజ్ సినిమాయే కావాలనుకున్నాడు… ఇప్పుడు హీరోను భారీగా ప్రొజెక్ట్ చేస్తే సినిమాకు అదే రేంజ్ వ్యాపారం, వసూళ్లు… రామాయణ్‌లో కూడా పెట్టుబడి పెడుతున్నాడు, అది దేశంలో ఇప్పటివరకూ పెడుతున్న అత్యంత భారీ నిర్మాణవ్యయం…

అల్లు అరవింద్ మాటల్లో తప్పులేదు, ఏదో సందర్భంలో చెప్పాడు, యశ్‌ మీద ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కూడా కాదు అవి… అదేదో తన కొడుకునే ఉదాహరణగా తీసుకుని చెబితే అయిపోయేది, ఏ విమర్శా వచ్చేది కాదు…

యశ్ తల్లి కూడా అల్లు అరవింద్ వ్యాఖ్యల్ని తన పేరు ప్రస్తావిస్తూ తప్పుపట్టలేదు… ఐనా సరే, మీడియా పాత అల్లు అరవింద్ వ్యాఖ్యలకు, యశ్ తల్లి పుష్ప వ్యాఖ్యల్ని కౌంటర్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తోంది… ఏదో నిప్పు రాజేసే ప్రయత్నం…

నిజానికి ఆమెకూ అన్నీ తెలుసు… ఆమె అనామకురాలేమీ కాదు… భర్త ప్రభుత్వ డ్రైవర్ కావచ్చుగాక, పీఏ ప్రొడక్షన్స్ (PUSHPA ARUNKUMAR) పేరిట ఆమెకు సొంత సినిమా నిర్మాణ సంస్థ ఉంది… ఓ సినిమా తీసింది… అనుష్క శెట్టి నటించిన ఘాటి సినిమాకు కర్నాటకలో డిస్ట్రిబ్యూటర్ కూడా… యశ్‌కు కూడా సొంత నిర్మాణ సంస్థ ఉంది… Moster Mind Creations దాని పేరు…

అంతెందుకు..? యశ్ భార్య రాధికా పండిట్ కూడా హీరోయిన్‌గా చేసింది… సో, ఆ కుటుంబానిది సినిమా నేపథ్యమే… కేజీఎఫ్ తరువాత నాలుగేళ్లుగా యశ్‌కు వేరే సినిమా లేదు, చేస్తే భారీ సినిమాయే చేయాలని టాక్సిక్ చేశాడు… సరే, దర్శకురాలి పైత్యమో, యశ్ తదితరులు ప్రతి ఇష్యూలో వేళ్లు పెట్టడం వల్లో, సినిమా పెద్ద కంగాళీ అయిపోయి డిజాస్టర్ అయిపోయింది… సినిమాలన్నీ హిట్ కావాలనేముంది..?

పైగా సినిమా ఫీల్డ్‌లో ఉండి, అన్నీ చూస్తూ… యశ్‌కు ఊరటనిచ్చే వ్యాఖ్యలు చేయడం తప్పు కాదు… కానీ ఆమె వర్తమానంతో సంబంధం లేని పాత వ్యాఖ్యలేవో గుర్తుచేసుకుని ఏదేదో మాట్లాడటం అనవసరం… ఎస్, భారీగా ప్రొజెక్ట్ అయితే తప్ప పాన్ ఇండియా స్టార్ హోదా రాదనే భ్రమ హీరోలందరిలోనూ ఉంది… ఎంత పాపులర్ స్టార్ అయినా సరే మహేశ్ బాబుకు నేషనల్ లెవల్ పాపులారిటీ రాలేదు… ఇప్పుడు వారణాసి ఆ కొరత తీరుస్తుంది…

ఎందుకంటే, రాజమౌళి సినిమాను ప్రొజెక్ట్ చేసే రేంజ్ వేరు కాబట్టి… ఆల్రెడీ ప్రభాస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్ ఆ రేంజ్ స్టార్‌డమ్ రాజమౌళి సినిమాలతో పొందారు కాబట్టి… అల్లు అరవింద్ కూడా దీన్నే ఏదో సందర్భంలో చెప్పాలని ప్రయత్నించాడు… తన మాటల్లో తప్పు పట్టేదేమీ లేదు…!! పైగా బహిరంగంగా తను ఏ హీరోనూ ఎప్పుడూ కించపరిచినట్టు కూడా ఉదాహరణలు కూడా లేవు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ ఆరోగ్యకరమైన చర్చ – ఏకశిల ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు !?
  • రాహుల్… నీకూ తల్లి ఉంది… కనీసం నీ డర్టీ టీమ్‌ను మార్చుకో…
  • Immortal – సరుకులన్నీ బాగానే ఉన్నయ్ … వంట కుదరలేదు, అంతే…
  • రోజులు మారాయ్ ! నువ్వెంత తోపు స్టార్ అయితేనేం- స్టోరీ ఏమిటో చెప్పు !
  • అమ్మగారు ఐరాస మెట్లు ఎక్కుతున్నారు – రచ్చ ముఖ్యం !!
  • ప్రొఫెనలిజం – ఎవరు నిజమైన దొంగలు ? ఓ బ్యాంకు చోరీ కథ !!
  • Only SunDay- Not FunDay… పరమ పేలవంగా నాగార్జున వీకెండ్ షో !
  • మైండ్ బ్లాకయ్యేలా… జన్వాడ భూముల ‘మోడస్ ఆపరెండి’…
  • పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !
  • బాలయ్య కొడుకు ఎంట్రీకి ఈ కథ సరిగ్గా కుదురుతుందేమో..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions