Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాప్ స్టార్‌తో రెండు హాట్ సాంగ్స్… పైగా వాణి విశ్వనాథ్ హొయలు…

May 3, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ఈ అలెగ్జాండర్ సినిమా వీళ్ళిద్దరిదే . ఒక వైపు వాణీ విశ్వనాథ్ హొయలు , రొమాంటిక్ ఏక్షన్ ; మరో వైపు సుమన్ హీరోయిజం , వయొలెంట్ ఏక్షన్ . ఇద్దరూ అదరగొట్టేసారు . ఈ సినిమాకు ఇంకా ప్రత్యేకతలు ఉన్నాయి . ప్రముఖ హాస్య నటుడు యం యస్ నారాయణ వి యస్ తెన్నేటితో కలిసి ఈ సినిమాకు డైలాగులు వ్రాసారు .

మామూలుగా వ్రాయలేదు . ముఖ్యంగా రాచకొండ లచ్చన్న పాత్రలో కోట శ్రీనివాసరావు డైలాగులు శత్రువు సినిమాలో కన్నా పదునుగా ఉంటాయి . కోట ఏక్షన్ కూడా అలాగే ఉంటుంది . శత్రువు సినిమాలో పాత్ర కన్నా ఇందులో పాత్రే పవర్ఫుల్ గా ఉంటుందేమో అనిపిస్తుంది .

Ads

మరో ప్రత్యేకత ప్రముఖ పాప్ సింగర్ , ప్రియమణి మేనత్త , ఉషా ఊతప్ ఏకలవ్య శిష్యురాలు మాల్గుడి శోభవి రెండు పాటలు ఊపి వదిలి పెడతాయి . వల వేసి పట్టేది వాడే గురి చూసి కొట్టేది వాడే వాడే అలెగ్జాండర్ అనే పాట సినిమాకు హైలైట్ . మరొకటి డిస్కో శాంతి , బాబూమోహన్ , గేంగ్ మెంబర్ల మీద చాలా డిఫరెంటుగా ఉంటుంది . హేపీ హేపీ హేపీ హేపీ తేరా పాపీ అంటూ సాగుతుంది .

రాజ్- కోటి వెరైటీ సంగీతాన్ని అందించారు . సినిమాలో ఉన్న అయిదు పాటల్నీ భువనచంద్రే గొప్పగా వ్రాసారు . అంత కంటే గొప్పగా బాలసుబ్రమణ్యం , చిత్ర , మాల్గుడి శోభ పాడారు . సుమన్ , వాణీ విశ్వనాథుల మీద మూడు డ్యూయెట్లను చాలా హాటుహాటుగా చిత్రీకరించారు దర్శకుడు కట్టా రంగారావు .

ఓ సుందరీ ఓ సుందరీ పరదా తెరిచింది , చలి గాలి కొట్టిందే హొయ్ రామా హొయ్ రామా , భేషుగ్గా ఉందే షేపు వూపు అంటూ సాగుతాయి ఈ మూడు డ్యూయెట్లు . సుందరం మాస్టారు , తారలు డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు .

హీరో నిజాయితీ కల ఓ జర్నలిస్టు కొడుకు . ఆటో నడుపుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు . హీరోని ముగ్గులోకి దింపి పెళ్ళాడే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటుంది హీరోయిన్ . ఇంతమంది శిష్టులు ఉన్నప్పుడు దుష్టులు కూడా ఉండాలిగా . ఉన్నాడు . పేరు రాచకొండ లచ్చన్న . కర్కోటకుడు . ఏ పదవీ లేకపోయినా మాఫియా గేంగుతో అందరినీ ఆటాడిస్తూ ఉంటాడు .

తన అఘాయిత్యాల గురించి సమాచారాన్ని సేకరించి పోలీసులకు ఇచ్చేందుకు విఫల ప్రయత్నం చేసిన తండ్రిని లచ్చన్న చంపేస్తాడు . ఎదిరించిన హీరోని బాగా గాయపరిచి రోడ్ మీద వదిలేస్తాడు . లచ్చన్నకు ప్రత్యర్థి , మరొక మాఫియా లీడర్ నూతన్ ప్రసాద్ హీరోని ఆదరించి , అలెగ్జాండర్ నామకరణ చేసి , లచ్చన్న మాఫియా సామ్రాజ్యాన్ని కూలదోసేలా మోటివేట్ చేస్తాడు .

హీరో లచ్చన్న మాఫియా సామ్రాజ్యాన్ని కూలదోసి , దోషులను కోర్ట్ ముందు నిలబెట్టి , చట్టపరంగా శిక్షింపచేసి , హీరోయిన్ని పెళ్ళాడటంతో సినిమా శుభాంతం అవుతుంది .

ఇతర ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణమ్మ , మన్నవ బాలయ్య , విద్యాసాగర్ , లావణ్య , సుశీల , మల్లికార్జున రావు , బాబూమోహన్ , నూతన్ ప్రసాద్ , డిస్కో శాంతి , తదితరులు నటించారు . It’s a romantic , action entertainer .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కన్నెపల్లిపై అదే స్క్రిప్టు – అదే ప్రహసనం — కాకపోతే ఫేస్ మారింది!!
  • కథ బాగుంది… వెరయిటీగా ఉంది… ఆలోచనాత్మకంగా ఉంది…
  • ఏ కెరటం ఏ తీరానికి చేరుతుందో – ఈ మోహిని ఇప్పుడేం చేస్తోందంటే?
  • బాలమురళి పాడేది అసలు సంగీతమే కాదు- హైకోర్టులో ఓ కేసు …
  • ఎగిసిన రంగుల కెరటాలు కొన్ని విరిగిపడటం… స్వయంకృతాలే..!
  • 5 కోట్ల బంగారు రామచరితమానస్ – అయోధ్య గుడిలో మాయం !
  • కన్నెపల్లి పంపులపై కేటీయార్ వితండవాదం – ఇవిగో అసలు నిజాలు…
  • మూడు రాచకుటుంబాల వారసత్వం – ఒక్క వీడియోతో కెరీర్ కకావికలం
  • FIFA 2026 – అనూహ్య ఫలితాలు – అంచనాల్లో తేడాలే అసలు మజా!!
  • I will find you – గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ –

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions