Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిశ్శబ్దంగా కాటేసే క్రౌర్యాన్ని ‘అబ్బాయి గారి’పై చూపించిన ఆ కళ్లు…

June 12, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. వెంకటేష్ జైత్రయాత్రలో మరో మైలురాయి 1993 సెప్టెంబరులో వచ్చిన ఈ అబ్బాయి గారు సినిమా . తమిళంలో భాగ్యరాజా , రాధ లీడ్ రోల్సులో నటించిన ఎంగ చిన్న రాజాకు రీమేక్ మన అబ్బాయి గారు . 58 కేంద్రాలలో 50 రోజులు , 25 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్లు పడ్డాయి .

తమిళం నుండి రీమేక్ అయి కూడా మరలా ఈ అబ్బాయి గారు తమిళంలోకి డబ్ అయింది . Quite interesting .

Ads

తల్లి లేని ఓ జమీందారు కొడుక్కి తల్లి కోసం తాపత్రయ పడుతుంటాడు . కొడుకు తాపత్రయం చూసి తండ్రి రెండో పెళ్లి చేసుకుని తల్లిని తెచ్చానని భావిస్తాడు . కాని వచ్చిన జయచిత్ర కుటిల బుధ్ధితో తండ్రిని శారీరక వైకల్యానికి గురిచేసి ఓ గదిలో పడేస్తుంది . కొడుకుని చదువు సంధ్య లేని నిశానిని చేసి గుప్పిట్లో పెట్టుకుంటుంది .

అనూహ్యంగా మీనా కోడలిగా ఇంట్లోకి వచ్చి అత్తను ఢీకొంటుంది . అత్తాకోడళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది . మామ ఆరోగ్యాన్ని బాగుచేసి భర్తను ప్రయోజకుడిని చేస్తుంది . మారు కొడుకు ప్రయోజకుడు కావటం ఇష్టం లేని మారు తల్లి విషం ఇస్తుంది .

ఆమె మీద చెదరని నమ్మకం ఉన్న కొడుకు ఆ విషపు పాలని తాగేస్తాడు . మారు తమ్ముడు , తమ్ముడి మేనమామ కలిసి అబ్బాయి గారిని బంధించేస్తారు . మీనాని ఆస్తి పేపర్ల మీద సంతకం చేయమని బలవంతం చేస్తారు . తల్లే సంతకం చేయవద్దని అడ్డుపడుతుంది . కొడుకు శ్రీకాంత్ ఫుల్ విలన్ అవతారం ఎత్తటం , అబ్బాయి గారు లేచి అందరిని బాదేయటం , అందరూ పశ్చాత్తాప పడటంతో సినిమా శుభాంతం అవుతుంది .

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుకూల మార్పులతో బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని సినిమా ఎక్కడా స్లో కాకుండా దర్శకత్వం వహించిన ఇవివి సత్యనారాయణని ప్రత్యేకంగా అభినందించాలి . ఆయన తర్వాత సినిమా విజయానికి దోహదపడింది కీరవాణి సంగీతం .

కూసింది కోయిలమ్మ కులికింది కూనలమ్మ , ఓ కన్నె పువ్వా కాటేసిపోనా , వెన్నెలకేం తెలుసు మల్లెలకేం తెలుసు , నీ తస్సాదియ్యా పాలకొల్లు పైటజల్లు డ్యూయెట్లు వెంకటేష్ , మీనాల మీద ఇవివి చాలా అందంగా చిత్రీకరించారు .

తడికెందుకు అదిరింది గడి ఎందుకు బిగిసింది జానపద శైలిలో బాగుంటుంది . అబ్బాయి గారు అమ్మ మీద తనకున్న అపార ప్రేమను కురిపించే గ్రూప్ డాన్స్ అమ్మా అమ్మా మాయమ్మా అమ్మంటేనే నువ్వమ్మా బాగుంటుంది . వేటూరి , భువనచంద్ర , వెన్నెలకంటి వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర  తదితరులు  శ్రావ్యంగా పాడారు . పాటలన్నీ హిట్టే . ముఖ్యంగా కూసింది కోయిలమ్మ , ఓ కన్నె పువ్వా కాటేసిపోనా పాటలు .

నటనపరంగా మీనా , జయచిత్ర పోటాపోటీగా నటించారు . అత్తాకోడళ్ళ కోల్డ్ వార్ అద్భుతంగా ఉంటుంది . వెంకటేష్ as usual బాగానే నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో నూతన్ ప్రసాద్ , కోట శ్రీనివాసరావు , శ్రీకాంత్ , శ్రీలత , బ్రహ్మానందం , ఏవియస్ , వై విజయ , జీవా , ఐరన్ లెగ్ శాస్త్రి , పి యల్ నారాయణ , శివాజీ రాజా , మాస్టర్ బాలాదిత్య , మల్లిఖార్జున రావు  తదితరులు నటించారు .

బ్రహ్మానందం , మీనా , నూతన్ ప్రసాద్ కలిసి విలన్లను ఆట పట్టించే సీన్లన్నీ బాగుంటాయి . తెలుగులో కూడా సక్సెస్ అయిన ఈ సినిమా తమిళ మూలం నుంచి అంతకుముందే హిందీలోకి కూడా రీమేక్ అయింది . హిందీలో అనిల్ కపూర్ , మాధురీ దీక్షిత్ , అరుణాఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు .

తరచూ ఏదో ఒక చానల్లో వచ్చే ఈ సినిమా యూట్యూబులో ఉంది . మీనా అభిమానులు తప్పక చూడవలసిందే .





ముచ్చట… ఇక్కడ మరో అంశం… అందరూ కీరవాణిని కాపీలు ఎరుగని స్వచ్ఛ కంపోజర్ అంటుంటారు కదా, ఇందులోని తడికెందుకు అదిరింది పాట ఖల్‌నాయక్ హిందీ సినిమాలోని ఛోలీకే పీచే క్యా హై పాటలాగే ఉంటుంది…

పాట ట్యూన్‌లో కొన్ని భాగాలు, బీట్ ప్యాటర్న్, ఫోక్- డాన్స్ స్టైల్, లిరిక్స్‌లోని డబుల్ మీనింగ్ సరదా శైలి… ఇవన్నీ చూస్తే “చోలీ కే పీచే” ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది…

ఆ కాలంలో తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఒక భాషలో హిట్ అయిన పాటను మరో భాషలో కొంత మార్చి వాడటం చాలా సాధారణం… ముఖ్యంగా 1990లలో ఇది తరచూ జరిగేది…

సో, కాపీ అనకుండా ఫ్రీ మేక్, ఇన్‌స్పిరేషన్, లోకలైజ్డ్ వెర్షన్, ప్రేరణ అని ఏదో పేరు పెట్టేయండి… ఎందుకంటే, ఆర్కెస్ట్రయిజేషన్ కాస్త తెలుగీకరించబడింది కాబట్టి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిశ్శబ్దంగా కాటేసే క్రౌర్యాన్ని ‘అబ్బాయి గారి’పై చూపించిన ఆ కళ్లు…
  • సినారె..! జ్ఞానపీఠమైనా ఈ కవి పాదపీఠమే…! అనితరసాధ్యం..!!
  • కాల్పులు, కర్ఫ్యూలు… ఆగని నిరసనలు! అట్టుడుకుతున్న పీవోకే..!
  • మెహబూబా మెహబూబా… ఈ పాపులర్ పాటపై ఓ పాపులర్ జోక్…
  • వెంటాడే ‘మిన్నేటి సూరీడు’ భారతీరాజా… ఏదో తెలియని మత్తు…
  • తమిళ రాజకీయ నేతలకు కర్ణాటక అమ్మవార్లే ఎందుకు ప్రత్యేకం?
  • ప్రిపెయిడ్..! తనెవరికీ ఏమీ కాడు, తనకెవరూ మిగల్లేదు… ఫిక్సయ్యాడు..!!
  • M6… ఆరు నగరాలు… భారత భవిష్యత్తు… రేవంత్‌రెడ్డి భేషైన ప్రతిపాదన…
  • ఆ బెంచీ..! ఎన్ని జ్ఞాపకాల నెమరివేత..? ఎన్ని కన్నీళ్లు ఇంకిన వేదిక..!!
  • తెలంగాణలో ‘సర్’… 88 లక్షల వోట్లు డౌట్‌ఫుల్… కథ మొదలైంది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions