Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కృష్ణంరాజు డేట్స్ ఇచ్చాడు… ఓ సినిమా లాగించేశారు… అంతే…

February 21, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. 1988 లో విడుదలయిన హిందీ సినిమా ఇన్సాఫ్ కీ పుకార్ సినిమాకి రీమేక్ తమిళంలో , తెలుగులో తీసారు . హిందీలో ధర్మేంద్ర , జితేంద్ర , అనితారాజ్ , భానుప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు . తమిళంలో రజనీకాంత్ , ప్రభు , సీత , గౌతమి నటించారు .

మన తెలుగులో ఈ సినిమాను గురుశిష్యులు టైటిలుతో తీసారు . 1990 లో రిలీజయింది . కృష్ణంరాజు , రాజేంద్రప్రసాద్ , సుమలత , ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించగా ఇతర పాత్రల్లో రామకృష్ణ , గొల్లపూడి మారుతీరావు , సుధాకర్ , కోట శ్రీనివాసరావు , హేమసుందర్ , మహర్షి రాఘవ , మాడా  ప్రభృతులు నటించారు .

Ads

ఫస్ట్ హాఫ్ అంతా అందరూ దొంగలే సినిమాలో జంట చిల్లర దొంగల్లాగా జైలు పక్షులు కృష్ణంరాజు , రాజేంద్రప్రసాద్ సందడి చేస్తారు . జైల్లో ఉండగా ఓ అమాయకుడు మహర్షి రాఘవను వాళ్ళ సెల్లోనే కలుస్తారు . అతను చేయని హత్యా నేరంలో ఇరికించి విలన్లు జైలుకు పంపుతారు . క్లైమాక్సులో అతను తన స్వంత తమ్ముడే అని కృష్ణంరాజుకు తెలుస్తుంది .

అతన్ని కాపాడతామని హామీ ఇచ్చి గురుశిష్యులు విలన్ల వెంట పడతారు . సెకండ్ హాఫ్ లో విలన్లు ఈ ఇద్దరు గురుశిష్యుల కుటుంబాలకు నష్టం చేసినవారే అని గుర్తిస్తారు . ఇద్దరు కలిసి విలన్లను చట్టానికి అప్పచెప్పి తాము ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకోవటంతో సినిమా శుభాంతం అవుతుంది .

తమిళ , తెలుగు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకుడు . ఆత్రేయ పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర పాడారు . గురుశిష్యులు జైల్లో పాడే కుర్చీ కోసం కుస్తీ పడితే జనమంతా పిచ్చోళ్ళేరా అనే పాట బాగుంటుంది .

గణేష్ పాత్రో వ్రాసిన డైలాగులు హాస్యభరితంగా ఉంటాయి . గొల్లపూడి డైలాగులు రాజకీయాల మీద విసుర్లతో ఉంటాయి . బ్లాక్ మనీ , వైట్ మనీలతో పాటు రెడ్ మనీ అని ఓ కొత్త పదాన్ని పరిచయం చేస్తారు గణేష్ పాత్రో . రెడ్ మనీ అంటే దుర్మార్గపు మనీ, నెత్తుటి డబ్బు అన్న మాట . కానీ కృష్ణంరాజు ఇమేజ్‌కు ఆ పాత్ర కేరక్టరైజేషన్ సెట్ కాలేదనిపిస్తుంది. ఏదో పల్లీ బఠానీ సినిమా…

  • అన్నట్టు గురుశిష్యులు పేరుతో అక్కినేని, కృష్ణ సినిమా కూడా ఒకటి (1981) ఉన్నట్టుంది… అందులో సుజాత, శ్రీదేవి హీరోయిన్లు… (Sun Nxt లో ఉంది)…

యస్ పి ముత్తురామన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణంరాజు కామెడీ + ఏక్షన్ హీరోగా నటించిన సినిమా . ఆయన అభిమానులు చూసి ఉండకపోతే ట్రై చేయవచ్చు . It’s an action comedy movie .

నేను పరిచయం చేస్తున్న 1243 వ సినిమా… #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బ్రిటన్‌లో ఓ గుడి కాంప్లెక్స్‌ను మసీదు కోసం అమ్మేశారు!
  • కళ్లల్లో ‘లక్ష్యం’… కాళ్లల్లో ‘రిథమ్’… కమాన్ స్పెయిన్, కప్పు పట్టు !!
  • కాంగ్రెస్ కాదు – బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్‌పై బీజేపీ ‘ఎదురుదాడి’..!!
  • పాత ఫోన్లకే రీబ్రాండింగ్ ! స్మార్ట్ ఫోన్ కంపెనీల మాయాజాలం !!
  • వితండ సర్వే! వాహనదారులనూ పార్టీలను బట్టి చీల్చితే ఎలా?!
  • హమ్మ జగనూ..! 18 ఏళ్ల పిల్లోడట – సర్కారుకే మానవత్వం లేదట..!!
  • బీఆర్ఎస్! పంపు హౌజులపై పొంతన లేని వితండ వాదనలు!!
  • ప్రాణాలు తీస్తున్న ఈ కలుపు మందుపై జాతీయ నిషేధం !!
  • తస్లీమా! మమత తరిమేసింది- సువేందు రమ్మంటున్నాడు !!
  • కాంగ్రెస్‌పై ప్రవాస భారతీయుల రుసరుస! పవన్ ఖేరా నిర్వాకం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions