.
సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ తప్పు కాదు… జాతీయ స్థాయిలో ఆదరణను ఆమె కోరుకుంటోంది బలంగా… కానీ ఆ దిశలో సరైన ప్లానింగ్ లేదు, తొందరపడింది… ఫలితం, తొలి సినిమాయే భారీ షాక్ ఇచ్చింది ఆమెకు… ఏదైనా సినిమాను అంగీకరించాలంటే నానా సమీకరణాలు చూస్తుంది ఆమె…
వల్డర్ కంటెంట్ ఉండొద్దు, ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉండాలి, రోత డ్రెస్సులు వేయదు, కథ ఓ రీతిలో ఉండాలి… కానీ బాలీవుడ్‌లో ఏదో ఓ సినిమాతో మొదలెట్టాలనే తొందరలో పడి, తన హిందీ డెబ్యూ సినిమా ఎంపికలో పొరపాట్లు చేసినట్టే కనిపిస్తోంది…
Ads
ఏక్ దిన్ ఆ సినిమా పేరు… చాన్నాళ్లుగా నిర్మాణంలో ఉంది… ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో… ఆమీర్ ఖాన్ నిర్మాత… ఇది థాయ్ సినిమా వన్ డే కు రీమేక్… ప్రధానలోపం ఏమిటంటే..? సాయిపల్లవికీ, జునైద్ ఖాన్‌కూ నడుమ ఏమాత్రం కెమిస్ట్రీ కుదరలేదు… ఆడ్‌గా ఉంది… బేసిక్ జునైద్ ఖాన్ నటనలో వెరీ పూర్… సాయిపల్లవి పక్కన తేలిపోయాడు…

ఈ కథ దినేష్ (జునైద్ ఖాన్) అనే సిగ్గరి ఐటీ ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది… అతను తన సహోద్యోగి మీరా (సాయి పల్లవి)ను ఏకపక్షంగా ప్రేమిస్తుంటాడు… జపాన్‌కు ఆఫీస్ ట్రిప్ వెళ్లినప్పుడు, మీరా ‘ట్రాన్సియెంట్ గ్లోబల్ ఆమ్నీషియా’ (TGA) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతుంది… దీనివల్ల ఆమె 24 గంటల పాటు తన జ్ఞాపకశక్తిని కోల్పోతుంది… దినేష్ ఈ ‘ఒక్క రోజు’ను ఉపయోగించుకుని, తామిద్దరూ ప్రేమలో ఉన్నట్లు నటిస్తూ, ఆమెతో ఉండాలనే తన కోరికను నెరవేర్చుకుంటాడు…

కథలో ఘర్షణ అనుకోని ట్విస్టులు, పకడ్బందీ డ్రామా, వినసొంపైన పాటలు గట్రా ఏమీ లేవు… జపాన్ లొకేషన్లు కాస్త నయం… ఏక్ దిన్’ మరీ అంత చెత్తగా ఏమీ లేదు… ప్రస్తుతం మితిమీరిన హింస, స్త్రీద్వేషపూరిత ధోరణుల మధ్య చిక్కుకుపోయిన బాలీవుడ్‌కు, ఇది స్వచ్ఛమైన యవ్వన ప్రేమను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది… కానీ ప్రేక్షకులకు నచ్చలేదు… పాపం మీడియా మీట్లలో జునైద్ కన్నీళ్లు పెట్టుకున్నా జనం లైట్ తీసుకున్నారు…

తొలిరోజే థియేటర్లు ఖాళీ… 1961 షోల ద్వారా కేవలం 1.37 కోట్ల గ్రాస్, 1.10 కోట్ల నెట్ వచ్చింది… పైగా వీకెండ్… ఈ సండే గడిస్తే… వీక్ డేస్ మరింత దారుణంగా ఉండేట్టుంది… సో, ఆమీర్ ఖాన్, సాయిపల్లవిల పేర్లు సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు… ఆమె ఎంట్రీ అమంగళకరంగా మారిపోయింది… ఇక రామాయణమే దిక్కు..!!
Share this Article