.
నా పార్టీ పేరు టీఆర్ఎస్… అని కల్వకుంట్ల కవిత అట్టహాసంగా ప్రకటించుకుంది వేల మంది హాజరైన పార్టీ ఆవిర్భావ వేదిక మీద..! అంటే తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పింది… కానీ ఆమెకు ఆ పార్టీ పేరు దక్కిందా..? లేదు, అంతా మాయ… పరువు పోగొట్టుకుంటోంది ఆమె… నలుగురూ నవ్వుకునేట్టు…
ఆ పార్టీ పేరు మీద బీఆర్ఎస్ బోలెడు ప్రశ్నలు సంధించింది ఆరోజే… క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని, అదీ ఆమె ఇస్తేనే బెటర్ అని ‘ముచ్చట’ కూడా సూచించింది… తీరా చూస్తే ఇప్పుడు గందరగోళం… కేసీయార్ భాషలో చెప్పాలంటే బభ్రాజమానం భజగోవిందం… (టీఆర్ఎస్ అనే ఐడెంటికల్ నేమ్ అయితే ఎన్నికల సంఘం అభ్యంతరాలు ఉంటాయనే భావనతో తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అనే పేరు రిజిష్టర్ చేయించుకున్నట్టూ చెప్పారు… కాకపోతే అసోసియేషన్ అనే అక్షరాలు అశ్వత్థామ హత కుంజర టైపులో కనీకనిపించకుండా ఉంటాయన్నమాట…)
Ads
తాజాగా ఈరోజు ఆమె ఏం చెప్పుకున్నదీ అంటే… ఎలక్షన్ కమిషన్ తమకు ఆ పేరు ఖరారు చేసిందని ట్వీటింది… కానీ తప్పు… అప్రూవల్ రాలేదు… తమకు వ్యక్తిగతంగా అప్రూవల్ లెటర్ ఇచ్చారని చెప్పిాంది, అదీ తప్పు… స్పీడ్ పోస్టు ద్వారా వచ్చింది… దానిపై 28 ఏప్రిల్ తేదీ ఉంది… అంటే మొన్నటి తేదీ… అంతే కాదు, అది అప్రూవల్ కాదు…
జనవరిలో దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పుకుంది కానీ ఎన్నికల సంఘం లేఖలోనేమో 23.4.2026లో దరఖాస్తు చేసినట్టుగా ఉంది…
పత్రికల్లో దీన్ని పబ్లిష్ చేసి అభ్యంతరాలు స్వీకరించాలనే మార్గదర్శన సూచన అది… అదే ఏయే పత్రికలకు, ఎన్నిరోజులు వేయాలో కూడా చెప్పింది… నెల రోజులు గడువు… ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే అప్పుడు పరిశీలించి అప్రూవల్ ఇస్తామనేది ఎన్నికల సంఘం పేర్కొంది… మరది అప్రూవల్ ఎలాగయినట్టు..?
ఇంకా ప్రహసనం ఏమిటంటే.,? ఆమె దరఖాస్తు చేసుకున్న పేర్లు ఏమిటో తెలుసా..? 1. తెలంగాణ ప్రజా జాగృతి 2. తెలంగాణ జాగృతి 3. తెలంగాణ రక్షణ సేన 4. తెలంగాణ రాష్ట్ర జాగృతి 5. తెలంగాణ ప్రజాశక్తి… విచిత్రమేమిటయ్యా అంటే… అసలు ఆమె ప్రకటించుకున్న తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరే లేదు ఈ జాబితాలో… మరి హఠాత్తుగా ఆ పేరు ఎక్కడి నుంచి ఊడిపడినట్టు..? ఆ అయిదు పేర్లలో లేని పేరును ఎలా ప్రకటించినట్టు..? ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తాను నెల క్రితమే చెప్పినప్పుడు ఏ జాగ్రత్తలూ ఎందుకు తీసుకోలేదు..? పైగా దరఖాస్తు చేసుకున్న రెండో రోజే ఎలా ప్రకటించినట్టు..?
పైగా ఆమె దరఖాస్తు చేసుకున్న లెటర్ హెడ్ ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో ఉంది… దానిపై ఆల్టర్నేటివ్ నేమ్స్ అని ఈ అయిదు పేర్లు రాశారు, అంటే అంతకుముందే ఏమైనా పేర్లతో దరఖాస్తు చేశారా..? దీనిపై అసలు తేదీ లేదు ఎందుకు..,? అసలు తెలంగాణ ప్రజాజాగృతి అనే పార్టీయే లేదు కదా, మరి ఈ లెటర్ హెడ్, ఈ పేరు ఏమిటి..?
అంతా గందరగోళం, అయోమయం… బీఆర్ఎస్ సోషల్ మీడియా వెంటనే అందుకుంది ఈ ప్రహసనాన్ని… అందుకే ‘ముచ్చట’ మరోసారి సూచిస్తోంది ఆమెకు… నువ్వే క్లారిటీ ఇవ్వాలి… లేకపోతే పార్టీ పుట్టుకతోనే ఇజ్జత్‌కు గండం..!!
Share this Article