Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘నేను ఓడిపోతే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా’… తండ్రులెప్పుడూ మారలేదు..!!

May 30, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ద్వాపర యుగంలో ఇల్లాలిని పణంగా పెట్టి జూదం ఆడారు . ఆ యుగంలోనే ముక్కు మీద వేలేసుకున్నవారు ఉన్నారు . 1972 లో మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో పంచాయతీ ఎలక్షన్లలో ఊరి కామందుకు , ఊళ్ళో కుర్రాడికి మాటామాట పెరిగి పంతం వచ్చి ఓడిపోతే కూతురిని ఇచ్చి పెళ్ళి చేసే ఒప్పందం అవుతుంది .

1972 లోనే కాదు ; అలాంటి కధా వస్తువుతో 1992 లో కూడా ఓ సినిమా రావటం అభ్యుదయవాదులకు ఒకింత బాధాకరమైనా, నాగార్జునకు ఆరేడు సినిమాల తర్వాత మంచి హిట్ సినిమా అయింది ఈ ప్రెసిడెంట్ గారి పెళ్ళాం .

Ads

ఏయన్నార్ సినిమాకి నాగార్జున సినిమాకి కొన్ని తేడాలు ఉన్నాయి . మొత్తం మీద సినిమా బాగా ఆడింది . దర్శకుడు కోదండరామిరెడ్డికి ఎక్కువ క్రెడిట్ పోతుంది . కధను కొన్ని మార్పులతో రమణి మధులు వ్రాయగా డైలాగులను మధు బాగా వ్రాసారు .

నాగార్జున , మీనా పోటాపోటీగా నటించారు . పొగరుబోతు పెద్దోళ్ళ పిల్లగా , పెళ్ళయ్యాక భర్తను సాధించుకునే సహనవతిగా , క్లైమాక్సులో భర్త కొరకు కలెక్టరుతో కూడా పోరాడే భార్యగా బాగా పరిణతి కల నటిగా నటించింది .
కామందు దేవుడుగా సత్యనారాయణ , ఆషాఢభూతి నా(ర)ద మునిగా కోట శ్రీనివాసరావు , నమ్మినబంటు పాలేరుగా చంద్రమోహన్ , కామందు భార్యగా అన్నపూర్ణమ్మ బాగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ , సుధ , బ్రహ్మానందం , చిట్టిబాబు , శాంతి , డిస్కో శాంతి  తదితరులు నటించారు .‌

కీరవాణి సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర చాలా శ్రావ్యంగా పాడారు . డ్యూయెట్లను కోదండరామిరెడ్డి తనదైన రొమాంటిక్ స్టైల్లో చిత్రీకరించారు . మండూరి ఆంబోతు మంద లోన రంకేస్తే అనే టీజింగ్ సాంగ్ , అలాంటిదే మరో సాంగ్ డిస్కో శాంతి నాగార్జున మీద పరువాల కోడి కొకొరొక్కో హుషారుగా ఉంటాయి . డిస్కో శాంతి , నాగార్జునల పాట బంగారు కోడిపెట్ట పాటను కాస్త గుర్తుచేస్తుంది .

మిగిలిన నాలుగు డ్యూయెట్లు నాగార్జున , మీనా మీదే . ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడి మధ్య ఏదడ్డు , నువ్వు మల్లె తీగె నేను తేనెటీగ , తస్స చెక్క తలాంగు చక్క , ఉమ్మ కావాలి ఉంగా ఉంగా అంటూ సాగుతాయి ఈ నాలుగు డ్యూయెట్లు . ఈ ఉమ్మ అనే పదం ఆరోజుల్లో బాగానే చక్కర్లు కొట్టింది .

తూర్పు గోదావరి జిల్లా కడియం , దేవర యాంజాల , మండపేట , చుట్టుపక్కల ప్రాంతాల్లో గోదావరి ప్రకృతి అందాలలో ఔట్ డోర్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 60 కేంద్రాలలో యాభై రోజులు , 26 కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడింది .

తమిళంలోకి డబ్ అయింది కూడా . అసలు ఒరిజినల్ సినిమా శివాజీ గణేషన్ నటించిన తమిళ సినిమా . దానికి రీమేక్ ఏయన్నార్ సినిమా . దాని ఆధారంగా నాగార్జున సినిమా . మళ్ళా అది తమిళంలోకి డబ్ అయింది . భూమి గుండ్రముగా ఉండును .

ఏయన్నార్ మంచి రోజులు వచ్చాయి సినిమాను నేను చిలకలూరిపేటలో చూసా . మా చిన్నప్పుడు మా నరసరావుపేటకు ఫస్ట్ రిలీజులు ఉండేవి కావు . కుర్రాళ్ళం సైకిళ్ళ మీద చిలకలూరిపేట వెళ్లి చూసేవాళ్ళం . ఈ సినిమా అలా చూసిందే .

గ్రామీణ నేపధ్యంలో ఫేమిలీ సెంటిమెంటుతో ఏక్షన్ , పాటల మసాలాతో మంచి ఎంటర్టయినరే సినిమా . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే చూడండి . నాగార్జున , మీనా అభిమానులు మరోసారి కూడా చూడవచ్చు …



  • యండమూరి రాసిన డబ్బు టుది పవర్ ఆఫ్ డబ్బు (చిరంజీవి చాలెంజ్ సినిమా) నవల కథ కూడా ఇదే… ఫలానా గడువులోపు ఇంత డబ్బు సంపాదిస్తే కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటాడు రావుగోపాలరావు… చాలా రాజుల కథల్లో చదివిందీ ఇదే… ఫలానా షరతు, సాధిస్తే అర్ధరాజ్యమిస్తా, కూతురినిచ్చి పెళ్లి చేస్తా అనే సవాళ్లు… ఆఫర్లు… రాజ్యం గెలిచిన శతృరాజులు ఫస్ట్ కోరుకునేది పరాజితుడి కూతుళ్లను… అన్ని కథల్లోనూ ఆడది జస్ట్, జేబులోని ఓ కరెన్సీ నోటు..! ఓ సరుకు..!!


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘నేను ఓడిపోతే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా’… తండ్రులెప్పుడూ మారలేదు..!!
  • సీఎం విజయ్… కోర్టు చెప్పింది, వీఐపీ- టారిఫ్ కల్చర్ మార్చగలవా..?
  • ‘వార్’పై ట్రంప్ మార్క్ మరో ప్రకటన..! చరిత్రాత్మక ఒప్పందమా? ఇదీ ఫేకేనా..?!
  • వైభవ్ సూర్యవంశీలో పరివర్తన..! ఈలోపే పాపం *నిష్క్రమణ…!
  • ఆసియా రాజకీయాల్లో భారీ మార్పులు…
  • జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…
  • Vaibhav Suryavanshi is illegal … Do you know why…
  • అందరూ కక్షకట్టారు, వివక్ష ప్రదర్శించారు… ఆ గ్రేట్‌నెస్ చంపలేకపోయారు…
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “సక్సెషన్ ఎరా” ప్రారంభమైందా?
  • ఎన్టీయార్ వేషం వేస్తే విలన్ ఏమిటి..? హీరో ఏమిటి..? జస్ట్, ఎన్టీయార్… అంతే..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions