Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెహబూబా మెహబూబా… ఈ పాపులర్ పాటపై ఓ పాపులర్ జోక్…

June 12, 2026 by M S R

.

Bharadwaja Rangavajhala …. షోలే సినిమా విడుదలైన కొత్తలో ప్రచారంలోకొచ్చిన కథ ….
ఒకానొక కాలనీలో ఒక్కానొక యువకుడు బర్మన్ గారి…
మెహబూబా మెహబూబా పాటను విపరీతంగా ప్రాక్టీసు చేస్తాడు …
ఆ కాలనీలో జరిగే దేవీనవరాత్రుల వేదిక మీద ఆ పాట పాడాలని నిర్ణయించుకుని నిర్వాహకులకు డబ్బిచ్చి మరీ అవకాశం కొనుక్కుంటాడు …

ఫైనల్ గా వేదిక ఎక్కి పాట పాడేస్తాడు …
జనం చప్పట్లు కొట్టరు …
అదేంటని నిర్వాహకుల్ని అడిగితే …
జనం నీ అసమాన ప్రతిభకి మ్రాన్పడి చప్పట్లు కొట్టడం మర్చిపోయార్లే అని పంపేస్తారు …

Ads

చెవుల్లోంచీ దూది తీసి పారేస్తూ …
అతను వేదిక దిగి వెడుతుంటే …
ఓ అందమైన అమ్మాయి హాయ్ అంటుంది …
మనోడు మెలికలు తిరిగిపోతాడు …
ఆటోగ్రాఫ్ కోసం వస్తోందేమో అనుకుంటాడు ….
ఆ అమ్మాయి వచ్చి మీరే కదా ఇందాక పాట పాడింది అని అడుగుతుంది …
అవునంటాడు తన్మయావస్తలో …

కాస్త అలా నడుస్తూ మాట్లాడుకుందామా అంటుంది …
కొంపతీసి ఐ లవ్యూ అంటుందేమో అని ఇతను మరింత టెన్షన్ కు గురౌతాడు …
అలా ముందుకు నడుస్తూ మీరేం చేస్తారు ఎక్కడుంటారు లాంటి రొటీన్ ప్రశ్నలడుగుతూ….
కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ఒక్కసారి నా కోసం … ఇందాక పాడిన పాట పాడరా ప్లీజ్ అంటుంది …

ఇప్పుడా అంటాడా కుర్రాడు …
అవునండి ఇప్పుడే … నా కోసం ప్లీజ్ అంటుందా అమ్మాయి గోముగా …
అంతే ఇతను పాడతాడు ….
పాడుతూ ఉండగా అక్కడున్న గుంపులోంచీ ఓ కుర్రాడు పరిగెట్టుకుని వీళ్లిద్దరి వైపు వస్తాడు …
అతను రాగానే ఈ అమ్మాయి ఈ పాడుతున్న కుర్రాడి చేయి పట్టుకుని … ఇంక ఆపేయండి …

బైదిబై చాలా థాంక్స్, నేను వెడుతున్నాను సీయూ అంటుంది …
అదేంటి, నన్ను పాడమన్నారు, ఇంకా పల్లవిలోనే ఉన్నాను … అంటాడు మన గాయకుడు
అబ్బే అక్కర్లేదు .. ఇతను మా డ్రైవర్ పేరు మెహబూబా … నేనీ జనంలో అరవలేక మీ హెల్ప్ తీసుకున్నానన్నమాట అనేసి వెళ్లిపోతుంది …
అదీ కథ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ముట్టడి పోరాటాలన్నీ మైలేజీ పోరాటాలే… ఎవ్వడూ తగ్గట్లేదు…
  • ధర్మేంద్ర ప్రధాన్… విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగినవాడే…
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా సంకేతాలు ఇవే !!
  • ఈ చట్టాలు ఎందుకూ పనికిరావు – ముళ్లు పీకాల్సింది బుల్‌డోజర్లే !!
  • జస్ట్, సెకన్ల ఆపరేషన్ – ఖేల్ ఖతం – ఉగ్రవాది హతం – 141 ప్రాణాలు సేఫ్
  • అప్పటి సంచలనం… ఇప్పటి మీడియాకూ తెలియదేమో ఈ కథ…
  • ఆల్రెడీ బాలయ్య హిట్ సినిమా ఇది! మరి రీమేక్ ఎవరు చూడాలి ?!
  • డొల్ల మాటల వ్యాపారి..! మళ్లీ తెలంగాణ యాసపై అదే ఏడుపు !!
  • ఢిల్లీ అల్లర్ల వైఫల్యానికి, కల్లోలానికి ఎవరు అసలు బాధ్యులు..?
  • అబ్బో… ఈ ఉదయ్‌కృష్ణుడు మామూలోడు కాదు… ఎందుకంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions