Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆడు జీవితం ! ఇది దుబయ్ వెట్టిచాకిరీ కథ కాదు – మన పంజాబ్‌లోనే !!

August 3, 2026 by M S R

.

మీకు GOAT… ఆడుజీవితం సినిమా గుర్తుంది కదా… ఎక్కడో దేశం కాని దేశంలో ఓ జంతువుగా జీవించిన కఠోరం… ఎలాగోలా బయటపడ్డాడు… మనమేమీ తక్కువ కాదు… అంటే, మన దేశంలోనూ ఉన్నారు అలా వెట్టిచాకిరీ చేయించుకుంటూ, మనుషుల్ని జంతువులకన్నా హీనంగా చూసేవాళ్లు… ఈ రియల్ స్టోరీ మిత్రుడు Ashok Pothraj వాల్ నుంచి సేకరణ…

సొంత దేశంలోనే ఒక మనిషి జీవితం కటిక చీకటైపోయింది. సినిమా కథలను తలపించేలా, సరిహద్దు గ్రామంలోని కొట్టంలో ఏళ్ల తరబడి ఇనుప గొలుసుల బంధీగా మారాడు. మాట మరిచిపోయి, గతాన్ని కోల్పోయి, గేదెల మధ్య నరకం అనుభవించిన ఒక తమిళ యువకుడు.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తన తల్లి ఒడికి చేరుకున్న వైనం కంటతడి పెట్టిస్తోంది.

Ads

అది 2003వ సంవత్సరం. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో 16 ఏళ్ల ప్రకాశం తన తమ్ముడితో గొడవపడి కోపంతో ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. ఆ క్షణంలో వేసిన ఒక్క అడుగు అతడి జీవితాన్ని ఏకంగా 22 ఏళ్ల పాటు చీకటిమయం చేస్తుందని ఆ టీనేజ్ కుర్రాడు ఊహించలేదు. ప్రయాణం దారి తప్పి, ఆఖరికి తమిళనాడు నుంచి ఏకంగా 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ సరిహద్దు గ్రామానికి చేరుకున్నాడు.

పంజాబ్‌లోని అమృతసర్ జిల్లా, భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జస్రౌర్ గ్రామం అతడికి నరకకూపంగా మారింది. అక్కడి ఒక పశువుల ఫామ్ యజమాని అతడిని బానిసగా మార్చుకున్నాడు. పగలేమో పాతిక గేదెల పేడ ఎత్తడం, కొట్టాలు శుభ్రం చేయడం.. రాత్రి కాగానే ఆరుబయట ఉన్న ఇనుప నులక మంచానికి గొలుసులతో కట్టేయడం!

ఆడుజీవితం

వానొచ్చినా, చలిపెట్టినా ఆ తడి దుప్పటితోనే పశువుల మధ్య పడుకునేవాడు. ఒంటిపై దుస్తులు మురికిపట్టి, మనిషి కంటే పశువులే శుభ్రంగా ఉన్నాయా అనేలా తయారయ్యాడు. చేతిలో రూపాయి లేదు, సరిగా తిండి లేదు, మాట్లాడేందుకు మనిషి లేడు.. అలా 15 ఏళ్లు దారుణమైన వెట్టిచాకిరీ అనుభవించాడు.

2022లో ప్రకాశం అనే మనిషి గొలుసులతో బంధించి ఉన్న తన వీడియో తీస్తే, అది కాస్తా స్థానికంగా వైరల్ అయ్యింది. దాని ఆధారంగా ‘అప్నా ఫర్జ్ సేవా సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు అక్కడికి చేరుకుని అతడికి విముక్తి కల్పించారు. కానీ, అప్పటికే 15 ఏళ్ల నరకం వల్ల అతడి మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది.

సొంత పేరు, ఊరు కూడా చెప్పలేని స్థితి. ఆ తర్వాత ఆసుపత్రిలో సుదీర్ఘ చికిత్స అందించగా, నెమ్మదిగా అతడికి మాటలు, పాత జ్ఞాపకాలు రావడం ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కోయంబత్తూరు, అరుప్పుకొట్టై వంటి పదాలు అతడి నోటి నుంచి రావడం అధికారులకు పెద్ద ఆధారంగా మారింది.

22 ఏళ్ల నిరీక్షణ.. కన్నీటి కథకు సుఖాంతం!
సామాజిక కార్యకర్తలు, విలేకరుల సహాయంతో ప్రకాశం ఇచ్చిన ఆధారాలను బట్టి తమిళనాడులోని అతడి కుటుంబ ఆచూకీ కనుగొన్నారు. కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో 22 ఏళ్లుగా కంటిమీద కునుకు లేకుండా గడిపిన సుందరి అనే తల్లికి ఈ వార్త అమృతంలా అనిపించింది. వీడియో కాల్‌లో కొడుకుని చూసి ఆమె భోరున విలపించింది.

తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం, పంజాబ్ అధికారులు వేగంగా స్పందించి, ప్రకాశంను బంధవిముక్తుడిని చేసి పునరావాస పథకాల కింద సాయం అందించారు. 22 ఏళ్ల క్రితం కంటిపాపలాంటి కొడుకుని కోల్పోయిన ఆ తల్లి, ఇప్పుడు ఆ కొడుకు చేయి పట్టుకుని మళ్లీ సొంతూరు బాట పట్టింది.
ఇది ఒక కొడుకు తిరిగి వచ్చిన కథ కాదు…
22 ఏళ్ల పాటు ఎదురు చూసిన ఒక తల్లి కథ…

.

అవునూ, ఆ రాక్షస యజమానికి పడిన శిక్ష ఏమిటి... ఎవరూ అడక్కండి... వాడికి ఏమీ జరగదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!
  • రేవంత్‌ రెడ్డిపై బహుముఖ కుట్ర ! జగన్ కూడా ఓ పాత్రధారేనా ?
  • నూరేళ్ల విల్లాకు కొత్త కళ ! సొగసైన బ్యాటింగే కాదు – కళాత్మక అభిరుచి !
  • కాళేశ్వరం బరాజుల బ్లండర్స్‌లాగే ఈనాడులో ఓ బ్లండర్ కథనం..!
  • న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!
  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions