Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక విలనీ అత్త… ఒక హీరో అల్లుడు… ఓ మాస్ మసాలా పల్లీ బఠానీ…

June 14, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. కళాభినేత్రి వాణిశ్రీ దుమ్ముదులిపిన మరో అత్త సినిమా 1993 లో వచ్చిన ఈ అల్లరి అల్లుడు . Undoubtedly an excellent romantic , comedy entertainer . కోదండరామిరెడ్డి పనితనం కనిపించే మరో వినోదాత్మక చిత్రం . అల్లరి అల్లుడుగా నాగార్జున కూడా వాణిశ్రీకి ధీటుగా నిలబడ్డాడు . ప్రేక్షకులను , అభిమానులను అలరించాడు .

1+2 సినిమా కావటంతో ఇద్దరు భామలు నగ్మా , మీనాలతో కావలసినన్ని డ్యూయెట్లు . వీరిద్దరే కాదు ; మరో భామ రమ్యకృష్ణతో ఓ ఐటెం సాంగ్ . నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు నేను రోమియోగా మారినది లగాయిత్తు అనే నాగార్జున , రమ్యకృష్ణల మీద గ్రూప్ డాన్సుని ప్రభుదేవా బ్రహ్మాండంగా కంపోజ్ చేసాడు . పాట , డాన్స్ సూపర్ హిట్ కావటమే కాదు ; కాలేజీ ఫంక్షన్లలో పిక్నిక్కులలో తప్పనిసరి ప్రోగ్రాం అయిపోయింది .

Ads

బాగా డబ్బు చేసిన అత్త అఖిలాండేశ్వరి విలన్ తమ్ముడు కోట శ్రీనివాసరావు సహకారంతో ఇరవై రూపాయల వడ్డీలు గుంజి పటాటోపాన్ని , అహంకారాన్ని , ఆభిజాత్యాన్ని చూపుతూ ఉంటుంది . ఇంతోటి అత్తకు మొగుడు ఎవరయినా నోరు మూసుకొని ఉండాల్సిందేగా ! ఆ పాత్ర రావు గోపాలరావుది .

వీరిద్దరి కూతుళ్ళుగా నగ్మా , మీనాలు . ఒకరు నాన్న కూతురు , మరొకరు అమ్మ కూతురు . పట్టణంలో చదువుకునే నగ్మాకు కాలేజీ కేంటీన్ కుర్రాడు నాగార్జునతో సంఘర్షణ , సవాళ్లు . సడెన్ గా తండ్రి చనిపోవటంతో ఇంటికి వెళ్ళిన నాగార్జునకు అఖిలాండేశ్వరి వలన తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని , అవమానాన్ని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవటానికి వాణిశ్రీ బంగళాకు చేరి , అమెకు దగ్గరయి , ఆస్తి తన పేర వ్రాయించుకుని అత్త అహంకారాన్ని దించేయటంతో సినిమా శుభాంతం అవుతుంది .

1+2 కదా ! రెండో కూతురు మీనాకు కూడా రెండో నాగార్జున గుర్రం మీద వచ్చేస్తాడు . దొంగ మొగుడులో మూడో చిరంజీవి లాగా . ఫార్ములా బాగానే వర్కవుట్ అయింది . ఇతర ప్రధాన పాత్రల్లో బ్రహ్మానందం , బాబూమోహన్ , చలపతిరావు , సుత్తి వేలు , సంగీత , మురళీమోహన్ తదితరులు నటించారు .

ఈ సినిమా సక్సెస్ అవటానికి మరో ప్రధాన కారకులు తోటపల్లి మధు . చక్కని చిక్కని కధను నేయటమే కాక పదునైన డైలాగులను కూడా అందించారు . వాణిశ్రీ డిఫరెంట్ డైలాగ్ డెలివరీ బాగుంటుంది . ఆ తర్వాత కీరవాణి సంగీతం . ఏడు పాటలకూ అద్భుతమైన సంగీతాన్ని అందించారు . వేటూరి as usual హుషారయిన సాహిత్యాన్ని అందించారు .‌

వేటూరి వారికి ఊళ్ళ పేర్ల మీద మమకారం ఎక్కువ అనుకుంటా . ఇందులో కూడా మఛిలీపట్నం మాయాబజార్ మేట్నీకొస్తే మాటేశా అంటూ సాగే నాగార్జున హరికధా కాలక్షేపం , అందులో వాణిశ్రీ డాన్స్ హైలైట్ . నగ్మాతో కమ్మని జత కమ్మని ఒడినిమ్మని పిలిచావే వాన పాట , తొడతొక్కిడి తోట లోన బుడబుక్కల గాలివాన అంటూ సాగే డ్యూయెట్లు ; మీనాతో రెయిక చూస్తే రాజమండ్రి పైట చూస్తే పాలకొల్లు , ఒక్క సారే వన్సు మోరే ఒప్పుకోవే సరే సరే అంటూ సాగే డ్యూయెట్లను కోదండరామిరెడ్డి రొమాంటిగ్గా చిత్రీకరించారు .

చలో నా చక్కెరకేళి చేరుకో రాత్రి తెనాలి పాట కూడా హుషారుగా ఉంటుంది . ఈ పాట మధ్యలో మొఘల్ ఎ ఆజం సినిమా లోని ప్యార్ కియాతో డర్నా క్యా ట్యూన్ని వినిపిస్తారు కీరవాణి . బాగుంటుంది . డాన్సుల్ని తార , ప్రసాద్ బ్రహ్మాండంగా కంపోజ్ చేసారు . బాలసుబ్రమణ్యం , చిత్ర , రమణ శ్రావ్యంగా పాటల్ని పాడి హిట్ చేసిపడేసారు .

తెలుగులో విజయవంతమైన ఈ సినిమా తమిళ , మళయాళ భాషల్లోకి డబ్బింగ్ అయింది . కన్నడంలోకి గడిబిడి ఏలియా అనే టైటిలుతో రీమేక్ అయింది . శివ రాజకుమార్ , మాలాశ్రీ , మోహిని , జయమాల లీడ్ రోల్సులో నటించారు . మన తెలుగు సినిమా నిర్మాత డి శివ ప్రసాద్ రెడ్డి .

కోదండరామిరెడ్డి సక్సెస్ ఎకౌంట్లో మరో సినిమా . యూట్యూబులో ఉంది . ఎక్కడా బోరించకుండా లాక్కెళ్ళుతుంది . ఇంతకుముందు చూసి ఉన్నా మరలా చూడవచ్చు . 100% entertainment .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పదే పదే ఓ కల… ముందుకు వెళ్తూ ఓ అమ్మ… వెనకాలే ఓ పిల్లాడు…
  • ఆల్రెడీ చూసి ఉన్నా సరే – ఈ ఆమని కళ్ళ కోసం మళ్ళీ చూడొచ్చు..!
  • కొత్త TRS vs కొత్త TRS -! పిల్ల పుట్టకముందే కుల్ల కుడితే ఇలాగే మరి!!
  • హేమిటో మరి… ఆ కురురాజ్య చక్రవర్తికీ ఇన్ని నగలు తొడగలేదేమో…
  • ఆదానీ పరుగుకు కేరళ కొత్త సీఎం బ్రేకులు! కాంగ్రెస్ మార్క్ ‘అడ్డు పుల్లలు’!
  • మీ ఇంట్లో ఓవెన్ ఉందా… అనడిగింది ఆమె ఆ బ్యాంకు మేనేజర్‌ను!
  • ‘పతివ్రత’ ఓ రేంజులో అదరగొట్టింది- అకస్మాత్తుగా మాయమైంది
  • పోడు వేధింపులకు తెర! ఆదివాసీల మెప్పు పొందిన రేవంత్!
  • రావు బహదూర్‌పై కంప్లీట్ డిఫరెంట్ రివ్యూ! 3.5 గంటల Psychological Trauma…!
  • ALPHA – ఆ పాత్రకు ఆలియా అస్సలు నప్పలేదు – అదే మేజర్ మైనస్!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions